esi corporation
-
కొత్తగా 14 ఈఎస్ఐ డిస్పెన్సరీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 14 ఈఎస్ ఐ డిస్పెన్సరీలను ఈఎస్ఐ కార్పొరేషన్ మంజూరు చేసింది. ఇందులో ఐదు డిస్పెన్సరీల్లో ఒక్కో డాక్టర్ పోస్టును, మరో ఎనిమిది డిస్పెన్స రీలకు ఇద్దరు డాక్టర్ల చొప్పున పోస్టులు మంజూ రు చేసింది. కొత్త డిస్పెన్సరీలను మంచిర్యాల, ఖమ్మం, అదిలాబాద్, హన్మకొండ, మెదక్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, సూర్యాపేట జిల్లాల్లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర కార్మిక శాఖ చర్యలు వేగవంతం చేసింది. బుధవారం ఆదర్శ్ నగర్‌లోని ఈఎస్ఐసీ ప్రాంతీయ కార్యాలయంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సీహెచ్. మల్లారెడ్డి ఆధ్వర్యంలో రీజనల్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రామగుండం, శంషాబాద్‌లో వంద పడకల ఆస్ప త్రులను కేంద్రం మంజూరు చేయగా... వీటి ఏర్పా టుకు సంబంధించిన అనుమతులను ఈఎస్ఐ కార్పొ రేషన్ జారీ చేసిందని చెప్పారు. శంషాబాద్ ఆస్పత్రి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎక రాల స్థలాన్ని కేటాయించినట్లు వివరించారు. నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కానింగ్ పరికరాల ఏర్పాటుకు కార్పొరే షన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. వీటిని అతి త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 71 డిస్పెన్సరీలు ఉన్నాయని, మరిన్ని కొత్త డిస్పెన్స రీల ఏర్పాటుకు ప్రతిపాద నలు రూపొందించా లని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో పాటు ఈఎస్ఐ సేవలు విస్తృతం చేసేందుకు కార్పొరేట్ ఆస్పత్రు లను ఎంప్యానల్ చేసి సర్వీసులు అందించేలా చర్యలు తీసుకుంటామని, ఇందుకు కార్పొరేషన్‌కు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. సమావేశంలో కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణికుముదిని, ఈఎస్ఐసీ ప్రాంతీయ సంచాలకులు రేణుక ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అది ‘ఈఎస్ఐ’ కుమ్మక్కు!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర కార్మికశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఈఎస్ఐ కార్పొరేషన భవన నిర్మాణాల విషయంలో జరిగిన కోట్లాది రూపాయల కుంభకోణం నుంచి తప్పించుకునేందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లాలూచీ పడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్(ఎన్బీసీ)కి ఇవ్వాల్సిన నిర్మాణ కాంట్రాక్టును కేంద్రమంత్రి హోదాలో సంబంధిత అధికారులను తన నివాసానికి పిలిపించుకుని, వారిపై ఒత్తిడి తెచ్చి మరీ అప్పటి ఏపీ ఫిషరీస్ కార్పొరేషన్‌కు ఇప్పించారని వెల్లడించారు. అప్పటికే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎలుగుబంటి సూర్యనారాయణ అనే ఈఈకి కట్టబెట్టి పాల్పడిన ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ పెండింగ్‌లో ఉందని తెలిపారు. అయితే ఈ కేసుకు సంబంధించిన చార్జిషీట్లో కేసీఆర్ తన పేరు లేకుండా చేసుకున్నారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. ఈ అంశమే కేసీఆర్, మోదీల బంధానికి నిదర్శనంగా నిలుస్తోందన్నారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ హోటల్లో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ నేత, మాజీ ఎంపీ అజీజ్‌పాషా, టీజేఎస్ నాయకుడు విద్యాధర్రెడ్డిలతో కలిసి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. తరచూ కంటి పరీక్షలు, వైద్య పరీక్షల పేరుతో ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. ఈ కేసులో సీబీఐ ముందుకు వెళ్లకుండా చూసుకునేందుకు ప్రధానిని, ఇతర పెద్దలను కలిసి వచ్చారని ఆరోపించారు. ‘ఈ కుంభకోణంలో కేసీఆర్ ప్రమేయం నేరుగా ఉంది. సీబీఐ జడ్జి ముందు ఇచ్చిన వాంగ్మూలంలో కూడా కేంద్రమంత్రి ఇంట్లో జరిగిన సమావేశంలోనే ఎన్బీసీ నుంచి ఆ కాంట్రాక్టును ఫిషరీస్‌కు ఇచ్చినట్టు రికార్డయింది. అయినా కేసీఆర్ పేరు చార్జిషీట్లో లేకుండా చేశారు. ఇందుకోసమే తెలంగాణ ప్రజల ప్రయోజనాలను మోదీ ముందు కేసీఆర్ తాకట్టు పెట్టారు’అని ఉత్తమ్ ధ్వజమెత్తారు. పునర్విభజన బిల్లులో తెలంగాణ ప్రయోజనాలను కాపాడే అంశాలను అమలు కాకుండా చేసింది కూడా ఇందుకోసమేనని ఆరోపించారు. దిగజారి విమర్శలు చేస్తున్నారు... ఎన్నికల ప్రచారంలో యూపీఏ చైర్పర్సన్ సోనియగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబులను ఉద్దేశించి కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను ఉత్తమ్ తప్పుబట్టారు. రాష్ట్రం ఇచ్చిన తల్లిగా తన పిల్లలు బాధపడుతున్నారనే ఆవేదనతో సోనియా మాట్లాడారని, హుందాగా మాట్లాడిన ఆమె మాటలను కేసీఆర్ దిగజారి విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తి తెలంగాణ సీఎం కావడం దౌర్భాగ్యమని ప్రజలు భావిస్తున్నారని, కేసీఆర్ వ్యాఖ్యలను అసహ్యించుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబుపై అనవసరంగా, అసందర్భంగా మాట్లాడుతున్నారని.. కేసీఆర్ ఏం చేస్తుంటే చంద్రబాబు అడ్డుపడ్డాడో చెప్పాలని డిమాండ్ చేశారు. దళితుడిని సీఎం చేస్తానంటే, దళిత గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తానంటే, ముస్లింలకు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానంటే, నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తానంటే బాబు అడ్డుపడ్డాడా అని ఉత్తమ్ ప్రశ్నించారు. సహారా కుంభకోణంలో ఎంత కమీషన్ వచ్చింది?: రమణ సోనియాగాంధీ, తెలంగాణ ప్రజల మధ్య ఉన్న అనుబంధాన్ని జీర్ణించుకోలేకనే కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఆయన చేసిన అక్రమాలు వెలుగులోకి రాకుండా ఉండేందుకే 2006లో తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేశారని ఆరోపించారు. యూపీఏ హాయాంలోనే కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, నాటి శాంతిభద్రతల పరిస్థితులను అంచనావేసి, ఉద్యమ ఉధృతిని గమనించినందునే కేంద్రం ఆ దిశలో అడుగులు వేయలేదని వివరించారు. సహారా కుంభకోణంలో కూడా కేసీఆర్ ప్రధాన భూమిక పోషించారని, ఆ కుంభకోణంలో ఎన్ని కోట్ల కమీషన్ వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, ఆయన కుటుంబం జుట్టు కేంద్రం చేతిలో ఉన్నందునే మోదీతో లాలూచీ పడ్డారని ఆరోపించారు. తాను ఎంపీగా ఉన్నప్పుడే కేసీఆర్ కేంద్రమంత్రిగా పనిచేశారని, అప్పుడు కూడా ఆయన కార్మికశాఖ కార్యాలయానికి వచ్చేవాడు కాదని మాజీ ఎంపీ అజీజ్‌పాషా వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఆయనకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన స్పష్టంచేశారు. -
కార్మిక వైద్య బిల్లులకు వీడని గ్రహణం
సాక్షి, హైదరాబాద్: కార్మిక బీమా సంస్థలో నిధుల ధీమా కరువైంది. మెడికల్ బిల్లుల రీరుుంబర్స్‌మెంటు నిధులు ఏడాదిన్నరగా విడుదల కావడంలేదు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సలకై న ఖర్చుల కోసం కార్మికులు ఈఎస్ఐ సంచాలక కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రాష్ట్ర కార్మిక బీమా వైద్య సేవల విభాగం(డీఐఎంఎస్)లో రూ.15 కోట్లకుపైబడి మెడికల్ రీరుుంబర్స్‌మెంట్ బకారుులున్నారుు. ఇందులో 650 మందికి కార్మికులకు రూ.2 లక్షలకు పైబడి చొప్పున చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలో 4 ప్రధానాస్పత్రులు, 70 డిస్పెన్సరీల ద్వారా కార్మికులకు ఆరోగ్య సేవలందుతున్నారుు. రాష్ట్రవ్యాప్తంగా 10.75 లక్షల మంది కార్మికులు తమ వేతనాల నుంచి ఈఎస్ఐకి ప్రీమియం చెల్లిస్తున్నారు. సాధారణ చికిత్సలన్నీ ఈఎస్ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో అందిస్తున్నప్పటికీ అత్యవసర సేవలు మాత్రం డాక్టర్లు ఇతర ప్రైవేటు ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలకై న ఖర్చుల మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్ఎస్) నిబంధనల ప్రకారం సదరు కార్మికులకు తిరిగి చెల్లిస్తుంది. గతంలో మెడికల్ రీరుుంబర్స్‌మెంట్ బిల్లుల చెల్లింపులన్నీ ఈఎస్ఐ కార్పొరేషన్ ద్వారా జరిగేవి. 2015 ఏప్రిల్ నుంచి ఈ చెల్లింపులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే చూసుకోవాలని కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఈఎస్ఐ కార్పొరేషన్ ఒక్కో కార్మికుడికి ఏటా రూ.2000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కార్మిక బీమా వైద్య సేవల విభాగానికి చెల్లిస్తోంది. ఈఎస్ఐ కార్పొరేషన్ ద్వారా క్రమం తప్పకుండా నిధులు మంజూరవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఖాతా నుంచి ఈ నిధులు విడుదల కావడంలో ఆలస్యమవుతోంది. తాజాగా ఈ చెల్లింపుల అంశాన్ని కార్పొరేషన్ ద్వారానే నిర్వహిస్తే బాగుంటుందని రాష్ట్ర కార్మిక బీమా వైద్య సేవల విభాగం అభిప్రాయపడుతోంది. ఈ మేరకు కార్పొరేషన్‌కు లేఖ రాసేందుకు సిద్దమవుతోంది. తాజాగా పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో మెడికల్ రీరుుంబర్స్‌మెంట్ బకారుుల విడుదలకు మరికొంత కాలం బ్రేక్ పడినట్లే. పలు చెల్లింపులను నిలిపివేయాల్సిందిగా ఖజానా శాఖ, పే అండ్ అకౌంట్స్ విభాగాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
కార్మికుల వైద్యానికి ‘ఎమర్జెన్సీ’ దెబ్బ
- అత్యవసర వైద్యానికి అనుమతుల నిరాకరణ - డెరైక్టర్ల అధికారాలకు కత్తెరేసిన ఈఎస్ఐ కార్పొరేషన్ - దుర్వినియోగం చేస్తున్నారంటూ సాకు - అవసరమైతే వైద్యం చేయించుకున్నాక రీయింబర్స్ చేస్తామని స్పష్టీకరణ - తెలుగు రాష్ట్రాల్లో 15 లక్షలమంది కార్మికుల్లో అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: లక్షలాది మంది కార్మికులు, వారి కుటుంబాలకు అందాల్సిన అత్యవసర వైద్యానికి బ్రేకులు పడ్డాయి. ఎమర్జెన్సీ వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లిన కార్మికులుగానీ, వారి కుటుంబాలుగానీ ఇకనుంచీ ముందు తమ చేతి డబ్బులు పెట్టుకోవాల్సిందే. సదరు వైద్యానికయ్యే ఖర్చును ఆ తర్వాతే ఎంప్లాయిస్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) రీయింబర్స్ చేస్తుంది. ఎమర్జెన్సీ వైద్యానికి అనుమతిస్తుంటే ప్రతిఒక్కరూ అత్యవసర వైద్యమేనని చెప్పి కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరుతున్నారని, దీనివల్ల కేంద్ర కార్మికశాఖకు భారీగా వ్యయమవుతోందనే కారణంతో ఈఎస్ఐసీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై తెలంగాణలోని 10 లక్షలమంది ఇన్స్యూర్డ్ పర్సన్స్(ఐపీ), ఆంధ్రప్రదేశ్‌లో 5 లక్షలమంది ఐపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము కష్టపడి సంపాదించిన డబ్బును తమకు ఖర్చు పెట్టడానికి ఇలాంటి ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంచాలకుల అధికారాలకు కత్తెర.. ప్రతి రాష్ట్రానికి ఈఎస్ఐకి సంచాలకుల కార్యాలయం(డెరైక్టరేట్) ఉంటుంది. ఆ మేరకు ఏపీ, తెలంగాణలకు రెండు డెరైక్టరేట్లు ఉన్నాయి. ఇప్పటివరకు కార్మికులుగానీ, వారి కుటుంబసభ్యులుగానీ గుండెపోటు, న్యూరో సంబంధిత వ్యాధులు సోకినప్పుడు నేరుగా కార్పొరేట్ ఆస్పత్రిలో చేరి.. ఈఎస్ఐ డెరైక్టర్ కార్యాలయానికి సమాచారమిస్తే 24 గంటల్లోనే అనుమతులిచ్చేవారు. పేషెంట్ నయాపైసా డబ్బు చెల్లించకుండా డెరైక్టరేట్ నుంచే చెల్లించేవారు. తాజాగా కేంద్ర పరిధిలో ఉండే ఈఎస్ఐ కార్పొరేషన్ ఈ విధానాన్ని తీసేసింది. అత్యవసర వైద్యం పేరుతో ప్రతిఒక్కరూ కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరుతున్నారని, పథకం దుర్వినియోగం అవుతోందంటూ.. ఈఎస్ఐ డెరైక్టర్లకు నేరుగా అనుమతులిచ్చే విధానాన్ని తీసేసింది. అత్యవసర వైద్యమైతే రోగి డబ్బులు చెల్లించి చేయించుకోవాలని, ఆ తర్వాత వైద్యానికయ్యే ఖర్చును తిరిగి చెల్లిస్తామంది. ఈ నేపథ్యంలో అనుమతులు నిలిపేశారు. దీనిపై కార్మిక వర్గాలు తీవ్ర ఆవేదన చెందుతున్నాయి. లక్షలు చెల్లించి వైద్యం ఎలా చేయించుకోగలమని వాపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్మికులు, వారి కుటుంబసభ్యులు కలిపి 60 లక్షలమంది వరకు ఉన్నట్టు అంచనా. ఇప్పుడు మాకు అధికారం లేదు గతంలో కార్మికులుగానీ, వారి పిల్లలు గానీ, కుటుంబసభ్యులుగానీ అత్యవసర వైద్యమంటే తామే అనుమతులు ఇచ్చేవాళ్లమని, ఇప్పుడు కార్పొరేషన్ ఆ అధికారాలను తీసేసిందని తెలంగాణ ఈఎస్ఐ డెరైక్టర్ డా.దేవికారాణి, ఏపీ ఈఎస్ఐ డెరైక్టర్ డా.రమేష్కుమార్లు తెలిపారు. ఎమర్జెన్సీ వైద్యానికి రోగులే చెల్లించుకుంటే.. రీయింబర్స్ చేస్తామన్నారు. అప్పటికప్పుడు అనుమతులివ్వడం తమ చేతుల్లో లేదన్నారు. -
వారంలో నాచారానికి ఈఎస్ఐ ఆస్పత్రి
♦ సనత్‌నగర్ మెడికల్ కాలేజీకి లైన్ క్లియర్ ♦ దత్తాత్రేయ, నాయిని సమక్షంలో ఎంవోయూ సాక్షి, హైదరాబాద్: వారం రోజుల్లోగా ఈఎస్ఐ సనత్‌నగర్ ఆస్పత్రిని నాచారం తరలించేందుకు రంగం సిద్ధమైంది. ఈఎస్ఐ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెడికల్ కాలేజీ కోసం రాష్ట్ర కార్మికశాఖ నిర్వహిస్తున్న ఈఎస్ఐ ఆస్పత్రిని కేటాయించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిని నాచారానికి, అక్కడున్న కార్పొరేషన్ ఆస్పత్రిని సనత్‌నగర్‌కు మార్చుతూ కేంద్ర, రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సమక్షంలో అధికారులు శనివారం ఎంవోయూ కుదుర్చుకున్నారు. నాచారం మెడికల్ సూపరింటెండెంట్ దేశ్‌పాండే, రాష్ట్ర ఈఎస్ఐ డెరైక్టర్ సీహెచ్, దేవికారాణి సంతకం చేసిన ఫైళ్లను అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ... సనత్‌నగర్ మెడికల్ కాలేజీ నిర్వహణకు లైన్‌క్లియర్ అవడం సంతోషంగా ఉందన్నారు. సనత్‌నగర్ ఈఎస్ఐని నాచారానికి తరలిస్తే ప్రస్తుతం 200 బెడ్స్ తగ్గిపోతాయన్నారు. ఈ నష్టం పూడ్చుకునేందుకు త్వరలో కేంద్రం తమ నిధులతో నాచారంలో అదనంగా 250 పడకల ఆస్పత్రిని విస్తరిస్తామని హామీ ఇచ్చిందన్నారు. అలాగే కార్మికులు అధికంగా ఉన్న ప్రాంతంలో స్థలం చూపిస్తే 500 పడకల ఆస్పత్రిని కూడా నిర్మిస్తామని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారన్నారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఈ మెడికల్ కాలేజీ నిర్వహణ వల్ల కార్మికుల పిల్లలకు 40శాతం సీట్లు లభిస్తాయన్నారు. గోషామహల్లో పశుసంవర్ధ్దకశాఖ స్థలాన్ని కేటాయిస్తే 100 పడకల ఆస్పత్రిని నిర్మించి ఇస్తామన్నారు. ఏప్రిల్ 1నుంచి ఆటో రిక్షా కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించేందుకు రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తామన్నారు. అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, మధ్యాహ్నం భోజన నిర్వాహకులకు కూడా ఈఎస్ఐ సదుపాయం కల్పించనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 4.70 కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులకు ఈపీఎఫ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. కార్మికుల సామాజిక భద్రతను దృష్టిలో ఉంచుకొని 10మంది పనిచేసే సంస్థలను పీఎఫ్ కిందకు తీసుకొచ్చేందుకు పార్లమెంటులో చట్టసవరణ చేయనున్నట్లు వివరించారు. కార్మికుల కనీస వేతన సవరణను పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. -
ఈఎస్ఐ ఆస్పత్రి త్వరలో నాచారం తరలింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కార్మికశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈఎస్ఐ సనత్‌నగర్ ఆస్పత్రిని నాచారం తరలింపు ఖాయమైంది. ఈ మేరకు ఈఎస్ఐ కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య గురువారం ఎంవోయూ కుదిరింది. అయితే ఈ విషయాన్ని 12న కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి నాయిని నర్సింహారెడ్డి సంయుక్తంగా ప్రకటించే అవకాశం ఉంది. సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ మెడికల్ కళాశాల నిర్వహణ కోసం రాష్ట్ర కార్మికశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆస్పత్రిని కార్పొరేషన్‌కు ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న నాచారం ఆస్పత్రిని రాష్ట్ర కార్మికశాఖకు అప్పగించనున్నారు. ఈ మేరకు సనత్‌నగర్ ఆస్పత్రిలో విధులు నిర్వహించే ఉద్యోగులు త్వరలో నాచారం ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది. -
ఈఎస్ఐ వైద్యసేవలపై పర్యవేక్షణ సంఘం
పాలక మండలి, కార్యనిర్వాహక మండలి ఏర్పాటుకు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కార్మిక బీమా వైద్యసేవలు (ఈఎస్ఐ) కార్డు కలిగిన వారికి మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మౌలిక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఒక పర్యవేక్షణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పర్యవేక్షణ సంఘంలో 11 మంది సభ్యులతో పాలక మండలి, 8 మంది సభ్యులతో కార్యనిర్వాహక మండలి ఏర్పాటు చేయనుంది. పాలక మండలికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడిగా, కార్య నిర్వాహక మండలికి రాష్ట్ర కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. వీటిలో సభ్యులుగా స్వచ్ఛంద సంస్థలు, కార్మిక సంఘాల నేతలకు చోటు కల్పిస్తారు. సంబంధిత ముసాయిదా ప్రతిపాదనలను రూపొందించి, అభిప్రాయాలు, సలహాలు సూచనలు కోరుతూ ఈఎస్ఐ కార్పొరేషన్ నుంచి రాష్ట్ర కార్మిక శాఖకు లేఖ అందింది. నిధులు ఖర్చు చేయాలన్నా, కొత్తగా ఆస్పత్రులను విస్తరించాలన్నా, నియామకాలు జరపాలన్నా ఈ సంఘం నుంచే అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈఎస్ఐ వైద్య సేవలకు గాను ప్రస్తుతం కేంద్రం 87.5 శాతం నిధులు విడుదల చేస్తుండగా... దాన్ని 90 శాతానికి పెంచుతూ ఈఎస్ఐ కార్పొరేషన్ నిర్ణయించింది. -
‘మార్చి’ వరకూ ఈఎస్ఐ తరలింపు వాయిదా!
అమీర్‌పేట, న్యూస్‌లైన్: సనత్‌నగర్ కార్మిక బీమా వైద్యశాల (ఈఎస్ఐ) తరలింపు తాత్కాలికంగా వాయిదా పడింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడమే ఇందుక్కారణం. ఉద్యోగుల ఒత్తిడి మేరకు వచ్చే మార్చి వరకూ ఇక్కడే కొనసాగే అవకాశ ముంది. ఆగస్టు 29 లోపు ఆస్పత్రిని తమకు స్వాధీనం చేయాలని ఈఎస్ఐ కార్పొరేషన్ కోరినప్పటికీ, ప్రభుత్వ అనుమతి వచ్చే వరకూ తరలింపు సాధ్యం కాదని మెడికల్ ఇన్సూరెన్స్ డెరైక్టర్ డాక్టర్ నాగమల్లేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన ఆస్పత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, యూ నియన్ నాయకులతో సమావేశమయ్యారు. ఆస్పత్రి తరలింపుపై ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక ఉత్తర్వులు వస్తేనే ఇక్కడి నుంచి నాచారానికి వెళ్తామని వైద్యులు స్పష్టం చేశారు. పిల్లలు స్థానికంగా చదువుకుంటున్నందున పరీక్షలు అయిపోయే వరకూ ఇక్కడే ఆస్పత్రిని కొనసాగిం చేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా డెరైక్టర్ మాట్లాడుతూ.. ఆస్పత్రి తరలింపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదన్నారు. తరలింపుపై ఉద్యోగుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. అభిప్రాయ సేకరణకు ఓ కమిటీని వేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఉత్వర్వులు రావాడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేమన్నారు. మంగళవా రం నుంచి నాచారంలో విధులు నిర్వహిం చాలని కొంత మంది అధికారులు చెప్పడాన్ని డెరైక్టర్ తప్పుపట్టారు