కార్మిక వైద్య బిల్లులకు వీడని గ్రహణం
సాక్షి, హైదరాబాద్: కార్మిక బీమా సంస్థలో నిధుల ధీమా కరువైంది. మెడికల్ బిల్లుల రీరుుంబర్స్‌మెంటు నిధులు ఏడాదిన్నరగా విడుదల కావడంలేదు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సలకై న ఖర్చుల కోసం కార్మికులు ఈఎస్‌ఐ సంచాలక కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రాష్ట్ర కార్మిక బీమా వైద్య సేవల విభాగం(డీఐఎంఎస్)లో రూ.15 కోట్లకుపైబడి మెడికల్ రీరుుంబర్స్‌మెంట్ బకారుులున్నారుు. ఇందులో 650 మందికి కార్మికులకు రూ.2 లక్షలకు పైబడి చొప్పున చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలో 4 ప్రధానాస్పత్రులు, 70 డిస్పెన్సరీల ద్వారా కార్మికులకు ఆరోగ్య సేవలందుతున్నారుు.
రాష్ట్రవ్యాప్తంగా 10.75 లక్షల మంది కార్మికులు తమ వేతనాల నుంచి ఈఎస్‌ఐకి ప్రీమియం చెల్లిస్తున్నారు. సాధారణ చికిత్సలన్నీ ఈఎస్‌ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో అందిస్తున్నప్పటికీ అత్యవసర సేవలు మాత్రం డాక్టర్లు ఇతర ప్రైవేటు ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలకై న ఖర్చుల మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్‌ఎస్) నిబంధనల ప్రకారం సదరు కార్మికులకు తిరిగి చెల్లిస్తుంది. గతంలో మెడికల్ రీరుుంబర్స్‌మెంట్ బిల్లుల చెల్లింపులన్నీ ఈఎస్‌ఐ కార్పొరేషన్ ద్వారా జరిగేవి. 2015 ఏప్రిల్ నుంచి ఈ చెల్లింపులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే చూసుకోవాలని కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఈఎస్‌ఐ కార్పొరేషన్ ఒక్కో కార్మికుడికి ఏటా రూ.2000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కార్మిక బీమా వైద్య సేవల విభాగానికి చెల్లిస్తోంది.
ఈఎస్‌ఐ కార్పొరేషన్ ద్వారా క్రమం తప్పకుండా నిధులు మంజూరవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఖాతా నుంచి ఈ నిధులు విడుదల కావడంలో ఆలస్యమవుతోంది. తాజాగా ఈ చెల్లింపుల అంశాన్ని కార్పొరేషన్ ద్వారానే నిర్వహిస్తే బాగుంటుందని రాష్ట్ర కార్మిక బీమా వైద్య సేవల విభాగం అభిప్రాయపడుతోంది. ఈ మేరకు కార్పొరేషన్‌కు లేఖ రాసేందుకు సిద్దమవుతోంది. తాజాగా పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో మెడికల్ రీరుుంబర్స్‌మెంట్ బకారుుల విడుదలకు మరికొంత కాలం బ్రేక్ పడినట్లే. పలు చెల్లింపులను నిలిపివేయాల్సిందిగా ఖజానా శాఖ, పే అండ్ అకౌంట్స్ విభాగాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.