సాక్షి, న్యూఢిల్లీ: ఈపీఎఫ్ చందాదారులకు కేంద్రం న్యూ ఇయర్ కానుక అందించింది. సుమారు ఆరు కోట్ల మందికి పైగా ఈపీఎఫ్ ఖాతాదారులకు నిర్దేశిత వడ్డీరేటును అందించనుంది. 2019-20 ఏడాదికిగాను వడ్డీని ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశామని కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ గురువారం వెల్లడించారు. 2020 ఏడాదిలో పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ పీఎఫ్ మొత్తంపై తొలి విడతగా 8.5 శాతం వడ్డీని ఖాతాదారులకు అందిస్తుండటం సంతోషంగా ఉందన్నారు.
కాగా ఏడాది మార్చిలో 2019-20 ఏడాదికి వడ్డీ రేటును 8.5 శాతంగా ఈపీఎఫ్‌వో నిర్ణయించిన సంగతి తెలిసిందే. కరోనా సంక్షోభం కారణంగా ఈ వడ్డీ రేటును విభజించి రెండు విడతలుగా ఇస్తామని సెప్టెంబర్‌లో ప్రకటించింది. మొదటి విడతగా 8.15 శాతం, రెండో విడతగా 0.35 శాతం ఇచ్చేందుకు నిర్ణయంచింది. ఇందులో భాగంగా మొదటి విడతను అందించింది. ఖాతాదారులు తమ పీఎఫ్ బాలెన్స్‌ను ఎస్‌ఎంఎస్, ఆన్‌లైన్, మిస్డ్ కాల్, ఉమాంగ్ యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
I am happy to inform you that a notification has been issued & for year 2019-2020, our over 6 crore subscribers will receive 8.5 percent interest on PF amount. We have made such arrangements that you'll start receiving these benefits from today: Union Minister Santosh Gangwar https://t.co/gmQ5WAzLXf— ANI (@ANI) December 31, 2020
Comments
Please login to add a commentAdd a comment