టోర్నీల ఆతిథ్యానికి భారత్‌ దూరం | India Will Not Conduct Any International Sporting Events Says Kiran Rijiju | Sakshi
Sakshi News home page

టోర్నీల ఆతిథ్యానికి భారత్‌ దూరం

Published Sun, May 24 2020 2:46 AM | Last Updated on Sun, May 24 2020 2:46 AM

India Will Not Conduct Any International Sporting Events Says Kiran Rijiju - Sakshi

న్యూఢిల్లీ: సమీప భవిష్యత్‌లో ఎలాంటి అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లకు భారత్‌ ఆతిథ్యం ఇవ్వబోదని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు స్పష్టం చేశారు. దీంతో అక్టోబర్‌–నవంబర్‌లలో ఐపీఎల్‌ జరిగే అవకాశాలున్నాయని వస్తోన్న ఊహాగానాలకు తెరపడినట్లయింది. దేశంలో క్రీడల పునరుద్ధరణ కోసం ప్రయత్నిస్తున్నామన్న రిజిజు... అంతకన్నా ముందు ఆట గాళ్ల ప్రాక్టీస్, శిక్షణ, ఫిట్‌నెస్‌ తమకు ముఖ్యమని పేర్కొన్నారు. స్టేడియాల్లో ప్రేక్షకులు లేకుండానే క్రీడా ఈవెంట్లు నిర్వహించేందుకు అలవాటు పడాలని సూచించారు. ఐపీఎల్‌ నిర్వహణ గురించి మాట్లాడుతూ ఈ పరిస్థితుల్లో కేవలం ఒక్క క్రీడా ఈవెంట్‌ నిర్వహించి అందరి ఆరోగ్యాలను ప్రమాదంలో పడేయలేమని ఆయన పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement