Guru Naidu
-
Khelo India Youth Games: ‘పసిడి’ నెగ్గిన గురునాయుడు
సాక్షి, అమరావతి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో ఆంధ్రప్రదేశ్ ఖాతాలో రెండో స్వర్ణ పతకం చేరింది. అండర్–18 బాలుర వెయిట్‌లిఫ్టింగ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్.గురు నాయుడు పసిడి పతకం సాధించాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ క్రీడల్లో సోమవారం 55 కేజీల విభాగంలో గురు నాయుడు మొత్తం 227 కేజీల బరువెత్తి అగ్ర స్థానంలో నిలిచాడు. టామ్చౌ మీటీ (మణిపూర్) రజతం, విజయ్ ప్రజాపతి (మధ్యప్రదేశ్) కాంస్య పతకం గెలుపొందారు. ప్రస్తుతం పతకాల పట్టికలో ఆంధ్రప్రదేశ్ 2 స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఆరు పతకాలతో 15వ స్థానంలో ఉంది. -
National Youth Weightlifting Championship: స్వర్ణం నెగ్గిన గురు
చెన్నై: జాతీయ యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శనపతి గురు నాయుడు స్వర్ణ పతకాన్ని సాధించాడు. శుక్రవారం జరిగిన యూత్ పురుషుల 55 కేజీల విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన 16 ఏళ్ల గురు నాయుడు మొత్తం 233 కేజీలు (స్నాచ్‌లో 104+క్లీన్ అండ్ జెర్క్‌లో 129) బరువెత్తి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఏడాది మెక్సికోలో జరిగిన ప్రపంచ యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో గురునాయుడు 55 కేజీల విభాగంలో మొత్తం 230 కేజీలు బరువెత్తి బంగారు పతకం సాధించాడు. తాజాగా జాతీయ టోర్నీలో అతను అదనంగా మరో మూడు కేజీలు ఎక్కువ బరువెత్తడం విశేషం. -
World Youth Weightlifting Championship: భళా గురు...
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అంతర్జాతీయ క్రీడా వేదికపై మరోసారి తెలుగు తేజం మెరిసింది. ప్రపంచ యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ కుర్రాడు శనపతి గురునాయుడు పసిడి పతకంతో అదరగొట్టాడు. గురునాయుడు ప్రతిభతో ఈ టోర్నీలో భారత్‌కు బంగారు పతకాల బోణీ లభించింది. మెక్సికోలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో విజయనగరం జిల్లాకు చెందిన 16 ఏళ్ల గురునాయుడు బాలుర 55 కేజీల విభాగంలో విజేతగా నిలిచాడు. స్నాచ్‌లో 104 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 126 కేజీలు బరువెత్తి ఓవరాల్‌గా 230 కేజీలతో గురునాయుడు అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. సౌదీ అరేబియా లిఫ్టర్ మాజీద్ అలీ (229 కేజీలు; స్నాచ్‌లో 105+క్లీన్ అండ్ జెర్క్‌లో 124) రజతం... కజకిస్తాన్ లిఫ్టర్ యెరాసిల్ ఉమ్రోవ్ (224 కేజీలు; స్నాచ్‌లో 100+క్లీన్ అండ్ జెర్క్‌లో 124) కాంస్యం సాధించారు. ఈ చాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు భారత్ నాలుగు పతకాలు సాధించింది. బాలికల 45 కేజీల విభాగంలో మహారాష్ట్రకు చెందిన సౌమ్య కాంస్యం గెలిచింది. సౌమ్య స్నాచ్‌లో 65 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 83 కేజీలు బరువెత్తి ఓవరాల్‌గా 148 కేజీలతో మూడో స్థానంలో నిలి చింది. ఆకాంక్ష (40 కేజీలు), విజయ్ ప్రజాపతి (49 కేజీలు) రజత పతకాలు గెలిచారు. ‘లిఫ్ట్’ చేస్తే పతకమే... వేదిక ఏదైనా బరిలోకి దిగితే గురునాయుడు పతకంతోనే తిరిగొస్తున్నాడు. తాష్కెం ట్లో జరిగిన 2020 ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో గురు 49 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించాడు. అంతకుముందు 2019లో తాష్కెంట్‌లోనే జరిగిన ఆసియా యూత్ క్రీడల్లో రజతం గెలిచాడు. గత మూడేళ్లుగా జాతీయస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో గురు పసిడి పతకాల పంట పండిస్తున్నాడు. 2020లో బుద్ధగయలో జాతీయ పోటీల్లో అతను స్వర్ణం సాధించడంతోపాటు ఐదు రికార్డులు నెలకొల్పాడు. 2021లో పంజాబ్‌లో, ఈ ఏడాది జనవరిలో భువనేశ్వర్‌లో జరిగిన జాతీయ పోటీల్లో గురునాయుడు బంగారు పతకాలు గెలిచాడు. ‘ఒలింపిక్స్ క్రీడల్లో పతకం సాధించడం, సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విజేతగా నిలిచి ఐఏఎస్ అధికారి కావడం తన జీవిత లక్ష్యాలు’ అని సోమవారం మెక్సికో నుంచి ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ గురునాయుడు పేర్కొన్నాడు. తండ్రి కలను నిజం చేస్తూ... గురునాయుడు స్వస్థలం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని చంద్రంపేట. అతని తండ్రి రామస్వామి గ్రామీణ క్రీడల్లో రాణించేవారు. ఆ రోజుల్లోనే బాడీబిల్డర్‌గా, వెయిట్‌లిఫ్టర్‌గా పేరుపొందారు. పేదరికం వల్ల తన అభిరుచికి మధ్యలోనే స్వస్తి పలకాల్సి వచ్చింది. తన ముగ్గురు కుమారుల్లో చిన్నవాడైన గురునాయుడిని మాత్రం వెయిట్‌లిఫ్టర్‌గా చేయాలని తపించారు. తన ఆశయాన్ని తన కుమారుడి ద్వారా సాధించాలనే లక్ష్యంతో విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని కొండవెలగాడ గ్రామానికి చెందిన చల్లా రాము వద్ద శిక్షణకు పంపించారు. అలా వెయిట్‌లిఫ్టింగ్‌లో ఓనమాలు దిద్దిన గురునాయుడు సికింద్రాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఆర్మీ స్కూల్లో సీటు సాధించాడు. సీబీఎస్ఈ పదో తరగతిలో ‘ఎ’ గ్రేడ్‌తో ఉత్తీర్ణుడయ్యాడు. అక్కడే ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతూ కోచ్ దేవా వద్ద శిక్షణ పొందుతున్నాడు. తమ కుమారుడు గురునాయుడు సాధించిన విజయంతో తల్లిదండ్రులైన రామస్వామి, పాపయ్యమ్మ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. -
వలస బతుకులపై మృత్యువల
విజయనగరం క్రైం/కంటోన్మెంట్: ఊరిగాని ఊరు వెళ్లారు. పొట్టకూటి కోసం దూర ప్రాంతానికి సైతం లెక్కచేయకుండా జీవన గడపటానికి వెళ్లారు. కష్టపడి సంపాదించిన సొమ్ముతో పిల్ల పాపలను చక్కగా చూసుకోవాలని భావించారు. ఇంతలో విధి వక్రీకరించింది. పొట్టకూటికోసం ఇతర రాష్ట్రానికి వెళ్లిన వారిని భవనం మింగేసింది. వారు నిర్మిస్తున్న భవనం కింద కొందరు సజీవసమాధి అయ్యారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక్ష సాక్షి గురునాయుడు కథనం ప్రకారం.. చెన్నైలోని మాన్ఘాడ్లో బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. జిల్లాకు చెందిన అనేకమంది వలస కూలీలుగా చెన్నె వెళ్లారు. శనివారం కూడా భవన నిర్మాణ పనులు యథావిధిగా నిర్వహించారు. సాయంత్రం వర్షం పడడంతో సుమారు 200మంది కూలీలు భవనం కింద కూర్చున్నారు. ఇంతలో ఒ క్కసారిగా పెద్దశబ్దం వచ్చింది. పిడుగుపడిందేమోనని మొదట భావిం చారు.తేరుకుని చూసేలోపే జరగరాని ఘోరం కళ్ల ముందు ప్రత్యక్షమైంది. నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మ క్కువ మండలం తూరు మామిడికి చెందిన తిరుపతిరావు, సీర స త్యనారాయణ, సీర జయమ్మ(వీరిద్దరూ భార్యాభర్తలు), దత్తిరాజేరు మండలం మంత్రి మైనమ్మ, కర్రిపైడిమ్మ, సిరిపురం రాము, పేకేటి అ ప్పలరాజు, పేకేటి లక్ష్మి, పతివాడ బంగారునాయుడు, వనం దుర్గ, పతివాడ గౌరీశ్వరి, పతివాడ చిలకడు, కర్రి అప్పలనాయుడు, పేకేటి సూర్యారావు, సారికి పాపినాయుడు, పతివాడ కృష్ణారావు, సామాల జనార్దన్, సామాల లక్ష్మి, బాడంగి గ్రామానికి చెందిన భార్య భర్తలు గౌరినాయుడు, అనసూయ, మరో మహిళ శాంతికుమారి కుప్పకూలిన భవనం కింద పడి చిక్కుకున్నారు. ఇంకా అనేకమంది చిక్కుకున్నట్లు సమాచారం. ప్రతి ఏడాది అనేకమంది భవన నిర్మాణ కార్మికులు పనులు కోసం వెళ్తుంటారు. దత్తిరాజేరు మండలం కె. కృష్ణాపురం గ్రామానికి చెందిన వంద కుటుంబాలు చెన్నైలో కూలి పనుల కోసం వెళ్లాయి. ప్రతి ఏడాదీ గ్రామానికి చెందిన అనేక కుటుంబాలు కూలి పనుల కోసం వెళ్లి వస్తుంటాయి. చెన్నైలో పనిచేయగా వచ్చిన డబ్బు తో పిల్లలను చదివించుకోవడం, అప్పులు తీర్చడం చేస్తుంటారు. మృ తుల్లో కొంత మంది పదిహేను రోజుల క్రితం వెళ్లినట్లు సమాచారం. ఇంతమంది మృత్యువాత పడడం ఇదే మొదటిసారి.. ఇతర రాష్ట్రాల్లో కూలిపనుల కోసం వెళ్లి ఎక్కువమంది మృతిచెందడం ఇదే మొదటిసారిగా చెప్పుకోవచ్చు. భవనం కిందపడి 14మంది వరకు మృత్యువాతపడడం, అనేమమంది శిధిలాల్లో చిక్కుకోవడం జరిగింది. చెన్నైలో కూలికోసం వెళ్లి లారీ బోల్తాపడి శృంగవరపుకోట మండలం ఎస్.కోట తలారి గ్రామానికి చెందిన పిల్లల గురువులు మృతిచెందాడు. కూలికోసం కాకపోయిన కేరళ రాష్ట్రంలో బస్సు లోయలోపడి జిల్లాలోని సాలూరు ప్రాంతానికి చెందిన ఆరుగురు అయ్యప్పస్వామి భక్తులు మృతిచెందారు.