సాక్షి, శ్రీకాకుళం : మాజీమంత్రి అచ్చెన్నాయుడుకి ఈఎస్‌ఐ కుంభకోణంతో సంబంధం లేదని టీడీపీ నేతలు ఎందుకు చెప్పలేకపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన..బాబాయ్ అచ్చెన్నాయుడి అక్రమాలు టీడీపీ ఎంపి రామ్మోహన్‌కి కూడా తెలుసని అన్నారు. 35 లక్షలమంది కార్మిక కుటుంబాల డబ్బును అక్రమంగా తరలించారని మండిపడ్డారు. టీడీపీ నేతల అక్రమాలు, అవినీతి ఎవరూ అడగకూడదన్నట్లు నారా లోకేష్ మాట్లాడటం హస్యాస్పదం అన్నారు.
అంతేకాకుండా అచ్చెన్నాయుడి ఆరోగ్యంపై మొట్టమొదటిసారి స్పందించింది సీఎం వైఎస్ జగన్ అని గుర్తుచేశారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు. ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడును గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారన్నారు. వైద్య బృందం నివేదిక ప్రకారమే ఆయనను జైలుకి తరలించారని అప్పలరాజు పేర్కొన్నారు. కాగా, ఈఎస్‌ఐ స్కామ్ కేసులో ఏ-2గా ఉన్న అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. (టీడీపీ 108, 104లను నిద్రావస్థలో ఉంచింది: పిల్లి )
Comments
Please login to add a commentAdd a comment