all districts
-
జిల్లాకో న్యాయసేవాధికార సంస్థ ! 23 కొత్త జిల్లాల్లో ఏర్పాటుకు నిర్ణయం
సాక్షి, కామారెడ్డి: పేదలకు ఉచితంగా న్యాయ సలహాలు, సేవలు అందించే న్యాయసేవాధికార సంస్థలు కొత్త జిల్లాల్లోనూ ఏర్పాటు అవుతున్నాయి. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాగానే కొనసాగాయి. అయితే సేవలు మరింత చేరువ అయ్యేందుకు తెలంగాణ న్యాయసేవాధికార సంస్థ 23 కొత్త జిల్లాల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థలను ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెల 2న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ వర్చువల్‌గా ఏకకాలంలో అన్ని జిల్లాల్లో ప్రారంభించనున్నారు. తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి.నవీన్‌రావు ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 23 కొత్త జిల్లాల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థలను చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రారంభిస్తారు. తెలంగాణ ప్రభుత్వం 2016లో పరిపాలనా సౌలభ్యం కోసం కొత్తగా 23 జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆయా జిల్లాల్లో జిల్లా కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయాలను ప్రారంభించింది. తరువాత కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాల సముదాయాలను నిర్మించింది. అయితే న్యాయస్థానాలకు సంబంధించి విభజన ప్రక్రియ కొంత ఆలస్యంగా జరిగింది. ఇటీవలే కొత్త జిల్లాల్లో జిల్లా న్యాయస్థానాలను ఏర్పాటు చేసింది. అంతేగాక కొత్త జిల్లాల్లో పోక్సో కేసుల విచారణకు కోర్టులను ఏర్పాటు చేసింది. ఇప్పుడు జిల్లా న్యాయసేవాధికార సంస్థలను ఏర్పాటు చేస్తోంది. ఇంకా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ ట్రిబ్యునళ్లు, కోర్టులు రావలసి ఉంది. అవి కూడా త్వరలోనే ఏర్పాటయ్యే అవకాశం ఉంది. కాగా కొత్త జిల్లాల్లో న్యాయస్థానాల సముదాయాల నిర్మాణానికి భూసేకరణ కూడా చేపట్టారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థల ద్వారా పేదలకు ఉచిత న్యాయసేవలు, సహాయం అందనుంది. అంతేగాక చిన్న చిన్న విషయాలకు సంబంధించిన కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరిగే వారిని కౌన్సెలింగ్ చేయడం ద్వారా ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చి కేసులను పరిష్కరిస్తారు. చదవండి: Telangana: గ్రూప్–4లో 8,039 పోస్టులే! -
ఇక అన్ని జిల్లాల్లోనూ ఈఎస్ఐ సేవలు
న్యూఢిల్లీ: దేశంలో ఇకపై అన్ని జిల్లాల్లోనూ ఈఎస్ఐ సేవలు లభించనున్నాయి. భారత్‌లోని 735 జిల్లాల్లోనూ ఏప్రిల్ 1నుంచి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ఇన్సూర్డ్ పర్సన్స్‌కు వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు. ప్రస్తుతం ఈ సేవలు కేవలం 387 జిల్లాల్లో మాత్రమే పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండగా, మరో 187 జిల్లాల్లో పాక్షికంగా అందుబాటులో ఉన్నాయి. 161 జిల్లాల్లో మాత్రం అసలు ఈ సేవలే ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా కేంద్రం ఈ సేవల ఏర్పాటుకు ముందడుగు వేసింది. దీనికి సంబంధించిన బిల్లుల ప్రక్రియను ఎసిక్ స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. -
ఇక జిల్లాల్లో ఖేలో ఇండియా కేంద్రాలు
న్యూఢిల్లీ: క్రీడల్లో భారతదేశాన్ని సూపర్ పవర్‌గా మార్చడానికి ఏర్పాటు చేసిన ‘ఖేలో ఇండియా’ పథకాన్ని విస్తరించేందుకు కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ నడుం బిగించింది. త్వరలోనే 1000 జిల్లాల్లో ఖేలో ఇండియా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు క్రీడల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ సెంటర్లను మాజీ చాంపియన్ అథ్లెట్లతో లేదా కోచ్‌ల పర్యవేక్షణలో నిర్వహిస్తామని ఆయన అన్నారు. ‘దేశాన్ని క్రీడా శక్తిగా మార్చడానికి మేము తీవ్రంగా కృషి చేస్తున్నాం. అందులో భాగంగా ఖేలో ఇండియాను జిల్లాల్లో విస్తరించాలని నిర్ణయం తీసుకున్నాం’ అని రిజిజు అన్నారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, బ్యాడ్మింటన్, సైక్లింగ్, ఫెన్సింగ్, హాకీ, జూడో, రోయింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్ క్రీడాంశాల్లో ఖేలో ఇండియా సెంటర్లు ఏర్పాటు చేస్తారు. -
జిల్లాల్లో కరోనా ‘సెరో సర్వే’
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతను తెలుసుకునేందుకు ప్రతి జిల్లాలో జనాభా ఆధారిత సెరో–సర్వే నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఐసీఎంఆర్, ఎన్‌సీడీసీలు కీలకంగా నిర్వహించే ఈ సర్వేకు రా ష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖలు సహకరిస్తాయి. వారానికి 200 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని సోమవారం అన్ని రాష్ట్రాలకు కేం ద్రం ఆదేశాలు జారీచేసింది. ప్ర తి జిల్లాలో 6 ప్రభుత్వ, 4 ప్రై వేటు ఆసుపత్రులను ఎంపిక చేస్తారు. ఔట్ పేషెంట్ల తరఫు న ఆసుపత్రులకు వచ్చే వారిలో 50 మంది, మరో 50 మంది గర్భిణుల శాంపిళ్లను సేకరించాలని సూచించింది. వీళ్లను లో–రిస్క్ గ్రూప్‌గా వర్గీకరించింది. అలాగే హైరిస్క్‌లో ఉండే వైద్య సిబ్బందికి ప్రతీ వారం 100 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాలి. మొత్తంగా వారానికి 200, నెలకు 800 మందికి ప్రతీ జిల్లాలో ర్యాండమ్‌గా పరీక్షలు చేయాలని పేర్కొంది. కాగా, కరోనా నిర్ధారణకు ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. దీని ద్వారా ఎవరికైనా కరోనా పాజిటివ్ వచ్చిందా లేదా తెలుసుకుంటారు. మరొకటి పూలింగ్ పరీక్ష. దీనిద్వారా ఒకేసారి కొందరి నమూనాలను కలిపి పరీక్ష చేస్తా రు. ఇంకొకటి ఎలిసా పరీక్ష. శరీరంలో వైరస్ ప్రభావాన్ని, యాంటీబాడీలను కనుక్కునేందుకు దీన్ని నిర్వహిస్తారు. వీటి ద్వారా వైరస్ వ్యాప్తి తీవ్రతతో పాటు ఎక్కడ ఎక్కువ కేసులు నమోదవుతున్నా యో గుర్తించి తదుపరి చర్యలు తీసుకుంటారు. -
త్వరలో దేశవ్యాప్తంగా షరియత్ కోర్టులు
లక్నో: ఇస్లామిక్ చట్టాలకు అనుగుణంగా ముస్లింల సమస్యలను పరిష్కరించేందుకు దేశంలోని అన్ని జిల్లాల్లో షరియత్ కోర్టు (దారుల్ కాజా)లు ఏర్పాటు చేయాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) భావిస్తోంది. న్యూఢిల్లీలో జరగనున్న బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించనుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో 40 షరియత్ కోర్టులు ఉన్నాయని, దేశంలోని అన్ని జిల్లాల్లో ఈ కోర్టులు ఏర్పాటుచేస్తే ముస్లింలు తమ సమస్యల పరిష్కారానికి ఇతర కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరముండదని బోర్డు సభ్యుడు జఫర్యాబ్ జిలానీ తెలిపారు. జడ్జీలు, లాయర్లు, సామాన్యులకు షరియత్ చట్టాలపై అవగాహన కల్పించేందుకు గాను తఫీమ్–ఈ–షరియత్ కమిటీని పునఃప్రారంభించనున్నామన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చినా బోర్డు ఆహ్వానిస్తుందన్నారు. -
అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి
భూపాలపల్లి అర్బన్ : నీతి ఆయోగ్‌తో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గాశంకర్‌మిశ్రా అన్నారు. జిల్లాలోని వివిధ మండలాల్లో ఆదివారం ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తీరును తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని సింగరేణి గెస్ట్‌హౌస్‌లో జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా దుర్గాశంకర్‌మిశ్రా అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న కాళేశ్వరం ఎత్తిపోతలు, మిషన్ భగీర«థ పనులు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం, డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మా ణం, కేసీఆర్ కిట్ల పథకం అమలు తీరు బాగుందని తెలిపారు. అలాగే టూరిజం అభివృద్ధి పనులు చకచక సాగుతున్నాయని, జిల్లాలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్నా జంతు సంపద అధికంగా లేదన్నారు. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, ఇతర జంతువులు పెంపకాన్ని అధికారులు ప్రోత్సహించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శితో మాట్లాడి కర్ణాటక రాష్ట్రం తరహాలో ఎకో టూరి జానికి ప్రత్యేక అధికారులను నియమించేలా చూస్తామని తెలిపారు. మరో 8 నెలల్లో జిల్లా సందర్శనకు వస్తానని, అప్పటి లోపు అభివృద్ధి చేసి చూపించాలన్నారు. సమావేశంలో డీఎఫ్ఓ రవికిరణ్, డీఆర్వో మోహ న్లాల్, జిల్లా అధికారులు అనురాధ, డాక్టర్ అప్పయ్య, అక్బర్, రాజారావు, భూపాలపల్లి మునిసిపల్ కమిషనర్ రవీందర్, అధికారులు పాల్గొన్నారు. -
అన్ని జిల్లాల్లో కాపు జేఏసీలు
కిర్లంపూడి : ప్రతి జిల్లాలోను కాపు జేఏసీలను నియమిస్తున్నట్టు కాపు సద్భావన సంఘం జిల్లా అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు అన్నారు. ఆదివారం పలువురు కాపు నాయకులతో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్వగృహం వద్ద విలేకరులతో మాట్లాడారు. తొలివిడతగా చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో నియోజకవర్గానికి పది మంది చొప్పున కాపు జేఏసీని ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. రెండో విడతలో ఈ నెల 26న కడప, 27న కర్నూలు, 28న అనంతపురం, 29న కృష్ణా జిల్లాల్లో పర్యటించి, కాపు జేఏసీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరో రెండు విడతల్లో అన్ని జిల్లాల్లో కాపు జేఏసీల ఏర్పాటు పూర్తిచేస్తామని తెలిపారు. భవిష్యత్తులో చేపట్టబోయే ఆందోళనలకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు వేణుగోపాల్, గోపు చంటిబాబు, గౌతు స్వామి, గౌతు సుబ్రహ్మణ్యం, సానా బోసు, చిడిపిరెడ్డి సత్తిబాబు, సూరత్ సత్యన్నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.