న్యూఢిల్లీ: క్రీడల్లో భారతదేశాన్ని సూపర్ పవర్‌గా మార్చడానికి ఏర్పాటు చేసిన ‘ఖేలో ఇండియా’ పథకాన్ని విస్తరించేందుకు కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ నడుం బిగించింది. త్వరలోనే 1000 జిల్లాల్లో ఖేలో ఇండియా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు క్రీడల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ సెంటర్లను మాజీ చాంపియన్ అథ్లెట్లతో లేదా కోచ్‌ల పర్యవేక్షణలో నిర్వహిస్తామని ఆయన అన్నారు. ‘దేశాన్ని క్రీడా శక్తిగా మార్చడానికి మేము తీవ్రంగా కృషి చేస్తున్నాం. అందులో భాగంగా ఖేలో ఇండియాను జిల్లాల్లో విస్తరించాలని నిర్ణయం తీసుకున్నాం’ అని రిజిజు అన్నారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, బ్యాడ్మింటన్, సైక్లింగ్, ఫెన్సింగ్, హాకీ, జూడో, రోయింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్ క్రీడాంశాల్లో ఖేలో ఇండియా సెంటర్లు ఏర్పాటు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment