న్యూఢిల్లీ: దేశంలో ఇకపై అన్ని జిల్లాల్లోనూ ఈఎస్‌ఐ సేవలు లభించనున్నాయి. భారత్‌లోని 735 జిల్లాల్లోనూ ఏప్రిల్ 1నుంచి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) ఇన్సూర్డ్ పర్సన్స్‌కు వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు. ప్రస్తుతం ఈ సేవలు కేవలం 387 జిల్లాల్లో మాత్రమే పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండగా, మరో 187 జిల్లాల్లో పాక్షికంగా అందుబాటులో ఉన్నాయి. 161 జిల్లాల్లో మాత్రం అసలు ఈ సేవలే ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా కేంద్రం ఈ సేవల ఏర్పాటుకు ముందడుగు వేసింది. దీనికి సంబంధించిన బిల్లుల ప్రక్రియను ఎసిక్ స్టాండింగ్ కమిటీ ఆమోదించింది.
Comments
Please login to add a commentAdd a comment