ESIC
-
కొత్తగా 20.58 లక్షల మందికి ఈఎస్ఐ
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) నిర్వహించే ఈఎస్ఐ పరిధిలోకి సెప్టెంబర్‌లో కొత్తగా 20.58 లక్షల మంది చేరారు. 2023 సెప్టెంబర్‌లో కొత్త సభ్యుల నమోదు 18.88 లక్షలుగా ఉంది. అంటే 9 శాతం మందికి అదనంగా ఉపాధి లభించినట్టు తెలుస్తోంది. ఈ వివరాలను కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది.230 కొత్త సంస్థలు ఈఎస్ఐ పథకం పరిధిలో సెప్టెంబర్‌లో కొత్తగా 230 సంస్థలు నమోదు చేసుకున్నాయి. ఇక 20.58 లక్షల కొత్త సభ్యుల్లో 49 శాతం మేర 25 ఏళ్లలోపు వయసువారే ఉన్నారు. మహిళా సభ్యులు 3.91 లక్షల మంది కాగా, అలాగే 64 మంది ట్రాన్స్జెండర్లు కూడా కొత్తగా చేరారు. -
ఈఎస్ఐ పథకంలోకి భారీగా చేరిన ఉద్యోగులు
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) పథకంలో ఈ ఏడాది మేలో 23 లక్షల మంది కొత్త ఉద్యోగులు చేరారు. గతేడాది ఇదే నెలతో పోలిస్తే వీరి సంఖ్య 13.9% పెరిగింది. నెలవారీగా ఈఎస్ఐసీలో చేరే సరాసరి ఉద్యోగులు 16.4 లక్షల మందితో పోలిస్తే 39.9% వృద్ధిని నమోదు చేసింది. ఈమేరకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ డేటా విడుదల చేసింది.ఈఎస్ఐసీ తాజాగా విడుదల చేసిన పేరోల్ డేటా ప్రకారం..2024 ఏప్రిల్‌లో ఈఎస్ఐసీ పరిధిలో 18,490 మంది చేరారు. అదే మేలో మాత్రం ఆ సంఖ్య 20,110 కు చేరింది. మే నెలలో నమోదైన మొత్తం 23 లక్షల ఉద్యోగుల్లో 25 ఏళ్లలోపు వయసు ఉన్నవారు 11 లక్షల మంది, మహిళలు 44 వేలు, 60 మంది ట్రాన్స్‌జెండర్ ఉద్యోగులు ఈఎస్ఐ పథకం కింద నమోదు చేసుకున్నారు. నెలవారీ వేతనం రూ.21,000 వరకు ఉంటే వారి జీతాల్లో 0.75% ఈఎస్ఐ కింద జమ చేస్తారు. సంస్థ యాజమాన్యం మరో 3.25% విరాళంగా అందిస్తుంది. మొత్తం 4% నగదు ఈఎస్ఐలో జమ అవుతుంది. ఇది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య, నగదు ప్రయోజనాలను అందించేందుకు ఉపయోగిస్తారు.ఇదీ చదవండి: వీడియో స్ట్రీమింగ్ రంగంలో 2.8 లక్షల మందికి ఉపాధి -
ఈఎస్ఐసీ కిందకు 16.47 లక్షల మంది
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) కింద ఏప్రిల్ నెలలో 16.47 లక్షల మంది కొత్తగా వచ్చి చేరారు. ఇందుకు సంబంధించిన గణాంకాలను కేంద్ర కార్మిక శాఖ తాజాగా విడుదల చేసింది.ఇందులో 47.60 శాతం అంటే 7.84 లక్షల మంది వయసు 25 ఏళ్లలోపే ఉందని, కొత్త ఉద్యోగాల కల్పనను ఈ గణాంకాలు ప్రతిఫలిస్తున్నాయని కార్మిక శాఖ పేర్కొంది. మొత్తం కొత్త సభ్యుల్లో 3.38 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఈఎస్ఐసీ కింద 53 మంది ట్రాన్స్జెండర్లు కూడా నమోదు చేసుకున్నారు.సమాజంలో అన్ని వర్గాలకు ప్రయోజనాలు అందించడమే ఈ పథకం లక్ష్యంగా కార్మిక శాఖ తెలిపింది. ఇక ఏప్రిల్‌లో 18,490 కొత్త సంస్థలు ఈఎస్ఐసీ కింద రిజిస్టర్ చేసుకున్నాయి. దీంతో ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈఎస్ఐ కవరేజీ వచ్చినట్టయింది. -
ప్రభుత్వానికి, సంస్థలకు భారం తప్పదా..!
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) గరిష్ఠ వేతన పరిమితిని పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2014లో పెంచిన ఈ పరిమితిని ఇప్పటి మర్చలేదని, ఈసారైనా దీన్ని పెంచాలని ఎప్పటినుంచో ప్రభుత్వానికి డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఈపీఎఫ్‌వో వేతన పరిమితి పెంపు ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఈమేరకు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. మీడియా సంస్థల్లో వెలువడిన కథనాల ప్రకారం ఒకవేళ గరిష్ఠంగా రూ.21000 పెంచితే మాత్రం ప్రభుత్వంపై అదనంగా ఆర్థిక భారం పడనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దాంతోపాటు ప్రైవేట్ సంస్థలపై కూడా ఆ భారం తప్పదని చెబుతున్నారు. పీఎఫ్ నిబంధనల ప్రకారం.. వేతననంలో 12 శాతం పీఎఫ్ కట్ అవుతుంది. మరో 12 శాతం ఉద్యోగం కల్పించిన యాజమాన్యం జమ చేయాలి. అందులో 8.33 శాతం పెన్షన్‌కు కేటాయిస్తారు. మిగిలిన మొత్తం పీఎఫ్‌లో జమ చేస్తారు. గతంలో ఈపీఎఫ్ఓ గరిష్ఠ వేతన పరిమితి రూ.15000గా ఉండేదాన్ని ప్రస్తుతం రూ.21వేలు చేస్తూ వార్తలు, ప్రతిపాదనలు వస్తున్న నేపథ్యంలో అటు ప్రభుత్వానికి, ఇటు సంస్థలకు భారం పడనుందనే వాదనలు వస్తున్నాయి. ఇదీ చదవండి: ఐటీ జాబ్ కోసం వేచిచూస్తున్నారా.. టెకీలకు శుభవార్త -
కొత్తగా 18.86 లక్షల మందికి ఈఎస్ఐ.. ఆసక్తికర అంశం ఏంటంటే..
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ( ESIC ) కిందకు డిసెంబర్ నెలలో 18.86 లక్షల మంది కొత్త సభ్యులు చేరినట్టు కేంద్ర కార్మిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అదే నెలలో 23,347 సంస్థలు ఈఎస్ఐసీ కింద నమోదు చేసుకున్నాయి. ముఖ్యంగా యువతకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభింనట్లుగా తెలుస్తోంది. కొత్త సభ్యుల్లో 8.83 లక్షల మంది (47 శాతం) వయసు 25 ఏళ్లలోపే ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇక నికరంగా నమోదైన మహిళా సభ్యుల సంఖ్య 3.59 లక్షలుగా ఉంది. అలాగే, డిసెంబర్లో 47 ట్రాన్స్జెండర్లకు సైతం ఉద్యోగ అవకాశాలు లభించాయి. సమాజంలోని ప్రతివర్గానికీ ప్రయోజనాలు అందించేందుకు ఈఎస్ఐసీ కట్టుబడి ఉన్నట్టు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. కార్మిక శాఖ తాత్కాలిక పేరోల్ డేటా ప్రకారం.. ఈఎస్ఐసీ కింద అధికారిక ఉద్యోగ కల్పన నవంబర్‌లో 1.59 మిలియన్ల కొత్త ఉద్యోగులతో పోలిస్తే, డిసెంబర్లో నెలవారీగా 18.2 శాతం పెరిగింది. ఏప్రిల్‌లో 17.8 లక్షల మంది, మేలో 20.2 లక్షల మంది, జూన్‌లో 20.2 లక్షల మంది, జూలైలో 19.8 లక్షలు, ఆగస్టులో 19.4 లక్షలు, సెప్టెంబర్‌లో 18.8 లక్షలు, అక్టోబర్‌లో 17.8 లక్షల మంది ఈఎస్ఐసీలో కొత్తగా చేరుతూ వచ్చారు. -
ESI అవకతవకల కేసులో సినీనటి జయప్రదకి జైలుశిక్ష
-
ఈఎస్ఐసీ కిందకు 11.82 లక్షల కొత్త సభ్యులు
న్యూఢిల్లీ: ఈఎస్ఐసీ నిర్వహించే సామాజిక భద్రతా పథకం కింద అక్టోబర్ నెలలో కొత్తగా 11.82 లక్షల మంది సభ్యులుగా చేరారు. అక్టోబర్ నెలకు సంబంధించిన గణాంకాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్సీ) విడుదల చేసింది. 2017 సెప్టెంబర్ నుంచి 2022 అక్టోబర్ వరకు చేరిన మొత్తం సభ్యుల సంఖ్య 7.49 కోట్లుగా ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2021–22)లో 1.49 కోట్ల మంది సభ్యులు చేరగా, అంతకుముందు 2020–21లో చేరిన సభ్యుల సంఖ్య 1.15 కోట్లుగాను, 2019–20లో 1.51 కోట్లు, 2018–19లో 1.49 కోట్ల చొప్పున కొత్త సభ్యులు భాగస్వాములు అయ్యారు. ఈఎస్ఐసీ, ఈపీఎఫ్‌వో పథకాల్లో నెలవారీగా సభ్యుల చేరిక గణాంకాలను ఎన్ఎస్వో విడుదల చేస్తుంటుంది. అక్టోబర్ నెలలో ఈపీఎఫ్‌వోలో కొత్తగా 12.94 లక్షల మంది సభ్యులు చేరినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2017 అక్టోబర్ నుంచి 2022 అక్టోబర్ వరకు ఈపీఎఫ్‌వో కింద చేరిన కొత్త సభ్యులు 5.99 కోట్లుగా ఉన్నారు. -
Pre-Budget 2023: బడ్జెట్లో పన్నులు తగ్గించాలి
న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గించాలన్నది బడ్జెట్‌కు ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ముందుకు వచ్చిన ప్రధాన డిమాండ్లలో ఒకటి. అలాగే, మరింత మందికి ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని, ఆర్థిక వ్యవస్థకు చేదోడుగా మరిన్ని నిధులను ఖర్చు చేయాలని, పలు రంగాలకు ప్రోత్సాహకాలు కల్పించాలన్న డిమాండ్లు వచ్చా యి. కేంద్ర ఆర్థిక శాఖ 2023–24 బడ్జెట్‌కు ముందు వివిధ భాగస్వాములు, పరిశ్రమలతో సంప్రదింపులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 21న పలు రంగాల పరిశ్రమల ప్రతినిధులతో చర్చలు మొదలు పెట్టారు. సోమవారం ఆర్థికవేత్తల అభిప్రాయాలను తెలుసుకోవడం ద్వారా చర్చలను ముగించారు. వచ్చే ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను మంత్రి సీతారామన్ పార్లమెంట్‌కు సమర్పించనుండడం గమనార్హం. ఎంఎస్ఎంఈలకు గ్రీన్ సర్టిఫికేషన్, పట్టణ నిరుద్యోగుల కోసం ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టాలని, ఆదాయపన్నును క్రమబద్ధీకరించాలనే డిమాండ్లు వచ్చినట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. దేశీయంగా సరఫరా వ్యవస్థ బలోపేతం, ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నుల తగ్గింపు, ఈవీ విధానాన్ని ప్రకటించడం, గ్రీన్ హైడ్రోజన్‌కు భారత్‌ను కేంద్రం చేయడం, చిన్నారులకు సామాజిక భద్రత ప్రయోజనం, ఈఎస్ఐసీ కింద అసంఘటిత రంగ కార్మికులకు కవరేజీ కల్పించాలన్న డిమాండ్లు కూడా వచ్చాయి. -
ఈఎస్ఐసీలో కొత్తగా 15 లక్షల మంది చందాదారులు
న్యూఢిల్లీ: ఉద్యోగులకు సామాజిక భద్రతా స్కీముల్లో ఒకటైన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ)లో ఈ ఏడాది ఆగస్టులో కొత్తగా 14.62 లక్షల మంది చందాదారులు చేరారు. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) మంగళవారం విడుదల చేసిన ఉద్యోగ నియమాకాల నివేదికలో ఈ అంశం వెల్లడైంది. దీని ప్రకారం ఈఎస్ఐసీలో 2021–22లో స్థూలంగా చేరిన కొత్త చందాదారుల సంఖ్య 1.49 కోట్లుగా ఉంది. 2017 సెప్టెంబర్ – 2022 ఆగస్టు మధ్యకాలంలో ఇది 7.22 కోట్లుగా నమోదైంది. ఈఎస్ఐసీ, ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌వో), పెన్షన్ ఫండ్ నియంత్రణ.. అభివృద్ధి ప్రాధికార సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) నిర్వహించే వివిధ సామాజిక భద్రతా స్కీముల్లో కొత్తగా చేరిన వారి డేటా ఆధారంగా ఎన్ఎస్వో ఈ నివేదిక తయారు చేసింది. దీని ప్రకారం ఆగస్టులో ఈపీఎఫ్‌వోలో నికరంగా కొత్తగా 16.94 లక్షల ఎన్రోల్మెంట్స్ నమోదయ్యాయి. 2017 సెప్టెంబర్ – 2022 ఆగస్టు మధ్య కాలంలో స్థూలంగా 5.81 కోట్ల మంది కొత్త సబ్‌స్క్రయిబర్స్ ఈపీఎఫ్‌వోలో చేరారు. చదవండి: షాపింగ్ బంద్, యూపీఐ లావాదేవీలు ఢమాల్.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే! -
ప్రతీ కార్మికుడికి హెల్త్ ప్రొఫైల్
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ చందాదారుల ఆరోగ్య భద్రత విషయంలో కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈఎస్ఐ పరిధిలో ఉన్న ప్రతీ కార్మికుడి హెల్త్ ప్రొఫైల్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం అనారోగ్యం బారిన పడ్డ కార్మికులకు వైద్య చికిత్స, మందుల పంపిణీ వరకు పరిమితమైన ఈఎస్ఐసీ... ఇకపై కార్మికుడి ఆరోగ్య చిట్టా మొత్తాన్ని నిక్షిప్తం చేయనుంది. అంతేకాకుండా క్రమం తప్పకుండా ఏటా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి సదరు కార్మికుడికి హెచ్చరికలు సైతం ఇవ్వనుంది. దీంతో భవిష్యత్ ఆరోగ్య పరిస్థితిపై కొంత అంచనా వస్తుందని, సకాలంలో జాగ్రత్తలు తీసుకుంటే కార్మికుడికి ఆరోగ్యకర జీవితం అందుతుందని సంస్థ చెబుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 63వేల సంస్థలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలున్నాయి. వీటి పరిధిలో 21 లక్షల మంది చందాదారులున్నారు. వీరి కుటుంబ సభ్యులను కలుపుకుంటే దాదాపు 80 లక్షలు అవుతారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఏటా సగటున 3.5 లక్షల మంది ఐపీ (ఇన్‌పేషెంట్) కేటగిరీలో వైద్య చికిత్సలు పొందుతున్నారు. వీటికి అదనంగా మరో 20 శాతం మంది ఓపీ సేవలు కూడా పొందేవారున్నట్లు ఈఎస్ఐసీ చెబుతోంది. ఆరోగ్య పరీక్షలు కీలకం కార్మికుల హెల్త్ ప్రొఫైల్ నిర్వహణలో ఆరోగ్య పరీక్షల ప్రాత కీలకం. దీంతో ఏడాదికోసారి కార్మికులకు పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ఈఎస్ఐసీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం అనారోగ్య సమస్యలు తలెత్తిన వారు మాత్రమే పరీక్షలు చేయించుకుని చికిత్స పొందుతున్నారు. ఇకపై హెల్త్ ప్రొఫైల్ నిర్వహణలో భాగంగా తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అనంతరం ఫలితాలను ఈఎస్ఐసీ వెబ్సైట్లో కార్మికుడి డేటాలో నిక్షిప్తం చేసి, ప్రతి సంవత్సరం ఈ వివరాలను అప్డేట్ చేస్తారు. పరీక్షల్లో ఏవైనా అనారోగ్య సంబంధిత లక్షణాలు, దీర్ఘకాల వ్యాధులు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత ఆస్పత్రికి రిఫర్ చేసి చికిత్సను అందిస్తారు. ప్రస్తుతం ఆరోగ్య పరీక్షలను అన్ని ఈఎస్ఐ ఆస్పత్రుల్లో చేపట్టేలా చర్యలు మొదలు పెట్టారు. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాల పనితీరుతోపాటు రక్త, మూత్ర పరీక్షలు నిర్వహిస్తారు. మరోవైపు చందాదారులందరికీ స్మార్ట్ కార్డులు ఇవ్వాలని కూడా సంస్థ నిర్ణయించింది. ఏప్రిల్ నాటికి ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. -
ఈఎస్ఐసీలో ఉద్యోగాలు.. నెలకు జీతం ఎంతంటే!
న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ).. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థ దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాలలో అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 15వ తేదీలోగా దరఖాస్తులను సమర్పించాలి. మొత్తం పోస్టుల సంఖ్య: 3820 విభాగాల వారీగా పోస్టులు: అప్పర్ డివిజన్ క్లర్క్(యూడీసీ)–1726, స్టెనోగ్రాఫర్ –163, మల్టీటాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్)–1931. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఆంధ్రప్రదేశ్–35: యూడీసీ–07, ఎంటీఎస్–26, స్టెనో–02. తెలంగాణ–72: యూడీసీ–25, ఎంటీఎస్–43, స్టెనో–04 అర్హతలు: ఎంటీఎస్ పోస్టులకు సంబంధించి పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హతను పూర్తిచేసి ఉండాలి. స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హతలో ఉత్తీర్ణత, అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) వయసు: స్టెనో, యూడీసీ పోస్టులకి 18–27 ఏళ్లు, ఎంటీఎస్ పోస్టులకు 18–25 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనాలు: అప్పర్ డివిజన్ క్లర్క్(యూడీసీ) పోస్టులకి 4వ పే లెవల్ ప్రకారం–నెలకు రూ.25,500–రూ.81,100, ఎంటీఎస్ వారికి పే లెవల్ 1 ప్రకారం–నెలకు రూ.18,800– రూ.56,900 వేతనంగా చెల్లిస్తారు. ఎంపిక ప్రక్రియ ప్రిలిమినరీ, మెయిన్స్ రాత పరీక్ష, స్కిల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఆయా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. పరీక్ష విధానం అప్పర్ డివిజన్ క్లర్క్(యూడీసీ): యూడీసీ పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష–200 మార్కులకు, మెయిన్స్–200 మార్కులకు, కంప్యూటర్ స్కిల్ టెస్ట్ 50 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ విభాగాల నుంచి ప్రశ్నలను అడుగుతారు. ప్రిలిమినరీ పరీక్షకు గంట(60 నిమిషాలు) సమయం, మెయిన్స్‌కు రెండు గంటలు(120 నిమిషాలు) పరీక్ష సమయంగా కేటాయిస్తారు. స్టెనోగ్రాఫర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు మెయిన్ ఎగ్జామ్, స్కిల్ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ మాత్రమే నిర్వహించి అర్హులైన వారిని తుది ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. దీంట్లో అర్హత సాధించిన వారిని మాత్రమే స్కిల్ టెస్ట్‌కు అనుమతిస్తారు. మెయిన్స్ పరీక్ష సమయం 130 నిమిషాలు. ఇందులో డిక్టేషన్, ట్రాన్స్‌స్క్రిప్షన్(ఇంగ్లిష్, హిందీ) టెస్టులు ఉంటాయి. డిక్టేషన్‌కు 10 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు. నిమిషానికి 80 వర్డ్స్ టైప్ చేయాలి. ట్రాన్స్స్క్రిప్షన్కు సంబంధించి ఇంగ్లిష్‌కు 50 నిమిషాలు(పీడబ్ల్యూడీలకు 70 నిమిషాలు ), హిందీకి 65 నిమిషాలు(పీడబ్యూడీలకు 90 నిమిషాలు) స్కిల్ టెస్టుకు సమయం కేటాయిస్తారు. మల్టి టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) ఎంటీఎస్ పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ–200 మార్కులకి, మెయిన్స్ పరీక్ష 200 మార్కులకి నిర్వహిస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు ప్రారంభతేదీ: 15.01.2022 ► దరఖాస్తు చివరి తేదీ: 15.02.2022 ► వెబ్సైట్: esic.nic.in -
ఈఎస్ఐసీ కిందకు 13.37 లక్షల మంది
న్యూఢిల్లీ: కార్మికరాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) నిర్వహించే సామాజిక భద్రతా పథకం కిందకు సెప్టెంబర్ నెలలో కొత్తగా 13.37 లక్షల మంది చేరారు. అంతక్రితం నెల ఆగస్ట్‌లో కొత్త సభ్యుల సంఖ్య 13.42 లక్షలుగా ఉండడం గమనార్హం. వ్యవస్థీకృత రంగంలో కొత్తగా ఉపాధి పొందిన వారి డేటాను ఈ రూపంలో తెలుసుకోవచ్చు. జాతీయ గణాంకా ల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో ఈఎస్ఐసీ కిందకు 10.76 లక్షల మంది నికరంగా చేరగా, మేలో 8.90 లక్షల మంది, జూన్‌లో 10.65 లక్షల మంది, జూలైలో 13.40 లక్షల మంది, ఆగస్ట్‌లో 13.42 లక్షల మంది చొప్పున నికరంగా చేరారు. కరోనా లాక్డౌన్లు సడలిపోవడంతో జూన్, జూలై, ఆగస్ట్ నెలల్లో ఎక్కువ మంది చేరినట్టు తెలుస్తోంది. 2020–21లో ఈఎస్ఐసీ కిందకు కొత్తగా 1.15 కోట్ల మంది సభ్యులు కాగా, అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2019–20లో కొత్తగా చేరిన వారి సంఖ్య 1.51 కోట్లుగా ఉంది. 2018–19లో 1.49 కోట్లు, 2017–18లో 83.85 లక్షల చొప్పున ఈఎస్ఐసీకి సభ్యులు జతయ్యారు. -
ఈఎస్ఐసీ చందాదారులకు కేంద్రం శుభవార్త!
న్యూఢిల్లీ: కార్మికరాజ్య బీమా సంస్థ(ఈఎస్ఐసీ) చందాదారులకు శుభవార్త. అటల్ బీమిటీ వ్యాక్తి కళ్యాణ్ యోజన పథకం గడువును 2022 జూన్ 30 వరకు పోడగిస్తున్నట్లు కార్మికరాజ్య బీమా సంస్థ(ఈఎస్ఐసీ) ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోయినవారిని కేంద్ర ప్రభుత్వం అటల్ బిమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకం కింద ఆదుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందేందుకు గతంలో గడువు 2020 డిసెంబర్ 31 వరకు ఉండేది. అయితే, ఆ తర్వాత ఈ స్కీమ్ గడువును 2021 జూన్ 30 వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా మరోసారి గడువును ఈసారి ఏకంగా ఒక ఏడాది వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంటే 2021 జూలై 1 నుంచి 2022 జూన్ 30 వరకు ఈ స్కీమ్‌ను పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ పథకం కింద పారిశ్రామిక కార్మికులకు నిరుద్యోగ ప్రయోజనాలు అందిస్తారు. ఏ కారణం చేతనైనా బీమా చేసిన వ్యక్తులు ఉద్యోగం కోల్పోతే 3 నెలల పాటు 50 శాతం వేతనంతో నిరుద్యోగ భత్యం అందిస్తారు. ఈఎస్ఐసీ చట్టం, 1948లోని సెక్షన్ 2(9) ప్రకారం జీవితంలో ఒకసారి మాత్రమే ఈ పథకం ద్వారా బెనిఫిట్ పొందొచ్చు.(చదవండి: Tesla: వారెవ్వా టెస్లా.. ‘లేజర్’తో అద్దాలు శుభ్రం!) కోవిడ్-19 వ్యాప్తి చెందినప్పటి నుంచి 50,000 మందికి పైగా ఉద్యోగులు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందారు. కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రెండు అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థల్లో ఒకటైన ఈఎస్ఐసీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. "ఉద్యోగాలు కోల్పోయే ఈఎస్ఐసీ చందాదారులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ, కోవిడ్-19 మహమ్మారి కాలంలో తొలగిస్తున్న కార్మికుల సంఖ్య పారదర్శకంగా ఉండటం లేదని" అని ఈఎస్ఐసీ బోర్డు సభ్యుడు అమర్జీత్ కౌర్ అన్నారు. -
కరోనా బాధిత కార్మిక కుటుంబాలకు ఈఎస్ఐసీ పింఛన్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనాతో మృతిచెందిన కార్మికులపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు పింఛను ఇచ్చేందుకు కార్మికరాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) ప్రత్యేక పథకాన్ని ప్రారంభించినట్లు కేంద్రం తెలిపింది. 2020 మార్చి 23న ప్రారంభించిన ఈ పథకం రెండేళ్లు అమల్లో ఉంటుందని వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి రామేళ్వర్ తేలి సమాధానమిచ్చారు. ఓబీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వరంగ సంస్థల అధికారులకు క్రీమీలేయర్ నిబంధన ఒకేలా వర్తిస్తుందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు సమాధానంగా కేంద్ర సామాజిక న్యా యశాఖ సహాయమంత్రి ప్రతిమా భౌమిక్ తెలి పారు. 15వ ఆర్థికసంఘం సూచనల మేరకు ప్రతి రాష్ట్రంలో ఒక కొత్త నగరం ఏర్పాటు చేయనున్నట్లు వైఎస్సార్సీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర గృహ, పట్టణాభివృద్ధిశాఖ సహా యమంత్రి కౌశల్ కిషోర్ సమాధానమిచ్చారు. ఏపీలో 8 ఎంసీసీలు ఆంధ్రప్రదేశ్‌లో 8 ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజీలను మోడల్ కెరీర్ సెంటర్స్ (ఎంసీసీ)గా అభివృద్ధి చేసేందుకు ఒక్కోదానికి రూ.50 లక్షలను కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని బీజేపీ సభ్యుడు సీఎం రమేశ్ ప్రశ్నకు మంత్రి రామేశ్వర్ తేలి చెప్పారు. విశాఖపట్టణం సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో రక్షణశాఖ పరిధిలోని భూముల్లో 29 పౌర విమానాశ్రయాలు ఉన్నాయని బీజేపీ సభ్యుడు టీజీ వెంకటేశ్ ప్రశ్నకు సమాధానమిచ్చారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని దేశంలో మౌలిక సదుపాయాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు టీడీ పీ సభ్యుడు కె.రవీంద్రకుమార్ ప్రశ్నకు మంత్రి రామేశ్వర్ తేలి సమాధానమిచ్చారు. కాకినాడ వద్ద రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మాణం విషయంలో తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రశ్నకు కేంద్రమంత్రి రామేశ్వర్ తేలి చెప్పారు. లోక్‌సభలో కోవిడ్ బీప్ ఉత్పత్తికి చర్యలు కరోనా రోగుల ఆరోగ్య పర్యవేక్షణ పరికరం ‘కోవిడ్ బీప్’ పెద్దసంఖ్యలో ఉత్పత్తికి చర్యలు చేపట్టినట్లు కేంద్ర అణుశక్తిశాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. 100 పరికరాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎంపీలు చింతా అనూరాధ, ఆదాల ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. శక్తి పాలసీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని థర్మల్ ప్లాంట్లకు బొగ్గు కేటాయిస్తున్నట్లు వైఎస్సార్సీపీ సభ్యుడు వైఎస్ అవినాశ్‌రెడ్డి ప్రశ్నకు సమాధానంగా కేంద్ర బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. కరోనా వ్యాక్సినేషన్ ధ్రువపత్రాలపై బహుపాక్షిక నిర్ణయం తీసుకోలేదని వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విదేశాంగశాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ తెలిపారు. సుప్రీంకోర్టులో దాఖలయ్యే రివ్యూ, క్యురేటివ్ పిటిషన్లకు సంబంధించి రికార్డు మెయింటైన్ చేయబోమని వైఎస్సార్సీపీ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నకు జవాబుగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు చెప్పారు. ఈఏడాది మే నుంచి జూన్ వరకు ఇస్రో 30 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఆంధ్రప్రదేశ్‌కు పంపిణీ చేసిందని వైఎస్సార్సీపీ సభ్యులు ఎన్.రెడ్డెప్ప, మాగుంట శ్రీనివాసులురెడ్డి, బి.వి.సత్యవతి, లావు శ్రీకృష్ణదేవరాయులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రధాని కార్యాలయ సహాయమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. -
కరోనా మృతుల కుటుంబాలకు కేంద్రం గుడ్‌న్యూస్
సాక్షి, న్యూడిల్లీ: కరోనాతో మరణించిన కార్మికుల కుటుంబసభ్యులకు పింఛన్‌ను అందించేందుకు ఈఎస్ఐసీ ప్రత్యేక పథకాన్ని ప్రారంభించినట్లు కార్మిక, ఉపాధి శాఖ మంత్రి రామేశ్వర్ తెలీ వెల్లడించారు. రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు బుధవారం మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. 2020 మార్చి 23వ తేదీ నుంచి ప్రారంభించిన ఈఎస్ఐసీ కోవిడ్-19 రిలీఫ్ స్కీమ్ రెండేళ్లపాటు అమలులో ఉంటుందని తెలిపారు. ఈఎస్ఐసీ వద్ద ఇన్సూర్ అయిన కార్మికులపై ఆధారపడిన కుటుంబసభ్యులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈఎస్ఐసీ కోవిడ్ రిలీఫ్ పథకం కింద మరణించిన కార్మికుడు లేదా ఉద్యోగిపై ఆధారపడిన అర్హులైన కుటుంబసభ్యులకు ఉద్యోగి పొందే వేతనంలో సగటున 90 శాతం మొత్తాన్ని పింఛన్ కింద చెల్లిస్తామని మంత్రి రామేశ్వర్ తేలి వివరించారు. ఈ పింఛన్ పొందడానికి రూపొందించిన అర్హతలు ఇవే. కోవిడ్ సోకినట్లుగా గుర్తించిన రోజు నుంచి మూడు నెలల ముందు సదరు కార్మికుడు లేదా ఉద్యోగి తప్పనిసరిగా ఈఎస్ఐసీ ఆన్లైన్ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకుని ఉండాలి. కోవిడ్ బారిన పడటానికి ముందు కనీసం 70 రోజుల పాటు ఆ ఉద్యోగి తరఫున ఈఎస్ఐసీ చందా చెల్లిస్తూ ఉండాలి. కోవిడ్‌తో మరణించిన వ్యక్తి మహిళ ఉంటే పింఛన్ ప్రయోజనం భర్తకు లభిస్తుంది. ప్రస్తుతం అమలులో ఉన్న పింఛన్ నిబంధనల ప్రకారం కార్మికుడు మరణానంతరం అతడి భార్య తిరిగి వివాహం చేసుకునే వరకు పింఛన్‌కు అర్హురాలు. అయితే ఈఎస్ఐసీ కోవిడ్ రిలీఫ్ పథకం కింద పింఛన్‌కు అర్హురాలైన మహిళకు ఈ నిబంధన వర్తించదు. ఉద్యోగుల భవిష్య నిధిలో సభ్యులైన కార్మికులు లేదా ఉద్యోగులకు కూడా ఈఎస్ఐసీ కోవిడ్ రిలీఫ్ పథకం వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా పింఛన్‌కు అర్హులైన కుటుంబసభ్యుల్లో భర్త లేదా భార్య వారి జీవితాంతం పెన్షన్ పొందే అవకాశం ఉంది. లబ్ధిదారుడు కుమారుడైతే అతడికి 25 ఏళ్లు నిండే వరకు, కుమార్తె అయితే వారికి వివాహం జరిగే వరకూ పింఛన్ పొందడానికి అర్హులు. -
ఈఎస్ఐసీ పరిధిలోకి 10.41 లక్షల మంది
న్యూఢిల్లీ: కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) నిర్వహించే సామాజిక భద్రతా పథకం కిందకు ఏప్రిల్ నెలలో కొత్తగా 10.41 లక్షల మంది సభ్యులుగా చేరారు. వ్యవస్థీకృత రంగంలో ఈ మేరకు నూతనంగా ఉపాధి అవకాశాలు లభించినట్టుగా భావించాలి. 2020–21 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఈఎస్ఐసీ కిందకు స్థూలంగా 1.15 కోట్ల మంది నమోదు అయ్యారు. 2019–20లో నమోదు 1.51 కోట్ల మందితో పోలిస్తే 24 శాతం తగ్గినట్టు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) శుక్రవారం గణాంకాలను విడుదల చేసింది. కరోనా వైరస్ విస్తరణను అడ్డుకునేందుకు గతేడాది మార్చి 25న దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను కేంద్రం ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత సడలింపులు చేసినప్పటికీ ఉపాధిపై ఆ ప్రభావం గణనీయంగానే పడింది. ఈఎస్ఐసీ కింద 2018–19లో స్థూలంగా 1.49 కోట్ల మంది చేరారు. 2017 సెప్టెంబర్ నుంచి 2021 ఏప్రిల్ వరకు ఈఎస్ఐసీ పరిధిలో స్థూలంగా 5.09 కోట్ల మంది సభ్యులయ్యారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్‌వో) కింద 12.76 లక్షల మంది కొత్తగా చేరారు. చదవండి: కోపరేటివ్‌లపై రాజకీయ పెత్తనానికి చెక్ -
కోవిడ్ మృతుల కుటుంబాలకు ఫించన్
న్యూఢిల్లీ: కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఇంట్లో సంపాదించే వ్యక్తిని కోల్పోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈఎస్ఐసీ, ఈపీఎఫ్ఓ పథకాలలో చేరిన ఉద్యోగుల కుటుంబాలకు ఆ ఉద్యోగి రోజువారీ వేతనంలో 90 శాతం మొత్తాన్ని కుటుంబానికి ప్రభుత్వం ఫించనుగా అందించనుంది. గతేడాది మార్చి 24 నుంచి నుంచి మార్చి 24,2022 వరకు ఈ పథకం వర్తిస్తుంది అని తెలిపింది. కోవిడ్‌తో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేలా ఈడీఎల్ఐ పథకం కింద వర్తించే భీమా ప్రయోజనాలపై కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే, గరిష్ట భీమా మొత్తాన్ని రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచింది. కనీస భీమా మొత్తాన్ని రూ .2.5 లక్షలుగా పునరుద్ధరించింది. గతేడాది ఫిబ్రవరి 15 నుంచి వచ్చే మూడేళ్ల పాటు ఇది వర్తిస్తుంది. సాధారణ, కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు కూడా లబ్ది చేకూరేలా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ పథకాలకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ జారీ చేస్తుందని స్పష్టం చేసింది. రాబోయే 3 సంవత్సరాల్లో, అర్హతగల కుటుంబ సభ్యులకు రూ. 2021-22 నుండి 2023-24 సంవత్సరాలలో ఈడీఎల్ఐ ఫండ్ నుంచి రూ.2185 కోట్లు చెల్లించనున్నట్లు అంచనా వేసింది. పీఎం కేర్స్-ఫర్ చిల్డ్రన్ "ఈ సంక్షేమ చర్యలు COVID-19 వ్యాధి కారణంగా మరణించిన కార్మికుల కుటుంబాలకు చాలా అవసరమైన సహాయాన్ని అందిస్తాయి. మహమ్మారి నుంచి ఈ సమయాల్లో ఆర్థిక ఇబ్బందుల నుంచి వారిని కాపాడుతుంది" అని ప్రభుత్వం పేర్కొంది. అలాగే, కేంద్ర ప్రభుత్వం 'పీఎం కేర్స్-ఫర్ చిల్డ్రన్' పథకాన్ని ప్రకటించింది. కరోనా వల్ల అనాథ అయిన పిల్లలకు 18 ఏళ్ల వయసు వచ్చేనాటికి వారి పేరిట రూ.10 లక్షల కార్పస్ ఫండ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 18 ఏళ్ల వయసు నుంచి ఐదేళ్ల పాటు ప్రతీ నెలా వారికి స్టైఫండ్ అందిస్తుంది. పిల్లలకు 23 ఏళ్ల వయసు వచ్చాక ఆ కార్పస్ ఫండ్ మొత్తాన్ని వారికి అందిస్తారు. దాన్ని వ్యక్తిగత ఖర్చులకు, చదువులకు లేదా వృత్తిపరమైన అవసరాలకు ఎలాగైనా వాడుకోవచ్చు. అలాగే, ఈ పథకం కింద అనాథ పిల్లలకు ఉచిత విద్య,ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షలు ఆరోగ్య భీమా అందించనున్నారు. భవిష్యత్తులో ఉన్నత చదువుల కోసం తీసుకునే విద్యా రుణాలపై వడ్డీ భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుంది. చదువులకు స్కాలర్షిప్స్ కూడా అందిస్తుంది. దేశంలో కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను, సంరక్షకులను కోల్పోయిన ఎంతోమంది చిన్నారులకు ఈ పథకం లబ్ది చేకూర్చనుంది. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు కూడా ఇదే తరహా పథకాలను ఇప్పటికే ప్రకటించాయి. చదవండి: -
మార్చి నెలలో కొత్తగా 12.24 లక్షల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: గత మార్చి నెలలో సుమారు 12.24 లక్షల మంది కొత్త సభ్యులు ఈఎస్ఐసీ(ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) నిర్వహిస్తున్న సామాజిక భద్రతా పథకంలో చేరారు. గత ఏడాది మార్చి నెలలో ఈ సంఖ్య 11.77 లక్షలుగా ఉంది. అంటే ఆ నెలలో దేశవ్యాప్తంగా అన్ని కొత్త ఉద్యోగాలు లభించినట్లు తెలుస్తుంది. తాజా గణాంకాలు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్(ఎన్ఎస్ఓ) విడుదల చేసిన నివేదికలో ఈ విషయం పేర్కొంది. తాజా డేటా ప్రకారం.. 2020-21లో ఈఎస్ఐసీ స్థూల నమోదు 24 శాతం తగ్గి 1.15 కోట్లకు చేరుకుంది కొవిడ్ మహమ్మారి దీనికి కారణమని, అంత క్రితం ఆర్థిక సంవత్సరంలో 1.51 కోట్ల మంది కొత్తగా ఈ పథకంలో చేరారని ఎన్ఎస్ఓ వెల్లడించింది. 2018-19లో ఈఎస్ఐసీ కొత్త చందాదారుల స్థూల నమోదు 1.49 కోట్లు అని ఎన్ఎస్ఓ నివేదిక వెల్లడించింది. సెప్టెంబర్ 2017 నుండి మార్చి 2018 వరకు సుమారు 83.35 లక్షల మంది కొత్త చందాదారులు ఈఎస్ఐసీ పథకంలో చేరారు. సెప్టెంబర్ 2017 నుంచి 2021 మార్చి వరకు ఈఎస్ఐసీలో స్థూలంగా కొత్త నమోదుల సంఖ్య దాదాపు ఐదు కోట్లు. కొత్త చందాదారుల పేరోల్ డేటా అనేది ఈఎస్ఐసీ, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(పీఎఫ్ఆర్ డీఏ) ఆధారంగా రూపొందించబడింది. చదవండి: కోవిడ్-19 విపత్తు వేళ ఉద్యోగులకు అండగా కార్పొరేట్ -
ఇక అన్ని జిల్లాల్లోనూ ఈఎస్ఐ సేవలు
న్యూఢిల్లీ: దేశంలో ఇకపై అన్ని జిల్లాల్లోనూ ఈఎస్ఐ సేవలు లభించనున్నాయి. భారత్‌లోని 735 జిల్లాల్లోనూ ఏప్రిల్ 1నుంచి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ఇన్సూర్డ్ పర్సన్స్‌కు వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు. ప్రస్తుతం ఈ సేవలు కేవలం 387 జిల్లాల్లో మాత్రమే పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండగా, మరో 187 జిల్లాల్లో పాక్షికంగా అందుబాటులో ఉన్నాయి. 161 జిల్లాల్లో మాత్రం అసలు ఈ సేవలే ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా కేంద్రం ఈ సేవల ఏర్పాటుకు ముందడుగు వేసింది. దీనికి సంబంధించిన బిల్లుల ప్రక్రియను ఎసిక్ స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. -
ఈఎస్ఐ సభ్యులు నేరుగా ప్రైవేట్ ఆసుపత్రికెళ్లొచ్చు
న్యూఢిల్లీ: కార్మిక రాజ్య బీమా సంస్థ(ఈఎస్ఐసీ) సభ్యులు ఇకపై అత్యవసర పరిస్థితుల్లో తమ సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి నేరుగా ఆరోగ్య సేవలు పొందవచ్చు. ఈ వెసులుబాటును సంస్థ యాజమాన్యం కల్పించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధన ప్రకారం.. ఈఎస్ఐసీ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు(లబ్ధిదారులు) తొలుత ఈఎస్ఐసీ ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో చేరాల్సి ఉంటుంది. అక్కడి వైద్యుల సిఫార్సు మేరకు ప్రైవ్రేట్ హాస్పిటళ్లలో చేరొచ్చు. ఎమర్జెన్సీ కేసుల విషయంలో ఈఎస్ఐసీ ఆసుపత్రికి రావాల్సిన అవసరం లేకుండానే నేరుగా ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లి, సేవలు పొందవచ్చని టీయూసీసీ జనరల్ సెక్రెటరీ ఎస్.పి.తివారీ చెప్పారు. సోమవారం జరిగిన బోర్డు మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీని వల్ల ఎంతోమంది లబ్ధిదారులకు మేలు జరుగుతుందని అన్నారు. గుండె పోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో వెంటనే ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం ఉంటుందన్నారు. -
దారుణంగా పడిపోయిన ఉద్యోగాల కల్పన
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థికమందగమనం, వినియోగదారుల డిమాండ్ పడిపోతున్న నేపథ్యంలో మరో షాకింగ్ న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. జూలై మాసంతో పోలిస్తే, ఆగస్టుమాసంలో ఉద్యోగాల కల్పన దారుణంగా పడిపోయింది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఇఎస్ఐసి) పేరోల్ డేటా ప్రకారం ఆగస్టులో సుమారు 13 లక్షల ఉద్యోగ అవకాశాలు మాత్రం రాగా, అంతకుముందు నెలలో (జూలై) ఈ సంఖ్య 14.49 లక్షలు. 2018-19లో ఇఎస్ఐసితో కొత్త చందాదారుల స్థూల నమోదు 1.49 కోట్లు అని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) ఒక నివేదికలో తెలిపింది. 2017 సెప్టెంబర్ నుండి 2019 ఆగస్టు వరకు సుమారు 2.97 కోట్ల మంది కొత్త చందాదారులు ఈ పథకంలో చేరినట్లు కూడా నివేదిక వివరించింది. ఇఎస్ఐసీ, రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్‌వో, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహించే వివిధ సామాజిక భద్రతా పథకాల్లో చేరిన కొత్త చందాదారుల పేరోల్ డేటా ఆధారంగా ఎన్ఎస్ఓ నివేదికను రూపొందిస్తుంది. సెప్టెంబర్ 2018 నుండి ప్రారంభమయ్యే కాలాన్ని కవర్ చేస్తూ ఏప్రిల్ 2018 నుండి ఈ మూడు సంస్థల పేరోల్ డేటా లేదా కొత్త చందాదారుల డేటాను విడుదల ఎన్ఎస్ఓ చేస్తోంది. దీని ప్రకారం సెప్టెంబర్ 2017 నుండి మార్చి 2018 వరకు ఇఎస్ఐసీ లో కొత్త నమోదులు 83.35 లక్షలుగా ఉందని నివేదిక చూపించింది. ఈ ఏడాది జూలైలో 11.71 లక్షలతో పోలిస్తే ఆగస్టులో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) తో 10.86 లక్షల కొత్త ఉద్యోగాలు మాత్రమే నమోదయ్యాయి. 2018-19లో నికర ప్రాతిపదికన 61.12 లక్షల మంది కొత్త చందాదారులు ఇపిఎఫ్ఓ నిర్వహిస్తున్న సామాజిక భద్రతా పథకాలలో చేరారు. అదేవిధంగా, నికర కొత్త నమోదులు (సెప్టెంబర్ 2017 - మార్చి 2018 వరకు) 15.52 లక్షలు. కాగా సెప్టెంబర్ 2017 - 2019 ఆగస్టులో ఇపీఎఫ్ పథకంలో చేరిన కొత్త చందాదారులు సుమారు 2.75 కోట్ల మంది. చందాదారుల సంఖ్య వివిధ వనరుల నుండి వచ్చినందున, ఈ అంచనాలు సంకలితం కాదని ఎన్ఎస్ఓ నివేదిక పేర్కొంది. -
ఓపిక ఉంటేనే రండి!
అమీర్‌పేట: ప్రజా ప్రతినిధులు హెచ్చరించినా, స్టాండింగ్ కమిటీ సభ్యులు వారించినా సనత్‌నగర్ ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అధికారుల తీరు మారడం లేదు. వారి ప్రవర్తనతో ఆస్పత్రికి వస్తున్న రోగులు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. చికిత్స నిమిత్తం వచ్చే రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అయితే అందుకు తగ్గట్టుగా వైద్యసేవలు అందడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కార్మికులకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఒక రోజు సెలవుపెట్టి ఆస్పత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుని మందులు వాడాల్సిన పరిస్థితి మచ్చుకైనా కనిపించడం లేదు. పరీక్షల కోసం నెలల తరబడి ఆస్పత్రి చుట్టూ తిరగాల్సి రావడంతో సకాలంలో వైద్యం అందటం లేదని ఈఎస్ఐ లబ్ధిదారులు వాపోతున్నారు. అత్యవసరంగా చేయాల్సిన ఎంఆర్ఐతో పాటు ఇతర స్కానింగ్‌లకు సైతం కనీసం మూడు నెలల కాలం ఆగాల్సి వస్తోందని, ఈలోగా రోగం ముదిరిపోయి ప్రాణాలమీదకు వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో చేరిన వారికి రోగం నయం కాకముందే డిచ్చార్జి చేస్తున్నారు. అదేమని అడిగితే బెడ్లు ఖాళీ లేవని సమాధానం ఇస్తున్నారని ఓ రోగి బంధువు వాపోయాడు. ఈఎస్ఐ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెబుతున్న పాలకుల మాటలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఇక ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో సైతం మందుల కొరత తీవ్రంగా ఉన్నట్లు రోగులు వాపోతున్నారు. ఇటీవల ఆస్పత్రిని సందర్శించిన స్టాండింగ్ కమిటీ సభ్యులకు రోగులు స్థానిక సమస్యలపై ఫిర్యాదు చేయగా కమిటీ సభ్యులు అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. అయినా ఎలాంటి మార్పు రాలేదు. ఇక సెక్యూరిటీ సిబ్బంది రోగుల సహయకుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రి లోపలికి వెళ్లిన ప్రతిసారి జైల్లో విచారణ ఖైదీలను తనిఖీ చేసినట్టు చేస్తున్నారు. వాహనాలకు పార్కింగ్ లేదు.. ఆస్పత్రికి వచ్చే రోగుల వాహనాలకు ప్రాంగణంలో భద్రత లేకుండా పోతోంది. వైద్యం కోసం ఓపీ బ్లాక్‌కు వచ్చే రోగుల వాహనాలు పార్కింగ్ చేసేందుకు వీలుగా మెడికల్ కళాశాల కింద ఉన్న డబుల్ సెల్లార్లో స్థలం కేటాయించారు. ఆస్పత్రి అధికారులు, వైద్యులు కూడా తమ వాహనాలను ఇక్కడే పార్కింగ్ చేస్తుంటారు. అయితే తమ వాహనాలు ధ్వంసం చేస్తున్నారన్న సాకుతో రోగుల వాహనాలను సెల్లార్లోకి అనుమతించడం లేదు. ఓపీ బ్లాక్‌కు వచ్చే వాహనాలు సుమారు కిలో మీటరు దూరంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సెల్లార్లోకి పంపిస్తున్నారు. దీంతో అక్కడి వరకు వెళ్లేందుకు ఓపికలేక చాలా మంది ఆస్పత్రి బయట రోడ్లపై నిలుపుతున్నారు. మెడికల్ కళాశాల సెల్లార్లోకి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మద్యం తాగి వాహనాలను ధ్వంసం చేయడంతో రోగుల వాహనాలను అనుమతించడం లేదని మెడికల్ కళాశాల డీన్ తెలిపారు. -
ఎస్బీఐతో ఈఎస్ఐసీ అవగాహన
బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ఒక అవగాహన కుదుర్చుకుంది. ఈఎస్ఐసీ లబ్దిదారులు, ఇతర చెల్లింపుదారుల అకౌంట్లకు ప్రత్యేక్షంగా బ్యాంక్ నుంచి ఎలక్ట్రానిక్ చెల్లింపులు ఈ అవగాహన లక్ష్యం. మ్యాన్యువల్తో ఇక ఏ మాత్రం సంబంధంలేని ఈ ప్రక్రియ వల్ల చెల్లింపుల్లో జాప్యం, తప్పుల వంటి వాటికి అవకాశం ఉండదని, ఈఎ స్ఐసీ వాటాదారులు అందరికీ కొత్త వ్యవస్థ ప్రయోజనం చేకూర్చుతుంది. -
ఈఎస్ఐసీలో 5వేల పోస్టుల భర్తీ
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ)లోని సుమారు 5వేల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు కార్మికశాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ వెల్లడించారు. దేశ రాజధానిలోని మయూర్ విహార్ ప్రాంతంలో ఈఎస్ఐసీ డిస్పెన్సరీ భవన శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఈఎస్ఐసీలోని వివిధ రకాలైన 5వేల పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. గ్రేటర్ నోయిడాలో ఈఎస్ఐసీ డిస్పెన్సరీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను పరిశీలిస్తున్నాం’ అని తెలిపారు. -
19 కొత్త ఎయిమ్స్‌లలో ఆయుర్వేద శాఖలు
న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పాటుచేసిన 19 ఆలిండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లలో ఆయుర్వేద శాఖలను నెలకొల్పనున్నట్లు ఆయుష్ శాఖ సహాయమంత్రి శ్రీపాద్ నాయక్ చెప్పారు. సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్), ఇతర పారమిలటరీ దళాలకు చెందిన ఏడు ఆస్పత్రుల్లోనూ ఆయుర్వేద శాఖలను ఏర్పాటుచేయనున్నారు. కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలోని 100 ఈఎస్ఐసీ ఆస్పత్రుల్లోనూ ఆయుర్వేద శాఖల ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయని నాయక్ తెలిపారు. అంటురోగాలుకాని వ్యాధుల వ్యాప్తి నిరోధానికి సంబంధించిన జాతీయ పథకాన్ని ఇప్పుడున్న ఆరు రాష్ట్రాలతోపాటు మరిన్ని రాష్ట్రాల్లో అమలుచేస్తామని ఆయన వెల్లడించారు.