సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 14 ఈఎస్ ఐ డిస్పెన్సరీలను ఈఎస్‌ఐ కార్పొరేషన్ మంజూరు చేసింది. ఇందులో ఐదు డిస్పెన్సరీల్లో ఒక్కో డాక్టర్ పోస్టును, మరో ఎనిమిది డిస్పెన్స రీలకు ఇద్దరు డాక్టర్ల చొప్పున పోస్టులు మంజూ రు చేసింది. కొత్త డిస్పెన్సరీలను మంచిర్యాల, ఖమ్మం, అదిలాబాద్, హన్మకొండ, మెదక్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, సూర్యాపేట జిల్లాల్లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర కార్మిక శాఖ చర్యలు వేగవంతం చేసింది.
బుధవారం ఆదర్శ్ నగర్‌లోని ఈఎస్‌ఐసీ ప్రాంతీయ కార్యాలయంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సీహెచ్. మల్లారెడ్డి ఆధ్వర్యంలో రీజనల్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రామగుండం, శంషాబాద్‌లో వంద పడకల ఆస్ప త్రులను కేంద్రం మంజూరు చేయగా... వీటి ఏర్పా టుకు సంబంధించిన అనుమతులను ఈఎస్‌ఐ కార్పొ రేషన్ జారీ చేసిందని చెప్పారు.
శంషాబాద్ ఆస్పత్రి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎక రాల స్థలాన్ని కేటాయించినట్లు వివరించారు. నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ స్కానింగ్ పరికరాల ఏర్పాటుకు కార్పొరే షన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. వీటిని అతి త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 71 డిస్పెన్సరీలు ఉన్నాయని, మరిన్ని కొత్త డిస్పెన్స రీల ఏర్పాటుకు ప్రతిపాద నలు రూపొందించా లని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు.
దీంతో పాటు ఈఎస్‌ఐ సేవలు విస్తృతం చేసేందుకు కార్పొరేట్ ఆస్పత్రు లను ఎంప్యానల్ చేసి సర్వీసులు అందించేలా చర్యలు తీసుకుంటామని, ఇందుకు కార్పొరేషన్‌కు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. సమావేశంలో కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణికుముదిని, ఈఎస్‌ఐసీ ప్రాంతీయ సంచాలకులు రేణుక ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment