వలస బతుకులపై మృత్యువల | Chennai building collapse 14 poples died | Sakshi
Sakshi News home page

వలస బతుకులపై మృత్యువల

Published Sun, Jun 29 2014 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 9:31 AM

వలస బతుకులపై మృత్యువల

వలస బతుకులపై మృత్యువల

విజయనగరం క్రైం/కంటోన్మెంట్: ఊరిగాని ఊరు వెళ్లారు. పొట్టకూటి కోసం దూర  ప్రాంతానికి సైతం లెక్కచేయకుండా జీవన గడపటానికి వెళ్లారు. కష్టపడి సంపాదించిన సొమ్ముతో పిల్ల పాపలను చక్కగా  చూసుకోవాలని భావించారు. ఇంతలో విధి వక్రీకరించింది.  పొట్టకూటికోసం  ఇతర రాష్ట్రానికి  వెళ్లిన వారిని భవనం మింగేసింది. వారు నిర్మిస్తున్న భవనం కింద కొందరు సజీవసమాధి అయ్యారు.  మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు.  ఇందుకు సంబంధించి ప్రత్యేక్ష సాక్షి గురునాయుడు కథనం ప్రకారం.. చెన్నైలోని మాన్‌ఘాడ్‌లో  బహుళ అంతస్తుల   భవనాన్ని  నిర్మిస్తున్నారు.   జిల్లాకు చెందిన అనేకమంది వలస కూలీలుగా చెన్నె వెళ్లారు.
 
 శనివారం కూడా భవన నిర్మాణ  పనులు యథావిధిగా నిర్వహించారు. సాయంత్రం వర్షం పడడంతో సుమారు 200మంది కూలీలు భవనం కింద కూర్చున్నారు. ఇంతలో ఒ క్కసారిగా పెద్దశబ్దం వచ్చింది. పిడుగుపడిందేమోనని మొదట భావిం చారు.తేరుకుని చూసేలోపే జరగరాని ఘోరం కళ్ల ముందు ప్రత్యక్షమైంది. నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో    మ క్కువ మండలం తూరు మామిడికి చెందిన తిరుపతిరావు, సీర స త్యనారాయణ, సీర జయమ్మ(వీరిద్దరూ భార్యాభర్తలు),  దత్తిరాజేరు మండలం మంత్రి మైనమ్మ, కర్రిపైడిమ్మ, సిరిపురం రాము, పేకేటి అ ప్పలరాజు, పేకేటి లక్ష్మి, పతివాడ బంగారునాయుడు, వనం దుర్గ, పతివాడ గౌరీశ్వరి, పతివాడ చిలకడు, కర్రి అప్పలనాయుడు, పేకేటి సూర్యారావు, సారికి పాపినాయుడు, పతివాడ కృష్ణారావు,
 
 సామాల  జనార్దన్, సామాల లక్ష్మి,  బాడంగి గ్రామానికి చెందిన  భార్య భర్తలు గౌరినాయుడు, అనసూయ, మరో మహిళ శాంతికుమారి కుప్పకూలిన భవనం కింద పడి చిక్కుకున్నారు. ఇంకా అనేకమంది చిక్కుకున్నట్లు సమాచారం. ప్రతి ఏడాది అనేకమంది భవన నిర్మాణ కార్మికులు పనులు కోసం వెళ్తుంటారు. దత్తిరాజేరు మండలం కె. కృష్ణాపురం గ్రామానికి చెందిన వంద కుటుంబాలు చెన్నైలో కూలి పనుల కోసం వెళ్లాయి. ప్రతి ఏడాదీ గ్రామానికి చెందిన అనేక కుటుంబాలు కూలి పనుల కోసం వెళ్లి వస్తుంటాయి. చెన్నైలో పనిచేయగా వచ్చిన డబ్బు తో పిల్లలను చదివించుకోవడం, అప్పులు తీర్చడం చేస్తుంటారు. మృ తుల్లో కొంత మంది పదిహేను రోజుల క్రితం వెళ్లినట్లు సమాచారం.
 
 ఇంతమంది మృత్యువాత  పడడం ఇదే  మొదటిసారి..
 ఇతర రాష్ట్రాల్లో కూలిపనుల కోసం వెళ్లి  ఎక్కువమంది మృతిచెందడం ఇదే మొదటిసారిగా చెప్పుకోవచ్చు. భవనం కిందపడి 14మంది వరకు మృత్యువాతపడడం, అనేమమంది శిధిలాల్లో చిక్కుకోవడం జరిగింది.  చెన్నైలో కూలికోసం వెళ్లి లారీ బోల్తాపడి శృంగవరపుకోట మండలం ఎస్.కోట తలారి గ్రామానికి చెందిన పిల్లల గురువులు మృతిచెందాడు.  కూలికోసం కాకపోయిన కేరళ రాష్ట్రంలో బస్సు లోయలోపడి జిల్లాలోని  సాలూరు ప్రాంతానికి చెందిన ఆరుగురు అయ్యప్పస్వామి భక్తులు  మృతిచెందారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement