Khelo India Youth Games
-
5 స్వర్ణాలు సహా మొత్తం 7 పతకాలు సాధించిన నటుడు మాధవన్ తనయుడు
Khelo India Games 2023: ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆర్ మాధవన్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. అతని కుమారుడు, భారత అప్ కమింగ్ స్విమ్మర్ వేదాంత్ మాధవన్ ఖేలో ఇండియా గేమ్స్-2023లో పతకాల వర్షం కురిపించాడు. ఈ పోటీల్లో మహారాష్ట్ర తరఫున బరిలోకి దిగిన వేదాంత్.. 5 స్వర్ణ పతాకలు, 2 రజత పతకాలు సహా మొత్తం 7 పతకాలను కైవసం చేసుకున్నాడు. VERY grateful & humbled by the performances of @fernandes_apeksha ( 6 golds,1 silver,PB $ records)& @VedaantMadhavan (5golds &2 silver).Thank you @ansadxb & Pradeep sir for the unwavering efforts & @ChouhanShivraj & @ianuragthakur for the brilliant #KheloIndiaInMP. So proud pic.twitter.com/ZIz4XAeuwN — Ranganathan Madhavan (@ActorMadhavan) February 12, 2023 100, 200, 1500 మీటర్ల రేసులో స్వర్ణ పతకాలు సాధించిన వేదాంత్.. 400, 800 మీట్లర రేసులో రజత పతకాలు సొంతం చేసుకున్నాడు. వేదాంత్ కొలనులో బంగారు చేపలా రెచ్చిపోయి పతకాలు సాధించడంతో అతను ప్రాతినిధ్యం వహించిన మహారాష్ట్ర మొత్తంగా 161 పతకాలు (56 స్వర్ణాలు, 55 రజతాలు, 50 కాంస్యాలు) సాధించి పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా ఓవరాల్ ఛాంపియన్షిప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. బాలుర విభాగంలో కూడా అత్యధిక పతకాలు సాధించిన మహారాష్ట్ర టీమ్ మరో ట్రోఫీని సాధించింది. With gods grace -Gold in 100m, 200m and 1500m and silver in 400m and 800m . 🙏🙏🙏👍👍 pic.twitter.com/DRAFqgZo9O — Ranganathan Madhavan (@ActorMadhavan) February 12, 2023 కొడుకు వేదాంత్ ప్రదర్శనతో ఉబ్బితబ్బిబైపోతున్న మాధవన్.. అతనికి, మహారాష్ట్ర టీమ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పలు ట్వీట్లు చేశాడు. వేదాంత్, ఫెర్నాండెస్ అపేక్ష (6 గోల్డ్, 1 సిల్వర్) ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది. వీరి ప్రదర్శన వెనుక తిరుగలేని కృషి చేసిన కోచ్ ప్రదీప్ సర్, చౌహాన్ శివ్‌రాజ్‌లకు ధన్యవాదాలు. ఖేలో ఇండియా గేమ్స్‌ను ఘనంగా నిర్వహించిన కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ గారికి కృతజ్ఞతలు అంటూ తొలి ట్వీట్ చేశాడు. CONGRATULATIONS team Maharashtra for the 2 trophy’s .. 1 for boys team Maharashtra in swimming & 2nd THE OVERALL Championship Trophy for Maharashtra in entire khelo games. pic.twitter.com/rn28piOAxY — Ranganathan Madhavan (@ActorMadhavan) February 12, 2023 ఆ తర్వాత ట్వీట్లో మాధవన్ తన కుమారుడు సాధించిన పతకాల వివరాలను పొందుపరిచాడు. మరో ట్వీట్లో టీమ్ మహారాష్ట్ర, ఆ రాష్ట్ర బాయ్స్ టీమ్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు. ఇటీవల కాలంలో కొలనులో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న వేదాంత్ దుబాయ్‌లో ఒలింపిక్స్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. వేదాంత్ కోసం మాధవన్ తన ఫ్యామిలీ మొత్తాన్ని దుబాయ్‌కు షిఫ్ట్ చేశాడు. కాగా, గతేడాది డానిష్ ఓపెన్‌లో బంగారు పతకం గెలవడం ద్వారా వేదాంత్ తొలిసారి వార్తల్లోకెక్కాడు. -
బంగారం: చెప్పుల్లేకుండా రోజూ 7 కిమీ పరుగెత్తిన ఆ అమ్మాయి ఇప్పుడు ఏకంగా..
Khelo India Games: చెప్పుల్లేకుండా రోజూ 7 కిలోమీటర్లు ఆకలి కడుపుతో స్కూల్‌కు పరిగెత్తిన అమ్మాయి గత వారం రోజుల్లో రెండు బంగారు పతకాలు సాధించింది. నిన్న మొన్నటి దాకా ఆమె ఇంటికి కరెంట్ లేదు. తల్లికి వచ్చే వెయ్యి రూపాయల వితంతు పెన్షన్ బతకడానికి ఆధారం. అయినా సరే ఆటల్లో నిలిచి గెలిచి పారిస్‌లో జరగనున్న ఒలింపిక్స్ కోసం ఆశలు పెట్టుకోదగ్గ అమ్మాయిగా నిలిచింది. 16 ఏళ్ల నిరుపేద బాలిక ఆశా కిరణ్ బార్లా స్ఫూర్తి గాథ ఇది. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు భోపాల్‌లో జరుగుతున్న జాతీయ ఖేలో ఇండియా పోటీల్లో న్యూస్ మేకర్ ఆశా కిరణ్ బార్లా. వారికి పేదరికం శాపం. కాని వారి పోరాటానికి అడ్డు లేదు. వారికి పోషకాహారలోపం. కాని వారి బలానికి తిరుగులేదు. దేశంలో ఎందరో పేద క్రీడాకారులు. కాని వారి సంకల్పానికి ఓటమి లేదు. 17 ఏళ్ల లోపు ఉండే దేశగ్రామీణ క్రీడాకారులను ఉత్సాహపరచడానికి 2018 నుంచి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తున్న ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’లో భాగంగా జనవరి 30 మొదలయ్యాయి. ఫిబ్రవరి 11 వరకూ జరుగుతున్న ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2022’ పోటీల్లో ఎందరో ఇలాంటి మట్టిలో మాణిక్యాలు. ఎందరినో ఆశ్చర్యపరుస్తున్న కొత్త ముఖాలు. ఆశా కిరణ్ బార్లా కూడా అలాంటి మాణిక్యమే. ఎవరీ బార్లా అని అందరూ ఆమె పట్ల ఆరా తీస్తున్నారు. నిజానికి ఇప్పటికే ఆశా సాధించిన విజయాలతో ఎంతో ప్రచారం పొందాల్సింది. కాని జార్ఖండ్‌కు చెందిన ఈ నిరుపేద ఆదివాసీ క్రీడాకారిణిని ఎవరు పట్టించుకుంటారు? పరుగుల రాణి ‘పీటీ ఉష నాకు ఆదర్శం’ అని చెప్పే 16 ఏళ్ల బార్ల చిరుతతో సమానంగా పరిగెత్త గలదు. 2022లో కువైట్‌లో జరిగిన ఆసియా యూత్ ఫెస్టివల్లో 800 మీటర్ల పరుగుల పోటీలో మన దేశం నుంచి రికార్డు నమోదు చేసింది. ఇంతకు ముందు ఉన్న రికార్డును చెరిపేసింది. ఈ ఘనవిజయానికి ఆమెకు రావలసినంత పేరు భారతీయ మీడియాలో రాలేదు. విషాదం ఏమంటే కువైట్‌లో సాధించిన ఈ ఘనతను వారి ఇంట్లో రెండు రోజుల తర్వాత తెలుసుకున్నారు. ఎందుకంటే వారి ఇంటికి కరెంట్ లేదు. ఇంట్లో టీవీ లేదు. వారికి ఫోన్ కూడా లేదు. ఆశా కిరణ్ బార్లా ఈ ఘనత సాధించాక అధికారులు వచ్చి హడావిడిగా కరెంట్ ఇచ్చారు. జిల్లా స్పోర్ట్స్ యంత్రాంగం ఒక టీవీ కొని ఇచ్చింది. ‘కాని మాకు తిండి ఎట్లా?’ అంటుంది బార్లా. ఆకలితో పరిగెత్తి ఆశా కిరణ్ బార్లాది జార్ఖండ్‌లో రాంచీకి 100 కిలోమీటర్ల దూరంలో అడవిలో కొండల మధ్య ఉన్న అతి చిన్న గిరిజన తండా. 22 ఇళ్లు ఉంటాయి. చుట్టుపక్కల నక్సల్స్ బెడద ఉండటంతో కరెంటు, ఫోన్ సిగ్నల్స్ దాదాపుగా ఆ తండాకి లేవు. అలాంటి ఊర్లో పని చేసిన ఏకైక టీచర్ విలియమ్స్ కుమార్తె ఆశా కిరణ్. కాని 9 ఏళ్ల క్రితం ఆ విలియమ్స్ మరణించడంతో ఆ కుటుంబం దిక్కు లేనిదైంది. నలుగురు పిల్లల్ని వితంతు పెన్షన్తోటి తల్లి రోసానియా సాకాల్సి వచ్చింది. ఆశా కిరణ్ అక్క ఫ్లోరెన్స్ బాగా పరిగెత్తుతుంది. అది చూసి ఆశా కూడా పరిగెత్తడం నేర్చింది. చిన్నప్పటి నుంచి కొండలు గుట్టలు ఎక్కిన కాళ్లు కనుక వారి కాళ్లల్లో విపరీతమైన వేగం. కాని తండ్రి మరణం తర్వాత జరుగుబాటు కోసం ఐదో తరగతి పూర్తి చేసిన ఆశాను వాళ్లమ్మ రాంచిలో ఏదో ఇంటిలో పనికి పెట్టింది. ఒక సంవత్సరం ఇంట్లో పనిమనిషిగా, వెట్టి కార్మికురాలిగా పని చేసింది ఆశా. టీచర్ తెచ్చిన మార్పు ఆశా అక్క ఫ్లోరెన్స్ వాళ్ల తండాకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మహుగావ్కు వెళ్లి చదువుకునేది. ఫ్లోరెన్స్ పరుగు చూసి వాళ్ల స్కూల్ టీచర్ సిస్టర్ దివ్య ‘నువ్వు బాగా పరిగెత్తుతున్నావ్’ అనంటే ‘మా చెల్లెలు ఇంకా బాగా పరిగెత్తుతుంది’ అని ఫ్లోరెన్స్ చెప్పింది. దాంతో ఆ టీచర్ రాంచీలో పనిమనిషిగా ఉన్న ఆశా కిరణ్‌ను తెచ్చి తన స్కూల్లో చేర్చింది. అక్కచెల్లెళ్లు ఇద్దరూ టిఫిన్ చేయకుండా స్కూల్‌కి పరిగెత్తుకుంటూ వచ్చేవారు. స్కూల్ అయ్యాక ఆకలికి తాళలేక మళ్లీ పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లేవారు. టీచర్ ఇది గమనించి తానే స్వయంగా వారికి రేషన్ ఇచ్చి చదువులో క్రీడల్లో ప్రోత్సహించడమే కాదు ఇలాంటి గిరిజన బాలికలను సొంత ఖర్చులతో ట్రయిన్ చేసే కోచ్ ఆశు భాటియా దృష్టికి తీసుకెళ్లింది. బొకారో థర్మల్ టౌన్లో ఉన్న తన అథ్లెట్స్ అకాడెమీలో ఆశా కిరణ్‌ను చేర్చుకున్న ఆశు భాటియా తగిన శిక్షణ ఇవ్వడంతో ఇప్పుడు ఆమె పతకాల పంట పండిస్తోంది. రెండు స్వర్ణాలు ఇప్పటికి 11 నేషనల్, 2 ఇంటర్నేషనల్ పతకాలు సాధించిన ఆశా తాజాగా భోపాల్‌లో జరుగుతున్న ఖేల్ రత్న యూత్ గేమ్స్‌లో 800 మీటర్ల పరుగులో, 1500 మీటర్ల పరుగులో స్వర్ణ పతకాలు సాధించింది. దాంతో పరిశీలకులు 2024లో పారిస్ ఒలింపిక్స్‌లో ఆశాను ఒక ప్రాపబుల్గా ఎంపిక చేశారు. ‘కాని ఏం లాభం? ఆమెను ఒలింపిక్స్ స్థాయిలో శిక్షణ ఇవ్వడానికి నా దగ్గర వనరులు లేవు’ అని దిగులు పడుతున్నాడు కోచ్ ఆశు భాటియా. ‘మా జీవితాలు మెరుగు పరిస్తే మా అమ్మాయి ఇంకా రాణిస్తుంది’ అంటుంది తల్లి. ఈ ప్రతికూలతలు ఎలా ఉన్నా గెలిచి తీరాలనే సంకల్పం ఆశాలో. ఇలాంటి క్రీడాకారిణుల గురించి ఎంత ప్రచారం చేస్తే అంత సాయం దక్కుతుంది. ప్రోత్సాహం లభిస్తుంది. ఇప్పుడు అందరూ చేయవలసిన పని అదే. చదవండి: Sneh Rana: కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్న టీమిండియా ఆల్‌రౌండర్ WPL 2023: డబ్ల్యూపీఎల్ వేలం.. బరిలో 409 మంది -
Khelo India Youth Games: ‘పసిడి’ నెగ్గిన గురునాయుడు
సాక్షి, అమరావతి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో ఆంధ్రప్రదేశ్ ఖాతాలో రెండో స్వర్ణ పతకం చేరింది. అండర్–18 బాలుర వెయిట్‌లిఫ్టింగ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్.గురు నాయుడు పసిడి పతకం సాధించాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ క్రీడల్లో సోమవారం 55 కేజీల విభాగంలో గురు నాయుడు మొత్తం 227 కేజీల బరువెత్తి అగ్ర స్థానంలో నిలిచాడు. టామ్చౌ మీటీ (మణిపూర్) రజతం, విజయ్ ప్రజాపతి (మధ్యప్రదేశ్) కాంస్య పతకం గెలుపొందారు. ప్రస్తుతం పతకాల పట్టికలో ఆంధ్రప్రదేశ్ 2 స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఆరు పతకాలతో 15వ స్థానంలో ఉంది. -
Khelo India Youth Games: ‘స్వర్ణ’ సురభి
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ ఖాతాలో మూడో స్వర్ణ పతకం చేరింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఆదివారం జరిగిన జిమ్నాస్టిక్స్ అండర్–18 బాలికల టేబుల్ వాల్ట్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన కె.సురభి ప్రసన్న పసిడి పతకం సాధించింది. సురభి 11.63 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఈవెంట్లో సురభి నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. అథ్లెటిక్స్‌లో 2000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో డిండి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అథ్లెటిక్స్ అకాడమీ విద్యార్థిని చెరిపెల్లి కీర్తన (పాలకుర్తి) రజత పతకం సొంతం చేసుకుంది. కీర్తన 7 నిమిషాల 17.37 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచింది. బాలికల కబడ్డీ మ్యాచ్‌లో తెలంగాణ జట్టు 28–46తో మధ్యప్రదేశ్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఈనెల 11 వరకు జరగనున్న ఈ క్రీడల్లో తెలంగాణ 3 స్వర్ణాలు, 3 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలతో 11వ స్థానంలో ఉంది. -
Khelo India Youth Games: ప్రణయ్‌కు పసిడి పతకం
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ క్రీడాకారుల తమ పతకాల వేట కొనసాగిస్తున్నారు. భోపాల్‌లో జరుగుతున్న ఈ క్రీడల్లో శనివారం అథ్లెటిక్స్ బాలుర ట్రిపుల్ జంప్‌లో తెలంగాణ ప్లేయర్ కొత్తూరి ప్రణయ్ పసిడి పతకాన్ని సొంతం చేసుకోగా.. బాలికల 100 మీటర్ల హర్డిల్స్‌లో నామాయి రుచిత రజత పతకాన్ని గెల్చుకుంది. శుక్రవారం 1500 మీటర్ల రేసులో సుమిత్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. శనివారం జరిగిన జూనియర్ పురుషుల సైక్లింగ్ కెరిన్ రేసు వ్యక్తిగత విభాగంలో ఆశీర్వాద్ సక్సేనా మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. బ్యాడ్మింటన్‌లో అండర్–19 బాలుర సింగిల్స్ విభాగంలో కె.లోకేశ్ రెడ్డి తెలంగాణకు స్వర్ణ పతకాన్ని అందించాడు. ఫైనల్లో లోకేశ్ రెడ్డి 21–19, 15–21, 22–20తో అభినవ్ ఠాకూర్ (పంజాబ్)పై గెలుపొందాడు. బాక్సింగ్‌లో బాలుర 51 కేజీల విభాగంలో బిలాల్... బాలికల 75 కేజీల విభాగంలో గుణనిధి పతంగె కాంస్య పతకాలు సాధించారు. పతకాల పట్టికలో ప్రస్తుతం తెలంగాణ పది పతకాలతో 14వ ర్యాంక్‌లో ఉంది. -
ఖేలో ఇండియా స్పాన్సర్‌గా ‘స్పోర్ట్స్ ఫర్ ఆల్’
సాక్షి, హైదరాబాద్: ప్రతిభ గల క్రీడాకారుల ప్రదర్శనకు పదును పెట్టే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (కేఐవైజీ)తో దేశీయ క్రీడల నిర్వాహక సంస్థ ‘స్పోర్ట్స్ ఫర్ ఆల్’ (ఎస్ఎఫ్ఏ) జతకట్టింది. యువతలోని క్రీడా నైపుణ్యాన్ని మెరుగు పరచడానికి విశేష కృషి చేస్తున్న ఎస్ఎఫ్ఏ ఐదేళ్ల పాటు ఖేలో ఇండియా గేమ్స్‌కు స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంది. ఈ మేరకు రూ. 12.5 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఎస్ఎఫ్ఏ వ్యవస్థాపకులు రిషికేశ్ జోషి తెలిపారు. కుర్రాళ్ల ప్రతిభాన్వేషణలో భాగమైన ఎస్ఎఫ్ఏ స్పాన్సర్షిప్ లభించడంపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హర్షం వ్యక్తం చేసింది. గతంలో ఎస్ఎఫ్ఏ ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో భారత జట్టుకు స్పాన్సర్‌గా ఉంది. -
'కేంద్రం క్రీడలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తోంది'
కేంద్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తోందని..ఇందులో భాగంగానే దేశ వ్యాప్తంగా వెయ్యి ఖేలో ఇండియా కేంద్రాలను నెలకొల్పినట్లు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. క్రీడాకారులు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకునేందుకు ప్రధాని మోడీ ఖేలో ఇండియా కేంద్రాలు తీసుకొచ్చారని మీడియా సమావేశంలో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎంతో మంది క్రీడాకారులు తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకుని ప్రతిభను చాటుతున్నారని వివరించారు. ఒలింపిక్స్ లో పోటీ చేసిన ఇండియా.. గోల్డ్ మెడల్ సాధించిందని, అలాగే పారాలింపిక్స్ లో కూడా క్రీడాకారులు 19 పతకాలు సాధించి దేశ కీర్తిని ఇనుమడింప చేశారని స్మృతి ఇరానీ సంతోషం వ్యక్తం చేశారు. మహిళల హాకీ జట్టు మరోసారి అవార్డులను ఎలా తెచ్చిపెట్టిందో దేశం చూసిందన్నారు. కేంద్రం ఇప్పుడు ఏకంగా ఒలింపిక్స్ ను లక్ష్యంగా పెట్టుకుని సాధన చేసే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ ద్వారా అగ్రశ్రేణి భారతీయ అథ్లెట్లకు శిక్షణ ఇచ్చేందుకు వీలు కల్పించిందన్నారు. శిక్షణా కార్యకలాపాల నిమిత్తం ఒక్కో క్రీడాకారుడికి ఏడాదికి రూ.5 లక్షలు అందజేస్తుందని మంత్రి స్మృతి ఇరానీ వివరించారు. -
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో ఏపీ క్రీడాకారుల సత్తా
సాక్షి, అమరావతి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2021లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సత్తాచాటారు. 19 క్రీడాంశాల్లో పోటీపడగా 13 (4 స్వర్ణ, 4 రజత, 5 కాంస్య) పతకాలు కైవసం చేసుకున్నారు. అత్యధికంగా స్వర్ణ పతకాలు సాధించిన రాష్ట్రాల జాబితాలో ఏపీ 15వ స్థానంలో నిలిచింది. ఈ నెల 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు హరియాణాలోని పంచ్కులలో అండర్–18 బాలబాలికల ఖేలో ఇండియా పోటీలు నిర్వహించారు. చివరిరోజు సోమవారం బాక్సర్ అంజనీకుమార్ (63.5–67 కేజీల వెల్టర్ వెయిట్ విభాగంలో) రజత పతకంతో మెరిశాడు. ఫైనల్ పోరులో చండీగఢ్ క్రీడాకారుడు అచల్వీర్తో పోటీపడి 2–3తో ద్వితీయ స్థానంలో నిలిచాడు. ఈ పోటీల్లో రాష్ట్రం తరఫున మొత్తం 161 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అత్యధికంగా వెయిట్ లిఫ్టింగ్‌లో 6 పతకాలు వచ్చాయి. ఇందులో రెండు స్వర్ణాలు ఉండటం విశేషం. ఈ సందర్భంగా క్రీడాకారులను పర్యాటక, సాంస్కృతిక, క్రీడలశాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎండీ ఎన్.ప్రభాకరరెడ్డి అభినందించారు. విజేతలు వీరే.. వెయిట్ లిఫ్టింగ్ విభాగాల్లో ఎస్.పల్లవి (స్వర్ణం), సీహెచ్.శ్రీలక్ష్మి (స్వర్ణం), ఎస్కే లాల్ భషీర్ (రజతం), పి.ధాత్రి (రజతం), డీజీ వీరేష్ (రజతం), ఆర్.గాయత్రి (కాంస్యం), అథ్లెటిక్స్ విభాగాల్లో కుంజా రజిత (స్వర్ణం), ఎం.శిరీష (కాంస్యం), కబడ్డీలో మహిళల జట్టు కాంస్యం, ఆర్చరీలో కుండేరు వెంకటాద్రి (స్వర్ణం), మాదాల సూర్యహంస (కాంస్యం), ఘాట్కాలో బాలురు జట్టు కాంస్యం, బాక్సింగ్‌లో అంజనీకుమార్ (రజతం). -
Khelo India Youth Games: వెంకటాద్రి పసిడి గురి.. ఏపీ ఖాతాలో మరో స్వర్ణం
పంచ్‌కుల(హరియాణా): ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో ఆదివారం ఆంధ్రప్రదేశ్‌కు ఒక స్వర్ణం, ఒక కాంస్య పతకం లభించాయి. ఆర్చరీలో అండర్–18 పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో కుందేరు వెంకట్రాది బంగారు పతకం సొంతం చేసుకోగా... అండర్–18 మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో మాదల సూర్య హంసిని కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఫైనల్లో వెంకటాద్రి 144–141తో కోర్డె పార్థ్ సునీల్ (మహారాష్ట్ర)పై విజయం సాధిం చాడు. సెమీఫైనల్లో వెంకటాద్రి 147–146తో ప్రథమేశ్ (మహారాష్ట్ర)పై, క్వార్టర్ ఫైనల్లో 147–145తో పెండ్యాల త్రినాథ్ చౌదరీ (ఆంధ్రప్రదేశ్)పై గెలుపొందాడు. కాంస్య పతక పోరులో సూర్య హంసిని 143–141తో అంతర్జాతీయ క్రీడాకారిణి పరిణీత్ కౌర్ (పంజాబ్)ను ఓడించింది. ఈ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ నాలుగు స్వర్ణాలు, మూడు రజతాలు, ఐదు కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలతో 14వ స్థానంలో ఉంది. చదవండి: Rishabh Pant: అదే మా పొరపాటు.. అందుకే ఓడిపోయాం.. ఇక మూడింటికి మూడు గెలవాల్సిందే! -
సైక్లింగ్‌లో స్వర్ణం.. చరిత్ర సృష్టించిన టైలర్ కొడుకు
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో 18 ఏళ్ల కశ్మీర్ కుర్రాడు ఆదిల్ అల్తాఫ్ అదరగొట్టాడు. జమ్మూ కశ్మీర్ తరపున ఖేలో ఇండియా యూత్ గేమ్స్ళో సైక్లింగ్ విభాగంలో తొలి స్వర్ణం సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. శనివారం ఉదయం నిర్వహించిన 70 కిమీ సైక్లింగ్ రోడ్ రేసులో ఆదిల్ అల్తాఫ్ అందరి కంటే ముందుగా గమ్యాన్ని చేరి పసిడి అందుకున్నాడు. అంతకముందు ఒక్కరోజు ముందు 28 కిమీ విభాగంలో నిర్వహించిన రేసులో రజతం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఒక టైలర్ కొడుకు తమ రాష్ట్రానికి స్వర్ణం పతకం తీసుకురావడంతో జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సింహా ఆదిల్ అల్తాఫ్‌ను ప్రత్యేకంగా అభినందించాడు.''ఈ విజయం నాకు చాలా పెద్దది. పతకం సాధిస్తాననే నమ్మకంతో ఖేలో ఇండియాకు వచ్చా. అయితే స్వర్ణ పతకం రావడం నా నమ్మకానికి మరింత బూస్టప్ ఇచ్చినట్లయింది'' అంటూ ఆదిల్ అల్తాఫ్ పేర్కొన్నాడు. 15 ఏళ్ల వయసులో ఆదిల్ అల్తాప్ కశ్మీర్ హార్వర్డ్ స్కూల్లో జరిగిన సైక్లింగ్ ఈవెంట్లో తొలిసారి పాల్గొన్నాడు. ఆ రేసులో విజేతగా నిలిచిన ఆదిల్ అల్తాఫ్ అక్కడి నుంచి సైక్లింగ్‌ను మరింత సీరియస్‌గా తీసుకున్నాడు. కొడుకు ఉత్సాహం, సైక్లింగ్‌పై ఉన్న ఇష్టం చూసి.. పగలు రాత్రి తేడా తెలియకుండా టైలరింగ్ చేసి పైసా పైసా కూడబెట్టి ఆదిల్‌కు రేసింగ్ సైకిల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు.ఆ తర్వాత లోకల్లో నిర్వహించిన పలు ఈవెంట్స్ ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచాడు. ఆదిల్ అల్తాఫ్ ప్రదర్శనకు మెచ్చిన శ్రీనగర్‌లోని ఎస్బీఐ బ్యాంక్ రూ.4.5 లక్షల ఎంటిబీ బైక్‌ను గిప్ట్గా ఇవ్వడం విశేషం. ఇక ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో పతకం సాధించాలనే కాంక్షతో ఆదిల్ అల్తాప్ గత ఆరు నెలలుగా పాటియాలాలోని ఎన్ఐఎస్లో శిక్షణ తీసుకున్నాడు. తాజాగా స్వర్ణం సాధించడంతో ఆదిల్ అల్తాఫ్ తన కలను నెరవేర్చుకున్నాడు. Congratulations to Adil Altaf for a historic gold and a new record at Khelo India Youth Games. Cycling team of Jammu Kashmir scripted history by winning second runner trophy. #KIYG2021 pic.twitter.com/vSHNtSAHyt — Office of LG J&K (@OfficeOfLGJandK) June 11, 2022 చదవండి: కామన్వెల్త్ క్రీడలకు నిఖత్ జరీన్ -
స్ఫూర్తి: సూపర్ రన్నర్ సుప్రీతి!
హరియాణాలోని పంచకులలో జరుగుతోన్న ఖేలో ఇండియా యూత్ అథ్లెటిక్స్‌లో జార్ఖండ్‌కు చెందిన సుప్రీతి కచ్చప్ 3000 మీటర్లను 9 నిమిషాల,46.14 సెకన్లల్లో పరుగెత్తి సరికొత్త రికార్డు సృష్టించింది. ట్రాక్ మీద రన్నింగ్ చేసి గోల్డ్ మెడల్ సాధించింది. కనీసం నడవడం కూడా నేర్చుకోని సమయంలో తండ్రిని కోల్పోయి, అమ్మ పెంపకంలో నడక నేర్చుకుని, పట్టుదల కష్టంతో రన్నింగ్‌లో దూసుకుపోతుంది. జార్ఖండ్‌లోని బుర్హు గ్రామానికి చెందిన సుప్రీతి తండ్రి రామ్‌సేవక్ ఓరాన్ ఇంటికి దగ్గరలో ఉన్న గ్రామంలో డాక్టర్‌గా పనిచేసేవారు. తల్లి బాలమతి గృహిణి. అది 2003.. ఓ రోజు రాత్రవుతున్నా రామ్‌సేవక్ ఇంటికి రాలేదు. తండ్రి కోసం సుప్రీతితో పాటు అమ్మ, నలుగురు తోబుట్టువులు ఎదురు చూస్తున్నారు. అర్థరాత్రి అయినా ఇంకా ఇంటికి చేరలేదు. అదే రోజు రామ్ సేవక్‌ను తుపాకితో కాల్చి చంపి చెట్టుకు వేలాడదీశారు నక్సలైట్లు. ఈ విషాధకర దుర్ఘటన జరిగినప్పుడు సుప్రీతి బుడిబుడి అడుగులు కూడా సరిగా వేయలేని చిన్నారి. రామ్ సేవ్క్ చనిపోయిన తరువాత బాలమతికి బీడీవో ఆఫీసులో నాలుగోతరగతి ఉద్యోగం వచ్చింది. దీంతో తన ఐదుగురు íపిల్లలతో గుమ్లాలోని గవర్నమెంట్ క్వార్టర్స్‌లోకి మకాం మార్చింది. మట్టి ట్రాక్‌పై పరుగెడుతూ.. క్వార్టర్స్‌లో ఉన్న మిగతా పిల్లలతో సుప్రీతి ఎంతోయాక్టివ్గా ఆడుకుంటూనే, దగ్గర్లోని గ్రౌండ్లో రన్నింగ్ సాధన చేస్తుండేది. సుప్రీతికి రన్నింగ్‌పై ఉన్న ఆసక్తిని గమనించిన బాలమతి మరింత ప్రోత్సహించి రన్నింగ్ చేయమని చెప్పేవారు. దీంతో నుక్రుడిప్పా చెయిన్‌పూర్ స్కూల్లో ఉన్న చిన్నపాటి మట్టి ట్రాక్‌పైనే కొన్నేళ్లు రన్నింగ్ చేసేది. తరువాత సెయింట్ పాట్రిక్ స్కూల్‌కు మారింది. అక్కడ సుప్రీతి ప్రతిభను గుర్తించిన యాజమాన్యం ఆమెకు స్కాలర్షిప్ను అందించి అథ్లెట్స్‌తో కలిసి శిక్షణ ఇప్పించింది. శిక్షణ తీసుకుంటూ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్లో పాల్గొన్న సుప్రీతి కోచ్ ప్రభాత్ రంజన్ తివారీ దృష్టిలో పడింది. దీంతో సుప్రీతికి మరింత శిక్షణ ఇస్తే మెడల్స్ సాధిస్తుందని గ్రహించిన ప్రభాత్ 2015ల గుమ్రాలోని జార్ఖండ్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌కు తీసుకెళ్లారు. ఇక్కడ 400 మీటర్లు, 800 మీటర్లు చాలా వేగంగా పరుగెత్తడం నేర్చుకుంది. క్రమంగా ఆమె వేగాన్ని 1500 మీటర్లకు పెంచారు. దీంతో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేది. తొలి మెడల్ సుప్రీతి 2019లో మధురలో జరిగిన నేషనల్ క్రాస్ కంట్రీ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొని తొలిసారి 2000 మీటర్ల పరుగుపందెంలో వెండి పతకం గెలుచుకుంది. ఇదే ఏడాది గుంటూరులో జరిగిన 3000 మీటర్ల నేషనల్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం అందుకుంది. క్రమంగా తన రన్నింగ్‌ను మెరుగు పరుచుకుంటూ గడిచిన మూడేళ్లలో పదినిమిషాల్లో మూడువేల మీటర్లను ఛేదించి వెండిపతకం, కాంస్య పతకాలను జూనియర్ ఫెడరేషన్ కప్‌లో గెలుచుకుంది. వారానికి 120 కిలోమీటర్లు.. సుప్రీతి లాంగ్ డిస్టెన్స్ ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు పట్టుదలతో తీవ్రంగా సాధన చేసేది. దీంతో వారానికి 80 కిలోమీటర్లు రన్నింగ్ చేసే సామర్థ్యాన్ని, వారానికి 120 కిలోమీటర్లకు పెంచింది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు ముందు కోజికోడ్‌లోని ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో మహిళల ఐదువేల మీటర్ల కాంపిటీషన్లో పాల్గొంది. 16.40 నిమిషాల్లో పూర్తిచేయాల్సిన రేసుని 16.33 సెకన్లలో పూర్తిచేసి ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు అర్హత సాధించింది. తాజాగా ఖేలో ఇండియా గేమ్స్‌లో జార్ఖండ్ రాష్ట్ర పతకాల జాబితాలో గోల్డ్ మెడల్ సాధించి పెట్టింది సుప్రీతి. ‘అదృష్టంలేదు, ఎంత ప్రయత్నించినా నెగ్గలేకపోతున్నాం’ అని చెప్పేవాళ్లకు, కష్టడితే ఏదైనా సాధ్యమే అని చెప్పడానికి సుప్రీతి ఉదాహరణగా నిలుస్తోంది. ‘‘నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఎంతోమంది అనేక గేమ్స్‌లో విజేతలుగా నిలుస్తున్నారు. వీరంతా నాకు ప్రేరణ. అనేక మంది సక్సెస్ స్టోరీల నుంచి స్ఫూర్తిని పొంది నేను ఇప్పుడు గోల్డ్ మెడల్‌ను గెలుచుకున్నాను. మానాన్న ఎలా ఉండేవారో నాకు గుర్తులేదు. కానీ ఈ మెడల్ ఆయనకే అంకితం ఇస్తున్నాను. నా విజయం వెనుక అమ్మ, కోచ్‌ల ప్రోత్సాహం చాలా ఉంది. పరిస్థితులు మనకు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ కష్టపడి వాటì ని అనుకూలంగా మార్చుకుని జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగవచ్చు’’ – సుప్రీతి -
Khelo India Youth Games 2022: మాయావతికి కాంస్యం
పంచ్‌కుల (హరియాణా): ‘ఖేలో ఇండియా’ యూత్ గేమ్స్‌లో గురువారం తెలంగాణకు 2 కాంస్యాలు, ఆంధ్రప్రదేశ్‌కు ఒక కాంస్యం లభించాయి. బాలికల 200 మీటర్ల పరుగులో నకిరేకంటి మాయావతి కాంస్యం గెలుచుకుంది. 24.94 సెకన్లలో రేసు పూర్తి చేసిన ఆమె మూడో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో సుదేష్ణ (మహారాష్ట్ర–24.29 సె.), అవంతిక (మహారాష్ట్ర–24.75 సె.) స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు. బాలుర 200 మీటర్ల పరుగులో తెలంగాణకు చెందిన అనికేత్ చౌదరి (22.27 సె.) మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకున్నాడు. ఆర్యన్ కదమ్ (మహారాష్ట్ర–21.82 సె.), ఆర్యన్ ఎక్కా (ఒడిషా–22.10 సె.) మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. బాలికల వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్. గాయత్రి కాంస్య పతకం గెలుచుకుంది. 81 ప్లస్ కేజీల కేటగిరీలో గాయత్రి 160 కిలోల బరువెత్తింది. ఈ విభాగంలో మార్టినా దేవి (మణిపూర్–186 కేజీలు), కె.ఒవియా (తమిళనాడు–164 కేజీలు) స్వర్ణం, రజతం సాధించారు. -
ఉక్కు సంకల్పం కలిగిన అమ్మాయిలకు అభినందనలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో విజయం సాధించిన అమ్మాయిలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సాయంత్రం ట్విటర్ ద్వారా అభినందనలు తెలియజేశారు. ‘‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో అద్భుత విజయాలు సాధించినందుకు ఛాంపియన్లు రజిత, పల్లవి, శిరీషలకు అభినందనలు. ఉక్కు సంకల్పం కలిగిన ఈ అమ్మాయిలు ఏపీకి గర్వకారణంగా నిలిచారు. వీళ్ల విజయం.. అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన పటిమ, కలలను సాధనకు చేసిన కృషి.. ఎంతో మంది ఔత్సాహికులకు ప్రేరణ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. Congratulating champions Rajitha, Pallavi & Sireesha for their spectacular victories in the Khelo India Youth Games. The iron-willed girls have made AP proud. Their fighting spirit to succeed against all odds is an inspiration for countless aspirants to achieve their dreams. — YS Jagan Mohan Reddy (@ysjagan) June 8, 2022 -
ఏపీ కబడ్డీ జట్టుకు కాంస్యం
పంచ్‌కుల (హరియాణా): ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో అండర్–18 మహిళల కబడ్డీ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ (ఏపీ) జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్ 15–50 పాయింట్ల తేడాతో హరియాణా చేతిలో ఓడిపోయింది. రెండో సెమీఫైనల్లో మహారాష్ట్ర 45–23తో తమిళనాడును ఓడించి నేడు జరిగే ఫైనల్లో హరియాణాతో అమీతుమీకి సిద్ధమైంది. సెమీఫైనల్లో ఓడిన రెండు జట్లకూ కాంస్య పతకాలు అందజేస్తారు. చదవండి: Kho Kho -League: ఖో–ఖో లీగ్‌లో జీఎంఆర్, అదానీ ఫ్రాంచైజీలు -
Khelo India Youth Games: కబడ్డీలో రైతుబిడ్డల విజయగర్జన
పంచకుల (హరియాణా): ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో ఆంధ్రప్రదేశ్ (ఏపీ) అమ్మాయిల కూత అదిరింది. హరియాణాలో జరుగుతున్న ఈ క్రీడల్లో అండర్–18 మహిళల కబడ్డీలో తెలుగు రైతుబిడ్డలు గర్జిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జట్టులో ఆడుతున్న 12 మందిలో పది మంది రైతు కూలీ బిడ్డలే ఉండటం గమనార్హం. వీరంతా విజయనగరం జిల్లాలోని కాపుసంభం గ్రామం నుంచి వచ్చారు. ఈ జిల్లాకు చెందిన వందన సూర్యకళ ఖేలో ఇండియా కబడ్డీలో అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థుల్ని హడలెత్తిస్తోంది. ‘బి’ గ్రూప్ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ 40–28తో చత్తీస్‌గఢ్‌ను ఓడించింది. ఇందులో ఏపీ రెయిడర్ సూర్యకళ 14 పాయింట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. నాలుగు జట్లున్న గ్రూప్ ‘బి’లో ఏపీ రెండు విజయాలు, ఒక ఓటమితో రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. సూర్యకళ మాట్లాడుతూ ‘అవును నేను రైతు కూలీ బిడ్డనే. రైతు బిడ్డలమైనందుకు గర్వంగా ఉంది. మనందరి పొద్దు గడిచేందుకు వృత్తి ఉంటుంది. అలాగే మా తల్లిదండ్రుల వృత్తి కూలీ చేసుకోవడం! నిజానికి నేను ఓ రన్నర్‌ను... చిన్నప్పుడు స్ప్రింట్‌పైనే ధ్యాస ఉండేది. ఏడేళ్లపుడు మా స్నేహితులంతా కబడ్డీ ఆడటం చూసి ఇటువైపు మళ్లాను’ అని చెప్పింది. -
ఇక జిల్లాల్లో ఖేలో ఇండియా కేంద్రాలు
న్యూఢిల్లీ: క్రీడల్లో భారతదేశాన్ని సూపర్ పవర్‌గా మార్చడానికి ఏర్పాటు చేసిన ‘ఖేలో ఇండియా’ పథకాన్ని విస్తరించేందుకు కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ నడుం బిగించింది. త్వరలోనే 1000 జిల్లాల్లో ఖేలో ఇండియా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు క్రీడల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ సెంటర్లను మాజీ చాంపియన్ అథ్లెట్లతో లేదా కోచ్‌ల పర్యవేక్షణలో నిర్వహిస్తామని ఆయన అన్నారు. ‘దేశాన్ని క్రీడా శక్తిగా మార్చడానికి మేము తీవ్రంగా కృషి చేస్తున్నాం. అందులో భాగంగా ఖేలో ఇండియాను జిల్లాల్లో విస్తరించాలని నిర్ణయం తీసుకున్నాం’ అని రిజిజు అన్నారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, బ్యాడ్మింటన్, సైక్లింగ్, ఫెన్సింగ్, హాకీ, జూడో, రోయింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్ క్రీడాంశాల్లో ఖేలో ఇండియా సెంటర్లు ఏర్పాటు చేస్తారు. -
ఓవరాల్ చాంప్ పంజాబ్ యూనివర్సిటీ
భువనేశ్వర్: తొలిసారి నిర్వహించిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో పంజాబ్ యూనివర్సిటీ జట్టు ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం ముగిసిన ఈ క్రీడల్లో పంజాబ్ వర్సిటీ మొత్తం 46 పతకాలు సాధించింది. ఇందులో 17 స్వర్ణాలు, 19 రజతాలు, 10 కాంస్యాలు ఉన్నాయి. ముగింపు ఉత్సవానికి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. మొత్తం పది రోజులపాటు జరిగిన ఈ క్రీడల్లో 64 యూనివర్సిటీలు కనీసం ఒక స్వర్ణమైనా సాధించాయి. 113 యూనివర్సిటీలు కనీసం ఒక కాంస్యమైనా గెలిచాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నాలుగు పతకాలతో (స్వర్ణం, రజతం, రెండు కాంస్యాలు) 38వ ర్యాంక్‌లో... ఆంధ్ర యూనివర్సిటీ రెండు పతకాలతో (స్వర్ణం, కాంస్యం) 50వ ర్యాంక్‌లో... కృష్ణా యూనివర్సిటీ రెండు రజతాలతో 72వ ర్యాంక్‌లో... డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ఒక కాంస్యంతో 97వ ర్యాంక్‌లో.... తెలంగాణకు చెందిన ఉస్మానియా యూనివర్సిటీ రెండు పతకాలతో (స్వర్ణం, రజతం) 45వ ర్యాంక్‌లో... పాలమూరు యూనివర్సిటీ ఒక రజతంతో 81వ ర్యాంక్‌లో నిలిచాయి. -
ఓయూ మహిళల టెన్నిస్ జట్టుకు స్వర్ణం
భువనేశ్వర్: తొలిసారి నిర్వహిస్తున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడల్లో ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్) జట్టుకు మొదటి స్వర్ణ పతకం లభించింది. టెన్నిస్ ఈవెంట్లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) మహిళల జట్టు చాంపియన్‌గా అవతరించింది. గుజరాత్ యూనివర్సిటీతో జరిగిన ఫైనల్లో చిలకలపూడి శ్రావ్య శివాని, కొండవీటి అనూష, నిధిత్రలతో కూడిన ఓయూ జట్టు 2–1తో గెలిచింది. తొలి మ్యాచ్‌లో అనూష 4–6, 6–7 (3/7)తో దీప్షిక షా చేతిలో ఓడింది. రెండో మ్యాచ్‌లో శ్రావ్య 6–0, 7–6 (9/7)తో ఈశ్వరి గౌతమ్ సేథ్‌ను ఓడించి స్కోరును 1–1తో సమం చేసింది. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్‌లో శ్రావ్య–అనూష 6–4, 6–2తో దీప్షిక–ఈశ్వరిలను ఓడించి ఓయూ జట్టుకు స్వర్ణాన్ని అందించారు. స్నేహకు కాంస్యం అథ్లెటిక్స్ మహిళల 100 మీటర్లలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఆంధ్రప్రదేశ్) అథ్లెట్ ఎస్.ఎస్.స్నేహ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. స్నేహ 12.08 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో ఒడిశాకు చెందిన అంతర్జాతీయ అథ్లెట్ ద్యుతీ చంద్ (కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ) స్వర్ణం గెలిచింది. ద్యుతీ చంద్ 11.49 సెకన్లలో రేసును ముగించి విజేతగా నిలిచింది. ఎస్.ధనలక్ష్మి (11.99 సెకన్లు–మంగళూరు యూనివర్సిటీ) రజత పతకాన్ని దక్కించుకుంది. -
సాత్విక–శ్రావ్య జంటకు రజతం
గువాహటి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో చివరి రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఒక్కో రజత పతకం లభించింది. టెన్నిస్ అండర్–21 బాలికల డబుల్స్ విభాగంలో సామ సాత్విక–శ్రావ్య శివాని జంట రన్నరప్‌గా నిలిచి రజత పతకాన్ని దక్కించుకుంది. ఫైనల్లో సాత్విక–శ్రావ్య శివాని ద్వయం 6–3, 3–6, 7–10తో మిహికా యాదవ్–స్నేహల్ మానె (మహారాష్ట్ర) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. స్విమ్మింగ్‌లో అండర్–21 బాలుర 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ స్విమ్మర్ ఎం.లోహిత్ రజతం సాధించాడు. లోహిత్ 2ని:21.32 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచాడు. బుధవారంతో ముగిసిన ఈ క్రీడల్లో ఓవరాల్‌గా తెలంగాణ 7 స్వర్ణాలు, 6 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి మొత్తం 21 పతకాలు సాధించి 15వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 3 స్వర్ణాలు, 7 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 17 పతకాలతో 22వ స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర 78 స్వర్ణాలు, 77 రజతాలు, 101 కాంస్యాలతో కలిపి మొత్తం 256 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. హరియాణా (68+60+72) మొత్తం 200 పతకాలు నెగ్గి రెండో స్థానంలో... ఢిల్లీ (39+36+47) మొత్తం 122 పతకాలు సాధించి మూడో స్థానంలో నిలిచాయి. -
బ్యాడ్మింటన్ డబుల్స్‌లో విష్ణు–నవనీత్ జంటకు స్వర్ణం
గువాహటి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో మంగళవారం తెలంగాణకు ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం నాలుగు పతకాలు లభించాయి. బ్యాడ్మింటన్ అండర్–21 బాలుర డబుల్స్ విభాగంలో విష్ణువర్ధన్ గౌడ్–బొక్కా నవనీత్ ద్వయం విజేతగా నిలిచి స్వర్ణం సొంతం చేసుకుంది. ఫైనల్లో విష్ణువర్ధన్–నవనీత్ (తెలంగాణ) జంట 18–21, 21–13, 21–15తో మంజిత్–డింకూ సింగ్ (మణిపూర్) జోడీపై గెలిచింది. టెన్నిస్ అండర్–21 బాలుర డబుల్స్ విభాగంలో తీర్థ శశాంక్–గంటా సాయికార్తీక్ (తెలంగాణ) ద్వయం రజతం నెగ్గింది. ఫైనల్లో శశాంక్–సాయికార్తీక్ జోడీ 3–6, 1–6తో పరీక్షిత్ సోమాని–షేక్ ఇఫ్తెకార్ (అస్సాం) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. టెన్నిస్ అండర్–21 బాలికల సింగిల్స్ విభాగంలో సామ సాత్విక (తెలంగాణ) రజతం దక్కించుకుంది. దక్షిణాసియా క్రీడల మహిళల సింగిల్స్ చాంపియన్ అయిన సాత్విక ఫైనల్లో 3–6, 1–6తో వైదేహి చౌదరీ (గుజరాత్) చేతిలో ఓటమి చవిచూసింది. టెన్నిస్ అండర్–17 బాలికల సింగిల్స్‌లో సంజన సిరిమల్ల (తెలంగాణ) కాంస్యం కైవసం చేసుకుంది. కాంస్య పతక పోరులో సంజన 6–0, 7–5తో కుందన (తమిళనాడు)పై గెలిచింది. పతకాల పట్టికలో ప్రస్తుతం తెలంగాణ ఆరు స్వర్ణాలు, మూడు రజతాలు, ఐదు కాంస్యాలతో కలిపి మొత్తం 14 పతకాలతో 15వ స్థానంలో ఉంది. -
ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ల పతకాల పంట
గువాహటి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో సోమవారం ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్లు అదరగొట్టారు. ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం నాలుగు పతకాలను సొంతం చేసుకున్నారు. అండర్–17 బాలుర 81 కేజీల విభాగంలో షేక్ లాల్ బషీర్ (విశాఖపట్నం) స్వర్ణం నెగ్గగా... జి. రవిశంకర్ (డాక్టర్ వైఎస్ఆర్ కడప జిల్లా) రజతం సాధించాడు. లాల్ బషీర్ (స్నాచ్‌లో 112+క్లీన్ అండ్ జెర్క్‌లో 142) మొత్తం 254 కేజీలు బరువెత్తి చాంపియన్‌గా నిలిచాడు. రవిశంకర్ (స్నాచ్‌లో 106+క్లీన్ అండ్ జెర్క్‌లో 143) మొత్తం 249 కేజీలు బరువెత్తి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. అండర్–21 బాలుర 89 కేజీల విభాగంలో ఆదిబోయిన శివరామకృష్ణ యాదవ్ (డాక్టర్ వైఎస్ఆర్ కడప జిల్లా) రజతం గెలిచాడు. శివరామకృష్ణ యాదవ్ (స్నాచ్‌లో 125+క్లీన్ అండ్ జెర్క్‌లో 150) మొత్తం 275 కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచాడు. ఇదే కేటగిరీలో తెలంగాణ వెయిట్‌లిఫ్టర్ హల్వత్ కార్తీక్ మొత్తం 269 కేజీలు బరువెత్తి మూడో స్థానాన్ని సంపాదించి కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. అండర్–17 బాలికల 76 కేజీల విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన చుక్కా శ్రీలక్ష్మి కాంస్య పత కాన్ని సొంతం చేసుకుంది. శ్రీలక్ష్మి మొత్తం 156 కేజీలు బరువెత్తి మూడో స్థానంలో నిలిచింది. అండర్–21 బాలికల బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో శ్రియ సాయి యనమండ్ర–గురజాడ శ్రీవిద్య (తెలంగాణ) జంట కాంస్యం సాధించింది. -
తెలంగాణకు రెండు పతకాలు
గువాహటి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో అండర్ –17 బాలుర వెయిట్‌లిఫ్టింగ్‌లో 73 కేజీల విభాగం లో తెలంగాణ వెయిట్‌లిఫ్టర్ ధనావత్ గణేశ్ రజత పతకం గెలిచాడు. అతను మొత్తం 245 కేజీల బరువెత్తి రెండో స్థానంలో నిలిచాడు. అండర్–17 బాలుర ఖో–ఖోలో తెలంగాణ జట్టుకు కాంస్యం లభిం చింది. అండర్–17 బాలికల వెయిట్‌లిఫ్టింగ్ 64 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్ షేక్ మహబూబా చాంద్ కాంస్య పతకం గెలిచింది. డాక్టర్ వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్ (కడప)కు చెందిన మహబూబా మొత్తం 144 కేజీలు బరువెత్తింది. -
స్విమ్మింగ్‌లో లోహిత్‌కు రజతం
గువాహటి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌కు ఒక రజత పతకం లభించింది. అండర్–21 బాలుర బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్లో ఎం.లోహిత్ రెండో స్థానంలో నిలిచాడు. లోహిత్ 1ని:05.31 సెకన్లలో రేసును పూర్తి చేసి రజతాన్ని దక్కించుకున్నాడు. ధనుష్ (తమిళనాడు–1ని:03.71 సెకన్లు) స్వర్ణం, వరుణ్ పటేల్ (మధ్యప్రదేశ్–1ని:08.51 సెకన్లు) కాంస్యం సాధించారు. మరోవైపు అండర్–17 బాలుర ఖో–ఖో ఈవెంట్లో తెలంగాణ జట్టు సెమీఫైనల్ చేరింది. క్వార్టర్ ఫైనల్లో తెలంగాణ 20–16తో ఛత్తీస్‌గఢ్‌పై గెలిచింది. టెన్నిస్‌లో తెలంగాణ క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. అండర్–17 బాలికల తొలి రౌండ్లో సంజన సిరిమల్ల 6–3, 6–1తో పరీ సింగ్ (హరియాణా)పై నెగ్గింది. అండర్–21 బాలికల తొలి రౌండ్లో సామ సాత్విక 6–0, 6–0తో శ్రుతి (డామన్ డయ్యూ)పై గెలుపొందగా... శ్రావ్య శివాని 0–6, 2–6తో సందీప్తి రావు (హరియాణా) చేతిలో ఓడింది. అండర్–21 బాలుర డబుల్స్ మ్యాచ్‌లో తీర్థ శశాంక్–గంటా సాయికార్తీక్ (తెలంగాణ) ద్వయం 6–1, 6–7, 10–5తో ‘సూపర్ టైబ్రేక్’లో దివేశ్–నితిన్ (హరియాణా) జంటపై గెలిచింది. -
తెలంగాణ ‘పసిడి’ పంట
గువాహటి: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు స్వర్ణ పతకాలతో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో మంగళవారం తెలంగాణ క్రీడాకారులు అదరగొట్టారు. అండర్–21 బాలుర టేబుల్ టెన్నిస్ (టీటీ) సింగిల్స్ విభాగంలో సూరావజ్జుల స్నేహిత్ చాంపియన్‌గా అవతరించగా... అండర్–21 బాలుర సైక్లింగ్ టైమ్ ట్రయల్ ఈవెంట్లో తని‹Ù్క గౌడ్... అథ్లెటిక్స్‌లో అండర్–17 బాలికల 200 మీటర్లలో జీవంజి దీప్తి... అండర్–17 బాలికల 100 మీటర్ల హర్డిల్స్‌లో అగసార నందిని పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. టీటీ ఫైనల్స్‌లో స్నేహిత్ 9–11, 12–10, 12–10, 5–11, 11–8, 11–6తో రీగన్ అల్బుక్యూర్క్యూ (మహారాష్ట్ర)ను ఓడించి స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. సైక్లింగ్ ఒక కిలోమీటర్ టైమ్ ట్రయల్ ఈవెంట్లో తనిష్క్ ఒక నిమిషం 08.352 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచాడు. కెంగలగుట్టి వెంకప్ప (కర్ణాటక) రజతం, గుర్ప్రీత్ సింగ్ (పంజాబ్) కాంస్యం గెలిచారు. ఇంతకుముందు లాంగ్‌జంప్‌లో స్వర్ణం నెగ్గిన నందిని 100 మీటర్ల హర్డిల్స్‌లో 14.07 సెకన్లలో గమ్యానికి చేరి చాంపియన్‌గా నిలిచింది. ప్రాంజలి పాటిల్ (మహారాష్ట్ర–14.57 సెకన్లు) రజతం, ప్రియా గుప్తా (మహారాష్ట్ర–14.57 సెకన్లు) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలిచారు. ప్రాంజలి, ప్రియా ఒకే సమయంలో రేసు ముగించగా... ఫొటో ఫినిష్ ద్వారా రజత, కాంస్య పతకాలను నిర్ణయించారు. ఈ క్రీడల్లోనే 100 మీటర్లలో పసిడి సొంతం చేసుకున్న దీప్తి మంగళవారం 200 మీటర్లలోనూ చిరుతలా దూసుకుపోయింది. 24.84 సెకన్లలో రేసును పూర్తి చేసి దీప్తి చాంపియన్‌గా నిలిచింది. పాయల్ (ఢిల్లీ–24.87 సెకన్లు) రజతం, సుదేష్ణ (మహారాష్ట్ర–25.24 సెకన్లు) కాంస్యం సాధించారు. తెలంగాణ 6 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి మొత్తం 10 పతకాలతో 11వ స్థానంలో ఉంది. యశ్వంత్‌కు స్వర్ణం... ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో మంగళవారం ఆంధ్రప్రదేశ్ పసిడి బోణీ చేసింది. అండర్–21 బాలుర 110 మీటర్ల హర్డిల్స్‌లో లావేటి యశ్వంత్ కుమార్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. యశ్వంత్ 14.10 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచాడు. అండర్–21 బాలికల హైజంప్‌లో జీజీ జార్జి స్టీఫెన్ (ఆంధ్రప్రదేశ్–1.60 మీటర్లు) కాంస్యం... అండర్–21 బాలుర ట్రిపుల్ జంప్ గెయిలీ వెనిస్టర్ (ఆంధ్రప్రదేశ్–15.51 మీటర్లు) కాంస్యం సాధిం చారు. ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణం, ఒక రజతం, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఐదు పతకాలతో 24వ స్థానంలో ఉంది. -
నందిని ‘పసిడి జంప్’
గువాహటి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ పసిడి బోణీ చేసింది. శనివారం జరిగిన అథ్లెటిక్స్ ఈవెంట్ అండర్–17 బాలికల లాంగ్‌జంప్ విభాగంలో తెలంగాణ అమ్మాయి అగసార నందిని స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన నందిని 5.65 మీటర్ల దూరం దూకి అగ్రస్థానాన్ని దక్కించు కుంది. నందిని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం విద్యార్థిని. నిర్మా అసారి (గుజరాత్–5.62 మీటర్లు) రజతం... అభిరామి (కేరళ–5.47 మీటర్లు) కాంస్యం సాధించారు. అండర్–17 బాలికల 400 మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కుంజా రజిత రజత పతకం సాధించింది. రజిత 57.61 సెకన్లలో గమ్యానికి చేరింది.