
సాక్షి, న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) డిపాజిట్లపై వడ్డీ రేట్లపై కోత పెట్టింది. 2019 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2020 ఆర్థిక సంవత్సరంలో 8.50 శాతానికి (15 బేసిస్ పాయింట్లు) తగ్గిస్తూ నిర్ణయించింది. పీఎఫ్ వడ్డీరేటు కుదింపుపై నేడు (మార్చి 5, గురువారం) సమావేశమైన కేంద్ర ట్రస్టీల బోర్డు (సీబీటీ) ఈ తుది నిర్ణయం తీసుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ వడ్డీరేటును 8.5 శాతంగా ఉంచినట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ వెల్లడించారు. పీఎఫ్ వడ్డీ రేటు కోతపై కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ఈపీఎఫ్‌వోలోని 60 మిలియన్ల ఖాతాదారులను ప్రభావితం చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment