న్యూఢిల్లీ: ఈఎస్‌ఐసీ నిర్వహించే సామాజిక భద్రతా పథకం కింద అక్టోబర్ నెలలో కొత్తగా 11.82 లక్షల మంది సభ్యులుగా చేరారు. అక్టోబర్ నెలకు సంబంధించిన గణాంకాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌సీ) విడుదల చేసింది. 2017 సెప్టెంబర్ నుంచి 2022 అక్టోబర్ వరకు చేరిన మొత్తం సభ్యుల సంఖ్య 7.49 కోట్లుగా ఉంది.
గడిచిన ఆర్థిక సంవత్సరం (2021–22)లో 1.49 కోట్ల మంది సభ్యులు చేరగా, అంతకుముందు 2020–21లో చేరిన సభ్యుల సంఖ్య 1.15 కోట్లుగాను, 2019–20లో 1.51 కోట్లు, 2018–19లో 1.49 కోట్ల చొప్పున కొత్త సభ్యులు భాగస్వాములు అయ్యారు. ఈఎస్‌ఐసీ, ఈపీఎఫ్‌వో పథకాల్లో నెలవారీగా సభ్యుల చేరిక గణాంకాలను ఎన్‌ఎస్‌వో విడుదల చేస్తుంటుంది. అక్టోబర్ నెలలో ఈపీఎఫ్‌వోలో కొత్తగా 12.94 లక్షల మంది సభ్యులు చేరినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2017 అక్టోబర్ నుంచి 2022 అక్టోబర్ వరకు ఈపీఎఫ్‌వో కింద చేరిన కొత్త సభ్యులు 5.99 కోట్లుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment