
14కి చేరిన చెన్నై మృతుల సంఖ్య
చెన్నైలో 11 అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 14కి చేరింది.
చెన్నై: చెన్నైలో 11 అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 14కి చేరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి సోమవారం మృతి చెందాడు. కాగా భవన నిర్మాణానికి సంబంధించి మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా చెన్నై ప్రమాద సంఘటన బాధితులు పెరుగుతున్నారు. అక్కడ పని చేస్తున్న వారు ఎంత మంది గల్లంతయ్యారు? ఎంత మంది మృత్యువాత పడ్డారన్న సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న కొద్దీ మరింత మంది గల్లంతయ్యారనే సమాచారం వస్తోంది.