ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) గరిష్ఠ వేతన పరిమితిని పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2014లో పెంచిన ఈ పరిమితిని ఇప్పటి మర్చలేదని, ఈసారైనా దీన్ని పెంచాలని ఎప్పటినుంచో ప్రభుత్వానికి డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఈపీఎఫ్‌వో వేతన పరిమితి పెంపు ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఈమేరకు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.
మీడియా సంస్థల్లో వెలువడిన కథనాల ప్రకారం ఒకవేళ గరిష్ఠంగా రూ.21000 పెంచితే మాత్రం ప్రభుత్వంపై అదనంగా ఆర్థిక భారం పడనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దాంతోపాటు ప్రైవేట్ సంస్థలపై కూడా ఆ భారం తప్పదని చెబుతున్నారు. పీఎఫ్ నిబంధనల ప్రకారం.. వేతననంలో 12 శాతం పీఎఫ్ కట్ అవుతుంది. మరో 12 శాతం ఉద్యోగం కల్పించిన యాజమాన్యం జమ చేయాలి. అందులో 8.33 శాతం పెన్షన్‌కు కేటాయిస్తారు. మిగిలిన మొత్తం పీఎఫ్‌లో జమ చేస్తారు. గతంలో ఈపీఎఫ్‌ఓ గరిష్ఠ వేతన పరిమితి రూ.15000గా ఉండేదాన్ని ప్రస్తుతం రూ.21వేలు చేస్తూ వార్తలు, ప్రతిపాదనలు వస్తున్న నేపథ్యంలో అటు ప్రభుత్వానికి, ఇటు సంస్థలకు భారం పడనుందనే వాదనలు వస్తున్నాయి.
ఇదీ చదవండి: ఐటీ జాబ్ కోసం వేచిచూస్తున్నారా.. టెకీలకు శుభవార్త
Comments
Please login to add a commentAdd a comment