
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్‌ఐసీ)లోని సుమారు 5వేల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు కార్మికశాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ వెల్లడించారు. దేశ రాజధానిలోని మయూర్ విహార్ ప్రాంతంలో ఈఎస్‌ఐసీ డిస్పెన్సరీ భవన శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఈఎస్‌ఐసీలోని వివిధ రకాలైన 5వేల పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. గ్రేటర్ నోయిడాలో ఈఎస్‌ఐసీ డిస్పెన్సరీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను పరిశీలిస్తున్నాం’ అని తెలిపారు.