న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) కింద ఏప్రిల్ నెలలో 16.47 లక్షల మంది కొత్తగా వచ్చి చేరారు. ఇందుకు సంబంధించిన గణాంకాలను కేంద్ర కార్మిక శాఖ తాజాగా విడుదల చేసింది.
ఇందులో 47.60 శాతం అంటే 7.84 లక్షల మంది వయసు 25 ఏళ్లలోపే ఉందని, కొత్త ఉద్యోగాల కల్పనను ఈ గణాంకాలు ప్రతిఫలిస్తున్నాయని కార్మిక శాఖ పేర్కొంది. మొత్తం కొత్త సభ్యుల్లో 3.38 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఈఎస్‌ఐసీ కింద 53 మంది ట్రాన్స్‌జెండర్లు కూడా నమోదు చేసుకున్నారు.
సమాజంలో అన్ని వర్గాలకు ప్రయోజనాలు అందించడమే ఈ పథకం లక్ష్యంగా కార్మిక శాఖ తెలిపింది. ఇక ఏప్రిల్‌లో 18,490 కొత్త సంస్థలు ఈఎస్‌ఐసీ కింద రిజిస్టర్ చేసుకున్నాయి. దీంతో ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈఎస్‌ఐ కవరేజీ వచ్చినట్టయింది.
Comments
Please login to add a commentAdd a comment