Chennai building collapse
-
చెన్నై బాధితులకు వైఎస్ఆర్సీపీ చేయూత
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వెళ్లి తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, తిరువళ్లూరులలో భవ నం, గోడ కూలిన ఘటనల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్సీపీ తరపున ఆర్థిక సహాయం అందజేశారు. పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి రెండు రోజుల క్రితం జిల్లాలో పర్యటించి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యుల స్థితిగతులను తెలుసుకున్న జగన్మోహనరెడ్డి పార్టీ తరపున ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు జిల్లా నాయకులు ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం, దువ్వాడ శ్రీనివాస్, రెడ్డి శాంతి, ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, విశ్వసరాయి కళావతిలు శని, ఆదివారాల్లో బాధితుల ఇళ్లకు వెళ్లి ఆర్థిక సాయం అందజేశారు. మృతుల కుటుంబ సభ్యులతో పాటు క్షతగాత్రులకు కూడా పార్టీ తరపున సాయం అందించారు. ఆదివారం బూర్జ మండలం కొల్లివలసకు చెందిన కర్రి సింహాచలం, సెనగల పెంటయ్య, ఇదే మండలంలోని టీఆర్ రాజు పేటకు చెందిన కొయ్యాన జయమ్మ, హిరమండలం మండలం గొట్ట గ్రామానికి చెందిన కొంగరాపు శ్రీనివాస్, మీసాల శ్రీనివాసరావు, మీసాల భవానీ, పెసైక్కి జ్యోతి, ఎల్‌ఎన్‌పేట మండలం ఎల్.ఎన్‌పేట గ్రామానికి చెందిన తాన్ని అప్పలనర్సమ్మ, మోదుగులవలస గ్రామానికి చెందిన దుక్క తవుడు, కొత్తూరు మండలం ఇరపాడు గ్రామానికి చెందిన అమలాపురం రాజేష్, అమలాపురం రమేష్, కిమిడి సుబ్బారావుల కుటుంబ సభ్యులకు రూ.75 వేలు చొప్పున, హిరమండలం మండలం గొట్టా గ్రామానికి చెందిన క్షతగాత్రులైన కొంగరాపు కృష్ణవేణి, బూర్జ మండలం కొల్లివలసకు చెందిన సెలగల నాగరాజులకు రూ.20 వేలు చొప్పున అందించారు. మెళియాపుట్టి మండలం పట్టుపురం గ్రామానికి చెందిన సవర భీమారావుకు ప్రమాదంలో నడుం విరిగిపోయిందని, కొత్తూరు మండలం ఇరపాడుకు చెందిన అనుపోజు దివ్య అనే చిన్నారి అనాథగా మిగిలిందని బంధువులు జగన్మోహనరెడ్డి దృష్టికి తేవడంతో ఆయన ఆదేశాల మేరకు వారికి కూడా రూ. 20వేలు చొప్పున అందజేశారు. కాగా శనివారం కోటబొమ్మాళి మండలం పాకివలసకు చెందిన ముద్దపు శ్రీనివాసరావు, చుట్టిగుండం గ్రామానికి చెందిన దేవర సిమ్మయ్య, దేవర లక్ష్మీకాంతం, దేవర అప్పయ్య, దేవర లక్ష్మి, దేవర జగదీష్‌లకు, నరసన్నపేట మండలం బాలసీమకు చెందిన దువ్వారపు పద్మ, సారవకోట మండలం సత్రాం గ్రామానికి చెందిన ఇద్దుబోయిన రాము కుటుంబ సభ్యులకు రూ.75వేలు చొప్పున అందజేశారు. సోమవారం భామిని మండలం కొరమ గ్రామానికి చెందిన దాసరి కళావతి, దాసరి రాము, పాలకొండ కు చెందిన ఊల రవి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. -
సంగోరు రాత్రేళ.. మృత్యు హేల!
బూర్జ, ఆమదాలవలస: సంగోరు రాత్రి గడిసింది. అంతలోనే పెద్ద శబ్దంతో గోడ కూలిపోనాది. మా బతుకులను కూల్చేసినాది. అని తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో గోడ కూలిన ఘటనలో మృతి చెందిన సెలగల పెంటయ్య కుటుంబ సభ్యులు విలపించారు. గురువారం వారిని పరామర్శించేందుకు కొల్లివలస వచ్చిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సంఘటన వివరాలు తెలుసుకుని వారి తరఫున పోరాడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాధితులు, జగన్ మధ్య సంభాషణ ఇలా సాగింది. జగన్: ప్రమాదం ఎలా జరిగింది? నాగరాజు: (పెంటయ్య కుమారుడు, ఈ ప్రమాదంలో గాయాలతో బయటపడ్డాడు) శనివారం పనిచేశాం. పేమెంట్ అందుకున్నాం. అన్నం తినేసాం. గుడిసెల్లోకి ఎళ్లి పడుకున్నాం. సంగోరు రాత్రిలో 20 అడుగుల గోడ ఒక్కసారి పెద్ద శబ్డంతో కూలిపోయింది. జగన్: అప్పుడు ఎంత మంది ఉన్నారు? నాగరాజు: మొత్తం 12 మందిపైన పడింది. అందరూ సనిపోయారు. నేనే మిగిలాను. బుర్రకు దెబ్బ తగలడంతో 5 రోజులు ఆస్పత్రిలో ఉన్నాను. జగన్: చెన్నైకే ఎందుకు పనికి వెళ్తున్నారు? పెంటమ్మ(మృతుని భార్య): నాకు ఇద్దరు పిల్లలు బాబు. సిన్నోడు మూడు చదివినాడు, పెద్దోడు సదవలేదు. మేస్త్రీ పనిచేస్తున్నాడు. మండలంలో ఉపాధి పనులు జరగడంలేదు. రెండు పూటలా పనికెళ్తే వందలోపే వస్తాంది. ఎటుకీ చాలడంలేదు. అందుకే ఏటా పనికెల్తాం. ఈసారి అదే కొంప ముంచింది. భర్తను మృత్యువు తీసుకుపోరుుందంటూ కన్నీరు పెట్టింది. జగన్: గోడ ఓనరుపై కేసు వేయగలరేమో కనుక్కోండి. పార్టీ తరఫున తమ్మినేని సీతారాం మీ వెంట ఉంటారు. ఈ ఘటనపై న్యాయపరంగా పోరాడి యజమాని నుంచి మీకేమైనా వచ్చేందుకు మా ప్రయత్నం చేస్తాం? పెంటమ్మ: అలాగే బాబూ, అక్కడ చేసిన పనికి స్లిప్పులు ఇచ్చినారు. ఆ డబ్బులు ఇవ్వలేదు. జగన్: నాగరాజూ చదువుకుంటావా? నాగరాజు: చదవలేను. పెంటమ్మ: విడో పింఛన్ ఇప్పించండి బాబూ.. జగన్: వచ్చేలా చూస్తానమ్మా. కొత్తగా పింఛన్లు ఏమైనా ఇస్తున్నారా? బాధితులు: లేవు బాబూ.. అన్నీ నాన్న వై.ఎస్. పెట్టినవే ఉన్నాయి. -
పులకించిన పల్లె
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:తమ వారిని పోగొట్టుకొని పుట్టెడు బాధలో ఉన్న చెన్నై బాధిత కుటుంబాలకు తానున్నానని హామీలభిం చింది. తమ కష్టాలను ఎవరితో చెప్పుకుం దామా అని ఎదురుచూస్తున్న సమయంలో ఒక ఆశా దీపం వారి కళ్లల్లో కనిపిం చడంతో వారి మోము లు వికసించాయి. రెండు రోజుల పర్యటన నిమిత్తం శ్రీకాకుళం జిల్లా కు చేరుకున్న వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చెన్నై బాధిత కుటుంబా ల్లో ఆనందం నింపారు. బుధవారం రాత్రి జిల్లాసరిహద్దులో ప్రవేశించిన ఆయన గురువారం ఉదయం ఆమదాలవలస, పాల కొండ, పాతపట్నం నియోజకవర్గాల్లో పర్యటించి అక్కడి వారిని ఓదార్చారు. బూర్జ, పాలకొండ, ఎల్.ఎన్.పేట, హిరమండలం, కొత్తూరు మండలాల్లో పర్యటించారు. జగన్‌ను చూసిన గ్రామీణ ప్రాంత ప్రజలు పులకించిపోయారు. చాన్నాళ్ల తర్వాత తమ నాయకుడు రావడం తో పల్లె ప్రజలు కళ్లల్లో ఒత్తులేసుకొని ఎదురుచూశారు. ఇటీవల చెన్నైలో చోటు చేసుకున్న రెండు వేర్వేరు దుర్ఘటనలో జిల్లాకు చెందిన 24 మంది మృతి చెందారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ గురువారం ఉదయం ఆమదాలవలసలో పార్టీ నేత తమ్మినేని సీతారాం నివాసగృహం నుంచి బూర్జ మండలం వైపు బయలుదేరి ఆ మండలంలో మూడు కుటుంబాలను పరామర్శించారు. అనంతరం పాల కొండలో ఊల రవి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఎల్.ఎన్.పేట, కొత్తూరు, హిరమండలం మండలాల్లో బాధిత కుటుంబాలను పరామర్శించి వారి కష్టాలను ఓపిగ్గా విన్నారు. సంఘటన ఎలా జరిగింది, కుటుంబ సభ్యు ల వివరాలు, భవిష్యత్తులో వారికి ఏమైనా అండ లభిస్తుందా, ప్రభుత్వం ప్రోత్సాహం ఏమైనా ఇచ్చిందా అని ఆరా తీశారు. భవిష్యత్తులో పార్టీ తరఫున, తమ కుటుం బం తరఫున పూర్తి సహకారం లభిస్తుందని హామీనిచ్చారు. సాక్షాత్తూ జగనే తమ ఇళ్లకు రావడంతో బాధిత కుటుంబాలు హర్షిం చాయి. తమవాడేనన్న భావన కల్పించడంతో మరింత ఉప్పొం గిపోయారు. తమ కష్టాలను ఆయనకు చెప్పుకున్నారు. కష్టాలు చెప్పుకున్న మహిళలు.. జగన్ పర్యటించిన అన్ని ప్రాంతాల్లోనూ రైతులు, మహిళలు తమ కష్టాలను చెప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ రుణమాఫీ అం టూ గద్దెనెక్కి ఇప్పుడు రీషెడ్యూల్ అంటూ తప్పుడు ప్రకటనలు చేయడంతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళా సంఘాల పట్ల ప్రభుత్వం ఉదాసీనత వ్యక్తం చేయడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనం ప్రతిపక్షంలో ఉన్నామని, రానున్న రెండు నెలల్లో అసెంబ్లీలో రాష్ట్ర ప్రజల కష్టాలపై గట్టిగా వాదిస్తానని జగన్ వారికి హామీనిచ్చారు. పర్యటించిన అన్ని ప్రాంతాల్లోనూ పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా జగన్‌తో చేతులు కలిపేందుకు ప్రయత్నించారు. ఆయన మోములో చిరు నవ్వును చూసి అచ్చం నాన్నలాగే ఉన్నావంటూ ఆనంద పడ్డారు. మా కష్టాలు నువ్వే చూడాలంటూ సమస్యలు వివరించే ప్రయత్నం చేశారు. జగన్ పర్యటించిన అన్ని ప్రాంతాల్లోనూ అటు పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఉత్సాహం కల్పించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నరసన్నపేటతో పాటు పలు మండలాల్లో జగన్ పర్యటన కొనసాగనున్నట్టు నేతలు తెలిపారు. జగన్ రాకను తెలుసుకున్న గ్రామస్తులు రోడ్డుకిరువైపులా నిలబడి ఆశగా ఎదురుచూశారు. హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలతో రహదారులు నింపేశారు. వయస్సు తారతమ్యం లేకుండా అన్ని వర్గాల వారు జగనన్నకు హారతులు పట్టారు. హాస్టల్ విద్యార్థులు తాము తింటున్న భోజనం ఇదేనంటూ రుచి చూపించారు. జగన్ బాధపడుతూ ఇలాంటి అన్నం తింటున్నారా అంటూ ఆవేదన చెందారు. వృద్ధుల తల నిమిరారు. అక్క, చెల్లెళ్లను ఓదార్చారు. కొన్ని ప్రాం తాల్లో వర్షం వస్తున్నా లెక్క చేయకుండా జిల్లా ప్రజలు జగన్ కోసం ఎదురుచూశా రు. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా క్యూ కట్టారు. మొత్తానికి జగన్ పర్యటన చెన్నై బాధిత కుటుంబాల్లో వెలుగులు నింపింది. జగన్ పర్యటనలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, కేంద్ర పాలకమండలి సభ్యుడు పాలవలస రాజశేఖరం, ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, కలమట వెంకటరమణ, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పార్టీ జిల్లా స్థాయి నాయకులు తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతి, పిరియా సాయిరాజ్, అంధవరపు సూరిబాబు, వరుదు కల్యాణి, మామిడి శ్రీకాంత్, పాలవలస విక్రాంత్, కరణం ధర్మశ్రీ, విశాఖ, విజయనగరం జిల్లాల నేతలు పాల్గొన్నారు. జగన్ పర్యటించిన చోట ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు ఘనంగా స్వాగతించారు. శ్రీకాకుళం చేరుకున్న జగన్ తొలిరోజు పర్యటన ముగించుకున్న జగన్గురువారం అర్ధరాత్రి 12.15 గంటల సమయంలో శ్రీకాకుళం చేరుకున్నారు. -
ఓదారుస్తూ భరోసా
ఆ గ్రామాల్లో ఎవరి కంట చూసినా కన్నీటి ధారలే కనిపించాయి. కష్టాల బతుకులే తారస పడ్డాయిY.S Jagan. బతుకు తెరువు కోసం వలస వెళ్లి చెన్నైలో ఇటీవల జరిగిన రెండు ఘోర ప్రమాదాల్లో తమవారిని పోగొట్టుకున్న కుటుంబాలు విషణ్ణవదనంలో మునిగిపోయూయి. ఆయూ కుటుంబాను వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి గురువారం ఓదార్చారు. ప్రమాద వివరాలు, ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. కష్టాల జీవనం తెలుసుకుని తల్లడిల్లారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూసేందుకు పార్టీ ప్రతినిధుల బృందాన్ని చెన్నై పంపిస్తాన ంటూ భరోసా ఇచ్చారు. టీఆర్ రాజుపేటలో కొయ్యాన జయమ్మ కుటుంబ సభ్యులతో... జగన్: మృతురాలు జయమ్మ కుమార్తె బొట్ట రామకుమారిని ఓదార్చారు. ప్రమాద తీరుపై ప్రశ్నించారు. అక్కడే ఉన్న రామకుమారి భర్త శ్రీనివాసరావు కలుగజేసుకుని జయమ్మ అల్లుడ్ని నేను. ముగ్గురు పిల్లలు నాకు. మేము ప్రమాదాన్ని చూడలేదు. మా అత్త తిలువులూరుజిల్లా యదపాలెంలో పనిచేస్తుండగా, మేము 20 కిలోమీటర్ల దూరంలోని చెన్నైసిటీలోని రెడ్ ఏరియా మాధవరం బ్రిడ్జి వద్ద పనిచేస్తున్నాం. జగన్: ప్రమాదవార్త మీకెలా తెలిసింది. శ్రీనివాసరావు: మా అత్త తలవద్ద ఉన్న బ్యాగ్‌లో ఒక పుస్తకం తమిళనాడు పోలీసులకు దొరికింది. అందులోని బూర్జ మండలంలోని లక్కుపురం గ్రామంలో ఉన్న మా చెల్లి ఫోన్ నంబర్‌కు కాల్చే శారు. మా చెల్లి నాకు ఫోన్ చేసి చెప్పడం తో వెంటనే నేను అక్కడకు వెళ్లాను. జగన్: మీరు వెళ్లేసరికి మృతదేహాలు అక్కడే ఉన్నాయా? శ్రీనివాసరావు: లేవు. ఆస్పత్రిలో ఉన్నాయని చెప్పారు. అక్కడకు వెళ్లి చూశాను. మా అత్తతో పాటు కోటబొమ్మాళి మండలంలోని చుట్టిగుండం గ్రామానికి చెందిన చిన్నత్త, చిన్నమామ, వారి కుమారుడు శవాలే కనిపించారుు. వీటిని చూసి అక్కడే కుమిలిపోయూను. జగన్: ఆ గోడ ఎలా కూలిపోయింది. శ్రీనివాసరావు: ఆ గోడ పాతదే. గోడ కలి సొస్తాదని దానికి ఆనుకొని పాక వేశారు. వర్షానికి అది కూలిపోరుుంది. జగన్: ఓనురుపై కేసు పెట్టండి శ్రీనివాసరావు: అలాగే బాబూ.. జగన్: మీ ఫోన్ నంబర్ ఇవ్వండి. మీకు మన బొబ్బిలి రాజు, ఎమ్మెల్యే సృజయకృష్ణ రంగారావుతో మాట్లాడించి మంచి లాయర్‌ను ఏర్పాటు చేసి మీ ఆవేదన వినిపించేలా చేస్తాను. జరిగినది జరిగినట్టుగా వివరాలు చెప్పండి, ఎల్లుండి మా పార్టీ నాయకులు తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతిలు మీతో మాట్లాడతారు. జగన్: శ్రీనివాసరావు పిల్లల పేర్లు తెలుసుకుని ఆప్యాయంగా పలకరించారు. వారి చదువులపై ఆరా తీశారు. బాగా చదువుకోవాలంటూ దీవించారు. కొల్లివలసలో కర్రి సింహాచలం కుటుంబ సభ్యులతో... జగన్: ప్రమాదం ఎలా జరిగిందమ్మా? చెన్నై ఎప్పుడు వెళ్లారు? సింహాచలం భార్య రాజులమ్మ: పిల్లలకు వేసవిసెలవులు ఇచ్చినప్పుడు అందరమూ కలసి చెన్నై వెళ్లిపోనాం. తిరిగిబడులు పెడతారని అందరూ కలసి మా ఊరు వచ్చాం. మా పెద్దోడిని తోటాడ బడిలో వేసి గత నెల 18న నా భర్త చెన్నై వెళ్లారు. ప్రమాదంలో చనిపోయూరు. జగన్: మీ గ్రామం నుంచి ఎంత మంది వలస వెళ్లారు? -మృతుడు సింహాచలం చిన్నాన్న కర్రి పెంటయ్య కల్పించుకొని వంద మంది వరకు వెళ్లినారు బాబు... వేర్వేరు చోట్ల పనిచేస్తున్నారు. సింహాచలం మేస్త్రీగా పనిచేస్తున్నారు. జగన్: కూలి ఎంత ఇచ్చేవారు? రాజులమ్మ : కూలీలకు రూ. 200, మేస్త్రీకి రూ. 500 ఇచ్చేవారు. జగన్: గోడ ఎలా కూలిపోయింది? రాజులమ్మ: వర్షం గట్టిగా కురవడంతో గోడ కూలిపోరుుందట. ముందురోజు రాత్రి ఎనిమిది గంటలకు నా భర్తతో ఫోన్లో మాట్లాడాను. మన ఊరిలో వర్షాలు కురిస్తే స్వగ్రామానికే వచ్చేస్తానని చెప్పి కనిపించని లోకాలకు వెళ్లిపోయూరంటూ భోరున విలపించింది. జగన్: తమిళనాడు ప్రభుత్వం మీకు సాయమందించిందా? భార్య: ఈ రోజే చెక్కులు ఇస్తామని శ్రీకాకుళం రమ్మని కబురెట్టారు. మీరు వస్తారని మేము వెళ్లకుండా ఉండిపోయినాం. నా మరిదిని శ్రీకాకుళం పంపినాను. పాలకొండలో ఊళ్ల రవి కుటుంబ సభ్యులతో... జగన్: రవి ఆకస్మికంగా చనిపోవడం చాలా బాధగా ఉందమ్మా.. రవి తల్లి పార్వతి: పుట్టెడు శోకంలో ఉన్నాం బాబు. రవిపైనే కుటుంబమంతా ఆధారపడి ఉంది. ఇంటిలో అందరివీ కూలి బతుకులే. దూరం వెళ్లి డబ్బు పంపుతున్న చెట్టంత కొడుకు ప్రమాదంలో మృతిచెందాడంటూ భోరున విలపించింది. (ఆమెను జగన్ ఓదార్చారు) రవి తమ్ముడు చిన్నారావు: రవితో పాటు నేను కూడా పనిలోకి వెళ్లా. పక్కనే పనిచేస్తున్నా. హఠాత్తుగా బిల్డింగ్ కూలి రవి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎవరూ అక్కడ లేరు. సాయం లేదు. పోస్టుమార్టంలో వేరొకరి మృతదేహం అప్పజెప్పే ప్రయత్నం చేశారు. పాలకొండ ఆర్డీవో సాయంతో రవి మృతదేహాన్ని గుర్తించి తెచ్చుకోగలిగాం. జగన్: బిల్డర్‌పై కేసు వేద్దాం... అప్పుడు అతడే దారిలోకి వస్తాడు. లేకపోతే చట్టపరంగా పరిహారం కోసం పోరాడతాం. బిల్డర్‌ను విడిచిపెట్టేది లేదు. భయపడకండి. ప్రస్తుతం జీవనం ఎలా? రవి అన్న శ్రీను, చిన్నాన్న సూర్యనారాయణ: కొంత సొంత భూమి ఉంది. కొంత కౌలుకు తీసుకొని పండిస్తున్నాం. నాలుగేళ్ల నుంచి పంటలు లేవు. బతుకు బాగోలేదు. అందుకే తమ్ముడు రవి వలస వెళ్లాడు. సగంలో నిలిచిపోయిన ఇంటిని పూర్తి చేయడానికి డబ్బులు సంపాదించేందుకు వెళ్లాడు. పెళ్లి కూడా చేయాలనుకున్నాం. ఇంతలోగా ఘోరం జరిగిపోయింది. జగన్నాథరథాయాత్రకు వస్తానని చెప్పిన మని షి కనిపించని లోకాలకు వెళ్లిపోయాడు. జగన్: మీకు వైఎస్సార్ సీపీ తరఫున అండగా ఉంటాం. ఎమ్మెల్యేలు కళావతమ్మ, కలమట వెంకటరమణ, బొబ్బిలి రాజులు మీకు సాయమందిస్తారు. తిరుపతి ఎంపీ వరప్రసాద్ గతంలో ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శిగా పనిచేశారు. వీరందరినీ ఒక బృందంగా ఏర్పాటు చేసి బిల్డర్ నుంచి పరిహారం రప్పిస్తాం. ఎల్ఎన్.పేటలో తాన్ని అప్పలనరసమ్మ కుటుంబీకులను ఓదార్చుతూ.. జగన్: ప్రమాదం ఎలా జరిగింది? లక్ష్మీనారాయణ (మృతురాలు అప్పలనరసమ్మ భర్త): అప్పుడు నేను మరో దగ్గర పనికి వెళ్తున్నాను. నా భార్య మాత్రం వంట కోసం బియ్యం తేవడానికి ఆ భవనానికి వెళ్లింది. అంతే.. ఒక్కసారిగా భవనమంతా కూలిపోయింది. ఇంటి దీపం ఆరిపోరుుంది. జగన్: ఎంత మంది ఉంటున్నారు ఇక్కడ? లక్ష్మీనారాయణ: నేను, నా భార్య పనిలోకి వెళ్తే, పిల్లలు ఇద్దరినీ మా పెద్దోళ్లు చూసుకుంటున్నారు. ఏటా పనిలోకి వెళ్తేనే మాకు, మా పిల్లలకు కాసింత కూడు దొరికేది. జగన్: ఎంతిస్తారు..అక్కడ? లక్ష్మీనారాయణ: ఇద్దరికీ రూ.350 చొప్పున ఇచ్చేవారు. పని మాత్రం దొరికేది. ఒక కూలి ఖర్చుకు సరిపోయేది. మరో కూలి డబ్బులు దాచుకుని ఇక్కడికి వచ్చేవాళ్లం. జగన్: బిల్డింగ్ వారు ఏమైనా పరిహారం కింద డబ్బులు ఇచ్చారా.. కనీసం మాట్లాడారా? లక్ష్మీనారాయణ: అసలు ఎవరో తెలియదు. ఇంతవరకు ఏమీ ఈయలేదు. జగన్: భవనం యజమాని నుంచి పరిహారం అందేలా వైఎస్సార్ సీపీ ఎంపీ వరప్రసాద్, ఎమ్మెల్యేలు బొబ్బిలి రాజు సుజయ్, రాజన్నదొర, శ్రీదేవమ్మ (కురుపాం ఎమ్మెల్యే)లతో ప్రత్యేక కమిటీ వేసి అక్కడికి పంపిస్తాను. మీ కోసం పోరాడేలా చేస్తాను. ధైర్యంగా ఉండండి.. జగన్: ఏమ్మా..ఏం చదువుతున్నారు.. మృతురాలు పెద్దమ్మాయి రమాదేవి: నేను ఇక్కడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. మా చెల్లి మాధవి 3వ తరగతి చదువుతోంది. జగన్: ఏమ్మా.. మీ స్కూల్లో మరుగుదొడ్లు, ఫ్యాన్లు ఉన్నాయా.. రమా: ఏమీ లేవు సార్.. జగన్: (పక్కనే ఉన్న రెడ్డి శాంతితో) అమ్మా శాంతి.. చూడమ్మా..అమ్మాయి 8వ తరగతి చదువుతోంది. అక్కడ బాత్రూమ్స్ లేవట..ఏదోలా కట్టేలా చెయ్..ట్రస్టులతో మాట్లాడు. నారాయణ అన్నా భార్యను కోల్పోవడం దారుణం.. ధైర్యంగా ఉండు .పిల్లల్ని పెద్ద చెయ్.. ఎప్పుడూ పనుల్లోకి పంపకు.. పిల్లలూ బాగా చదవండి.. ఉంటాను. గొట్ట గ్రామ బాధితులతో... జగన్: అయ్యా మీకు పెద్ద కష్టం వచ్చి పడింది? సింహాచలం (జ్యోతి భర్త): అవునన్నా. పక్క బిల్డింగ్‌లో పనిచేస్తున్నాం. వర్షం పడుతుందని ఆరేసిన బట్టలు తీసేం దుకు వెళ్లిన నా భార్య జ్యోతి శిథిలాల్లో చిక్కుకుంది. మాకు ఇద్దరు పిల్లలు. కుమార్తె మౌనిక రెండో తరగతి చదువుతోంది. అబ్బాయి శ్రీను చేతిపిల్లాడు. జగన్: తమిళనాడు ప్రభుత్వం నుంచి పరిహారం అందిందా? సింహాచలం: మొత్తం రూ.7,25,000 అందాయి. పిల్లల పేరున డిపాజిట్ చేశామన్నా. జగన్: మంచిది. పిల్లలను బాగా చది వించు. ఏకష్టమోచ్చినా నేను ఆదుకుంటా.. కొంగరాపు శ్రీను తండ్రి రాములు: అయ్యా, మమ్మలను ఓదార్చేందుకు వచ్చావా.. చెన్నైలో నాకొడుకు భవనం కూలిన ఘటనలో చనిపోయాడు. మా కోడలు కూడా చావుబతుకుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. భగవంతుడు మా ఇంటికి అన్యాయం చేశాడు నాయనా.. జగన్: ఈ పిల్లలెవరు..? రాములు: చనిపోయిన మా శ్రీను పిల్లలు. బాబు పేరు సాయి, పాప పేరు సుస్మిత. జగన్: వారిని జగన్ అక్కున చేర్చుకు న్నారు. బాగా చదువుకోవాలంటూ సూచించారు. అక్కడే ఉన్న మీసాల శ్రీను భార్య సావిత్రి మాట్లాడుతూ ఈ మధ్యనే చెన్నైలో పనులకు వెళ్లాం. ఇంతలో భవనం రూపంలో మృత్యువు మా ఇంటి పెద్దదిక్కును తీసుకుపోయిందంటూ భోరున విలపించింది. -
కష్టాలు వింటూ..కన్నీళ్లు తుడుస్తూ..
సాక్షి ప్రతినిధి, విజయనగరం : చెమట చిందితేనే కడుపు నిండే నిరుపేద కుటుంబాలవి!..నిత్యం రెక్కలాడితేనే పిడికెడు మెతుకులు నోటికెళ్లే కూలీలు వాళ్లు. కష్టపడి పనిచేసి ఇంటిల్లిపాదీ కాసిన్ని గంజి మెతుకులు తిని సంతోషంగా బతికే వారికి ఎంతో కష్టమొచ్చింది. తమ కుటుంబ సభ్యుల ఆకలి దప్పులు తీర్చేందుకు వలస వెళ్లి అక్కడ అసువులు బాసిన ఇంటి పెద్దలు, ఇతర సభ్యుల కుటుంబాల కష్టాన్ని చూసిన రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించి పో యారు. రెండో రోజూ ఆయన పర్యటన బొబ్బిలిలో ఆరంభమై జియ్యమ్మవలస మండలంలోని నీలమాంబపురంలో రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. చోటామోటా నాయకులతోపాటు పెద్ద నాయకులు ఏజెన్సీలో పర్యటించేందుకే భయపడే పరిస్థితుల్లో ప్రతిపక్ష నేత ఏకంగా మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ ఏరియా లో పర్యటించారు. కష్టాల్లో ఉన్న ప్రజల కోసం ఆయన కొండలూ వాగులూ చుట్టుముట్టారు. నిరుపేద ప్రజల కోసం తానెంతకైనా తెగించి ముందుంటానన్న జగన్మోహన్రెడ్డి అదే విధంగా పర్యటన కొనసాగించి పేదలను పలకరించారు. చెన్నై భవన ప్రమాదంలో ఒకరు ఇద్దరు కాదు. జిల్లాకు చెందిన 24 మంది చనిపోవడంతో వారందరి ఇళ్లకూ వెళ్లారు. వారి గడపలో కూర్చున్నారు.వారిని పేరుపేరున తెలుసుకుని పలకరించారు. కష్టాల్లో తోడుంటానన్నారు. పూర్తి న్యాయం జరిగే వర కూ చర్యలు తీసుకుంటానని చెప్పారు. దీంతో చనిపోయిన వారిని నిత్యం తలచుకుని తలచుకుని విలపిస్తున్నవారు కాస్త కుదుటపడ్డారు. మా కష్టాలు పంచుకున్నావయ్యా! మా కన్నీళ్లకు తోడయ్యావు నాయనా!.. మా బాధల్ని చూసి పలకరించడానికి వచ్చావు. అయ్య లాంటి మనసున్న నీవు మా బోటి ఇళ్లకు అల్లంత దూరం నుంచి వచ్చి మా కన్నీళ్లు తుడుస్తున్నావు!! నీవు చల్లంగుండాలయ్యా!!! అంటూ కష్టాల్లో ఉన్న వా రంతా జగనన్నను దీవించారు. ఇంటికొచ్చి పరామర్శ చేసిన జగన్మోహనరెడ్డిని చూసి చలించిపోయారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సాలూరు నియోజకవర్గంలోని మక్కువ, కురుపాం నియోజకవర్గంలోని కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో పర్యటించారు. మంగళవారం తొమ్మిది కుటుంబాలను పరామర్శించిన ఆయన బుధవారం 15 మంది మృతుల కుటుంబాలను పరామర్శించారు. మక్కువ మండలంలోని పెద గైశిలలో మూడు కుటుంబాలను, తూరుమామిడిలో మూడు కుటుంబాలను, కొమరాడ మండలంలోని దళాయిపేటలో మూడు కుటుంబాలను పరామర్శించారు. అదేవిధంగా మాదలంగిలో ఒక కుటుంబా న్ని పరామర్శించారు.గ్రామానికి రహదారి సదుపా యం లేదని గ్రామస్తులు వారించినా రాత్రి 11 గంటల సమయంలో జియ్యమ్మవలసలోని నీలమాంబపురంలో ఐదు కుటుంబాలను పరామర్శించారు. ఈ సం దర్భంగా అక్కడి బాధిత కుటుంబాలు ఎంతో సంతృప్తి చెందాయి.దగ్గరి బంధువుల కన్నా ముందుగానే ఎంతో దూరంలో ఉన్న జగనన్న తమకు ఆప్తుడిగా వచ్చి పలకరించడం వారిని ఎంతో ఆనందపరచింది. పతి ఒక్కరూ కష్టాల్లో ఉన్న విషయం తెల్సుకున్న జగనన్న తమ వద్దకు వచ్చి చూపిన ఆత్మీయతను చూసి ఆనందపరవశులయ్యారు. తమ గ్రామాల్లో ఉన్న బంధువులతో సమానంగా తమ కష్టంగా భావించి వచ్చి పరామర్శించిన జగన్‌ను చూసి అన్ని వర్గాల వారూ హేట్సాఫ్ అన్నారు. ఇటువంటి కష్టాల సమయంలో వచ్చి కన్నీళ్లను తుడిచే వాడే సిసలైన నాయకుడ్రా అని ప్రజలు బహిరంగంగా అరుస్తూ శెభాష్ జగనన్నా అనడం వినిపించింది. ఉదయం నుంచీ పరామర్శలు చేస్తూనే ఉన్న జగన్‌ను చూసిన గ్రామీణ ప్రాంత ప్రజలు మంత్రముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మీ కందరికీ బాసటగా ఉంటా! మీ బాధలు, కష్టాలు పంచుకుంటా! ఇటువంటి కష్టాలు వచ్చినపుడు కుంగిపోవద్దు! పిల్లలు, వృద్ధులను చూడాల్సింది మనమే కదా అంటూ వారిని అనునయించారు. బాధితులు ప్రతి ఒక్కరి కుటుంబానికి వచ్చిన కష్టం చూసి చలించిపోయారు జగన్. అసలే చిన్న కుటుంబాలు. ఆర్థికంగా అంత బాగాలేకనే కదా ఇలా వలసలు వెళ్లి బతుకులీడుస్తున్నారు. ఇంతలోనే మీకెందుకు ఇలా కష్టం వచ్చింది. ఇటువంటప్పుడే గుండె దిటవు చేసుకోవాలని ఆయా కుటుంబాలకు ధైర్యం నూరిపోశారు. ఉదయం నుంచీ రాత్రి వరకు అలసట లేకుండా జగన్ పర్యటించారు. చీకటి పడిపోయినప్పటికీ అన్ని ఇళ్లకూ వెళ్లి అందరి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం కూడా వచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. మీ పిల్లలను చక్కగా చదివించాలని, పెద్దలను శ్రద్ధగా సాకాలనీ, భగవంతుడు అందరికీ మేలు చేకూరుస్తాడని వారిలో ఆత్మవిశ్వా సాన్ని ప్రోది చేశారు. జగన్మోహన్రెడ్డి పరామర్శ ప్రయాణంలో దారి పొడవునా జనం గుంపులు, గుంపులుగా చేరి జననేతను చూసి, మాట్లాడేందుకు ఎగబడ్డారు. దీనిలో భాగంగా ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో ఆయన వినతుల పరిష్కారానికి ప్రజల పక్షాన ప్రభుత్వంతో పోరాడతానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి, సాలూరు, కురుపాం ఎమ్మెల్యేలు సుజయ్‌కృష్ణ రంగారావు, పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, మాజీ ఎమ్మెల్యేలు శత్రుచర్ల చంద్రశేఖరరాజు, సవరపు జయమణి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు, పార్టీ నాయకులు గులిపల్లి సుదర్శనరావు, అవనాపు విజయ్, విక్రమ్, పరీక్షిత్‌రాజు, ప్రసన్నకుమార్, కడుబండి శ్రీనివాసరావు, కోలగట్ల వీరభద్రస్వామి, బేబీనాయన, ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, ద్వారపురెడ్డి సత్యనారాయణ, మావుడి ప్రసాదనాయుడు, రెడ్డి పద్మావతి, గొర్లె వెంకటరమణ, దమయంతి, తదితరులు పాల్గొన్నారు. -
విజయనగరంలో రెండోరోజు వైఎస్ జగన్ పర్యటన
విజయనగరం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన రెండోరోజు కూడా విజయనగరంలో కొనసాగనుంది. ఆయన బుధవారం సాలూరు, కురుపాం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. చెన్నైభవనం కూలిన ఘటనలో మృతుల కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శిస్తారు. మక్కువ మండలం తూరుమామిడిలో రెండు కుటుంబాలు, గైసీల గ్రామంలో మూడు కుటుంబాలు, కొమరాడ మండలం దలాయిపేటలో రెండు కుటుంబాలు, మాదలింగిలో జాన్ కుటుంబం, జీయమ్మవసల మండలం నీలమాంబపురంలో అయిదు కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు. కాగా గత నెల 28న చెన్నైలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో పలువురు మరణించారు. వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది మృతుల కుటుంబీకులను జగన్ మంగళవారం పరామర్శించారు. చెన్నై మృతుల్లో దత్తి రాజేరు మండలంలోని కోరపు కృష్ణాపురానికి చెం దిన పేకేటి అప్పలరాము, లక్ష్మి (వీరిద్దరూ భార్యాభర్తలు), కర్రి తౌడమ్మ, వనం దుర్గ, పతివాడ గౌరీశ్వరి, సిరిపురపు రాము, పతివాడ బంగారినాయుడు, బాడంగి మండల కేంద్రానికి చెందిన బొమ్మి గౌరునాయడు, బొంగు శాంతి కుమారిల కుటుంబీకులను ఓదార్చారు. దుర్ఘటన జరిగిన తీరును, వారి కష్టాల్ని అడిగి తెలుసుకున్నారు. -
నేనున్నానంటూ...
సాక్షి ప్రతినిధి, విజయనగరం : చెన్నైలో బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు శాసనసభలో ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం జిల్లాకు రానున్నారు. జిల్లాలో మంగళ, బుధవారాలలో పర్యటించనున్నారు. బాధితుల ఇళ్లకు వెళ్లి నేనున్నాని భరోసా కల్పించనున్నారు. వారి కన్నీరు తుడిచి ఓదార్చనున్నారు. చెన్నై ఘటనలో జిల్లాకు చెందిన 24 మంది మృతి చెందారు. వారందరి ఇళ్లకు వెళ్లి, శోకసంద్రంలో ఉన్న ఆ కుటుంబాలను పరామర్శించనున్నారు. పర్యటనకు ఏర్పాట్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు వైఎస్ఆర్ సీపీ విజయనగ రం నియోజకవర్గ ఇన్చార్జ్ కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. అలాగే గజపతినగరంలో నియోజకవర్గ ఇన్చార్జ్ కడుబండి శ్రీనివాసరావు నేతృత్వంలో ఏర్పాట్లు చేశారు. తొలి రోజు షెడ్యూల్.... వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి విమానంలో చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంగుండా విజయనగరం మీదుగా గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరుమండలం కె.కృష్ణాపురం చేరుకుంటారు. చెన్నైలో భవనం కూలిన ఘటనలో మృతి చెందిన ఏడుగురి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అక్కడి నుంచి బాడంగి వెళ్లి, ఇద్దరు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం బొబ్బిలి చేరుకుని రాత్రి బస చేస్తారు. రెండో రోజు షెడ్యూల్ రెండో రోజు సాలూరు నియోజకవర్గంలోని మక్కువ, కురుపాం నియోజకవర్గంలోని కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో పర్యటించనున్నారు. మక్కువ మండలంలోని తూరుమామిడిలో మూడు కుటుంబాలను, పెద గైశీలలో మూడు కుటుంబాలను, కొమరాడ మండలంలోని దళాయిపేటలో గల మూడు కుటుంబాలను, మాదలంగిలో ఉన్న ఒక కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం జియ్యమ్మవలస మండలం నీలమాంబపురంలో ఐదు కుటుంబాలను పరామర్శించి శ్రీకాకుళం జిల్లాకు వెళ్తారు. -
ఆ కమిషన్ ఏకపక్షం..!
చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై మౌళివాక్కంలో జరిగిన అపార్ట్మెంటు ప్రమాదం అసెంబ్లీని కుదిపేసింది. ఆ సంఘటనపై విచారణకు నియమించిన రఘుపతి కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని, సీబీఐ విచారణకు ఆదేశించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశారుు. దీనికి అధికార పక్షం అడ్డుతగలడంతో వామపక్షాలు వాకౌట్ చేశాయి. ఈ సంఘటనలు గురువారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 13న 2014-15 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం నాలుగురోజుల తర్వాత వాయిదా వేసింది. సహజంగా బడ్జెట్‌పై శాఖల వారీగా చర్చలు జరగాల్సి ఉంది. అయితే ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున వాయిదా వేశారు. బడ్జెట్ సమావేశాలకు కొనసాగింపుగా గురువారం సమావేశాలు ప్రారంభమయ్యూరుు. ఉదయం 9.52 గంటలకు ముఖ్యమంత్రి జయలలిత సమావేశం హాలులోకి అడుగుపెట్టారు. కేంద్రమంత్రి గోపినాధ్ ముండే, మౌళివాక్కం, తిరువళ్లూరులో మృతులకు సంతాప సూచకంగా స్పీకర్ ధనపాల్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించారు. అనంతరం అరగంటపాటూ వాయిదా వేశారు. ఆ తరువాత అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగా అపార్ట్మెంటు ప్రమాదంపై సమగ్రంగా చర్చించేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా డీఎంకే సభ్యులు స్టాలిన్ స్పీకర్‌ను కోరారు. డీఎండీకే, కాంగ్రెస్, వామపక్షాలు సైతం స్టాలిన్‌తో గళం కలిపాయి. మాజీ న్యాయమూర్తి రఘుపతి నేతృత్వంలో న్యాయవిచారణ జరుగుతున్నందున చర్చించడం సముచితం కాదని స్పీకర్ బదులిచ్చారు. ఇందుకు సమ్మతించ ని ప్రతిపక్షాల నేతలు లేచి నిలబడి నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో స్పీకర్ సైతం లేచి నిలబడి సభ నిబంధనల ప్రకారం కూర్చోవాలని కోరారు. సీపీఎం సభ్యులు భీమ్రావ్ ఇదే అంశాన్ని లేవనెత్తడంతో గృహ నిర్మాణశాఖా మంత్రి వైద్యలింగం జోక్యం చేసుకుని తాను చెప్పే విషయాలను సావధానంగా వినండి, సంతృప్తి లేకుంటే వాకౌట్ చేయండని చెప్పారు. చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఎండీఏ)వారు నిబంధనలకు లోబడే అనుమతులు మంజూరు చేశారని, నిర్మాణంలో లోపాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత బిల్డర్, స్ట్రక్చరల్ ఇంజనీరుదేనని పేర్కొన్నారు. ప్రైవేటు నిర్మాణాల్లో జరిగిన ప్రమాదాలకు ప్రభుత్వంతో సంబంధం లేదని, అయినా జయ ప్రభుత్వం మానవతా దృ క్పథంతో వ్యవహరించి బాధిత కుటుంబాలను ఆదుకుందని అన్నారు. ఇవన్నీ తెలిసి కూడా రాజకీయ లబ్ధి కోసం విపక్షాలు పాకులాడుతున్నాయని విమర్శించారు. ప్రమాద తీవ్రతపై పారదర్శక విచారణ జరిపించాల్సిన ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ విచారణకు ఆదేశించిందని విపక్షాల నాయకులు తప్పుపట్టారు. ఇది ఏకసభ్య కమిషన్ కాదు ఏకపక్ష కమిషన్ అంటూ డీఎండీకే సభ్యులు చంద్రకుమార్ ఎద్దేవా చేశారు. డీఎంకే సభ్యులు స్టాలిన్, కాంగ్రెస్ సభ్యులు ప్రిన్స్, సీపీఎం సభ్యులు సౌందర్‌రాజన్ తదితరులంతా సీబీఐ విచారణకు ఆదేశించాలని లేచి నిలబడి నినదించారు. ప్రతిపక్షాల డిమాండ్‌ను తీసిపారేస్తున్నట్లుగా అధికార పార్టీ సభ్యులు వాగ్విదానికి దిగడంతో డీఎంకే, డీఎండీకే, కాంగ్రెస్, వామపక్షాలు, మనిదనేయ మక్కల్ కట్చి, పుదియకళగం తదితర పార్టీలకు చెందిన ప్రతిపక్ష నేతలంతా వాకౌట్ చేశారు. -
నరకాన్ని చూసొచ్చాం!
పాలకొండ రూరల్: ఆ ఘటనే ఒక పెను విషాదం.. ఆ దృశ్యాలు అత్యంత భయానకం.. శిథిలాల కింద చితికిపోయిన శరీరాలు కొన్నయితే.. మరణానికి అతి చేరువగా వెళ్లి.. అక్కడి నుంచే తప్పించుకునేందుకు క్షతగాత్రులు పడిన వేదన.. అనుభవించిన నరకయాతనను అతి సమీపం నుంచి చూడటం తలచుకుంటే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తుంది. రోజుల తరబడి అనుభవించిన యాతన.. చావు బతుకుల సంఘర్షణ. వీటన్నింటినీ ప్రత్యక్షంగా చూడటం.. సహాయ చర్యల్లో పాలుపంచుకోవడం జీవితంలో మరచిపోలేని సంఘటనలని అంటున్నారు పాలకొండ ఆర్డీవో తేజ్‌భరత్. చెన్నైలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో జిల్లాకు చెందిన 14 మంది మృతి చెందగా, ఇద్దరు స్వల్పగాయాలతో బయట పడిన విషయం తెలిసింది. ఈ దుర్ఘటనలో చిక్కుకున్న జిల్లావాసులకు సహాయ చర్యలు చేపట్టేందుకు గత శనివారం చెన్నై వెళ్లిన బృందంలో ఆర్డీవోతోపాటు రాజాం తహశీల్దార్ జల్లేపల్లి రామారావు, హిరమండలం ఆర్ఐ శంకరరావులు ఉన్నారు. వారంపాటు సహాయ చర్యల్లో పాల్గొన్న వారు ఈ శనివారం అక్కడి నుంచి తిరుగు పయనమయ్యారు. ఈ వారం రోజులు ఈ బృందం ఎదుర్కొన్న అనుభవాలను ఆర్డీవో తేజ్‌భరత్ ‘సాక్షి’తో ఫోనులో పంచుకున్నారు.ఆ విశేషాలు.. సాక్షి: మీ బృందం చెన్నై చేరుకొనేసరికి పరిస్థితి ఎలా ఉంది? ఆర్డీవో: గత నెల 29 శనివారం సాయంత్రం జిల్లా అధికారుల సూచన మేరకు మా బృందం చెన్నై చేరుకుంది. రాత్రి 9 గంటల సమయంలో సంఘటన స్థలానికి వెళ్లాం. అక్కడి పరిస్థితి చూసి ఒళ్లు గగుర్పొడించింది. ఇన్నాళ్ల నా సర్వీసులో ఈ తరహా ఘటనను చూడలేదు. నాతో పాటు వచ్చిన రాజాం తహశీల్దార్, హిరమండలం ఆర్ఐ ఎంతగానో సహకరించారు. శిథిలాలు, మృతదేహాలు, క్షతగాత్రులు, వారి బంధువుల రోదనల మధ్య పని చేయడానికి గుండె నిబ్బరం అవసరం. సాక్షి: మిమ్మల్ని బాగా కదిలించిన సంఘటన ఏమిటి? ఆర్డీవో: చావుకు.. బతుకుకు మధ్య జరిగే సంఘర్షణ ఎలా ఉంటుందో కళ్లారా చూశాం. చనిపోయింది ఎవరో.. వారి బంధువులు ఎవరో తెలియని పరిస్థితి వలస కూలీలది. రాత్రి సమయం కావడంతో సహాయ చర్యలు చేపట్టడంలో తొలుత కొంత ఆలస్యం జరిగింది. అసలు శిథిలాల కింద ఉన్న వారు ఎలా ఉన్నారో, ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. తమ వారిని రక్షించాలంటూ వారి బంధువులు కనిపించిన వారందరి కాళ్ల మీద పడి రోదించిన దృశ్యాలు కలచివేశాయి. సాక్షి: గతంలో మీరు డీఎస్పీగా కూడా పనిచేశారు. ఆ అనుభవం ఇక్కడ ఏమైనా ఉపకరించిందా? ఆర్డీవో: డీఎస్పీగా పని చేసినప్పుడు ఎప్పుడూ పోస్టుమార్టాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి రాలేదు. కానీ ఇక్కడ రోజుల తరబడి భవన శిథిలాల కింద నుజ్జయిన పదుల సంఖ్యలో మృతదేహాలను చూడాల్సి వచ్చింది. లోపలకు వెళ్లి సాయమందిద్దామంటే చెన్నై అధికారులు మా బృందానికి అనుమతి ఇవ్వలేదు. సాక్షి: జిల్లాకు చెందినా.. గుర్తించని వారి మృతదేహాలు పంపించడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఆర్డీఓ: ఈ విషయంలో మాత్రం తమిళనాడు ప్రభుత్వం చొరవ చూపించింది. ప్రతి ఒక్క మృతదేహాన్ని గుర్తించిన అనంతరం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయడంతో పాటు వారి బంధువులు, క్షతగాత్రులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించింది. అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అధికారుల సంఖ్య ఎక్కువగా ఉండడం, మన జిల్లా నుంచి వెళ్లింది ముగ్గురు మాత్రమే కావడం కాస్త ఇబ్బంది కలిగించింది. అయినా రోజుకు 3 గంటలు మాత్రమే పడుకొని మిగిలిన సమయమంతి జిల్లా వాసులకు సహకరించడానికే వెచ్చించాం. సాక్షి: మీ సహచర ఉద్యోగులు ఎలా సహకరించారు? ఆర్డీవో: ఒడిశా, విజయనగరంతో పాటు మన జిల్లా నుంచి వెళ్లిన మేము సమన్వయంతో మనవాళ్ల ఆచూకీ కోసం ప్రయత్నించాం. 168 గంటలు సహాయ చర్యల్లో పాల్గొన్నాం. 28 గంటల పాటు మార్చురీలో గుర్తు తెలియని, చిధ్రమైన, కుళ్లిన మృతదేహాల మధ్య గడిపాం. కొన్ని సమయాల్లో ఎక్స్‌గ్రేషియా కోసం చెన్నైకి చెందిన బాధితులు కొందరు మృతదేహాలు తమవారివి కాకపోయినా తమవేనంటూ గొడవకు దిగారు. ఈ తరహా ఘటనలు ఎన్నో. సాక్షి : రాష్ట్రం నుంచి వచ్చిన రాజకీయ నాయకుల సహకారం అందిందా? ఆర్డీవో: వివిధ ప్రాంతాలకు చెందిన రాజకీయ నాయకులతో పాటు రాష్ట్ర మంత్రులు కూడా వచ్చి బాధితులను ఓదార్చారు. అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అలాగే అక్కడి ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు. సాక్షి: తమిళనాడు ప్రభుత్వం మనవారికి పూర్తిస్థాయిలో సాయం చేసిందా? ఆర్డీవో: జిల్లాకు చెందిన 16 మంది శిథిలాల్లో చిక్కుకోగా వారిలో 14 మంది మృత్యువాత పడ్డారు. ఇద్దరు క్షేమంగా ఉండడంతో వారిని కూడా జిల్లాకు పంపించాం. మృతి చెందిన ప్రతి ఒక్కరికి అక్కడి ప్రభుత్వం రూ.2 లక్షలు చొప్పున రూ. 28 లక్షలు ప్రకటించింది. ఈ మొత్తాన్ని జిల్లా కలెక్టర్‌కు చెక్కు రూపంలో పంపించనున్నారు. అలాగే క్షతగాత్రులకు ఎటువంటి ఆధారాలు చూపకపోయినా తక్షణ సాయం కింద రూ.50 వేలు చొప్పున అందించింది. మెరుగైన వైద్య చికిత్స చేయించడంతో పాటు బాధిత కుటుంబాలను అన్ని విధాలా సహకరించింది. వారం రోజుల పాటు అక్కడ జరిగిన విషయాలను, మేం చేపట్టిన కార్యక్రమాలను ఫొటోల రూపంలో జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తాం. -
చచ్చాడనుకున్నోడు..బతికొచ్చాడు
కేంద్రపరా (ఒడిశా): చెన్నైలో 11 అంతస్తుల భవనం కూలిన ఘటనలో ఒడిశాకు చెందిన ఓ కూలీ చనిపోయాడని గుర్తించారు. మృతదేహాన్ని అతడి స్వస్థలానికి పంపారు. అతడి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో బతికే ఉన్నానంటూ అతడి నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చింది. అంతే వారికి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. కూలిన శిథిలాల నుంచి 72 గంటల పాటు మృత్యువుతో పోరాడి క్షేమంగా బయటపడ్డ 28 ఏళ్ల ప్రకాశ్ రౌత్ కథ ఇది. చెన్నై దుర్ఘటనలో మొత్తం 61 మంది మరణించారు. బాగా నలిగిపోయిన ఓ మృతదేహాన్ని ప్రకాశ్దిగా పొరపాటును గుర్తించారు. అతడి సొంతూరు కేంద్రపరా జిల్లా రాజ్‌నగర్ ప్రాంతానికి తరలించారు. తల్లిదండ్రులు కూడా శవాన్ని గుర్తించలేకపోయారు. తమ కొడుకే చనిపోయాడని భావించారు. కాగా చెన్నైలో సహాయక చర్యల చేపడుతున్న సిబ్బంది బుధవారం శిథిలాల కింద ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సాయం కోసం ఎదురు చూస్తున్న ప్రకాశ్‌ను గుర్తించి రక్షించారు. ప్రమాదం జరిగిన మూడు రోజుల తర్వాత అతను ప్రాణాలతో బయటపడటం విశేషం. ప్రకాశ్ వెంటనే కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను బతికేఉన్నానని చెప్పాడు. చితిపై శవాన్ని ఉంచి దహన సంస్కారాలు చేయడానికి సిద్ధమైన తల్లిదండ్రులు కాసేపు కలా నిజమా తేల్చుకోలేకపోయారు. విషయం అర్థమయ్యాక సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రకాశ్ సొంతూరుకు పయనమవగా.. చితిపై ఉన్న శవం ఎవరిదో గుర్తించేందుకు చెన్నైకు వెనక్కు తీసుకుపోవాల్సివుంది. -
54కి చేరిన చెన్నై మృతుల సంఖ్య
-
54కి చేరిన చెన్నై మృతుల సంఖ్య
చెన్నై : చెన్నైలో బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 54కి చేరింది. మరికొందరి కోసం ఆరో రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే భవనం శిథిలాల కింద ఇంకా ఎంతమంది చిక్కుకుని ఉంటారనే దానిపై అధికారులు స్పష్టంగా వివరాలు ఇవ్వటం లేదు. కాగా శనివారం నిర్మాణంలో ఉన్న 11 అంతస్తుల భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే. దాంతో నిర్మాణ పనుల్లో ఉన్న అనేకమంది శిథిలాల కింద చిక్కుకు పోయారు. కూలిన భవనం నుంచి సహాయక సిబ్బంది మృతదేహాలను వెలికి తీస్తునే ఉన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందినవారు ఎక్కువగా తెలుగువారే ఉన్నారు. వీరంతా ఉపాధి కోసం విజయనగరం జిల్లా నుంచి చెన్నైకి వలస వెళ్లారు. మరోవైపు మృతదేహాలకు చెన్నైలోని రాయపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ 17మృతదేహాలను గుర్తించినట్లు తెలుస్తోంది. Chennai Building Collapse, 54 Dead, ex gratia, చెన్నై, కుప్పకూలిన భవనం, 54 మంది మృతి, 11 అంతస్తుల భవనం, మౌళివాకం, ఎక్స్‌గ్రేషియా -
చెన్నై బాధిత కుటుంబాలకు 5లక్షల ఎక్స్‌గ్రేషియా
హైదరాబాద్ : చెన్నై భవనం కూలిన ఘటనతో మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. గాయపడినవారికి రూ.50 వేలు, రోజూ కూలీ పని దినాల నష్టానికి కుటుంబానికి రూ.25 వేలు పరిహారంతో పాటు వైద్య సేవల ఖర్చు మొత్తం భరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య బుధవారానికి 45కి చేరింది. అయిదో రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
భవనం కూలిన ఘటనలో 41కి చేరిన మృతులు
-
భవనం కూలిన ఘటనలో 41కి చేరిన మృతులు
చెన్నై మహానగరంలో బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య బుధవారం 41కి చేరింది. గత అర్థరాత్రి భవన శిథిలాల నుంచి 8 మృత దేహాలను వెలికి తీశారు. అలాగే శిథిలాల కింద చిక్కుకున్న మరో 27 మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా శనివారం నిర్మాణంలో ఉన్న11 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఆ భవన నిర్మాణంలో పని చేస్తున్న కార్మికులలో అత్యధికులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే. -
లెక్క తేలింది..!
శ్రీకాకుళం కలెక్టరేట్:చెన్నైలో శిథిలాల కింద చిక్కుకున్న వారి లెక్క తేలింది. గత నెల 28న నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ప్రమాదంలో జిల్లాకు చెందిన 17 మంది చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో ఇప్ప టి వరకు నలుగురిని గుర్తించారు. నరసన్నపేట మండలం బాలసీమకు చెందిన దువ్వారపు లక్ష్మి, కొత్తూరు మండలం ఇరపాడుకు చెందిన అమలాపురం శ్రీనివాసరావు(22) మృతి చెందగా, హిరమండలం మండలం గొట్ట గ్రామానికి చెందిన కొంగరాపు కృష్ణవేణి, కోటబొమ్మాళి మండలం గుడివాడకు చెందిన చుక్కా రమేష్ అక్కడి శ్రీరామచంద్ర ఆస్పత్రి లో వైద్యసేవలు పొందుతున్నారు. మరో 13 మందిని గుర్తించాల్సి ఉంది. అయితే వారు క్షతగాత్రులుగా ఉన్నారా..లేక మృత్యువాత పడ్డారా? అన్న విషయం తేలాల్సి ఉంది. అక్కడి జిల్లాకు చెందిన రెవెన్యూ అధికారులు సంఘటన స్థలంలోనే ఉండి..సహాయక చర్యలు చేపడుతున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రేషన్ బియ్యంతో పాటు.. అమ్మహస్తం సరుకులను అందజేసింది. ఇంకా గుర్తించాల్సిన వారు హిరమండలం మండలం గొట్ట గ్రామానికి చెందిన కొంగరాపు శ్రీను (40), మీసాల శ్రీను (40), మీసాల భవాని (14), లక్ష్మీపురంకు చెందిన పి.జ్యోతి (30), కోటబొమ్మాళి మండలం పాయకవలసకు చెందిన ముద్దాడ శ్రీనివాసరావు (23), ఎల్‌ఎన్‌పేట గ్రామానికి చెందిన తన్నా అప్పలనర్సమ్మ (40), అదే మండలం మోదుగువలసకు చెందిన దుక్క తవుడు (58), భామిని మండలం కొరమ గ్రామానికి చెందిన దాసరి రాము (40), దాసరి కళావతి (28), కొత్తూరు మండలం ఇరపాడుకు చెందిన అమలాపురం రాజేష్(21), కిమిడి సుబ్బారావు (50), పాలకొండ మం డలం వాటర్ ట్యాంక్ కాలనీకి చెందిన ఊళ్ల రవి, గుడివాడగ్రామానికి చెందిన చెందిన చుక్క సుజాతల ఆచూకీ తెలియాల్సి ఉంది. అచ్చెన్న పరామర్శ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. మంగళవారం చెన్నై వెళ్లిన ఆయన బాధితులను పరామర్శించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క కార్మిక కుటుంబానికి అన్యాయం జరగకుండా..అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.పాలకొండ ఆర్డీవో ఎస్.తేజ్‌భరత్ ఆధ్వర్యంలో సహాయ, పునరావాస చర్యలు చేపడుతున్నామన్నారు. అనంతరం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి, సంఘటన వివరాలు తెలుసుకున్నారు. అలాగే..అక్కడి పునరావాస కేంద్రం లో మౌలిక వసతులు లేకపోవడంతో సమీపంలోని లాడ్జిలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు చెందిన 36 మంది చెన్నై వచ్చారని, వారికి కూడా మంగళవారం సాయంత్రం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశామని పాలకొండ ఆర్డీవో చెప్పారు. ఇన్చార్జి కలెక్టర్ జి.వీరపాండ్యన్ ఎప్పటికప్పుడు పరిస్థితిని అక్కడి అధికారులతో సమీక్షిస్తున్నారు. నేడు స్వగృహానికి పద్మ మృతదేహం బాలసీమకు చెందిన దువ్వారపు పద్మ మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరనుంది. ప్రత్యేక వాహనంలో పంపిస్తున్నారని, ఆమె భర్త అప్పన్న కూడా వస్తున్నారని ఇన్చార్జి కలెక్టర్ తెలిపారు. ఇరపాడు యువకుడి మృతి ఇరపాడు (కొత్తూరు): చెన్నై భవన ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకున్న ఇరపాడు వాసి అమలాపురం శ్రీనివాసరావు (రమేష్) (22) మృతి చెందినట్లు హిరమండలం ఆర్ఐ శంకరరావు, మృతుని తండ్రి సూర్యనారాయణ మంగళవారం రాత్రి ఫోన్ ద్వారా తెలిపారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న శ్రీనివాసరావు మృతదేహాన్ని సహాయక బృందాలు వెలికి తీసి, ఎంజీఆర్ ఆస్పత్రికి తరలించగా..అక్కడ గుర్తించామని పేర్కొన్నారు. ఇంటర్ పూర్తి చేసి, డిగ్రీలో చేరాల్సిన కొడుకు ఇలా శవంలా మిగిలాడంటూ తండ్రి రోదిస్తున్న తీరు అక్కడి వారిని సైతం కన్నీరు పెట్టించింది. రెండో కుమారుడిపై సన్నగిల్లిన ఆశలు అలాగే..సూర్యనారాయణ మరో కుమారుడు రాజేష్ కూడా బతికున్నాడన్న నమ్మకం సన్నగిల్లుతుండడంతో కుటుంబ సభ్యులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ప్రమాదం జరిగి మూడు రోజులు గడుస్తున్నా..రాజేష్ ఆచూకీ లభించలేదు. ప్రమాదం సమయంలో అన్నదమ్ములిద్దరూ ఒకే చోట ఉండడం..శ్రీనివాసరావు మృతి చెందడంతో..రాజేష్ ఏమయ్యాడోనన్న బెంగ పట్టుకుంది. అలాగే..ఇదే గ్రామానికి చెందిన సుబ్బయ్యపై కుటుంబం కూడా భోరుమంటోంది. ఇద్దరు కుమారులు ఒకే సారి భవన శిథిలాల్లో చిక్కుకోవడంతో అనాథలమయ్యామని సూర్యానారాయణ రోదిస్తున్నాడు. -
అశ్రునయనాల మధ్య...అంతిమ వీడ్కోలు
విజయనగరం కంటోన్మెంట్ : గుర్తు పట్టలేని విధంగా ఉన్న మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు, పిల్లలు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ముందుగా కలెక్టరేట్‌కు వచ్చి కంట్రోల్ రూమ్‌కు సమాచారమిచ్చిన అనంతరం ఆయా గ్రామాలకు చెన్నై అంబులెన్స్‌లు తరలివెళ్లాయి. దత్తిరాజేరు మండలం కె.కృష్ణాపురానికి చెందిన సిరిపురపు రాము, మక్కువ మండలం పెదైగైశీలకు చెందిన వెంపడాపు శంకరరావు, అదే గ్రామానికి చెందిన మజ్జి సరస్వతి, మక్కువ మండలం తూరుమామిడికి చెందిన నీలమాంబపురానికి చెందిన ముదిలి రామలక్ష్మి మృతదేహాలను ఆయా గ్రామాలకు తరలించారు. మృతదేహాలు గ్రామాలకు రాగానే ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. ఆయా గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఏ కంట చూసిన మంటికి జాలురువారుతున్న కన్నీటిధారలే కపినించాయి. ఎవరిని కదిపినా రోదన తప్ప వారి నోటవెంట మరో మాట బయటకు రాలేదు. గ్రామస్తులందరూ కలిసి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆచూకీ తెలియాల్సి ఉంది. తొమ్మిది మంది చెన్నైలోని రామచంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల తొలగింపు కొనసాగుతుండడంతో మిగతా వారి కోసం ఎదురుచూస్తున్నారు. బాడంగి మండల కేంద్రానికి చెందిన బొమ్మి అనసూయ క్షేమంగా ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. ఊరి కాని ఊరిలో మృతి.. ఊరవతల కడచూపు చెన్నైలో మృతి చెందిన వారి కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంది. పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రం వెళ్లిన వీరు అక్కడి భవన ప్రమాదంలో మృతి చెందడంతో కన్నీరుమున్నీరవుతున్న గ్రామస్తులు, కుటుంబ సభ్యులు వర్ణిస్తూ రోది స్తుండడం చూపరులను కూడా కంటతడిపెట్టుకునేలా చేస్తున్నాయి. సాధారణం గా ప్రమాదాల్లో మృతి చెందిన వారి మృతదేహాన్ని గ్రామాల్లో ఉంచరు. ఇది గ్రామీణ ప్రజల కట్టుబాటు. చెన్నైలో మరణించిన వారి మృతదేహాలను నేరుగా స్వగ్రామాలకు తీసుకు రాకుండా అంబులెన్స్‌ల్లో శ్మశాన వాటికలకు తరలించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు, కుటుంబ సభ్యులు నేరుగా శ్మశాన వాటికలకు తరలివెళ్లారు. ఊరుకాని ఊరిలో చనిపోయి ఊరవతల కడచూపులు మిగిల్చావా? దేవుడా అని బంధువులు, కన్నవారు మింటికి, మంటికి ఏకధాటిగా రోదించడంతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలముకున్నాయి. అతను మా నాన్న కాదు... కె.కృష్ణాపురానికి చెందిన సిరిపురపు రాము మృతదేహం సాయంత్రానికి స్వ గ్రామం పక్కనే ఉన్న శ్మశానానికి చేరుకుంది. దీంతో గ్రామానికి చెందని ప్రజలతో పాటు కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. వీరితో పాటు కడసారి చూపు చూపించాలంటూ బంధువులు రాము ఇద్దరు కుమార్తెలనూ శ్మశానానికి తీసుకువచ్చారు. ఏడేళ్ల వేదశ్రీ, ఐదేళ్ల ఐశ్వర్యలకు సిరిపురపు రాము మృతదేహాన్ని చూపిం చారు. ప్రమాదంలో తండ్రి తలంతా ఛిద్రమైపోయినట్టు తెలియని ఆ చిన్నారులు మానాన్న కాదూ అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నప్పుడు పంటి బిగువున దుఃఖాన్ని ఆపుకున్న వారు కూడా బోరున ఏడ్చేశారు. నాన్నను చూపించండి అంటూ ఇద్దరు చిన్నకుమార్తెలూ ఏడుస్తున్నప్పుడు అక్కడ వాతావరణం శోకసంద్రమైపోయింది. నేడు మరో నలుగురి మృతదేహాలు జిల్లాకు జిల్లాకు చెందిన మరో నలుగురి మృతదేహాలు బుధవారం ఆయా గ్రామాలకు చేరుకోనున్నాయని అధికారులు తెలిపారు. మక్కువ మండలం తూరుమామిడికి చెందిన సీర జయమ్మ, బాడంగి మండలకేంద్రానికి చెందిన బొంగుశాంత కుమారి, కొమరాడ మండలం దళాయిపేటకు చెందిన పడాల చిన్నమ్మ, దత్తిరాజేరు మండలం కె.కృష్ణాపురానికి చెందిన వనం దుర్గ మృతదేహాలు రానున్నాయి. జిల్లాకు చెందిన మరో 26 మంది -
మరో ముప్పు!
సాక్షి, చెన్నై: బహుళ అంతస్తుల భవన నిర్మాణం పేక మేడలా కుప్పకూల డం దక్షిణ భారతంలో అతి పెద్ద ప్రమాదంగా పరిగణించవచ్చు. ఈ ప్రమాదం నేర్పిన గుణపాఠంతో అధికార యంత్రాంగం మేల్కొంది. భవిష్యత్తులో ఇలాం టివి పునరావృతం కాని విధంగా తగిన జాగ్రత్తలకు సిద్ధం అవుతోన్నది. రాజధాని నగరం, శివారు ల్లో నిర్మించిన, నిర్మాణంలో ఉన్న భవనాల్లో నిబంధనల అమలు మీద దృష్టి పెట్టేందుకు చెన్నై మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ సిద్ధం అవుతోంది. ఇప్పటి వరకు అనుమతులు పొందిన, అనుమతుల కోసం వేచి ఉన్న భవనాలకు సంబంధించిన అన్ని రకాల రికార్డులను పునఃపరిశీలించేందుకు సిద్ధం అవుతున్నారు. ఇందుకోసం తమ విభాగంతోపాటుగా అన్నా వర్సిటీ, చెన్నై ఐఐటీ నిపుణుల సహకారంతో ఉన్నత స్థాయి కమిటీకి రెడీ అవుతున్నారు. ప్రస్తుత ఘటనపై సమగ్ర పరిశీలనతోపాటుగా భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా నిబంధనల కొరడా ఝుళిపించే రీతిలో ఈ కమిటీ ఏర్పాటుకు ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సీఎండీఏ వర్గాలు నివేదిక పంపించి ఉండటం గమనార్హం. మరో ముప్పు : మౌళి వాకంలో ప్రైమ్ సృష్టి ట్రస్ట్ హైట్స్‌లోని మరో భవనం ముప్పు అంచున ఉన్నట్టు అధికారుల పరిశీలనలో వెలుగు చూసి ఉంది. తొలి భవనం కూలిన క్షణాల్లో రెండో భవనంలో కొన్ని చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. తొలుత రెస్క్యూఆపరేషన్కు ఈ భవనం ఆడ్డంకిగా మారింది. ఈ భవనం రూపంలో ఏ క్షణాన ముప్పు వాటిల్లుతుందోనన్న ఆందోళనతోనే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో సీఎండీఏ నిపుణులు ఆ భవనాన్ని పరిశీలించి అది కూడా ముప్పు అంచున ఉన్నట్టు తేల్చారు. ఈ భవనానికి ఓ వైపున పునాదులు ఒక అడుగు కిందకు దిగి ఉండటం, కొన్ని చోట్ల పగుళ్లతో భవనం వాలినట్టు ఉండటాన్ని గుర్తించారు. ఆ భవనం లోపలి భాగంలో పలు చోట్ల గోడలు పగిలి శిథిలాలు ఉండడంతో ఈ భవనం ముప్పు అంచున ఉన్నట్టు నిర్ధారించి ఉన్నారు. దీన్ని ఏమి చేయాలోనన్నది తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం సీఎండీఏ వర్గాలు ఎదురు చూపుల్లో ఉన్నారు. ఉన్నత స్థాయి కమిటీ కి ఆమోదం లభించిన మరుక్షణం పూర్తి స్థాయి పరిశీలనతో ఆ భవనాన్ని కూల్చడమా లేదా, మరేదేని మార్గాలు అన్వేషించడమా అన్నది తేల్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ రెండు భవనాల నిర్మాణానికి నమూనా, డిజైనింగ్ సిద్ధం చేసి సంస్థ బోగస్‌గా తేలింది. జాతీయ భవన నిర్మాణ డిజైనింగ్ కౌన్సిల్లో ఆ సంస్థకు కనీసం సభ్యతం కూడా లేనట్టు పరిశీలనలో తేలింది. పరిసరవాసుల్లో ఆందోళన : అధికారులకు తమ గోడు పట్టనట్టుందని ట్రస్ట్ హైట్స్ భవనాల చుట్టూ ఉన్న నివాసాల్లోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలి భవనం కూలిన క్షణాల్లో ఆ ప్రభావం పరిసరాల్లోని 30 ఇళ్ల మీద పడింది. పది ఇళ్ల వరకు పూర్తిగా దెబ్బ తినగా, మిగిలిన ఇళ్లు పాక్షింగా దెబ్బ తిన్నాయి. గోడలు పెద్ద ఎత్తున బీటలు వారి, పై కప్పులు అక్కడక్కడ కూలిపోవడంతో ఆందోళనలో పడ్డ అక్కడి కొన్ని కుటుంబాలు తమ బంధువుల ఇళ్లల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి. మరి కొన్ని కుటుంబాల ఆందోళన వర్ణనాతీతం. తమ ఇళ్లలోకి వెళ్లి కనీసం దుస్తులు కూడా తీసుకోలేని పరిస్థితి. దీంతో ఆ పరిసరాల్లోని తెలిసిన వాళ్ల ఇళ్లల్లో బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. తమ గోడును ఇంత వరకు ఏ అధికారీ పట్టించుకోక పోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రమాద బాధితులను ఆదుకుంటున్న తరహాలో తమను ఆదుకోవాలని, తమ ఇళ్లను పునర్నిర్మించేందుకు ప్రభుత్వం సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక, రెండో భవనం పరిసరాల్లో ఉన్న ఇళ్ల యాజమాన్యాల్లో, అద్దెకు ఉంటున్న కుటుంబాల్లో మరింత ఆందోళన నెలకొంది. ఈ భవనం రూపంలో ఎక్కడ తమకు ముప్పు వాటిల్లుతుందోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. ఈ భవనానికి అనుకుని స్కూల్ సైతం ఉంది. దీంతో ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియని దృష్ట్యా, ఆ పరిసర వాసులను ముందు జాగ్రత్త చర్యగా ఖాళీ చేయించేందుకు రెడీ అవుతున్నారు. ఇళ్లను ఖాళీ చేసి వెళ్లాలంటూ పోలీసులు హెచ్చరిస్తున్నా, తామెక్కడికి వెళ్లాలో, ఎక్కడ, ఎన్ని రోజులు తల దాచుకోవాలోనన్న విషయాన్ని అధికారులు చెప్పకపోవడంతో అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. కనీసం తమకు ఆశ్రయం కల్పించే విధంగా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడుపు మాడ్చుకుని, అప్పొసప్పో చేసి ఇళ్లను నిర్మించు కుంటే, ఆ భవనం రూపంలో ముప్పు ఎదురవుతుండడం, ఇందులో అధికారుల తప్పులు సైతం ఉన్నాయంటూ ఆ పరిసర వాసులు ఏకరువు పెడుతున్నారు. -
పడిగాపులు
తమ వాళ్ల కడచూపు కోసం రాయపేట మార్చురీ వద్ద ఆప్తులు, కుటుంబాలు పడిగాపులు కాస్తున్నాయి. మృత దేహాలను గుర్తించడం, పోస్టుమార్టం, సమగ్ర విచారణ అనంతరం అప్పగించడంలో జాప్యం నెలకొంటోంది. దీంతో మార్చురీ వద్ద ఆప్తులు, కుటుంబీకులు తీవ్ర ఆవేదనలో మునిగి ఉన్నాయి. సాక్షి, చెన్నై:మౌళివాకం ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను రాయపేట మార్చురీకి తరలిస్తున్నారు. మంగళవారం ఉదయానికి 27 మృతదేహాలను ఆ మార్చురీకి తరలించారు. అయితే, కొన్ని మృతదేహాలు ఛిద్రమై ఉండడంతో గుర్తించడం కష్టతరంగా మారుతోంది. తమ వాళ్ల కోసం మార్చురీ వద్దకు పరుగులు తీస్తున్న వాళ్లకు ఆ మృతదేహాలను చూపిస్తున్నారు. అయితే, గుర్తించడం కష్టతరం అవుతుండడంతో కొన్ని మృతదేహాల ఆచూకీ, వివరాలు కనుగొనడంలో ఆటంకం ఏర్పడుతోంది. అదే సమయంలో తమ వాళ్లు మరణించారన్న సమాచారం ఉన్నా, వారి మృతదేహాలు రాయపేటలో ఉన్నాయా? కేఎంసీలో ఉన్నాయా? లేదా రామచంద్ర ఆస్పత్రిలో ఉన్నాయా? అన్నది తేల్చుకునేందుకు అక్కడక్కడ పరుగులు పెట్టే వాళ్లూ ఉన్నారు. ఇక, తమ వాళ్ల మృతదేహాలు మార్చురీలో ఉండటంతో పరిశీలన, పోస్టుమార్టం ఎప్పుడు పూర్తి అవుతుందో, ఎప్పుడు అప్పగిస్తారో తెలియక రాయపేట మార్చురీ వద్ద తీవ్ర మనో వేదనతో పడిగాపులు కాస్తున్న కుటుంబాలు అనేకం. మరి కొందరికి మృతదేహాలు చూసే అవకాశం దక్కడం లేదు. ఆంధ్ర రాష్ట్రం విజయనగరం, శ్రీకాకుళంవాసులే కాకుండా, తమిళనాడుకు చెందిన బాధితులు సైతం ఇక్కడ మృత దేహాల కోసం వేచి ఉన్నారు. సుమారు పదిహేనుకు పైగా కుటుంబాలు ఇక్కడ తమ వాళ్ల కడచూపు కోసం ఎదురు చూపుల్లో ఉన్నాయి. మృత దేహాలను స్వగ్రామాలకు తీసుకెళ్లి అంత్యక్రియలు జరుపుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఆర్థిక కష్టాలు : అనేక తెలుగు కుటుంబాలు చేతిలో చిల్లిగవ్వ లేకుండా మార్చురీ వద్ద తీవ్ర మనోవేదనలో మునిగి ఉన్నాయి. వేతనం రోజునే ప్రమాదం జరిగిన దృష్ట్యా, చేసిన కష్టానికి ప్రతి ఫలం లేక కొందరు, తెచ్చుకున్న డబ్బులు సంఘటనా స్థలానికి, ఆస్పత్రికి అంటూ అక్కడా..ఇక్కడ తిరగడంతో అయిపోయూయి. ఇలా అనేక కుటుంబాలు చేతిలో చిల్లిగవ్వకూడా లేకుండా కన్నీటి పర్యంతమవుతున్నారు. హెల్ప్‌లైన్ వద్ద ఇచ్చే అన్నం, నీళ్ల ప్యాకెట్లతో కడుపు నింపుకుంటూ మృత దేహాలను తమ స్వగ్రామాలకు తీసుకెళ్లేందుకు బరువెక్కిన గుండెతో చెట్ట నీడన కూర్చుని ఉన్నారు. దుర్గంధం : మార్చురీ వద్ద బాధిత కుటుంబాల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. ఇటు తమిళనాడు అధికారులు, అటు ఆంధ్రా నుంచి వచ్చిన రెస్క్యూ టీం అధికారి, విజయనగరం హౌసింగ్ విభాగం డెప్యూటీ ఇంజనీర్ మురళీ మోహన్ తమకు అందిన సమాచారాన్ని బాధిత కుటుంబాలకు అందజేస్తున్నారు. అయితే, ఆ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసిన పరిసరాలు, మార్చురీ మార్గాలు ఉద యాన్నే దుర్గంధంగా మారాయి. దీంతో అక్కడ ఆగమేఘాలపై బ్లీచింగ్, క్రిమి సంహారక మందులు చల్లారు. హెల్ప్‌లైన్ అధికారులతో పాటుగా, అక్కడున్న బాధిత కుటుంబాలకు మాస్కులు అందజేశారు. గుర్తించ లేనివి : పన్నెండు మృత దేహాలు గుర్తించలేని రీతిలో చితికిపోయినట్టు మార్చురీ వర్గాలు, వైద్య బృందాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, ఆ మృతదేహాలను బాధిత బంధువులు పరిశీలిస్తున్నారు. కొన్నింటిని గుర్తించినా, ఎక్కడో మెలిక పెడుతుండడంతో, అనుమానంతో తదుపరి ఆ మృత దేహం కోసం ఎవరైనా వస్తారా? అన్న ఎదురు చూపుల్లో మార్చురీ వర్గాలు ఉన్నాయి. 27 మృతదేహాల్లో 18 పురుషులు, 9 మహిళలవి. ఇప్పటి వరకు ఒడిశాకు చెందిన నాలుగు, విల్లుపురానికి చెందిన రెండు, అంబత్తూరు, విజయనగరానికి చెందిన ఓ మృత దేహాన్ని ఇప్పటి వరకు బాధిత కుటుంబాలకు అప్పగించారు. గుర్తించని 12 మృతదేహాల్లో ఐదు స్త్రీలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. మృతదేహాల్ని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులతో అంబులెన్స్‌లలో పంపిస్తున్నారు. ఎదురు చూస్తున్నాం మా బంధువు పద్మ ఈ ప్రమాదంలో మరణించింది. ఆమెను గుర్తించాం. అయితే, పోస్టుమార్టం అనంతరం మృత దేహం అప్పగిస్తామన్నారు. నేను ఒరగడంలో పనిచేస్తుంటాను. బంధువులు అప్పన్న, పద్మలు ప్రమాదం జరిగిన చోట రెండు నెలలుగా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అప్పన్న ప్రమాదం నుంచి బయట పడ్డాడు. పద్మ మరణించడంతో ఆమె మృత దేహం కోసం ఇక్కడ ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు ఇస్తారో...ఎప్పుడు మా ఊరెళ్లాలో తెలియడం లేదు. - సూర్యనారాయణ, నర్సన్న పేట మండలం, శ్రీకాకుళం మరదలు చనిపోయింది అమ్మ, నాన్నతో పాటుగా మరదలు దుర్గా ప్రమాదం జరిగిన భవనంలో పనిచేశారు. దుర్గా మరణించినట్టు అధికారులు చెప్పారు. అయితే, అమ్మ నాన్నలు అప్పలరాము, లక్ష్మిల జాడ ఇంకా తెలియలేదు. దుర్గా మృత దేహాన్ని మార్చురీలో గుర్తించాను. ఇంకా, అమ్మనాన్నల జాడ తెలియలేదు. ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఇక్కడ తిరుగుతున్నాను. అన్ని ఏర్పాట్లు చేశాం శ్రీకాకుళం, విజయనగరం బాధితుల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. మృత దేహాలు వస్తున్నాయి. ఇక్కడికి వచ్చే ప్రతి కుటుంబానికి, బంధువులకు వాటిని చూపించి గుర్తు పట్టే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనేక మృత దేహాలు గుర్తించాల్సి ఉంది. ఇక్కడికి వచ్చే తెలుగు బాధితుల కుటుంబాలకు పూర్తి సమాచారాన్ని అందజేస్తున్నారు. ఆహారం అందిస్తున్నాం. మృత దేహాల్ని అంబులెన్స్‌లో స్వగ్రామాలకు పంపించే ఏర్పాట్లు చేశాం. బాధిత కుటుంబాలకు ఖర్చులకు గాను రూ.రెండు వేలు ఇచ్చి పంపుతున్నాం. పది మంది మృత దేహాలు ఆంధ్రాకు చెందిన వారివి గుర్తించాల్సి ఉంది. విజయ నగరానికి చెందిన సింహమ్మ మృత దేహాన్ని వారి స్వగ్రామానికి పంపించాం. మిగిలిన వారిని గుర్తించి, పోస్టుమార్టం అనంతరం స్వగ్రామాలకు పంపుతాం. - మురళీ మోహన్ విజయనగరం డీఈ. హౌసింగ్ విభాగం ఇంజనీర్ -
ఇప్పటి వరకు 27 మంది మృతి...
చెన్నై: చెన్నై శివారులోని మౌళివాకంలో 11 అంతస్తుల భవనం కూలిన ఘటనపై తమిళనాడు ప్రభుత్వం మంగళవారం బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకూ ఈ ప్రమాదంలో 27మంది మృతి చెందినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మరో 24మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది. మృతి చెందినవారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నట్లు తెలిపింది. అలాగే క్షతగాత్రుల్లో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు మంత్రి అచ్చెంనాయుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
చెన్నైలో భవనం కూలిన ఘటనలో 24కు చేరిన మృతులు
చెన్నై మహానగరంలో భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరింది. భవన శిథిలాల కింద మంగళవారం మరో మృతదేహన్ని కనుగొన్నారు. మృతుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహేశ్‌గా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. శిథిలాల కింద 26 మంది చిక్కుకున్నారని భావిస్తున్నట్లు చెప్పారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. భారీ వర్షాల కారణంగా శనివారం 11 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఆ ఘటనలో 18 మంది మృతి చెందారు. మరో 26 మంది ఆచూకీ తెలియకుండా పోయారు. -
కన్నీటి నిరీక్షణ!
సాక్షి, చెన్నై : మౌళివాకంలో రెస్క్యూ ఆపరేషన్ మూడో రోజుకు చేరింది. నిర్విరామంగా 40 గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్‌లో జాతీయ విపత్తుల నివారణ బృందం, ప్రత్యేక శిక్షణ పొందిన హోం గార్డ్స్, కమాండోస్, వైద్య, రెవెన్యూ శాఖలు తమ సేవలను అందిస్తూ వస్తున్నాయి. ఓ వైపు ఆపరేషన్ శరవేగంగా సాగుతున్నా, మరో వైపు తమ వాళ్ల జాడ కోసం కళ్లు కాయలు కాసేలా బాధిత కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. తమ వాళ్లు బతికే ఉంటారన్న చిన్న ఆశ ఎక్కడో ఉన్నా, రోజులు గడుస్తున్న కొద్దీ తెలియని ఆందోళన ఆ కుటుంబాల్లో మొదలైంది. ఆప్తుల కోసం భార్య కోసం, భర్త, భర్త కోసం భార్య, కుటుంబం కోసం ఆప్తులు, తల్లిదండ్రుల కోసం తనయుడు, తనయుడి కోసం తల్లిదండ్రులు, అమ్మానాన్నల కోసం చంటి బిడ్డలు ఇలా ....సర్వత్రా తమ వాళ్ల కోసం కన్నీటి వేదనలో మునిగి ఉన్నారు. శిథిలాల కింద నుంచి కొందరిని సురక్షితంగా వెలికితీసినా, వారిలో తమ వాళ్లు ఉన్నారో..లేదో అని తెలుసుకోలేని పరిస్థితి. రామచంద్ర ఆస్పత్రికి పరుగులు తీస్తే, అక్కడ సెక్యూరిటీల అడ్డు. దీంతో బతికి ఉన్న వారిలో తమ వాళ్లు ఉన్నారో లేదో తెలుసుకోవడానికి కూడా పడిగాపులు కాయాల్సిన పరిస్థితిలో బాధిత కుటుంబాలు ఉన్నా యి. శ్రీకాకుళంకు చెందిన తన సోదరి కళావతి, బావ రాము జాడ కోసం బావమరిది అప్పలరాజు అటు ఆస్పత్రికి, ఇటు సంఘటనా స్థలానికి పరుగులు తీస్తున్నాడు. తన సోదరి పిల్లలు మణిగండన్, సంజన తన వద్దే ఉన్నారని, వారిద్దరూ తమకు లేకుండా పోతే, ఆ పిల్లలకు ఏ సమాధానం ఇవ్వాలో తెలియదంటూ రామచంద్ర ఆస్పత్రి వద్ద అప్పలరాజు విలపిస్తున్నాడు. అక్క, బావలు ప్రాణాలతో ఉండాలని దేవుడిని వేడుకుంటున్నట్టు అప్పలరాజు కన్నీటి సంద్రంలో మునిగాడు. తన భార్య జ్యోతి జాడ కానరాలేదంటూ శ్రీకాకుళంకు చెందిన సింహాచలం తీవ్ర ఆవేదనలో ఉన్నాడు. కూలిన భవనంలో వంట చేస్తున్న జ్యోతి తన కళ్లేదుటే కిందకు కూరుకు పోయిందని, ఆమెను రక్షించలేని నిస్సహాయుడిగా మరో భవనం మీద తాను ఉండాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమవుతున్నాడు. ఐదుగురికి శస్త్ర చికిత్స రామచంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురికి శస్త్ర చికిత్స నిర్వహించేందుకు వైద్యులు నిర్ణయించారు. సంఘటనా స్థలం నుంచి రక్షితులైన 23 మందిని రామచంద్ర ఆస్పత్రికి తీసుకొచ్చినట్టు ఆరోగ్య శాఖ అధికారి కులందై వేల్ తె లిపారు. 22 మంది ఆరోగ్యంగానే ఉన్నారని, ఒకరిని మాత్రం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ఇక్కడున్న 22 మందిలో ఐదుగురికి కాలు, చేతి బాగాల్లో ఎముకలు విరిగాయని, వీరికి శస్త్ర చికిత్స నిర్వహించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. మిగి లిన వారిలో 15 మంది ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఎక్స్‌గ్రేషియో పెంపు రాష్ట్రానికి చెందిన బాధితులకు ఎక్స్‌గ్రేషియోను పెంచుతూ సీఎం జయలలిత ఆదేశాలు ఇచ్చారు. మౌళివాకం బాధితులను ఆదివారం సీఎం జయలలిత పరామర్శించిన విష యం తెలిసిందే. మృతులకు రూ.రెండు లక్షలు, గాయపడ్డ వారికి రూ.50వేలు ప్రకటించారు. అయితే, ఆంధ్రప్రదేశ్ బాధితులకు అక్కడి ప్రభుత్వం ప్రత్యేకంగా ఎక్స్‌గ్రేషియో ప్రకటించడంతో, తమిళనాడు బాధితులకు ఎక్స్‌గ్రేషియోను పెంచుతూ ఆదేశాలు ఇచ్చారు. మృతుల్లో తమిళనాడుకు చెందిన నలుగురు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఇది వరకు ప్రకటించిన రెండు లక్షలతో పాటుగా మరో ఐదులక్షలు అందజేయనున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారి మృత దేహాల్ని ప్రభుత్వ ఖర్చుతో వారి స్వగ్రామాలకు పంపించనున్నామన్నారు. ఆస్పత్రి వైద్య ఖర్చులన్నీ తామే భరిస్తామని ప్రకటించారు. అధికారుల మెడకు ఉచ్చు మౌళి వాకం ఘటన ఉచ్చు ఎక్కడ తమ మెడకు చుట్టుకుం టుందోనన్న భయం అధికారుల్లో గుబులు మొదలైంది. పోరూర్ డివిజన్ పరిధిలోని టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు ఆయా భవనాల నిర్మాణ పనుల్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. అయితే, ఇక్కడి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు, ఇష్టారాజ్యంగా పంచాయతీ అనుమతుల్ని ఇచ్చేస్తూ, సీఎండీఏకు రెఫర్ చేస్తున్నట్టుగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ డివిజన్ పరిధిలోని అధికారుల్లో దడ మొదలైంది. ఎక్కడ తమను పోలీసులు విచారణకు పిలిపిస్తారోనన్న ఆందోళనలో పడ్డారు. జిరాక్స్ కాపీల్లో ఫొటోలు మృతుల వివరాలను వారి ఆప్తులు, బంధువులకు తెలియజేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. తమ వాళ్ల జాడ కోసం ఆస్పత్రి, సంఘటనా స్థలానికి ఆప్తులు పరుగులు తీస్తుండంతో సోమవారం సాయంత్రం కాంచీపురం జిల్లా కలెక్టర్ భాస్కరన్ ఆదేశాలతో కాంచీపురం జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు. రాయపేట మార్చురిలో ఉన్న మృత దేహాలను ఫొటో తీసి, జిరాక్స్ కాపీల రూపంలో రామచంద్ర ఆస్పత్రి వద్దకు, సంఘటనా స్థలానికి వచ్చే ఆప్తులు, బంధువులకు అందించి, గుర్తించే పనిలో పడ్డారు. వారు ఇచ్చే సమాచారం, గుర్తించే మేరకు పోస్టుమార్టం అనంతరం మృతదేహాలని బాధిత కుటుంబాలకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
భద్రతకు భరోసా ఏదీ?
సాక్షి, చెన్నై: చెన్నై నగరంలో ఇళ్ల అద్దెలు ఆకాశాన్నంటుతున్నాయి. చిన్న గది కూడా ఊహించ నంత రీతిలో అద్దె పలకడంతో సామాన్యుడిపై పెనుభారం పడుతోంది. దీంతో చిన్న చిన్న ఉద్యోగులు అగ్గిపెట్టెల్లాంటి ఇరుకు గదుల్లో తమ జీవితాలను సాగదీస్తున్నారు. ఇక, కడుపులు మాడ్చుకుని తమ సంపాదనలో కొంత భాగాన్ని భద్ర పరుచుకుంటూ సొంత ఇంటి కలను సాకారం చేసుకుంటున్న వాళ్లూ ఉన్నారు. అప్పోసప్పో చేసి సొంత ఇంట్లో చేరిపోవాలన్న ఆశల పల్లకిలో పరుగులు తీసే వారూ ఉన్నారు. వీరందరినీ ఆకర్షించే విధంగా భవన నిర్మాణ సంస్థలు ముందుకు సాగుతున్నాయి. విస్తరణ: చెన్నై ఇటీవల మహానగరంగా విస్తరించింది. కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లోని అనేక ప్రాంతాలు మహానగరం పరిధిలోకి చేరాయి. దీంతో నగర శివారుల మీద దృష్టి పెట్టే వారు అధికం అయ్యారు. శివారు ప్రాంతాల్లో మధ్య, ఉన్నత కుటుంబాల వారిని ఆకర్షించే అనేక రకాల నివాస గృహాల నిర్మాణాల మీద అనేక సంస్థలు దృష్టి పెట్టాయి. ఉన్నత వసతులు కలిగిన ఇళ్లను, వారికి తగిన రేట్లలో సమకూర్చే పనిలో పడ్డాయి. అడ్వాన్స్‌లను రాబట్టి నిర్మాణాల వేగం పెంచి నాణ్యతకు, నిబంధనలకు తిలోదకాలు ఇచ్చేస్తున్నాయి. విచ్చలవిడిగా నిర్మాణాలు: నగర శివారులోని పోరూర్, కుండ్రత్తూరు, గూడువాంజేరి, వండలూరు, మన్నివాక్కం, మణి మంగళం, ఒరగడం, సింగ పెరుమాల్ కోవిల్, జీఎస్టీ రోడ్డు, ముడిచ్చూర్, తాంబరం పరిసరాలు, మేడవాక్కం పరిసరాలు, పళ్లికరనై, నీలాంగరై, ఓల్డ్ మహాబలిపురం మార్గాల్లో విచ్చలవిడిగా భవన నిర్మాణాలు సాగుతున్నాయి. ఓ వైపు ఐటీ సంస్థల నిర్మాణాలు, మరో వైపు ఇక్కడి ఉద్యోగులను ఆకర్షించే విధంగా విల్లాలు, డూప్లెక్స్లు నిర్మించేస్తున్నారు. భరోసా కరువు: చెన్నైలో ఒకప్పుడు ఎల్ఐసీ భవనమే అతి పెద్దది. ఇప్పుడు ఆ దాన్ని మించిన అంతస్తులతో కూడిన నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి. ఈ బహుళ అంతస్తుల్లో ఏళ్ల తరబడి జీవనం సాగిస్తున్న ప్రజలు అనేకం. ఇక నగర శివారుల్లో సాగుతున్న నిర్మాణాలు ప్రజల భద్రతకు భరోసా దక్కే రీతిలో ఉన్నాయా? అన్నది ప్రశ్నార్థకం అవుతోంది. నిబంధనలను, నాణ్యతను సక్రమంగా పాటిస్తున్నారా? అన్న ఆందోళన కొనుగోలుదారుల్లో బయలు దేరింది. నగర శివారులో 30 అంతస్తులతో కూడిన ఆరు అతిపెద్ద బహుళ అంతస్తుల భవనాలు, 28 అంతస్తులతో కూడిన మరో ఆరు, 20 అంతస్తులతో కూడిన 8 భవనాలు నిర్మాణ ముగింపుదశలో ఉన్నారుు. 20 నుంచి 40 అంతస్తులతో కూడిన 32 భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. మరో 59 బహుళ అంతస్తుల భవనాలు సీఎండీఏ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ భవనాల నిర్మాణ పనులు లాంఛనంగా ఆరంభం అయ్యాయని చెప్పవచ్చు. నిబంధనలకు పాతర: భవనాలు నిర్మించే సమయంలో తూచా తప్పకుండా నిబంధనల్ని, నాణ్యతల్ని పాటించాల్సిన అవశ్యకత ఉంది. అతి పెద్ద బహుళ అంతస్తుల్ని నిర్మించే సమయంలో విపత్తుల్ని ఎదుర్కొనే రీతిలో నిర్మాణాలు సాగించాల్సి ఉన్నా, పాటించే వాళ్లు అరుదే. ఇందుకు గాను, నగరాభివృద్ధి చట్టాల్లో ఉన్న పాత నిబంధనల్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జాతీయ విపత్తుల భద్రత పేరిట కొన్ని నిబంధనలను, కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ గత ప్రభుత్వానికి సిఫారసు చేసింది. నగరాభివృద్ధి చట్టాల్లో, నిబంధనల్లో సవరణలు తెచ్చే విధంగా చేసిన సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించింది. అయితే, అమల్లో జాప్యం నెలకొంటోంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ న్యాయమూర్తి మోహన్ కమిటీ నగరాభివృద్ధి చట్టంలో సవరణకు సూచనలు ఇచ్చింది. భవన నిర్మాణ నిబంధనలను కఠినతరం చేస్తూ సిఫారసులు చేసినా ఇంత వరకు అమల్లోకి రాలేదని చెప్పవచ్చు. సవరణలు సాగేనా?: విచ్చలవిడిగా బిల్డర్ల రాజ్యం సాగుతుండడం, నిబంధనలను తుంగలో తొక్కి భవన నిర్మాణాలు కుప్పలు కుప్పలుగా సాగుతుండడంతో ఇకనైనా చట్టాల్లో సవరణలు సాగేనా? అన్న ప్రశ్న బయలు దేరింది. మౌళి వాకం ఘటన కార్మికుల్ని బలిగొంది. అదే ఆ భవనం నిర్మాణం పూర్తి చేసుకుని ఉంటే, సొంతింటి కల సాకారం చేసుకున్న ఎన్నో కుటుంబాలు జీవచ్చవాలుగా మారి ఉండేవి. ఇప్పటికైనా కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీల సిఫారసులను పరిగణనలోకి తీసుకుని భవన నిర్మాణ చట్టాల్ని కఠినతరం చేస్తూ సవరణలకు ప్రభుత్వం సిద్ధం అయ్యేనా అన్న ఎదురు చూపులు ప్రజల్లో పెరిగాయి. ఈ విషయంగా సీఎండీఏ అధికారి ఒకర్ని కదిలించగా, పాత నిబంధనలు కొన్ని భవన నిర్మాణ సంస్థలకు అస్త్రాలుగా మారుతున్నాయని, ఈ దృష్ట్యా, నిబంధనలను పక్కన పెట్టి నిర్మాణాలు వేగవంతం చేస్తున్నాయని వివరించారు. భవన నిర్మాణాల అనుమతులకు సంబంధించి నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ, నగరాభివృద్ధి చట్టాల్లో ఏడు అంశాల సవరణలకు చేసిన సిఫారసుల నివేదిక సిద్ధంగా ఉందన్నారు. పాలకుల నుంచి ఆదేశాలు వస్తే చాలు కొరడా ఝుళిపించడంతో పాటుగా బహుళ అంతస్తుల్లో నివాసాలు ఉండే ప్రజల భద్రతకు పూర్తి భరోసా దక్కే అవకాశం ఉందని పేర్కొనడం గమనార్హం. -
మృత్యుంజయురాలు కృష్ణవేణి
హిరమండలం: చెన్నైలో మూడు రోజుల కిందట జరిగిన దుర్ఘటన నుంచి గొట్టాకు చెందిన ఓ మహిళ ప్రాణాలతో బైటపడింది. బహుళ అంతస్తుల భవనం శిథిలాల కింద చిక్కి రెండు రోజులు నరకం అనుభవించిన ఆమెను సోమవారం సాయంత్రం సహాయక బృందం సభ్యులు ప్రాణాలతో బైటకు తీశారు. ఈ సమాచారం అందిన వెంటనే ఆమె కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇది ఆమెకు పునర్జన్మేనని గ్రామస్తులు అంటున్నారు. వివరాలు ఇవీ... చెన్నైలో జరిగిన దుర్ఘటనలో శిథిలాల కింద హిరమండలం మండలం గొట్టకు చెందిన మీసాల శ్రీను, ఆయన కుమార్తె భవాని, కొంగరాపు కృష్ణవేణి, ఆమె భర్త శ్రీను, లక్ష్మీపురానికి చెందిన పెసైక్కి జ్యోతి చిక్కుకున్న విషయం పాఠకులకు తెలిసిందే. శిథిలాలు తొలగిస్తుండగా కృష్ణవేణి ప్రాణాలతో బయటపడింది. విషయం తెలిసి ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా తతిమా వారు కూడా ప్రాణాలతో బైటపడొచ్చన్న ఆశ గ్రామస్తుల్లో చిగురిస్తోంది. దుర్ఘటన జరిగిన వెంటనే ఇక్కడి నుంచి చెన్నై వెళ్లిన వారు ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఇక్కడకు చేరవేస్తునే ఉన్నారు. వీరిలో ఒకరైన ఆర్ఐ శంకర్‌ను సంప్రదించగా కృష్ణవేణి ఆరోగ్యం నిలకడగా ఉందని, స్వల్ప గాయాలు తగలడంతో రామచంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని చెప్పారు. కాగా కృష్ణవేణి తన పిల్లలు సాయి, సుశ్మితతో ఫోన్లో మాట్లాడారు. తాను క్షేమంగానున్నానని త్వరలోనే ఇంటికొచ్చేస్తానని చెప్పింది. సంఘటన జరిగిన సమయంలో భర్త తనను బయటకు నెట్టివేయడం వల్లే బతికానని, ఆయన ఆచూకీ ఇంకా తెలియరాలేదని చెప్పిందని గ్రామస్తులు తెలిపారు. అలాగే పెసైక్కి సింహాచలం ఫోన్లో మాట్లాడుతూ తన భార్య జ్యోతి ఇంకా శిథిలాల కిందే ఉందని చెప్పారు. అయితే సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. చైన్నై అధికారులు భోజనాల ఏర్పాట్లు చేస్తున్నారని, కానీ కుటుంబ సభ్యులు చిక్కుకోవడంతో తామే పస్తులుంటున్నామని చెప్పారు. పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, పాలకొండ ఆర్డీవో తేజ్‌భరత్, రాజాం తహశీల్దార్ జె.రామారావు, హిరమండలం ఆర్ఐ శంకర్ రావడంతో తమకు మానసిక స్థైర్యం వచ్చిందన్నారు. -
చెన్నై బాధిత కుటుంబాలకు నెల రోజుల రేషన్
శ్రీకాకుళం కలెక్టరేట్: చెన్పైలో భవనం కూలిన సంఘటనకు బాధిత కుటుంబాలకు నెల రోజులకు సరిపడా రేషన్ అందిస్తామని ఇన్చార్జి కలెక్టర్ జి.వీరపాండ్యన్ తెలిపారు. ఈమేరకు ఆయన సోమవారం సాయంత్రం అదేశాలు జారీచేశారు. జిల్లా వాసుల యోగక్షేమాలు తెలుసుకుని వారికి సహాయం చేసేందుకు పాలకొండ ఆర్డీవో ఎన్.తేజ్‌భరత్, రాజాం తహశీల్దారు, హిరమండలం ఆర్ఐ చెన్నై వెళ్లారని, వారి నుంచి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామన్నారు. రామచంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హిరమండలం(గొట్టా) వాసి కొంగరాపు కృష్ణవేణిని అధికారులు పరామర్శించారని చెప్పారు. శిథిలాల నుంచి 41 మందిని బయటకు తీశారని, వీరిలో 18 మంది మృతి చెందగా వారిలో ఆరుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని సమాచారం అందిందని తెలిపారు. మృతుల్లో నరసన్నపేట మండలం బాలసీమకు చెందిన డి.అప్పన్న భార్య పద్మ ఉన్నట్లు వెల్లడించారు. ప్రమాదం నుంచి తప్పించుకున్న జిల్లా వాసుల సహాయంతో శిథిలాల కింద ఉన్న మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో మృత్యువాత పడిన వారి కుటుంబానికి రూ.5 లక్షల నష్ట పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, తమిళనాడు ప్రభుత్వం మరో రూ.2 లక్షలు ఇస్తోందని తెలిపారు. గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఇస్తున్నారన్నారు. -
అమ్మను చూడాలి...నాన్నతో ఆడాలి...!
మక్కువ: మండలంలోని గైశీల శోక సంద్రంలా మారింది. ఎటువైపు చూసినా రోదనలు వేదనలతో కన్నీటి లోకంగా మారిపోయింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు భవన ప్రమాదంలో చనిపోయాడని తెలుసుకున్న ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు ఆపడం ఎవరి తరం కావడం లేదు. కూతురు కూడా అసువులు బాసిందని తెలిసి ఆ అమ్మానాన్నల రోదన ఆగడం లేదు. రెండురోజులుగా వారు భవన ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం ఎదురుచూస్తున్నారు. కన్నబిడ్డలపై ఆశలు వదులుకోలేక బతికి వస్తారేమోనని ఆశగా నిద్రాహారాలు మాని మరీ ఎదురుచూస్తున్నారు. కొడుకు వెంపడాపు శంకరరావు మృతిచెందాడని తెలుసుకున్న తల్లి నారాయణమ్మ, తండ్రి అప్పలనాయుడులు భోరున విలపిస్తున్నారు. కూతురు సరస్వతి కూడా చనిపోయింది. అలాగే భ ర్త మృతి చెందడంతో అతని భార్య దుర్గ రోదనను ఎవరూ ఆపలేకపోతున్నారు. ఇప్పటికే గ్రామం నుంచి పలువురు ప్రమాద స్థలానికి వెళ్లారు. ఆస్పత్రిలో ఉన్నవారిలో తమ వారిని గుర్తిస్తారని ఇక్కడి వారు ఆశగా ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు గైశీల గ్రామానికి చెందిన వెంపడాపు శంకరరావు మృతి చెందడంతో ఊహ కూడా తెలియని ఇద్దరు కుమారులు మూడేళ్ల నిఖిల్, 8 నెలలు హర్షవర్ధన్‌ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అలాగే మజ్జి సరస్వతి భవన శిథిలాల్లో చిక్కుకొని మూడో రోజు గడిచినా ఇంతవరకు ఆమె ఆచూకీ తెలియలేదు. దీంతో ఆమె పిల్లలు కిశోర్, కార్తీక్‌లు బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు. అదే గ్రామానికి చెందిన రాయిపిల్లి సతీష్ గాయాలపాలై ఆస్పత్రిలో ఉండగా, అతని భార్య ఆచూకీ తెలియకపోవడంతో పిల్లలు చందూ, శ్వేతాలు అమ్మా,నాన్నలు కావాలంటూ రోదిస్తున్నారు. జియ్యమ్మవలస: మండలంలోని ఇటిక పంచాయతీ నీలమాంబపురం గ్రామానికి చెందిన వారు చెన్నై భవన ప్రమాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. చనిపోయిన వారి మృతదేహాలు ఇప్పటివరకు రాకపోవడంతో సంబంధిత కుటుంబ సభ్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు. శనివారం జరిగిన ప్రమాదంలో గ్రామానికి చెందిన ముదిలి రామలక్ష్మి, మర్రాపు దమయంతి మృతదేహాలు లభ్యమవ్వగా మిగిలిన ముగ్గురు మర్రాపు వెంకటనాయుడు, తిరుపతినాయుడు, ముదిలి చిన్నంనాయుడుల ఆచూకీ తెలియక పోవడంతో వారి కుటుంబ సభ్యులు రెండు రోజుల నుండి తిండీతిప్పలు మాని రోదిస్తూ కూర్చుకున్నారు. చెన్నై నుంచి కూడా ఎలాంటి సమాచారం లేకపోవడంతో వీరు తమ వారు మళ్లీ వస్తారేమోనని ఆశగా ఉన్నారు. తండ్రి కోసం... శిథిలాల కింద చిక్కుకున్న మర్రాపు తిరుపతి నాయుడు ఆచూకీ ఇంతవరకు తెలియకపోవడంతో ఆయన కుమారుడు పోలినాయుడు ఆందోళన చెందుతున్నాడు. పోలినాయుడు 10 వ తరగతి చదువు చున్నాడు. తండ్రి భవన ప్రమాదంలో చిక్కుకున్నాడని తెలిసి బాలుడు విలవిలలాడిపోతున్నాడు. అక్క గర్భిణి కావడంతో అమ్మ మంగమ్మ చూడడానికి వచ్చిందని లేకుంటే అమ్మ కూడా ప్రమాదంలో చిక్కుకుని ఉండేదని తెలిపాడు. పై చదువులు చదివించడానికి... ప్రమాదంలో చిక్కుకుని ఆచూకీ తెలియకుండా పోయిన మర్రాపు వెంకటనాయుడు కోసం ఆయన కుమారుడు జయంత్ పరితపిస్తున్నాడు. జయంత్‌ను ఉన్నత చదువులు చదివించడానికి వెంకటనాయుడు కొడుకును రావివలస వసతి గృహంలో విడిచిపెట్టి భార్య సరోజనమ్మ, కుమార్తె దమయంతిని తీసుకొని చెన్నై వెళ్లారు. అయితే ఈ ప్రమాదంలో వెంకటనాయుడుతోపాటు దమయంతి కూడా బలయ్యారు. తల్లి సరోజనమ్మ మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకుంది. కళ్లెదుటే భర్త, కూతురు విగత జీవులుగా మారడంతో ఆమె వేదన వర్ణానాతీతం. నాన్న, అక్క చనిపోవడంతో జయంత్ బిత్తర చూపులతో కనిపిస్తున్నాడు. పిల్లలను ఇంటి వద్ద ఉంచి... పిల్లల భవిష్యత్ కోసం నాలుగు రాళ్లు సంపాదిద్దామని చిన్నారులను నానమ్మ వద్ద ఉంచి ముదిలి వెంకటరమణ, రామలక్ష్మి చెన్నై వెళ్లారు. కానీ ప్రమాదంలో తల్లి శవమై తేలింది. వెంకటరమణ మాత్రం ఏడో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. తల్లి చనిపోవడంతో దివ్య(8), రాణి(10)ల పరిస్థితి అగమ్యంగా మారింది. మా నాన్న మరి రారా..? ఇద్దరు ఆడపిల్లలు... మహాలకు్ష్మల్లా కళగా ఉన్నారు. కానీ ఆ కళను చూసే భాగ్యం తండ్రికి లేకుండా పో యిం ది. కె.కృష్ణాపురం గ్రామానికి చెందిన సిరిపురపు రాము... భార్య లక్ష్మి పిల్లలు ఏడేళ్ల వేదశ్రీ, ఐదేళ్ల ఐశ్వర్యలను అనాథలుగా వదిలేసి అనంత లోకాలకు వెళ్లిపొయారు. ఆ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పిల్లలు చదువుతున్నారు. పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలని రాము ఎంతో ఆశపడ్డారు. కానీ దేవుడు అంతలోనే ఆయనను పిల్లలకు దూరం చేశాడు. -
14కి చేరిన చెన్నై మృతుల సంఖ్య
చెన్నై: చెన్నైలో 11 అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 14కి చేరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి సోమవారం మృతి చెందాడు. కాగా భవన నిర్మాణానికి సంబంధించి మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా చెన్నై ప్రమాద సంఘటన బాధితులు పెరుగుతున్నారు. అక్కడ పని చేస్తున్న వారు ఎంత మంది గల్లంతయ్యారు? ఎంత మంది మృత్యువాత పడ్డారన్న సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న కొద్దీ మరింత మంది గల్లంతయ్యారనే సమాచారం వస్తోంది. -
చితికిపోయిన వలస బతుకులు
ఉన్న ఊళ్లో ఉపాధి కరువై.. బతుకు భారమై.. పొట్ట కూటి కోసం వందల కిలోమీటర్లు దాటి వెళ్లిన వారు.. బతుకుపోరులో సమిథలయ్యారు. చిన్న పిల్లలను కుటుంబ సభ్యుల వద్ద విడిచి వెళ్లి.. మృత్యుకుహరంలో కూరుకుపోయారు. నాలుగు రాళ్లు వెనకేసుకుందామనుకున్న వారి కలలు కల్లలయ్యాయి. పిల్లలకు మంచి చదువు చెప్పించాలన్న ఆశయం శిథిలాల కింద చిక్కుకుంది. రెండు రోజుల నుంచి ఏమయ్యారో తెలియక.. ఫోన్ మోగితే ఏ దుర్వార్త వినాల్సి వస్తుందోనన్న భయాందోళతో కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటున్నారు. తమ తల్లి దండ్రుల యోగ క్షేమాలు తెలియక చిన్నారులు బిత్తర చూపులు చూస్తున్నారు. విషాద వీచిక హిరమండలం (లక్ష్మీపురం) : చెన్నై ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకున్న గొట్ట, లక్ష్మీపురం గ్రామాలకు చెందిన ఆరుగురూ.. నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. ఉన్న ఊళ్లో ఉపాధి కరువై..నాలుగు రాళ్లు వెనకేసుకునేందుకు వెళ్లి..విగతజీవులైన మీసాల శ్రీను, కుమార్తె భవానీ, కొంగరాపు శ్రీను, భార్య కృష్ణవేణి, సారవకోట మం డలం పాయకవలసకు చెందిన శ్రీను బావమరిది ముద్ద శ్రీను, లక్ష్మీపురానికి చెందిన పెసైక్కి జ్యోతిలది ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ. సంక్రాంతి అనంతరం వెళ్లి.. గొట్ట గ్రామానికి చెందిన మీసాల శ్రీను కుటుంబం ఈ ఏడాది సంక్రాంతి అనంతరం చెన్నై వెళ్లింది. పెళ్లీడుకొచ్చిన కుమార్తె కళ్లెదుటే కనిపిస్తుండడంతో..నాలుగు పైసలు వెనకేసుకుందామనుకున్న వారి ఆశలు అడియాసలయ్యారు. భారీ భవంతి కూలడంతో తండ్రీ కూతుళ్లు చిక్కుకున్నారు. శ్రీను భార్య వరలక్ష్మి ఇటీవల గ్రామానికి వచ్చి..శనివారమే చెన్నై బయల్దేరింది. మార్గమధ్యలో ఉండగానే..భర్త, కుమార్తె శిథి లాల కింద ఉండిపోయారన్న విషయం తెలియడంతో..ముందుకెళ్లే ధైర్యం చెయ్యలేక పుట్టెడు దుఃఖంతో విజయవాడ నుంచి వెనుదిరిగింది. కుమారుడు లోకేష్ మాత్రం తండ్రి, చెల్లెలు కోసం సంఘటన స్థలంలో రోదిస్తున్నాడు. భార్యాభర్తలు.. అదే గ్రామానికి చెందిన కొంగరాపు శ్రీనుది విషాద గాథ. పిల్లలు సుస్మిత, సాయిలను వృద్ధులైన తల్లిదండ్రులు తులసమ్మ, రాములు వద్ద ఉంచి..నలభై రోజుల క్రితమే కూలిపని కోసం భార్య కృష్ణవేణి, సారవకోట మండలం పాయకవలసకు చెందిన బావమరిది ముద్ద శ్రీనుతో కలిసి చెన్నై వెళ్లాడు. భవన ప్రమాదంలో ముగ్గురూ చిక్కుకున్నారు. కృష్ణవేణి చిన్న సోదరుడు శ్యామలరావు పాముకాటుతో పదేళ్ల క్రితమే చనిపోవడంతో కన్నబిడ్డలెవరూ దక్కకుండా పోయరంటూ ఆమె తల్లి..విలపిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. పిల్లలను వదిలి వెళ్లి.. ఈ దారుణంలో బలైన జ్యోతిది మరో గాథ. పిల్లలు శ్రీను, మౌనికలను కుటుంబ సభ్యుల వద్ద ఉంచి..భర్త సింహాచలంతో కలిసి ఉపాధి కోసం ఇటీవలే.. చెన్నైకి వెళ్లింది. భర్త సిం హాచలం టీ తాగేందుకు బయటకు వచ్చి..తి రిగి వెళ్లేసరికి జ్యోతి భవన శిథిలాల కింది చిక్కుకుంది. ఈ దారుణాన్ని కళ్లారా చూసిన సింహాచలం అక్కడే కుప్ప కూలిపోయాడు. మనుమలు తల్లి ప్రేమకు దూరమయ్యారంటూ.. ఆమె అత్త విలపిస్తోంది. చెన్నై వెళ్లిన అధికారులు పాలకొండ రూరల్: చెన్నై మాంగాడు బహుళ అంతస్తుల భవనాలు ఆకస్మికంగా కూలిపోవడం..అక్కడ పాలకొండ డివిజన్‌కు చెందిన పలువురు శిథిలాల కింద చిక్కుకోవడంతో అధికారులు హుటాహుటిన చెన్నైకి బయల్దేరారు. వారి క్షేమ సమాచారం తెలుసుకుని, అవసరమైన సేవలు అందించేందుకు పాలకొండ ఆర్డీవో తేజ్‌భరత్‌తో పాటు రాజాం తహశీల్దార్ జె.రామారావు, హిరమండలం ఆర్ఐ శంకరరావు ఒక బృందంగా చెన్నైకి వెళ్లారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు శిథిలాల కింద చిక్కుకున్న వారి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు తన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఆర్డీవో తేజ్ భరత్ తెలిపారు. బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు 08941-260144 నంబర్‌కు ఫోన్ చేసి, సమాచారం తెలుసుకోవచ్చన్నారు. భామిని మండలానికి చెందిన ఇద్దరు, కొత్తూరులో ముగ్గురు, హిరమండలంలో ఐదుగురు, పాలకొండలో ఒక కుటుంబానికి చెందిన బాధితులున్నట్లు ఇప్పటి వరకు తమకు సమాచారమందిందన్నారు. కంట్రోల్ రూమ్ ఇన్చార్జిగా కార్యాలయ ఉపగణాంక అధికారి ఇ.లిల్లీ పుష్పనాథం వ్యవహరిస్తున్నారు. ఆలస్యంగా..! శ్రీకాకుళం: పొట్ట కూటి కోసం చెన్నై వెళ్లి.. బహుళ అంతస్తుల భవంతి కూలిన ప్రమాదంలో జిల్లా వాసులు చిక్కుకున్నా అధికారు లు ఆలస్యంగా స్పందించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రమాదంలో పాలకొండకు చెందిన ఐదుగురు, హిరమండలం గొట్ట గ్రామానికి చెందిన ఐదుగురు, లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఒకరు, కొత్తూరు మండలం ఇరాపాడు వాసులు ముగ్గురు, భామిని మండలం కొరమకు చెందిన ఇద్దరు, లక్ష్మీనర్సుపేట మండలానికి చెందిన ఇద్దరు, నరసన్నపేట మండలం బాలసీమకు చెందిన ఒకరు శిథి లాల కింద చిక్కుకున్నట్లు వారి కుటుంబ సభ్యులకు సమాచారమందింది. ఇంతటి ఘోర ప్రమాదం జరిగినా..అధికారులు ఆల స్యంగా స్పందించడంపై బాధితుల బంధువులు, కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. పొరుగు జిల్లా విజయనగరం బాధితుల కోసం అక్కడి కలెక్టర్ స్పందించినా.. మన వారికి పట్టకపోవడమేమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. బాధితుల సంఖ్య పాలకొండ డివిజన్లో ఎక్కువగా ఉండడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్డీవో తేజ్ భరత్ రాజాం తహశీల్దార్, హిరమండలం ఆర్ఐతో కలిసి చెన్నై బయల్దేరారు. కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు ప్రమాదంపై బాధిత కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. నెంబర్లు: 18004256625, 08942-225361, 9652838191కేటాయించారు. చెన్నైకి వెళ్లిన బంధువులు కొందరు బాధితుల బంధువులు శనివారం రాత్రే చెన్నై బయలుదేరి వెళ్లారు. అధికారులు కూడా కచ్చితమైన సమాచారం ఇవ్వక పో యినా.. సేకరించిన వివరాలు ప్రకారం 19 మంది వరకు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం.మన అధికారులు మాత్రం ఎంచక్కా..తమిళనాడు అధికారులు ఏమీ చెప్పడం లేదని వారిపైకి తోసేస్తున్నారు. కానీ నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎన్.శ్రీకాంత్‌ను సంప్రదించామని,సహాయక చర్యలు చేపట్టేందుకు సహకరించాలని కోరామని పేర్కొన్నారు. కొరమలో విషాదం భామిని (కొరమ): కొరమకు చెందిన దంపతుల ఆచూకీ తెలియకపోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. చెన్నైలో భవనం కూలి దాసరి రాము(35), కుమారి(29) శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆదివారం ఆర్ఐ పైడి కూర్మారావు, వీఆర్ వో కె.కృష్ణారావు, వీఆర్వోల సంఘ అధ్యక్షుడు కె.సన్యాసిరా వు తదితరులు బాధిత కుటుం బాన్ని పరామర్శించి, ఓదార్చా రు. వీరు ఈ ఏడాది జనవరిలో ఇక్కడి నుంచి వలస వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. వీరితో పాటు వెళ్లిన మరో నలుగురు క్షేమంగా ఉన్నట్లు ఇక్కడి వారికి సమాచారమందింది. -
ఎదురు చూపులే..!
విజయనగరం కంటోన్మెంట్: చెన్నైలో జరిగిన భవన ప్రమాదంలో చి క్కుకున్న వారి కోసం వారి కుటుంబ సభ్యులు కళ్లు కాయలు కాసే లా ఎదురుచూస్తున్నారు. గ్రామంలోకి ఎవరైనా వాహనంతో వస్తే చాలు ఏదైనా సమాచారం వచ్చిందేమోనని ఆశగా చూస్తున్నారు. కృష్ణాపురానికి చెందిన వారు గల్లంతు కావడంతో వారం తా మరణించారో లేక సజీవంగా ఉన్నారోనన్న ఆతృత గ్రామస్తుల్లో నెల కొంది. గ్రామానికి చెందిన ఒకరు మృతి చెందినట్టు తెలియడం, మరో పక్క మిగతా వారి జాడ తెలియకపోవడంతో ఇక్కడ గంభీర వాతావరణం నెలకొంది. బాడంగి, జియ్యమ్మవలస, మక్కువ మండలాల్లోనూ ఇదే పరిస్థితి. జిల్లా అధికారుల బృందం చెన్నై వెళ్లిన దగ్గర నుంచీ వారి నుంచి ఏదైనా సమాచారం వస్తుందోనని ఎదురు చూస్తున్నారు. అలాగే కృష్ణాపురం సర్పంచ్ మంత్రి రామారావు, ఆల్తిరామారావులు కూడా ట్రైన్లో చెన్నై వెళ్లారు. వారినుంచి క్షేమ సమాచారాలు వస్తాయని నిద్రాహారాలు లేక వీరు చూస్తున్నారు. జిల్లాలోని దత్తిరాజేరు మం డలం కోరపు కృష్ణాపురం, బాడంగి, మక్కువ మండలంలోని తూరుమామిడి గ్రామాలకు చెందిన కూలీలు శిథిలాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి కె.కృష్ణాపురానికి చెందిన సిరిపురపు రాము, బాడంగికి చెందిన శాంతికుమారిలు మృతి చెం దినట్టు గుర్తించామని కంట్రోల్ రూం సూపరింటెండెంట్ అప్పలనర్స య్య తెలిపారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం నీలమాంబపు రం గ్రామానికి చెందిన రామలక్ష్మి, మక్కువ పెదగైశిల గ్రామానికి చెం దిన వెంపడాపు శంకరరావు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. పెరుగుతున్న బాధితులు జిల్లాలో చెన్నై ప్రమాద సంఘటన బాధితులు పెరుగుతున్నారు. అక్కడ పని చేస్తున్న వారు ఎంత మంది గల్లంతయ్యారు? ఎంత మంది మృత్యువాత పడ్డారన్న సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న కొద్దీ మరింత మంది గల్లంతయ్యారనే సమాచారం వస్తోంది. నీలమాంబ పురం గ్రామానికి చెం దిన మర్రాపు వెంకటినాయుడు ఆయన కుమార్తె దమయంతిలు శిథిలాల కింద చిక్కుకున్నారు. అదే గ్రామానికి చెందిన మొదిలి రామలక్ష్మి, మొదిలి చిన్నంనాయుడు, మర్రాపు తిరుపతినాయుడులు గల్లంతయినవారి జాబితాలో ఉన్నట్టు సమాచారం. మూగబోయిన ఫోన్లు కలెక్టరేట్లో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన టోల్‌ఫ్రీ నెంబర్, ల్యాండ్‌లైన్ నంబర్లు పనిచేయడం లేదు. చెన్నై ప్రమాద దుర్ఘటన గూర్చి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తామనీ, తెలుసుకోవాలనుకునే వారు ఈ నంబర్లకు ఫోన్ చేయాలనీ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఇందుకోసం 1077 టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో పాటు మరో ల్యాండ్‌లైన్ నెంబర్ 08922-236947ను ప్రకటించారు. కానీ రెండు నెంబర్లూ పనిచేయడం లేదు. కంట్రోల్ రూం కొత్త నంబర్లివే... టోల్‌ఫ్రీ, ల్యాండ్లైన్నెంబర్లు పనిచేయకపోవడంతో కొత్తగా నెంబర్లను సూపరింటెండెంట్ అప్పలనర్సయ్య ప్రకటించారు. ప్రకటించిన నం బర్లు పనిచేయకపోవడంతో ఇక్కడ నైట్ డ్యూటీ చేసే వారి నంబర్లకు ఫోన్‌చేసి సమాచారం తెలుసుకోవచ్చని ఆయన చెప్పారు. కంట్రోల్ రూంలో ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లను నియమించినట్టు తెలిపారు. ఏ.పార్ధసారధి(8466091249), ఎన్.రవికుమార్(9908738336)ల నంబర్లకు ఫోన్‌చేసి సమాచారం తెలుసుకోవచ్చన్నారు. -
మృతదేహాలను త్వరగా తరలించాలి:ఎమ్మెల్యే రంగారావు
విజయనగరం: చెన్నైలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణరంగారావు పరామర్శించారు. ఈ ఘటనలో విజయనగరం జిల్లా కార్మికులే ఎక్కువ మంది మృతి చెందారు. దర్టీరాజేరు మండలం కృష్ణాపురం గ్రామం, మక్కువ మండలం సూరిమామిడి గ్రామాల్లో మృతుల కుటుంబాల వారు ఉన్నారు. వారిని పరామర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మృతదేహాలను త్వరగా సొంత గ్రామాలకు చేర్చాలని కోరారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించాలని రంగారావు కోరారు. ఇదిలా ఉండగా, మృతుల కుటుంబాలను మంత్రి మృణాళిని కూడా పరామర్శించారు. మృతులు ఒక్కొక్కరికి ప్రభుత్వం 5లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. -
శిథిలాల నుంచి ఓ బాలిక వెలికితీత
చెన్నై: మొగలివాక్కంలో భవనం కూలిన ప్రదేశంలో శిథిలాల నుంచి ఈ రోజు ఓ బాలికను బయటకు తీశారు. ఇక్కడ నిర్మాణంలో ఉన్న 11 అంతస్తుల భవనం నిన్న కూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పది మంది తెలుగు కార్మికులు మృతి చెందారు. ఇంకా శిథిలాలను తొలగిస్తున్నారు. కింద చిక్కుకున్నవారిని బయటకు తీస్తున్నారు. ఈ రోజు భవానీ అనే బాలికను వెలికి తీశారు. ఇప్పటి వరకు 21 మందిని సురక్షితంగా బయటకు తీసినట్లు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి కె.మృణాళిని సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు. మృతి చెందినవారిలో ఎక్కువ మంది కార్మికులు విజయనగరం జిల్లా వారే. మృతి చెందిన ఒక్కో కార్మికుని కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిదు లక్షల రూపాయలు ప్రకటించారు. గాయపడిన వారికి 50 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రెండు లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడినవారికి 50 వేల రూపాయలు ఇస్తామని జయలలిత చెప్పారు. -
శిథిల స్వప్నం
పొట్ట చేత పట్టుకొని జీవనోపాధి కోసం పరాయి రాష్ట్రానికి వెళ్లిన పేద కూలీలపై విధి కన్నెర్ర చేసింది. పిల్లలను ఆకలితో ఉంచలేక నాలుగు రాళ్లు సంపాదిద్దామని వెళ్లిన కూలీల పాలిట.. తాము కష్టించి నిర్మించిన భవనమే మృత్యుపాశమైంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కూలీలు చెన్నైలోని పోరూరుకు సమీపంలో మాంగాడు మౌలివాకం ప్రాంతంలో పనికి కుదిరారు. బహుళ అంతస్తుల భవన నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారు. వర్షం కురుస్తున్న వేళ పనులు చేస్తుండగా భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయి 10 అడుగుల లోతులో కూరుకుపోయింది. ఈ ప్రమాదంలో జిల్లాకు చెందిన పదిమంది చిక్కుకున్నారు. శిథిలాలు తొలగిస్తేనే గానీ వారి యోగక్షేమాలు తెలిసే అవకాశం లేదు. వారు కొనప్రాణంతోనైనా బతకాలని వారి కుటుంబ సభ్యులు కన్నీటితో భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. శ్రీకాకుళం: నెల క్రితం కూలి పనులకు చెన్నై వెళ్లిన కొందరు... మాకు పని కుదిరింది...మీరూ వస్తే పని దొరుకుతుందని చెప్పి కొందరిని తీసుకువెళ్లారు. వారు వెళ్లిన కొద్ది రోజులకే మరింత మందిని తీసుకొని వెళ్లారు... ఇలా జిల్లాకు చెందిన పలువురు కూలీలు ఒకే చోట పనిచేస్తున్నారు. శనివారం నాటి ప్రమాదంలో నరసన్నపేట, హిరమండలం, కొత్తూరు, ఎల్‌ఎన్‌పేట మండలాలకు చెందిన 10మంది చిక్కుకున్నారు. వీరు ప్రాణాలతో ఉన్నదీ లేనిదీ చెన్నై అధికారులు ధ్రువీకరించలేకపోతున్నారు. ఈ వార్తతో జిల్లా నుంచి తమిళనాడు రాష్ట్రానికి వలస వెళ్లిన వారి కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. వారి క్షేమ సమాచారం తెలుసుకునేందుకు ఫోన్ చేస్తుండగా ఫోన్లు పనిచేయక పోవడంతో వారిలో మరింత ఆందోళన ప్రారంభమైంది. అయితే అధికారుల నుంచి ఏ సమాచారం అందుతుందేమోనని వారి కుటుంబ సభ్యులు, బంధువులు శనివారం రాత్రంతా జాగారం చేస్తున్నారు. కడుపు నింపుకుందామని సుదూర ప్రాంతాలకు వెళ్లిన తమ వారిని భవనం రూపంలో మృత్యువు కాాటేసిందని ఆవేదన చెందుతున్నారు. సాయంత్రం వేళ భవనం కూలడం వలన, వర్షం పడుతుండడం వలన సహాయ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతున్నట్టు చెన్నై నుంచి బాధితుల బంధువులు చెబుతున్నారు. శిథిలాల కింద వందమందికి పైగా చిక్కుకున్నట్టు వారు తెలిపారు. కొందరు పారిపోయారని ఎవరెక్కడ ఉన్నారో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అందులో జిల్లా వాసులు కూడా మరింత మంది ఉండవచ్చునని వారు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి విషయాలు తెలుసుకొని పొట్ట కూటి కోసం చెన్నై వెళ్లిన వారి కుటుంబాలు మరింత ఆవేదనతో ఉన్నాయి. అయినా వారికి సరైన సమాచారం అందించే నాధుడే లేకుండా పోయాడు. ఆదివారం సహాయ కార్యక్రమాలు ముమ్మరం అయితే పూర్తి వివరాలు అందే అవకాశాలు ఉంటాయి. తమిళనాడు అధికారులు ధ్రువీకరించడం లేదు జేసీ వీరపాండ్యన్ జిల్లాకు చెందిన వలస కూలీలు మృతి చెందినట్టు తమిళనాడు అధికారులు ధ్రువీకరించడం లేదని జాయింట్ కలెక్టర్ వీరపాండ్యన్ సాక్షికి తెలిపారు. ఇప్పటికే తాను రెండుసార్లు తమిళనాడు అధికారులతో మాట్లాడానన్నారు. మండలాల నుంచి మాత్రం వలస కూలీల బంధువుల ఆక్రందనల వలన తహశీల్దార్లు స్పందించి సమాచారం అందించార,ని అది వాస్తవమో కాదో నిర్ధారించుకోవాల్సి ఉందన్నారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత కొంత వాస్తవ సమాచారం రావచ్చని అభిప్రాయపడ్డారు. జేసీతో మాట్లాడిన అచ్చెన్న చెన్నై ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు జాయింట్ కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. ఎప్పటికప్పుడు తమిళనాడు అదికారులతో మాట్లాడాలని ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో కూడా అధికారులు మాట్లాడుతున్నారని ఎప్పటికప్పుడు జిల్లాకు సమాచారాలు అందిస్తామని తెలిపారు. -
నేడు చెన్నైకు అధికారుల బృందం
విజయనగరం కంటోన్మెంట్: చెన్నైలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందిన జిల్లావాసుల మృతదేహా లను తీసుకువచ్చేందుకు ఆదివారంఅధికారుల బృందం బయలుదేరనుంది. ఆర్డీఓ వెంకటరావుతో పాటు పీడీ మెప్మా, ఏపీఎంలు చెన్నై వెళ్లనున్నారు. అక్కడి మృతదేహాల వెలికితీత, జిల్లాకు తరలింపు వంటి చర్యలు చేపట్టనున్నారు. అలాగే అక్కడి వారి క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు జిల్లా అధికారులకు, కుటుంబసభ్యుల కు చేరవేసేందుకు కూడా చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు చెన్నైలో మృతులు, క్షతగాత్రుల వివరాలు తెలియజేసేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ (089 22-236947 నెంబర్) ఏర్పాటు చేశారు. దీంతో పాటు గా టోల్ ఫ్రీ నెంబర్ 1077ను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు సూపరింటెండెంట్, సహాయకుల నంబర్లకు (9949234246, 9885466376) కూడా కాల్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునేలా ఏర్పాట్లు చేశా రు. ప్రమాదం జరిగిన వెంటనే దత్తిరాజేరు మండలం కృష్ణాపురానికి చెందిన ఎనిమిది మంది, బాడంగి మండలానికి చెందిన ముగ్గురు, మక్కువ మండలానికి చెంది న మరో ముగ్గురు మృతి చెందినట్టు కలెక్టరేట్లోని అధికారులకు సమాచారం అందింది. శనివారం రాత్రి కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారుల మృతదేహాల తరలింపుపై చర్చించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఉండి అధికారులందర్నీ అప్రమత్తం చేశారు. డీఆర్ఓ హేమసుందర్, ఆర్డీఓ వెంకటరావు, తదితరులు సమాచారాల సేకరణలో నిమగ్నమయ్యారు. సమాచార సేకరణలో ఎమ్మెల్యే అప్పలనాయుడు చెన్నై ప్రమాద సంఘటనలో ఎక్కువ మంది గజపతినగ రం నియోజకవర్గానికి చెందిన వారు కావడంతో ఎమ్మె ల్యే కెఏ నాయుడు కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి చేరుకుని మృతులవివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. తమ వద్ద ఉన్న సమాచారాన్ని అధికారులకు తెలియపరుస్తూ వారి వద్ద ఉన్న సమాచారాన్ని తెలుసుకుంటూ కుటుంబ సభ్యులకు తెలియజెప్పే ప్రయత్నం చేశారు. అన్ని చర్యలూ తీసుకుంటున్నాం చెన్నై ప్రమాద సంఘటనలో జిల్లాకు చెందిన సుమారు 14 మంది మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం అందింది. దీని ప్రకారం రేపు ఉదయం చెన్నైకు అధికారుల బృందాన్ని పంపిస్తున్నాం. అక్కడి చర్యలను వీరు వేగవంతం చేస్తారు. మృతుల కుటుంబాలకు కార్మిక శాఖ కమిషనర్ రూ.2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. కలెక్టరేట్లో కంట్రోల్‌రూం ఏర్పాటు చేశాం. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయ పడేందుకు చర్య లు తీసుకుంటున్నాం. - కాంతిలాల్ దండే, జిల్లా కలెక్టర్ -
వలస బతుకులపై మృత్యువల
విజయనగరం క్రైం/కంటోన్మెంట్: ఊరిగాని ఊరు వెళ్లారు. పొట్టకూటి కోసం దూర ప్రాంతానికి సైతం లెక్కచేయకుండా జీవన గడపటానికి వెళ్లారు. కష్టపడి సంపాదించిన సొమ్ముతో పిల్ల పాపలను చక్కగా చూసుకోవాలని భావించారు. ఇంతలో విధి వక్రీకరించింది. పొట్టకూటికోసం ఇతర రాష్ట్రానికి వెళ్లిన వారిని భవనం మింగేసింది. వారు నిర్మిస్తున్న భవనం కింద కొందరు సజీవసమాధి అయ్యారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక్ష సాక్షి గురునాయుడు కథనం ప్రకారం.. చెన్నైలోని మాన్ఘాడ్లో బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. జిల్లాకు చెందిన అనేకమంది వలస కూలీలుగా చెన్నె వెళ్లారు. శనివారం కూడా భవన నిర్మాణ పనులు యథావిధిగా నిర్వహించారు. సాయంత్రం వర్షం పడడంతో సుమారు 200మంది కూలీలు భవనం కింద కూర్చున్నారు. ఇంతలో ఒ క్కసారిగా పెద్దశబ్దం వచ్చింది. పిడుగుపడిందేమోనని మొదట భావిం చారు.తేరుకుని చూసేలోపే జరగరాని ఘోరం కళ్ల ముందు ప్రత్యక్షమైంది. నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మ క్కువ మండలం తూరు మామిడికి చెందిన తిరుపతిరావు, సీర స త్యనారాయణ, సీర జయమ్మ(వీరిద్దరూ భార్యాభర్తలు), దత్తిరాజేరు మండలం మంత్రి మైనమ్మ, కర్రిపైడిమ్మ, సిరిపురం రాము, పేకేటి అ ప్పలరాజు, పేకేటి లక్ష్మి, పతివాడ బంగారునాయుడు, వనం దుర్గ, పతివాడ గౌరీశ్వరి, పతివాడ చిలకడు, కర్రి అప్పలనాయుడు, పేకేటి సూర్యారావు, సారికి పాపినాయుడు, పతివాడ కృష్ణారావు, సామాల జనార్దన్, సామాల లక్ష్మి, బాడంగి గ్రామానికి చెందిన భార్య భర్తలు గౌరినాయుడు, అనసూయ, మరో మహిళ శాంతికుమారి కుప్పకూలిన భవనం కింద పడి చిక్కుకున్నారు. ఇంకా అనేకమంది చిక్కుకున్నట్లు సమాచారం. ప్రతి ఏడాది అనేకమంది భవన నిర్మాణ కార్మికులు పనులు కోసం వెళ్తుంటారు. దత్తిరాజేరు మండలం కె. కృష్ణాపురం గ్రామానికి చెందిన వంద కుటుంబాలు చెన్నైలో కూలి పనుల కోసం వెళ్లాయి. ప్రతి ఏడాదీ గ్రామానికి చెందిన అనేక కుటుంబాలు కూలి పనుల కోసం వెళ్లి వస్తుంటాయి. చెన్నైలో పనిచేయగా వచ్చిన డబ్బు తో పిల్లలను చదివించుకోవడం, అప్పులు తీర్చడం చేస్తుంటారు. మృ తుల్లో కొంత మంది పదిహేను రోజుల క్రితం వెళ్లినట్లు సమాచారం. ఇంతమంది మృత్యువాత పడడం ఇదే మొదటిసారి.. ఇతర రాష్ట్రాల్లో కూలిపనుల కోసం వెళ్లి ఎక్కువమంది మృతిచెందడం ఇదే మొదటిసారిగా చెప్పుకోవచ్చు. భవనం కిందపడి 14మంది వరకు మృత్యువాతపడడం, అనేమమంది శిధిలాల్లో చిక్కుకోవడం జరిగింది. చెన్నైలో కూలికోసం వెళ్లి లారీ బోల్తాపడి శృంగవరపుకోట మండలం ఎస్.కోట తలారి గ్రామానికి చెందిన పిల్లల గురువులు మృతిచెందాడు. కూలికోసం కాకపోయిన కేరళ రాష్ట్రంలో బస్సు లోయలోపడి జిల్లాలోని సాలూరు ప్రాంతానికి చెందిన ఆరుగురు అయ్యప్పస్వామి భక్తులు మృతిచెందారు. -
శిథిలాల కింద 14 మంది విజయనగరం జిల్లా వాసులు
చెన్నై: చెన్నైలో 11 అంతస్తుల భవనం కూలిన సంఘటనలో విజయనగరం జిల్లాకు చెందిన 14 మంది శిథిలాల్లో చిక్కుకున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిలో ఎక్కువ మంది తెలుగువాళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రుల కోసం సహాయక చర్యలు చేపట్టాలని విజయనగరం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప చెప్పారు. ప్రమాదం జరిగిన విషయాన్ని మంత్రి కిమిడి మృణాళిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. మాన్‌గాడులో శనివారం జరిగిన ఈ దుర్ఘటనలో 50 మంది చిక్కుకున్నట్టు సమాచారం. ప్రమాదంలో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహం వెలికితీశారు. మరో 8 మందిని రక్షించారు. జాతీయ విపత్తు సహాయక బృందాలు ఘటనా స్ఠలానికి చేరుకుని రంగంలోకి దిగాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు.