Labor insurance
-
కార్మిక వైద్య బిల్లులకు వీడని గ్రహణం
సాక్షి, హైదరాబాద్: కార్మిక బీమా సంస్థలో నిధుల ధీమా కరువైంది. మెడికల్ బిల్లుల రీరుుంబర్స్‌మెంటు నిధులు ఏడాదిన్నరగా విడుదల కావడంలేదు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సలకై న ఖర్చుల కోసం కార్మికులు ఈఎస్ఐ సంచాలక కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రాష్ట్ర కార్మిక బీమా వైద్య సేవల విభాగం(డీఐఎంఎస్)లో రూ.15 కోట్లకుపైబడి మెడికల్ రీరుుంబర్స్‌మెంట్ బకారుులున్నారుు. ఇందులో 650 మందికి కార్మికులకు రూ.2 లక్షలకు పైబడి చొప్పున చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలో 4 ప్రధానాస్పత్రులు, 70 డిస్పెన్సరీల ద్వారా కార్మికులకు ఆరోగ్య సేవలందుతున్నారుు. రాష్ట్రవ్యాప్తంగా 10.75 లక్షల మంది కార్మికులు తమ వేతనాల నుంచి ఈఎస్ఐకి ప్రీమియం చెల్లిస్తున్నారు. సాధారణ చికిత్సలన్నీ ఈఎస్ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో అందిస్తున్నప్పటికీ అత్యవసర సేవలు మాత్రం డాక్టర్లు ఇతర ప్రైవేటు ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలకై న ఖర్చుల మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్ఎస్) నిబంధనల ప్రకారం సదరు కార్మికులకు తిరిగి చెల్లిస్తుంది. గతంలో మెడికల్ రీరుుంబర్స్‌మెంట్ బిల్లుల చెల్లింపులన్నీ ఈఎస్ఐ కార్పొరేషన్ ద్వారా జరిగేవి. 2015 ఏప్రిల్ నుంచి ఈ చెల్లింపులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే చూసుకోవాలని కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఈఎస్ఐ కార్పొరేషన్ ఒక్కో కార్మికుడికి ఏటా రూ.2000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కార్మిక బీమా వైద్య సేవల విభాగానికి చెల్లిస్తోంది. ఈఎస్ఐ కార్పొరేషన్ ద్వారా క్రమం తప్పకుండా నిధులు మంజూరవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఖాతా నుంచి ఈ నిధులు విడుదల కావడంలో ఆలస్యమవుతోంది. తాజాగా ఈ చెల్లింపుల అంశాన్ని కార్పొరేషన్ ద్వారానే నిర్వహిస్తే బాగుంటుందని రాష్ట్ర కార్మిక బీమా వైద్య సేవల విభాగం అభిప్రాయపడుతోంది. ఈ మేరకు కార్పొరేషన్‌కు లేఖ రాసేందుకు సిద్దమవుతోంది. తాజాగా పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో మెడికల్ రీరుుంబర్స్‌మెంట్ బకారుుల విడుదలకు మరికొంత కాలం బ్రేక్ పడినట్లే. పలు చెల్లింపులను నిలిపివేయాల్సిందిగా ఖజానా శాఖ, పే అండ్ అకౌంట్స్ విభాగాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
తప్పులు చేసేవాళ్లే గుడికి వెళ్తున్నారు
కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు సాక్షి, విజయవాడ బ్యూరో: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పులు చేసేవారే ఎక్కువగా గుళ్లకు వెళుతున్నారని అన్నారు. ఎక్కువ తప్పులు చేసి హుండీలో ఎక్కువ డబ్బులు వేస్తున్నారని చెప్పారు. అందుకే రాష్ట్రంలో దేవాలయాల ఆదాయం బాగా పెరుగుతోందని అన్నారు. అధికారులు కష్టపడకపోయినా రాష్ట్ర ఆదాయంలో 27 శాతం ఆ శాఖ నుంచే వస్తోందని చెప్పారు. నగరంలోని వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో బుధవారం నుంచి రెండురోజుల పాటు జరిగే జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం మాట్లాడారు. చర్చిలు, మసీదులు, దేవాలయాలు లేకపోతే చాలామందికి పిచ్చి పట్టేదన్నారు. ప్రజలకు కష్టం వస్తే దేవాలయాలకు వెళుతున్నారని, కొంతమంది బ్రాందీ, విస్కీలు తాగి సంతృప్తి చెందుతున్నారని అన్నారు. మద్యం తాగకుండా ఉండడం కోసం కొందరు అయ్యప్ప దీక్ష చేస్తున్నారని, ఆ 40 రోజులు మద్యం అమ్మకాలు తగ్గిపోతున్నాయని వ్యాఖ్యానించారు. కొన్ని ప్రభుత్వ శాఖలపై భారీ అవినీతి ముద్ర ఉందని, అధికార యంత్రాంగం బాధ్యత లేకుండా పనిచేస్తున్నారనే భావన ఉందని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అవినీతి పరులనే విషయం జనంలో నాటుకుపోయిందని అన్నారు. వారసత్వంగా వచ్చిన సమస్యల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజలకు అవసరమైన ఫైళ్లపై కాకుండా కిందిస్థాయిలో ఎవరికో అవసరమైన ఫైళ్లపైనే తాను సంతకం చేస్తున్నానని చెప్పారు. ఫైళ్ల క్లియరెన్స్ కోసం ఎవరైతే వెంటబడతారో వారి ఫైళ్లే క్లియర్ అవుతున్నాయని, వెంటబడని వారి ఫైళ్లు అలాగే ఉండిపోతున్నాయన్నారు. ఈ-ఫైలింగ్ విధానం అమలు చేస్తే ఈ పరిస్థితి ఉండదని తెలిపారు. జూన్ ఒకటి నుంచి ప్రతి జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ-ఆఫీసు కార్యక్రమం అమలు కావాలన్నారు. జూన్ నెలాఖరు నాటికి ప్రతి ఫైలు ఆన్లైన్లో ఉండాలని, దీనికి జాయింట్ కలెక్టర్ నోడల్ అధికారిగా ఉంటారని ముఖ్యమంత్రి తెలిపారు. పట్టణ జనాభా పెరగాలి తలసరి ఆదాయంలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల కంటే మనం వెనుకబడి ఉన్నామన్నారు. 13 జిల్లాలకు వివిధ అంశాల్లో ర్యాంకులు ఇస్తామని, వెనుకబడిన జిల్లాలు మెరుగైన ర్యాంకు కోసం పోటీ పడాలని సీఎం చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో పోల్చితే పట్టణ జనాభా రాష్ట్రంలో తక్కువగా 29 శాతం మాత్రమే ఉందని, దీన్ని పెంచుకుంటేనే ముందుకెళతామన్నారు. రాష్ట్రంలో 50 శాతం మందే ప్రభుత్వ స్కూళ్లకు వస్తున్నారని, పట్టణాల్లో అయితే ప్రభుత్వ స్కూళ్లు మూతపడే పరిస్థితి ఉందని అన్నారు. నాణ్యమైన విద్య అందిస్తే ప్రభుత్వ స్కూళ్లకే అందరూ వస్తారన్నారు. ప్రజల సంతృప్తస్థాయి 80 శాతం ఉండేలా పథకాలు అమలు చేయాలని అధికారులను కోరారు. పల్స్ సర్వే చేపట్టడం ద్వారా ఇంటింటికీ వెళ్లి సమగ్ర వివరాలు సేకరించాలని ఆదేశించారు. చేనేత కళాకారులకు విదేశీ మార్కెట్లో సంబంధాలు నెలకొల్పేలా ప్రైవేటు ఏజెన్సీలను ప్రోత్సహించాలని సూచించారు. పవర్‌లూమ్స్ ఏర్పాటు చేసే చేనేత కార్మికులకు భారీగా సబ్సిడీ ఇస్తామన్నారు. బోయలు, వడ్డెరలకు రుణాలిస్తామన్నారు. జూన్ 2న నవనిర్మాణ దీక్ష రాష్ట్రం విడిపోయి రెండేళ్లవుతున్న సందర్భంగా జూన్ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. జూన్ 2న నవ నిర్మాణ దీక్ష చేపడతామని, 8న మహాసంకల్పం నిర్వహిస్తామని చెప్పారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన రాష్ట్రానికి చెందిన నీలిమను సమావేశంలో ముఖ్యమంత్రి అభినందించారు. మండలాల వారీగా వృద్ధి రేటు, రెండంకెల వృద్ధి, మనం-మన అభివృద్ధి పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. విశాఖ సాగర తీరంలో జూలై రెండో తేదీన జరిగే బే మారథాన్ వెబ్‌సైట్‌ను www. vizagbaymarathon. com ప్రారంభించారు. అలాగే కార్మికుల బీమా సౌకర్యం కోసం ఉద్దేశించిన వెబ్సైట్ www.chandrannabima.ap. gov.inను కూడా ప్రారంభించారు. కేంద్ర నిధులు రాకపోయినా రాష్ట్రాన్ని చంద్రబాబు ముందుకు తీసుకెళుతున్నారని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రారంభోపన్యాసంలో పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ ప్రజల విశ్వాసం కోల్పోతోందని, మీ-సేవల్లో అవినీతిని అరికట్టాలన్నారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సీఎస్ ఎస్పీ ఠక్కర్ తదితరులు మాట్లాడారు. సీసీఎల్ఏ అనిల్ చంద్ర పునేఠా స్వాగతోపన్యాసం చేయగా మంత్రులు, వివిధ శాఖాధిపతులు, విభాగాధిపతులు పాల్గొన్నారు. మొదటిరోజు ఉదయం పది గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 9.30 గంటలకు ముగిసింది. -
పేదలకు ధీమా బీమా
ఊహించని పరిస్థితుల్లో ప్రమాదం జరిగితే అండగా నిలిచేది బీమా పథకం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు కల్పించే పాలసీలు అనేకం అందుబాటులో ఉన్నాయి. గతంలో బడుగు, బలహీన వర్గాలకు బీమా సదుపాయం అందుబాటులో ఉండేది కాదు. ప్రభుత్వం పలు పథకాల కింద మహిళలు, వారి కుటుంబాలకు బీమా సౌకర్యం కల్పిస్తోంది. నగరవాసులకైతే జీవీఎంసీ యూసీడీ విభాగం, జిల్లా వాసులకైతే డీఆర్డీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఇందిరాక్రాంతి పథకం ద్వారా పలు బీమా పథకాలు పొందవచ్చు. ఆ వివరాలు... - ద్వారకానగర్ అమ్ఆద్మీ యోజన... తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి 18 నుంచి 59 ఏళ్ల వరకు భూమిలేని నిరుపేద గ్రామీణ వ్యవసాయ కూలీలు రూ.15ల సేవా రుసుం చెల్లిస్తే ప్రభుత్వం రూ. 320 జత చేసి బీమా కంపెనీలకు రూ. 335 చెల్లిస్తుంది. ఏటా రూ.15తో పాలసీని రెన్యూవల్ చేసుకోవాలి. ప్రమాదం లేదా సాధారణ మరణమైనా తక్షణ సహా యంగా రూ.5వేలు అందజేస్తారు. తర్వాత రూ.25 వేలు చెల్లిస్తారు. వైఎస్సార్ అభయ హస్తం గ్రామ సమాఖ్యలో సభ్యత్వంతోపాటు 18 నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉండాలి. వరుసగా రెండేళ్లు వాటా ధనం చెల్లించకపోతే స భ్యుత్వం రద్దవుతుంది. రోజు రూ. రూపాయి చొప్పున ఏడాది పొడవునా అభ్యర్థి రూ.365 జమ చేస్తే అంతే ప్రీమియం ప్రభుత్వం చెల్లించి బీమా సదుపాయం కల్పిస్తుంది. వరుసగా పదేళ్లు వాటాధనం చెల్లిస్తే కనీసం రూ. 500 పింఛను పొందేందుకు అర్హత లభిస్తుంది. వృద్ధాప్యంలో పింఛనుతో పాటు బీమా సదుపాయం ఉంటుంది. సహజ మరణానికి రూ. 30వేలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.75 వేలు, అంగవైకల్యానికి పరిహా రం పొం దే అవకాశం ఉంటుంది. సభ్యుత్వం పొందిన కుటుంబంలో 9వ తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులు ఉంటే ఏటా రూ.1200 ఉపకారం వేతనం అందుతుంది. జనశ్రీ... స్వయం సహాయక సంఘాల సభ్యులు 18 ఏళ్లు పైబడిన వారు ఈ బీమాలో చేరవ చ్చు. ప్రతి ఒక్కరూ ప్రీమియం రూ.17 సేవా రుసుం రూ.15లు చెల్లిస్తే ప్రభుత్వం మరో రూ.360లు కలిపి బీమా చేస్తుంది. అభయహస్తంలో చేరి ఉంటే సర్వీసు చార్జి చెల్లించాల్సిన అవసరం లేదు. అప్పు బీమా.. మహిళ సంఘాల్లో సభ్యత్వం పొందిన మహిళలు బ్యాంకు రుణం పొందిన తర్వాత దురదృష్టవశాత్తూ మరణిస్తే ఆ అప్పు భారాన్ని కు టుంబ సభ్యులు చె ల్లించాల్సి వచ్చేది. ఆ పరిస్థి తి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం అప్పు బీమా పథకాన్ని అమలు చేస్తోంది. అప్పు తీసుకున్న సభ్యురాలు ప్రతి రూ.1000కి రూ. 4.50 చొప్పున బీమా ప్రీమియం చెల్లించాలి. రుణం తీసుకున్నా తర్వాత మృతిచెందితే ఆమె చెల్లిం చాల్సిన రుణం మాఫీ చేస్తారు. అప్పటి వరకు చెల్లించిన వాయిదాలు కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. కార్మిక బీమా..: భవన నిర్మాణ రంగంలోని కూలీలు, మేస్త్రీలు తక్కువ ప్రీమియంతో బీమా పొందే వీలుంది. మొదటి సంవత్సరం ప్రవేశరుసం రూ.50, అదనంగా మరో రూ.12 చొ ప్పున రూ.62 చెల్లించాలి.. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2లక్షల పరిహారం పొందవచ్చు. అయితే ఏటా ప్రీమి యం చెల్లిస్తూ పాలసీని రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉం టుంది. సహజమరణమైతే రూ.30వేలు, పని చేసే చోట చనిపోతే అంత్యక్రియల కోసం రూ.5వేలు అందిస్తారు.