
గువాహటి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ జిమ్నాస్ట్ సురభి ప్రసన్న మూడు పతకాలు సాధించింది. శుక్రవారం జరిగిన అండర్–17 బాలికల మూడు ఈవెంట్‌లలో సురభి రెండు రజతాలు, ఒక కాంస్యం సాధించింది.
ఆల్ అరౌండ్ వ్యక్తిగత విభాగంలో సురభి 39.85 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకోగా... టేబుల్ వాల్ట్, బ్యాలెన్సింగ్ బీమ్ ఈవెంట్స్‌లో ఆమె రెండో స్థానంలో నిలిచి రెండు రజత పతకాలను సొంతం చేసుకుంది.