గువాహటి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌కు ఒక రజత పతకం లభించింది. అండర్–21 బాలుర బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్‌లో ఎం.లోహిత్ రెండో స్థానంలో నిలిచాడు. లోహిత్ 1ని:05.31 సెకన్లలో రేసును పూర్తి చేసి రజతాన్ని దక్కించుకున్నాడు. ధనుష్ (తమిళనాడు–1ని:03.71 సెకన్లు) స్వర్ణం, వరుణ్ పటేల్ (మధ్యప్రదేశ్–1ని:08.51 సెకన్లు) కాంస్యం సాధించారు. మరోవైపు అండర్–17 బాలుర ఖో–ఖో ఈవెంట్‌లో తెలంగాణ జట్టు సెమీఫైనల్ చేరింది.
క్వార్టర్ ఫైనల్లో తెలంగాణ 20–16తో ఛత్తీస్‌గఢ్‌పై గెలిచింది. టెన్నిస్‌లో తెలంగాణ క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. అండర్–17 బాలికల తొలి రౌండ్‌లో సంజన సిరిమల్ల 6–3, 6–1తో పరీ సింగ్ (హరియాణా)పై నెగ్గింది. అండర్–21 బాలికల తొలి రౌండ్‌లో సామ సాత్విక 6–0, 6–0తో శ్రుతి (డామన్ డయ్యూ)పై గెలుపొందగా... శ్రావ్య శివాని 0–6, 2–6తో సందీప్తి రావు (హరియాణా) చేతిలో ఓడింది. అండర్–21 బాలుర డబుల్స్ మ్యాచ్‌లో తీర్థ శశాంక్–గంటా సాయికార్తీక్ (తెలంగాణ) ద్వయం 6–1, 6–7, 10–5తో ‘సూపర్ టైబ్రేక్’లో దివేశ్–నితిన్ (హరియాణా) జంటపై గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment