గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో భేటీ
ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోసం గవర్నర్‌కు విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్ అసెంబ్లీ ఫలితాల నేప థ్యంలో ఏఐసీసీ పరిశీలకు ని హోదాలో రాంచీలో మ కాం వేసిన తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆదివారమంతా బిజీబిజీగా గడిపారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో జార్ఖండ్ పీసీసీ కార్యాలయంలో ఆయన భేటీ అయ్యారు. జేపీసీసీ అధ్యక్షుడు కేశవ్ మహతో కమలేశ్‌తో పాటు పార్టీ సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపిన భట్టి.. కొత్త ప్రభుత్వ ఏర్పాటు క్రమంలో పార్టీ వ్యూహాలను ఎమ్మెల్యేలకు వివరించారు.
ఆ తర్వాత ఇండియా కూటమి ఎమ్మెల్యేలతో కలిసి జార్ఖండ్ గవర్నర్ సంతోశ్ గంగ్వార్‌ను కలిశారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో పాటు జేఎంఎం, కాంగ్రెస్, ఆర్‌జేడీ, సీపీఐఎంఎల్ పార్టీల ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు. కాగా, జార్ఖండ్ ఎన్నికల ప్రక్రియలో కీలకపాత్ర పోషించిన భట్టి ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పు తదితర అంశాల్లో కాంగ్రెస్ పక్షాన కీలకంగా వ్యవహరిస్తుండటం గమనార్హం.
ఎన్నుకున్న ప్రజల కోసం కష్టపడి పనిచేయండి
దేశాన్ని ఓ వికృత పార్టీ పాలిస్తోందని, ఆ పార్టీని కాదని ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నందున వారి కోసం కష్టపడి పనిచేయాలని జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు భట్టి దిశానిర్దేశం చేశారు. రాంచీలోని హోటల్ చాణక్యలో జరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీలో ఆయన మాట్లాడారు. ‘ఇక్కడ కూర్చున్న వాళ్లు అదృష్టవంతులు. ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేయాలనుకున్నారు. కానీ అందరికీ టికెట్లు దక్కలేదు. కాంగ్రెస్ పారీ్టలో పనిచేయడం అదృష్టం’ అని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర పార్టీ పక్షాన కొత్త ఎమ్మెల్యేలను అభినందించిన భట్టి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పక్షాన రాష్ట్రానికి రావాలని కోరుతూ జార్ఖండ్ ఎమ్మెల్యేలకు సాదర ఆహా్వనం పలికారు. ఈ సమావేశంలో జార్ఖండ్ పార్టీ ఇన్‌చార్జి సిరివెళ్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment