
సాక్షి, అమరావతి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో ఆంధ్రప్రదేశ్ ఖాతాలో రెండో స్వర్ణ పతకం చేరింది. అండర్–18 బాలుర వెయిట్‌లిఫ్టింగ్ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్.గురు నాయుడు పసిడి పతకం సాధించాడు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ క్రీడల్లో సోమవారం 55 కేజీల విభాగంలో గురు నాయుడు మొత్తం 227 కేజీల బరువెత్తి అగ్ర స్థానంలో నిలిచాడు. టామ్చౌ మీటీ (మణిపూర్) రజతం, విజయ్ ప్రజాపతి (మధ్యప్రదేశ్) కాంస్య పతకం గెలుపొందారు. ప్రస్తుతం పతకాల పట్టికలో ఆంధ్రప్రదేశ్ 2 స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఆరు పతకాలతో 15వ స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment