Social Security Schemes
-
ఈపీఎఫ్‌వో కిందకు 16.99 లక్షల మంది
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్వహించే సామాజిక భద్రత పథకం కిందకు ఆగస్ట్ మాసంలో 16.99 లక్షల మంది కొత్త సభ్యులు నికరంగా వచ్చి చేరారు. కేంద్ర కారి్మక శాఖ ఆగస్ట్ నెల ఈపీఎఫ్‌వో పేరోల్ గణాంకాలను విడుదల చేసింది. ఆగస్ట్‌లో 3,210 సంస్థలు మొదటి సారి ఈపీఎఫ్‌వోలో రిజిస్టర్ చేసుకున్నాయి. సుమారు 11.88 లక్షల మంది సభ్యులు ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరడం ద్వారా ఈపీఎఫ్‌లో కిందకు మళ్లీ వచ్చి చేరారు. కొత్త సభ్యుల్లో 18–25 ఏళ్ల వయసువారు 58.36 శాతంగా ఉన్నారు. మొదటిసారి ఉద్యోగంలో చేరిన వారే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. మొదటిసారి చేరిన చేరిన మహిళలు 2.44 లక్షల మంది ఉన్నారు. నికరంగా చేరిన మహిళా సభ్యుల సంఖ్య 3.43 లక్షలుగా ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, గుజరాత్ నుంచి నికర సభ్యుల చేరిక అధికంగా ఉంది. ఈ రాష్ట్రాల నుంచి 9.96 లక్షల మంది ఆగస్ట్‌లో ఈపీఎఫ్‌వో కిందకు వచ్చారు. వ్యాపార దుకాణాలు, భవన నిర్మాణం, ఇంజనీరింగ్ కాంట్రాక్టు సేవలు, టెక్స్‌టైల్స్‌లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. 39.87 మంది సభ్యులు నైపుణ్య సేవలకు సంబంధించి ఉన్నారు. -
అటల్ పెన్షన్ యోజనకు విశేష ఆదరణ
న్యూఢిల్లీ: సామాజిక భద్రతా పథకం– అటల్ పెన్షన్ యోజన (ఏపీవై)కు విశేష ఆధరణ లభిస్తున్నట్లు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) పేర్కొంది. ఈ పథకం కింద ఇప్పటికి 5 కోట్ల మందికిపైగా ప్రజలు నమోదయినట్లు తెలిపింది. ఒక్క 2022 క్యాలెండర్ ఇయర్లో 1.25 కోట్ల మంది చందాదారులుగా చేరినట్లు వివరించింది. 2021లో ఈ సంఖ్య 92 లక్షలు కావడం గమనార్హం. 2021 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీవైని ప్రకటించారు. దీని విస్తృతికి పీఎఫ్ఆర్డీఏ అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఈ పథకం కింద ఒక చందాదారుడు (చేరిన వయస్సు, చందాపై ఆధారపడి) 60 సంవత్సరాల వయస్సు నుండి నెలకు రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు కనీస హామీ పెన్షన్‌ను అందుకుంటాడు. చందాదారుని మరణానంతరం అదే పెన్షన్ చందాదారుని జీవిత భాగస్వామికి చెల్లించడం జరుగుతుంది. చందాదారుడు, జీవిత భాగస్వామి ఇద్దరూ మరణించినప్పుడు, చందాదారుడు 60 ఏళ్ల వరకు చెల్లించిన మొత్తం నామినీ పొందే వెసులుబాటు ఉంది. -
ఈఎస్ఐసీ కిందకు 11.82 లక్షల కొత్త సభ్యులు
న్యూఢిల్లీ: ఈఎస్ఐసీ నిర్వహించే సామాజిక భద్రతా పథకం కింద అక్టోబర్ నెలలో కొత్తగా 11.82 లక్షల మంది సభ్యులుగా చేరారు. అక్టోబర్ నెలకు సంబంధించిన గణాంకాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్సీ) విడుదల చేసింది. 2017 సెప్టెంబర్ నుంచి 2022 అక్టోబర్ వరకు చేరిన మొత్తం సభ్యుల సంఖ్య 7.49 కోట్లుగా ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2021–22)లో 1.49 కోట్ల మంది సభ్యులు చేరగా, అంతకుముందు 2020–21లో చేరిన సభ్యుల సంఖ్య 1.15 కోట్లుగాను, 2019–20లో 1.51 కోట్లు, 2018–19లో 1.49 కోట్ల చొప్పున కొత్త సభ్యులు భాగస్వాములు అయ్యారు. ఈఎస్ఐసీ, ఈపీఎఫ్‌వో పథకాల్లో నెలవారీగా సభ్యుల చేరిక గణాంకాలను ఎన్ఎస్వో విడుదల చేస్తుంటుంది. అక్టోబర్ నెలలో ఈపీఎఫ్‌వోలో కొత్తగా 12.94 లక్షల మంది సభ్యులు చేరినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2017 అక్టోబర్ నుంచి 2022 అక్టోబర్ వరకు ఈపీఎఫ్‌వో కింద చేరిన కొత్త సభ్యులు 5.99 కోట్లుగా ఉన్నారు. -
ఈపీఎఫ్‌వోలోకి 18.36 లక్షల కొత్త సభ్యులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్వహించే సామాజిక భద్రతా పథకంలోకి జూన్ నెలలో కొత్తగా 18.36 లక్షల మంది సభ్యులు చేరారు. అంతక్రితం ఏడాది జూన్ నెలలో కొత్త సభ్యులు 12.83 లక్షలతో పోలిస్తే మంచి వృద్ధి నమోదైంది. ఇందుకు సంబంధించి పేరోల్ గణాంకాలను కార్మిక శాఖ విడుదల చేసింది. ఈ ఏడాది మేనెలలో కొత్త సభ్యుల చేరికతో పోల్చి చూసినా జూన్‌లో 9.21 శాతం వృద్ధి కనిపిస్తోంది. (వడ్డీల భారం, చేతులెత్తేసిన మరో స్టార్టప్) ఇక జూన్‌లో నికర కొత్త సభ్యులు 18.36 లక్షల మందిలో 10.54 లక్షల మంది ఈపీఎఫ్ అండ్ ఎంపీ యాక్ట్, 1952 కింద మొదటసారి చేరిన వారు కావడం గమనించాలి. 7.82 లక్షల మంది సభ్యులు ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరడం వల్ల కొత్త సభ్యుల్లో భాగంగా ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచీ ప్రతి నెలా కొత్త సభ్యుల్లో వృద్ధి కనిపిస్తోంది. 22–25 వయసు నుంచి 4.72 లక్షల మంది కొత్తగా చేరిన వారున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల నుంచే 12.61 లక్షల మంది కొత్తగా చేరారు. మొత్తం కొత్త సభ్యుల్లో మహిళలు 4.06 లక్షల మంది ఉన్నారు. ఈపీఎఫ్‌వో మొత్తం సభ్యుల్లో మహిళల శాతం మే చివరికి 20.37 శాతంగా ఉంటే, జూన్ చివరికి 22.09 శాతానికి తగ్గింది. (Electric Scooters: కేవలం వేలం వెర్రేనా? సర్వేలో షాకింగ్ విషయాలు) -
ఈఎస్ఐసీ కిందకు 13.37 లక్షల మంది
న్యూఢిల్లీ: కార్మికరాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) నిర్వహించే సామాజిక భద్రతా పథకం కిందకు సెప్టెంబర్ నెలలో కొత్తగా 13.37 లక్షల మంది చేరారు. అంతక్రితం నెల ఆగస్ట్‌లో కొత్త సభ్యుల సంఖ్య 13.42 లక్షలుగా ఉండడం గమనార్హం. వ్యవస్థీకృత రంగంలో కొత్తగా ఉపాధి పొందిన వారి డేటాను ఈ రూపంలో తెలుసుకోవచ్చు. జాతీయ గణాంకా ల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో ఈఎస్ఐసీ కిందకు 10.76 లక్షల మంది నికరంగా చేరగా, మేలో 8.90 లక్షల మంది, జూన్‌లో 10.65 లక్షల మంది, జూలైలో 13.40 లక్షల మంది, ఆగస్ట్‌లో 13.42 లక్షల మంది చొప్పున నికరంగా చేరారు. కరోనా లాక్డౌన్లు సడలిపోవడంతో జూన్, జూలై, ఆగస్ట్ నెలల్లో ఎక్కువ మంది చేరినట్టు తెలుస్తోంది. 2020–21లో ఈఎస్ఐసీ కిందకు కొత్తగా 1.15 కోట్ల మంది సభ్యులు కాగా, అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2019–20లో కొత్తగా చేరిన వారి సంఖ్య 1.51 కోట్లుగా ఉంది. 2018–19లో 1.49 కోట్లు, 2017–18లో 83.85 లక్షల చొప్పున ఈఎస్ఐసీకి సభ్యులు జతయ్యారు. -
మెరుగుపడుతున్న ఉపాధి అవకాశాలు!
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి ప్రభావిత సవాళ్ల తర్వాత దేశంలో క్రమంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) అమలు చేస్తున్న సామాజిక భద్రతా పథకంలో ఈ ఏడాది ఆగస్టులో స్థూలంగా 13.22 లక్షల మంది కొత్త సభ్యులు చేరారని తాజా గణాంకాలు వివరించయి. అయితే జూలైతో పోల్చితే (13.33 లక్షల మంది) ఈ సంఖ్య కొంచెం తక్కువ కావడం గమనార్హం. దేశంలో సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలకు సంబంధించి సోమవారం జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్ఎస్ఓ)వెలువరించిన అధికారిక గణాంకాలు ఈ విషయాన్ని తెలిపాయి. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► ఈఎస్ఐసీలో ఏప్రిల్‌లో 10.74 లక్షలు, మేలో 8.88 లక్షలు, జూన్‌లో 10.62 లక్షలు, జూలైలో 13.33 లక్షల మంది కొత్తగా చేరారు. ► సెకండ్ వేవ్ నేపథ్యంలో విధించిన ఆంక్షల సడలింపు సానుకూల ప్రభావం తాజా గణాంకాల్లో కనిపిస్తోంది. స్థిరరీతిన క్రమంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. ► 2018–19లో కొత్త సబ్స్క్రైబర్ల సంఖ్య 1.49 కోట్లు. 2019–20లో ఈ సంఖ్య 1.51 కోట్లకు చేరింది. 2020–21లో కరోనా ప్రభావంతో 1.15 కోట్లకు పడిపోయింది. ► ఈఎస్ఐసీలో 2017 సెప్టెంబర్ నుంచి 2021 మధ్య 5.56 కోట్ల కొత్త చందాదారులు చేరారు. ► ఈఎస్ఐసీ, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) ద్వారా నిర్వహించబడుతున్న వివిధ సామాజిక భద్రతా పథకాల కొత్త చందాదారుల పేరోల్ డేటా ఆధారంగా ఎన్ఎస్ఓ నివేదికలు రూపొందిస్తుంది. 2017 సెప్టెంబర్ నుంచీ ప్రారంభమైన కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటూ 2018 ఏప్రిల్ నుంచి ఈ గణాంకాలను ఎన్ఎస్ఓ విడుదల చేస్తోంది. ఈపీఎఫ్ఓకు సంబంధించి ఇలా... ఇదిలావుండగా నివేదిక ప్రకారం, రిటైర్మెంట్ ఫండ్ సంస్థ– ఈపీఎఫ్ఓలో నికర కొత్త నమోదులు ఆగస్టులో 14.80 లక్షలు. జూలై 2021లో ఈ సంఖ్య 13.15 లక్షలు. 2017 సెప్టెంబర్ నుంచి 2021 ఆగస్టు మధ్య స్థూలంగా కొత్త చందాదారుల సంఖ్య 4.61 కోట్లు. -
అసంఘటిత కార్మికులకు కేంద్రం శుభవార్త!
దేశ వ్యాప్తంగా అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల సంక్షేమం కోసం కార్మిక, ఉపాధిశాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ నేడు లాంఛనంగా ఈ-శ్రమ్ పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా దేశంలోని అసంఘటిత రంగంలోని కార్మికుల వివరాలను సేకరిస్తారు. అలాగే వారి సంక్షేమం కోసం వివిధ సామాజిక భద్రతా పథకాలను మరింత మెరుగ్గా అమలు చేయడానికి ఉపకరిస్తుంది. ఆధార్‌కార్డు ఆధారంగా కార్మికులు తమ వివరాలను ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల ఆయా కేటగిరిల కింద ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కార్మికులకు అందించే వీలు కలగనుంది. ప్రమాధ భీమా రూ.2 లక్షలు "భారతదేశ చరిత్రలో మొట్ట మొదటిసారిగా 38 కోట్ల మంది అసంఘటిత కార్మికుల వివరాలను నమోదు చేయడానికి ఒక వ్యవస్థ తయారు చేయబడుతోంది. దీనిలో వివరాలు నమోదు చేయడం ద్వారా కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సామాజిక భద్రతా పథకాలను పొందడానికి సహాయంగా ఉంటుంది" అని కార్మిక మంత్రి అన్నారు. అలాగే, ఇందులో తమ పేర్లు నమోదు చేసుకున్న అసంఘటిత కార్మికులకు రూ.2.0 లక్షల యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ అందించినందుకు ప్రధాన మంత్రికి శ్రీ భూపేందర్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. ఒక వ్యక్తి ప్రమాదానికి లోనై మరణిస్తే/శాశ్వత వైకల్యం చెందితే రూ.2.0 లక్షలు, పాక్షిక వైకల్యం చెందితే రూ.1.0 లక్షలకు అందించనున్నట్లు తెలిపారు. కార్మికుల సంక్షేమం కొరకు ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది అని అన్నారు.(చదవండి: పతకం చేజార్చుకున్న 24 మంది ఒలింపియన్లకు టాటా కార్లు) The e-Shram portal will cover all unorganised workers of the nation and help link them to social security schemes of the Government of India. The portal will prove to be a huge boost for the last-mile delivery of services. #ShramevJayate pic.twitter.com/wnEb0U85Uo — Bhupender Yadav (@byadavbjp) August 26, 2021 అసంఘటిత రంగ కార్మికులు నేటి నుంచే తమ పేర్లను ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు. పుట్టిన తేదీ, స్వస్థలం, మొబైల్ నంబర్ వంటి ఇతర అవసరమైన వివరాలను నింపాల్సి ఉంటుంది. అలాగే, కార్మికుడు తన ఆధార్ కార్డ్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలను ఉపయోగించి నమోదు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు నమోదు చేశాక కార్మికునికి ఈ-శ్రమ్ కార్డు ఒకటి మీకు వస్తుంది. దాన్ని భద్రపర్చుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఏవైనా సందేహాలుంటే.. నివృత్తి చేసుకునేందుకు జాతీయ స్థాయిలో టోల్ ఫ్రీ నంబర్ 14434ని కూడా ప్రారంభించారు. -
ఒంటరి మహిళల ఆర్థిక భృతికి దరఖాస్తులు
నేటి నుంచి ప్రారంభం..13 వరకు దరఖాస్తుల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: ‘ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి’ పథకానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. సోమవారం నుంచి ఈనెల 13 వరకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపిక ప్రక్రియకు సంబంధించి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) తాజాగా షెడ్యూల్‌ను, మార్గదర్శకాలను జారీ చేసింది. లబ్ధిదారుల ఎంపికకు అర్హతలివే.. ► ఒంటరి మహిళల ఎంపికకు 18 ఏళ్లు నిండిన వివాహిత మహిళలు భర్త నుంచి ఏడాదికిపైగా వేరుగా ఉంటున్న వారై ఉండాలి. ► అవివాహితులైతే గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్లు, పట్టణ ప్రాంతాల్లో 35 ఏళ్ల వయస్సు నిండిన వారై ఉండాలి. ► దారిద్య్రరేఖకు దిగువన ఉండి, వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు. ► ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సామాజిక భద్రత పథకాలు, పింఛన్ల లబ్ధిదారులై ఉండరాదు. ►దరఖాస్తుకు జత చేయాల్సిన పత్రాలు తహసీల్దార్, సంబంధిత మున్సిపల్ కార్యాలయాల్లో నేరుగా దరఖాస్తులు సమర్పించవచ్చు. జీహెచ్ఎంసీ పరిధిలోని వారు మీసేవ, ఈ సేవ కేంద్రాల్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను సమర్పించేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదు. దరఖాస్తుతోపాటు వయస్సు నిర్ధారణ కోసం ఆధార్ కార్డు, ఎన్నికల గుర్తింపు కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, స్కూల్ టీసీలలో ఏదో ఒక జిరాక్స్ ప్రతిని జతపరచాలి.