ఈఎస్‌ఐసీలో కొత్తగా 15 లక్షల మంది చందాదారులు | Esic Scheme Adds Nearly 15 Lakhs New Employees In August | Sakshi
Sakshi News home page

ఈఎస్‌ఐసీలో కొత్తగా 15 లక్షల మంది చందాదారులు

Published Wed, Oct 26 2022 8:09 AM | Last Updated on Wed, Oct 26 2022 8:21 AM

Esic Scheme Adds Nearly 15 Lakhs New Employees In August - Sakshi

న్యూఢిల్లీ: ఉద్యోగులకు సామాజిక భద్రతా స్కీముల్లో ఒకటైన ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ)లో ఈ ఏడాది ఆగస్టులో కొత్తగా 14.62 లక్షల మంది చందాదారులు చేరారు. నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌వో) మంగళవారం విడుదల చేసిన ఉద్యోగ నియమాకాల నివేదికలో ఈ అంశం వెల్లడైంది. దీని ప్రకారం ఈఎస్‌ఐసీలో 2021–22లో స్థూలంగా చేరిన కొత్త చందాదారుల సంఖ్య 1.49 కోట్లుగా ఉంది.

2017 సెప్టెంబర్‌ – 2022 ఆగస్టు మధ్యకాలంలో ఇది 7.22 కోట్లుగా నమోదైంది. ఈఎస్‌ఐసీ, ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌వో), పెన్షన్‌ ఫండ్‌ నియంత్రణ.. అభివృద్ధి ప్రాధికార సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) నిర్వహించే వివిధ సామాజిక భద్రతా స్కీముల్లో కొత్తగా చేరిన వారి డేటా ఆధారంగా ఎన్‌ఎస్‌వో ఈ నివేదిక తయారు చేసింది. దీని ప్రకారం ఆగస్టులో ఈపీఎఫ్‌వోలో నికరంగా కొత్తగా 16.94 లక్షల ఎన్‌రోల్‌మెంట్స్‌ నమోదయ్యాయి. 2017 సెప్టెంబర్‌ – 2022 ఆగస్టు మధ్య కాలంలో స్థూలంగా 5.81 కోట్ల మంది కొత్త సబ్‌స్క్రయిబర్స్‌ ఈపీఎఫ్‌వోలో చేరారు.

చదవండి: షాపింగ్‌ బంద్‌, యూపీఐ లావాదేవీలు ఢమాల్‌.. ఏమయ్యా విరాట్‌ కోహ్లీ ఇదంతా నీ వల్లే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement