న్యూఢిల్లీ: ఈపీఎఫ్‌ఓ (ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ), ఈఎస్‌ఐసీ (కార్మిక రాజ్య బీమా సంస్థ)ల్లో నమోదు కోసం ఇక నుంచి కంపెనీలు ఒకే ఉమ్మడి దరఖాస్తును సమర్పించేలా కేంద్రం కొత్త విధానం తీసుకురానుంది.
ఈఎస్‌ఐసీ, ఈపీఎఫ్‌ఓల్లో సంస్థల నమోదును సులభం చేయడంలో భాగంగా ప్రభుత్వం త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేయనుంది. నిబంధనల ప్రకారం 20 లేదా అంతకన్నా ఎక్కువ మంది పనిచేస్తున్న కంపెనీలు ఈపీఎఫ్‌వో దగ్గర కచ్చితంగా నమోదు చేయించుకోవాల్సి ఉండగా, ఈఎస్‌ఐసీ విషయానికి వస్తే ఈ సంఖ్య 10 మాత్రమే.