శ్రీకాకుళం కలెక్టరేట్: చెన్పైలో భవనం కూలిన సంఘటనకు బాధిత కుటుంబాలకు నెల రోజులకు సరిపడా రేషన్ అందిస్తామని ఇన్‌చార్జి కలెక్టర్ జి.వీరపాండ్యన్ తెలిపారు. ఈమేరకు ఆయన సోమవారం సాయంత్రం అదేశాలు జారీచేశారు. జిల్లా వాసుల యోగక్షేమాలు తెలుసుకుని వారికి సహాయం చేసేందుకు పాలకొండ ఆర్డీవో ఎన్.తేజ్‌భరత్, రాజాం తహశీల్దారు, హిరమండలం ఆర్‌ఐ చెన్నై వెళ్లారని, వారి నుంచి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామన్నారు. రామచంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హిరమండలం(గొట్టా) వాసి కొంగరాపు కృష్ణవేణిని అధికారులు పరామర్శించారని చెప్పారు.
శిథిలాల నుంచి 41 మందిని బయటకు తీశారని, వీరిలో 18 మంది మృతి చెందగా వారిలో ఆరుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని సమాచారం అందిందని తెలిపారు. మృతుల్లో నరసన్నపేట మండలం బాలసీమకు చెందిన డి.అప్పన్న భార్య పద్మ ఉన్నట్లు వెల్లడించారు. ప్రమాదం నుంచి తప్పించుకున్న జిల్లా వాసుల సహాయంతో శిథిలాల కింద ఉన్న మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో మృత్యువాత పడిన వారి కుటుంబానికి రూ.5 లక్షల నష్ట పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, తమిళనాడు ప్రభుత్వం మరో రూ.2 లక్షలు ఇస్తోందని తెలిపారు. గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఇస్తున్నారన్నారు.
చెన్నై బాధిత కుటుంబాలకు నెల రోజుల రేషన్
Published Tue, Jul 1 2014 4:13 AM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
Advertisement