Santosh gangwar
-
కేంద్ర కేబినెట్ విస్తరణ: పలువురికి ఉద్వాసన
సాక్షి, న్యూడిల్లీ: కేంద్ర కేబినెట్ విస్తరణపై భారీ ఊహాగానాల మధ్య కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం దాదాపు ఖరారైనట్టే. ప్రస్తుత కేబినెట్లో మరో 43 మందిని కొత్తగా మంత్రి పదవులు వరించనున్నాయని అంచనా. వీరిలో నలుగురు మాజీ సీఎంలకు కేబినెట్లో బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది. స్వతంత్ర హోదా, సహాయ మంత్రి బాధ్యతలను నిర్వహిస్తున్న మంత్రుల్లో ఒకరిద్దరికి కేబినెట్ ర్యాంకు దక్కే అవకాశం ఉంది. అలాగే సీనియర్ మంత్రుల నుంచి అదనపు బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రపతి భవన్ వద్ద ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మోదీ కేబినెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ఇప్పటికే ఇద్దరు మంత్రులు వెల్లడించారు. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ రాజీనామా ప్రకటించారు. కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ తాను మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్‌ను మోదీ కేబినెట్ నుంచి తప్పించ నున్నారు. దీంతో కేబినెట్ విస్తరణకు ముందే రమేష్ రాజీనామాను ప్రకటించడం గమనార్హం. ప్రస్తుతం, 21 మంది క్యాబినెట్ మంత్రులు, స్వతంత్ర బాధ్యత కలిగిన తొమ్మిది మంది మంత్రులు, 23 మంది సహాయ మంత్రులు ఉన్నారు. తాజా ఈ విస్తరణతో ఈ సంఖ్య 81కి పెరగొచ్చని భావిస్తున్నారు. మోదీ కేబినెట్‌నుంచి రాజీనామా చేసినవారు ప్రధానంగా కీలకమంత్రులను మంత్రివర్గంనుంచి తప్పించడం పలువురిని విస్మయ పర్చింది. ఐటీ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవడేకర్, కేంద్ర కార్మిక శాఖమంత్రి, విద్యా శాఖా మంత్రికి తోడు కేంద్ర కెమికల్స్, ఎరువుల మంత్రి డీవీ సదానంద గౌడ కూడా కేంద్ర మంత్రి మండలికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి దేబశ్రీ చౌదరి, పర్యావరణ సహాయ మంత్రి బాబూల్ సుప్రియో తప్పుకున్నారు. అలాగే విద్యాశాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే కూడా తప్పుకోనున్నారు. బెంగాల్‌కు చెందిన మరో మంత్రి ప్రతాప్ సారంగి కూడా రాజీనామా చేశారు. -
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: ఈపీఎఫ్ చందాదారులకు కేంద్రం న్యూ ఇయర్ కానుక అందించింది. సుమారు ఆరు కోట్ల మందికి పైగా ఈపీఎఫ్ ఖాతాదారులకు నిర్దేశిత వడ్డీరేటును అందించనుంది. 2019-20 ఏడాదికిగాను వడ్డీని ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశామని కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ గురువారం వెల్లడించారు. 2020 ఏడాదిలో పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ పీఎఫ్ మొత్తంపై తొలి విడతగా 8.5 శాతం వడ్డీని ఖాతాదారులకు అందిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. కాగా ఏడాది మార్చిలో 2019-20 ఏడాదికి వడ్డీ రేటును 8.5 శాతంగా ఈపీఎఫ్‌వో నిర్ణయించిన సంగతి తెలిసిందే. కరోనా సంక్షోభం కారణంగా ఈ వడ్డీ రేటును విభజించి రెండు విడతలుగా ఇస్తామని సెప్టెంబర్‌లో ప్రకటించింది. మొదటి విడతగా 8.15 శాతం, రెండో విడతగా 0.35 శాతం ఇచ్చేందుకు నిర్ణయంచింది. ఇందులో భాగంగా మొదటి విడతను అందించింది. ఖాతాదారులు తమ పీఎఫ్ బాలెన్స్‌ను ఎస్ఎంఎస్, ఆన్లైన్, మిస్డ్ కాల్, ఉమాంగ్ యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. I am happy to inform you that a notification has been issued & for year 2019-2020, our over 6 crore subscribers will receive 8.5 percent interest on PF amount. We have made such arrangements that you'll start receiving these benefits from today: Union Minister Santosh Gangwar https://t.co/gmQ5WAzLXf— ANI (@ANI) December 31, 2020 -
కేంద్రమంత్రి కుటుంబంలో కరోనా కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గాంగ్వర్ (71) కుటుంబంలో కరోనా మహమ్మారి కలకలం రేపింది. మంత్రి భార్యకు, ఆయన కుటుంబ సభ్యుల్లో మరో ఆరుగురికి అక్టోబర్ 31, శనివారం కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన పార్లమెంటు సభ్యుడు గంగ్వార్ విలేకరులతో మాట్లాడుతూ తనకు నెగెటివ్ రిపోర్టు వచ్చినప్పటికీ తన ఫ్యామిలీలో మరో ఏడుగురికి కరోనా సోకినట్టు వెల్లడించారు. తన కుటుంబ సభ్యులు ఇటీవల ఢిల్లీ వెళ్లారని, బహుశా అక్కడే వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నానన్నారు. వీరంతా ఫరీదాబాద్ లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని కేంద్రమంత్రి వెల్లడించారు. తమ ఫ్యామిలీ వంటమనిషి కూడా అస్వస్థతకు గురి కావడంతోముందు జాగ్రత్తగా మరో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. అలాగే తన మంత్రిత్వ శాఖలో కొందరు అధికారులకు కరోనా వైరస్ సోకిందని, వారినందరినీ క్వారంటైన్ లో ఉండాల్సిందిగా డాక్టర్లు సూచించారని ఆయన చెప్పారు. కాగా ఇటీవల కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. భారత్‌లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. మొత్తం కేసుల సంఖ్య 81,37,119కు చేరగా మొత్తం మరణాల సంఖ్య 1,21,641 గా ఉంది. -
పీఎఫ్ ఖాతాదారులకు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) డిపాజిట్లపై వడ్డీ రేట్లపై కోత పెట్టింది. 2019 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2020 ఆర్థిక సంవత్సరంలో 8.50 శాతానికి (15 బేసిస్ పాయింట్లు) తగ్గిస్తూ నిర్ణయించింది. పీఎఫ్ వడ్డీరేటు కుదింపుపై నేడు (మార్చి 5, గురువారం) సమావేశమైన కేంద్ర ట్రస్టీల బోర్డు (సీబీటీ) ఈ తుది నిర్ణయం తీసుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ వడ్డీరేటును 8.5 శాతంగా ఉంచినట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ వెల్లడించారు. పీఎఫ్ వడ్డీ రేటు కోతపై కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ఈపీఎఫ్‌వోలోని 60 మిలియన్ల ఖాతాదారులను ప్రభావితం చేయనుంది. -
ఇక సొంతంగానే యూఏఎన్: ఈపీఎఫ్ఓ
న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి(ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్) సంస్థ తమ చందాదారుల కోసం కొత్త సౌకర్యాన్ని శుక్రవారం అందుబాటులోకి తీసుకువచ్చింది. సార్వత్రిక ఖాతా సంఖ్య(యూఏఎన్)ను ఉద్యోగులు ఇకపై సొంతంగా ఆన్లైన్లో పొందవచ్చు. ఉద్యోగాలు మారినా యూఏఎన్ ఒకటే ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు యూఏఎన్‌ను పొందాలంటే తమ యాజమాన్యం ద్వారా పొందాల్సి వచ్చేది. ఇకపై ఉద్యోగులు ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ ద్వారా తామే యూఏఎన్‌ను జనరేట్ చేసుకోవచ్చు. అలాగే, 65 లక్షల పెన్షన్ ఖాతాదారులకు కూడా ఈపీఎఫ్ఓ మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. వారు తమ పెన్షన్ పేమెంట్ ఆర్డర్‌ను ఇకపై డిజీలాకర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. భవిష్య నిధి సంస్థ 67వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ ఈ సౌకర్యాలను ప్రారంభించారు. -
బీజేపీ విస్తరణకు సంపర్క్ అభియాన్
సాక్షి, హన్మకొండ: పార్టీ విస్తరణలో భాగంగా సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు బీజేపీ వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాల అధ్యక్షులు ఎడ్ల అశోక్ రెడ్డి, రావు పద్మ తెలిపారు. హన్మకొండ హంటర్ రోడ్డులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు కేంద్ర మంత్రులు దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా 30వ తేదీ సోమవారం హన్మకొండ రాంనగర్‌లోని నిత్య బాంక్వెట్ హాల్లో జరిగే సదస్సులో కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. అలాగే, నగరంలోని పలువురు ప్రముఖులను కలుస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మేధావులతో పాటు వివిధ వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి మాట్లాడగా మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, నాయకులు సంగని జగదీశ్వర్, పాశికంటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. -
పీఎఫ్ చందాదారులకు శుభవార్త
సాక్షి, న్యూఢిల్లీ: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఖాతాదారులకు శుభవార్త అందించింది. 2018-19 సంవత్సరానికి 6 కోట్ల మంది సభ్యుల ఖాతాల్లోకి త్వరలోనే వడ్డీని చెల్లించనున్నారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే కొత్త వడ్డీ రేటు అమలులోకి వస్తుందని, తద్వారా ఆరు కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. 2018-19 సంవత్సరానికి గాను 8.65శాతం వడ్డీని చెల్లించనున్నామన్నారు. పండుగ సీజన్ కన్నా ముందుగానే పీఎఫ్ ఖాతాదారులకు 8.65 శాతం వడ్డీ రేటు లభిస్తుందని సంతోష్ గంగ్వార్ పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇది 8.55 శాతం మాత్రమే. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) చందాదారులకు వారి పీఎఫ్ ఖాతాల్లో త్వరలోనే 8.65 శాతం వడ్డీ రేటు లభిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. 2017-18 ఆర్థిక సంవత్సరపు వడ్డీ రేటుతో (8.55 శాతం) పోలిస్తే 2018-19 ఆర్థిక సంవత్సరం పీఎఫ్ వడ్డీ 10 బేసిస్ పాయింట్లు (8.65 శాతం) ఎక్కువగా ఉంది. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి గత మూడేళ్లలో ఈపీఎఫ్ వడ్డీ రేటు పెరగడం ఇదే తొలిసారి. 2015–16 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీరేట్లు 8.8 శాతం ఉండగా అప్పటి పరిస్థితుల రీత్యా వాటిని క్రమంగా ఐదేళ్ల కనిష్టమైన 8.55 శాతానికి తగ్గించారు. 2018-19 సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ రేటును అందించిన తరువాత 151.67 కోట్ల మిగులు ఉంటుందని ఈపీఎఫ్‌వో అంచనా. మునుపటి ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌పై 8.7 శాతం వడ్డీ రేటును అందించడంపై 158 కోట్ల లోటు ఉండేది. అందుకే 2018-19 సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ రేటును అందించాలని నిర్ణయించింది. -
నార్త్ ఇండియన్స్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి వివరణ
సాక్షి, న్యూఢిల్లీ : నార్త్ ఇండియన్స్‌కు సరైన నైపుణ్యాలు లేవని కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వర్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం సృష్టించడంతో తన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యల సందర్భం వేరని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రజల నైపుణ్యాలను పెంచేందుకు చేపడుతున్న చర్యలను వివరించే ఉద్దేశంతోనే తాను ఈ వ్యాఖ్యలు చేశానని చెప్పుకొచ్చారు. నైపుణ్యాలు లేనివారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు తగిన అర్హతలను వారికి అందించేందుకు ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందనే కోణంలో తాను ఈ వ్యాఖ్యలు చేశానని చెప్పారు. ఉపాధి అవకాశాలు కొరవడిన తీరుపై కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుతీరి వంద రోజులైన నేపథ్యంలో రాయ్‌బరేలిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఉద్యోగాలు పెద్దసంఖ్యలో అందుబాటులో ఉన్నాయని అయితే నార్త్ ఇండియన్స్‌లో నైపుణ్యాలు లోపించడమే సమస్యని ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చదవండి : నార్త్ ఇండియన్స్‌కు ఆ సత్తా లేదా..? -
నార్త్ ఇండియన్స్‌కు ఆ సత్తా లేదా..?
లక్నో : దేశంలో ఉపాధి రహిత పరిస్థితికి నార్త్ ఇండియన్స్ కారణమని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టి వంద రోజులు పూర్తయిన సందర్భంగా బరేలిలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉద్యోగాలకు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. పలు రంగాల్లో ఉద్యోగావకాశాలున్నా ఉత్తర భారతీయుల్లో నైపుణ్యాలు, సామర్థ్యాలు కొరవడటమే అసలు సమస్యని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కార్మిక మంత్రిత్వ శాఖ పనితీరును గమనిస్తున్న క్రమంలో పరిస్థితి గురించి తనకు పూర్తి అవగాహన ఉందని అన్నారు. ఆర్థిక మందగమనంపై తమకు ఆందోళన ఉన్నా దేశంలో ఉపాథి అవకాశాలకు ఢోకా లేదని చెప్పుకొచ్చారు. పనిలోపనిగా యూపీ మాజీ సీఎం, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్, ఆ పార్టీ నేత ఆజం ఖాన్‌లపై విమర్శలతో విరుచుకుపడ్డారు. అఖిలేష్ అధికారం కోల్పోవడంతో అసహనంలో ఉన్నారని, ఇక రాంపూర్ ప్రజలు ఆజం ఖాన్ వంటి నేతను లోక్‌సభకు ఎన్నుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కాగా ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఆటోమొబైల్ సహా పలు రంగాల్లో ఉద్యోగాలు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. -
ఇక పీఎఫ్ వడ్డీ రేటు 8.65 శాతం
న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) ఖాతాదారులకు కేంద్రం శుభవార్త అందించింది. 2018–19 సంవత్సరానికిగాను చేపట్టే చెల్లింపులకు 8.65 శాతం వడ్డీ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇది ప్రస్తుతం చెల్లిస్తున్న వడ్డీరేటు 8.55 శాతంతో పోలిస్తే 0.10 శాతం ఎక్కువ. ఈ పెంపుతో 6 కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు లబ్ధి చేకూరనుంది. త్వరలోనే వడ్డీరేట్ల పెంపునకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తామని శుక్రవారం ఢిల్లీలోని ఫిక్కీ కార్యాలయంలో ప్రైవేటు సెక్యూరిటీ సంస్థల ప్రతినిధులతో సమావేశం అనంతరం కార్మికశాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ పేర్కొన్నారు. 2015–16 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీరేట్లు 8.8 శాతం ఉండగా అప్పటి పరిస్థితుల రీత్యా వాటిని క్రమంగా ఐదేళ్ల కనిష్టమైన 8.55 శాతానికి తగ్గించారు. ఈపీఎఫ్ఓ అంచనాల ప్రకారం 2018–19 సంవత్సరానికి వడ్డీరేటును 8.65 శాతం ఉంచితే 151 కోట్ల రూపాయల మిగులు ఉండనుంది. అదే 8.7 శాతానికి పెంచితే 158 కోట్ల ద్రవ్యలోటు ఉండనుంది. దీంతో వడ్డీరేటును 8.65 శాతానికి పెంచడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) సమ్మతించింది. -
ఈపీఎఫ్‌పై 8.65 శాతం వడ్డీ రేటు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్)పై 2018–19 ఆర్థిక సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ రేటు అమలు కానుంది. కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గాంగ్వర్ అధ్యక్షతన ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వడ్డీ రేటు పెంచుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకోగా, దీనికి కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ఆమోదం తెలిపింది. ఈపీఎఫ్‌వో వడ్డీ రేటు ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం అమోదం తెలిపినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. 2017–18లో ఈపీఎఫ్ నిధులపై 8.55 శాతం వడ్డీ రేటు అమలు కాగా, దీన్ని స్వల్పంగా పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2015–16 ఆర్థిక సంవత్సరానికి 8.8 శాతం వడ్డీ రేటు ఉండగా, ఆ తర్వాత రెండు సంవత్సరాల్లో స్వల్పంగా తగ్గించారు. ఆదాయపన్ను శాఖ, కార్మికశాఖ వడ్డీ రేటును నోటిఫై చేసిన తర్వాత చందాదారుల ఖాతాల్లో వడ్డీని జమ చేయాలంటూ దేశవ్యాప్తంగా ఉన్న 120 క్షేత్రస్థాయి అధికారులకు ఈపీఎఫ్‌వో ఆదేశాలు జారీ చేస్తుంది. సభ్యుల భవిష్యనిధిపై 8.65 శాతం వడ్డీ చెల్లించిన అనంతరం కూడా సంస్థ వద్ద రూ.151.67 కోట్ల మిగులు నిల్వలు ఉంటాయని అంచనా. -
ఈఎస్ఐసీలో 5వేల పోస్టుల భర్తీ
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ)లోని సుమారు 5వేల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు కార్మికశాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ వెల్లడించారు. దేశ రాజధానిలోని మయూర్ విహార్ ప్రాంతంలో ఈఎస్ఐసీ డిస్పెన్సరీ భవన శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఈఎస్ఐసీలోని వివిధ రకాలైన 5వేల పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. గ్రేటర్ నోయిడాలో ఈఎస్ఐసీ డిస్పెన్సరీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను పరిశీలిస్తున్నాం’ అని తెలిపారు. -
రేప్ ఘటనలపై రాద్ధాంతం వద్దు
లక్నో: భారత్‌లాంటి పెద్ద దేశంలో జరిగే ఒకటీ రెండు అత్యాచార ఘటనలపై అతిగా స్పందించవద్దనీ కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ వ్యాఖ్యానించారు. కఠువా, ఉన్నావ్ ఘటనలతో దేశంలో తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బరేలీలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..‘ఇలాంటివి జరగటం దురదృష్టకరం.. కొన్ని సార్లు వీటిని ఆపడం సాధ్యం కాదు.. భారత్ లాంటి పెద్దదేశాల్లో ఇలాంటి ఘటనలు ఒకటీ రెండు జరిగినప్పుడు వాటిపై రాద్ధాంతం చేయటం తగదు. ప్రభుత్వం వెంటనే స్పందించి అవసరమైన మేరకు చర్యలు తీసుకుంటోంది..’అని వ్యాఖ్యానించారు. బీజేపీకి చెందిన బరేలీ ఎంపీ సంతోష్ గంగ్వార్ కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయమంత్రిగా ఉన్నారు. -
అత్యాచారాలను ఆపలేం: కేంద్ర మంత్రి
సాక్షి,న్యూఢిల్లీ: చిన్నారులపై వరుసగా జరుగుతున్న అత్యాచారాలపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తతున్నవేళ కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచార ఘటనలను అడ్డుకోలేమని, ప్రభుత్వాలు తమ వంతుగా పనిచేస్తున్నా ఇలాంటివి జరుగుతుండటం దురదృష్టకరమని అన్నారు. ఆదివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంతపెద్ద దేశంలో ఒకటి రెండు జరిగితే!: భారత్ చాలా పెద్ద దేశమని, ఏదో ఒక మూలన ఒకటో, రెండో రేప్‌లు జరిగితే, వాటికి విపరీతమైన ప్రచారం కల్పించి, రాద్ధాంతం చేయాల్సిన అవసరంలేదని కేంద్ర మంత్రి గంగ్వార్ అన్నారు. ‘‘అత్యాచారాలు జరగడం దుదృష్టకరమే. అయితే కొన్ని సార్లు రేప్‌లను ఆపలేం. అవసరమైన మేరకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇంత పెద్ద దేశంలో ఒకటో రెండో, రేప్‌లు జరిగితే, ఆ విషయాన్ని రచ్చ చేయాల్సిన అవసరంలేదు’’ అని గంగ్వార్ అన్నారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై పెనుదుమారం రేగుతున్నది. -
రూ.2000 నోటుపై ప్రభుత్వం స్పందించింది
న్యూఢిల్లీ : రూ.2000 నోటును రద్దు చేస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న రూమర్లకు కేంద్రప్రభుత్వం చెక్ పెట్టింది. కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2000 నోట్లను రద్దు చేసే ఉద్దేశ్యమేమీ లేదని ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. అంతేకాక త్వరలోనే కొత్తగా రూ.200 నోటును చలామణిలోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. ''రూ.2000 నోట్లు రద్దు చేయబోతున్నారనే వార్తలేమీ లేవు'' అని గంగ్వార్ చెప్పారు. కొత్త రూ.2000 నోట్ల ముద్రణను తగ్గించడమేది భిన్నమైన అంశమని పేర్కొన్నారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి దీనికి సంబంధించి ధృవీకరణ రావాల్సి ఉందన్నారు. రూ.2000 నోట్లపై సమాచారం ఆర్బీఐనే ఇస్తుందని కూడా స్పష్టంచేశారు. ఇటీవల వచ్చిన రిపోర్టుల ప్రకారం ప్రభుత్వం రూ.2000 నోట్ల ముద్రణను ఆపివేసిందని తెలిసింది. జూలై 26న ఈ విషయంపై ప్రతిపక్షాలు పార్లమెంట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టీకరణను కూడా డిమాండ్ చేశాయి. డీమానిటైజేషన్ తర్వాత తీసుకొచ్చిన కొత్త రూ.2000 నోటును రద్దు చేస్తున్నారా? అందుకే ప్రింటిగ్ ఆపివేశారా? అంటూ నిలదీశాయి. కానీ ప్రతిపక్షాల ప్రశ్నలకు ఆర్థికమంత్రి ఎలాంటి సమాధానమివ్వలేదు. కొత్త రూ.2000 నోటును లీగల్ టెండర్ లాగా కొనసాగిస్తూ చలామణిని పరిమితం చేస్తుందని, కానీ రద్దు చేసే అవకాశం లేదని ఓ వైపు ఇండస్ట్రి నిపుణులు కూడా చెప్పారు. కొత్త రూ.200 నోటును ప్రవేశపెట్టి, మార్కెట్లో నెలకొన్న చిన్న నోట్ల సమస్యకు చెక్ పెడుతుందని తెలిపారు. ఇప్పటికే రూ.200 నోటు ప్రింటింగ్ మొదలైందని, వీటిని త్వరలోనే చలామణిలోకి తీసుకొస్తామని గంగ్వార్ శుక్రవారం కూడా చెప్పార. ఈ కొత్త రూ.200 నోటుతో చిన్న నోట్ల సర్క్యూలేషన్‌ను పెంచుతామన్నారు. ప్రభుత్వ అధికారుల సమాచారం మేరకు ఈ నోటును ఆగస్టులో మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. -
పవర్‌లూం కార్మికులకు శాశ్వత ఉపాధి
* మంత్రి కేటీఆర్ హామీ * తమిళనాడు తరహాలో జనతా వస్త్రాలు * నేతన్నల కోసం మూలనిధి * వేజ్‌బోర్డు ద్వారాకూలీరేట్లు * సిరిసిల్లలో సమ్మె విరమణ సిరిసిల్ల: నేత కార్మికులకు శాశ్వతంగా ఉపాధి కల్పించేందుకు కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు మెగా పవర్‌లూం క్లస్టర్‌ను సాధిస్తానని తెలంగాణ ఐటీ, పీఆర్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. సిరిసిల్లలో నేత కార్మికులు పది రోజులుగా చేస్తున్న సమ్మె నేపథ్యంలో నలుగురు నేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ సంఘటనపై స్పం దించిన మంత్రి కేటీఆర్.. గురువారం కేరళ నుంచి బయలుదేరి నేరుగా సిరిసిల్లకు చేరుకున్నారు. ఆర్డీవో ఆఫీసులో ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్ల నేత కార్మికుల శాశ్వత ఉపాధికి మెగా పవర్‌లూం క్లస్టర్‌ను సాధిస్తానని, ఈ నెల 12న ఎంపీ వినోద్‌కుమార్‌తో కలసి కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్‌ను కలిసేందుకు ఢిల్లీ వెళ్తానన్నారు. వచ్చే బడ్జెట్లో సిరిసిల్లకు నిధులు కేటాయించే విధంగా కేంద్ర ఆర్థికమంత్రిని కలుస్తామని చెప్పారు. సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్‌లో సమ్మె యోచనను విరమించాలని కోరారు. పారిశ్రామికవేత్తలకు రావాల్సిన రూ.ఏడుకోట్ల సబ్సిడీని మంజూరు చేయిస్తానన్నారు. ఏభైశాతం విద్యుత్ రాయితీ పార్క్‌లో అమలు చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. తమిళనాడు తరహాలో తెలంగాణలోనూ పేదలకు జనతా వస్త్రాలు పంచేం దుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారన్నారు. ఈవిధంగా సిరిసిల్ల నేతన్నలకు దీర్ఘకాలిక ఉపాధి లభిస్తుందని స్పష్టం చేశారు. రాజీవ్ విద్యామిషన్‌లో స్కూల్ యూనిఫారమ్స్, సింగరేణి, ఆర్టీసీ కార్మికులకు డ్రెస్‌లు, ఆశా వర్కర్లు, ఆస్పత్రులకు సిరిసిల్ల వస్త్రాలు కొనుగోలు చేసే విధంగా మార్కెటింగ్ వసతి కల్పిస్తామన్నారు. సిరి సిల్ల ఆసాములకు పావలావడ్డీ రుణవసతి కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. నేతన్నల కోసం వేజ్‌బోర్డు ఏర్పాటు చేసి వేతనాలు ఎప్పటికప్పుడు పెరిగేలా చూస్తామని స్ప ష్టం చేశారు. సిరిసిల్లలో నేతన్నల కూలి ఒప్పందం జరిగిం ది. సమ్మె విరమించి శుక్రవారం నుంచి కార్మికులు పనుల్లోకి వెళ్లాలని కార్మికసంఘాలు, ఆసాములు ప్రకటించారు.