విజయనగరం కంటోన్మెంట్: చెన్నైలో జరిగిన భవన ప్రమాదంలో చి క్కుకున్న వారి కోసం వారి కుటుంబ సభ్యులు కళ్లు కాయలు కాసే లా ఎదురుచూస్తున్నారు. గ్రామంలోకి ఎవరైనా వాహనంతో వస్తే చాలు ఏదైనా సమాచారం వచ్చిందేమోనని ఆశగా చూస్తున్నారు. కృష్ణాపురానికి చెందిన వారు గల్లంతు కావడంతో వారం తా మరణించారో లేక సజీవంగా ఉన్నారోనన్న ఆతృత గ్రామస్తుల్లో నెల కొంది. గ్రామానికి చెందిన ఒకరు మృతి చెందినట్టు తెలియడం, మరో పక్క మిగతా వారి జాడ తెలియకపోవడంతో ఇక్కడ గంభీర వాతావరణం నెలకొంది. బాడంగి, జియ్యమ్మవలస, మక్కువ మండలాల్లోనూ ఇదే పరిస్థితి.
జిల్లా అధికారుల బృందం చెన్నై వెళ్లిన దగ్గర నుంచీ వారి నుంచి ఏదైనా సమాచారం వస్తుందోనని ఎదురు చూస్తున్నారు. అలాగే కృష్ణాపురం సర్పంచ్ మంత్రి రామారావు, ఆల్తిరామారావులు కూడా ట్రైన్‌లో చెన్నై వెళ్లారు. వారినుంచి క్షేమ సమాచారాలు వస్తాయని నిద్రాహారాలు లేక వీరు చూస్తున్నారు. జిల్లాలోని దత్తిరాజేరు మం డలం కోరపు కృష్ణాపురం, బాడంగి, మక్కువ మండలంలోని తూరుమామిడి గ్రామాలకు చెందిన కూలీలు శిథిలాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి కె.కృష్ణాపురానికి చెందిన సిరిపురపు రాము, బాడంగికి చెందిన శాంతికుమారిలు మృతి చెం దినట్టు గుర్తించామని కంట్రోల్ రూం సూపరింటెండెంట్ అప్పలనర్స య్య తెలిపారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం నీలమాంబపు రం గ్రామానికి చెందిన రామలక్ష్మి, మక్కువ పెదగైశిల గ్రామానికి చెం దిన వెంపడాపు శంకరరావు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు.
పెరుగుతున్న బాధితులు
జిల్లాలో చెన్నై ప్రమాద సంఘటన బాధితులు పెరుగుతున్నారు. అక్కడ పని చేస్తున్న వారు ఎంత మంది గల్లంతయ్యారు? ఎంత మంది మృత్యువాత పడ్డారన్న సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న కొద్దీ మరింత మంది గల్లంతయ్యారనే సమాచారం వస్తోంది. నీలమాంబ పురం గ్రామానికి చెం దిన మర్రాపు వెంకటినాయుడు ఆయన కుమార్తె దమయంతిలు శిథిలాల కింద చిక్కుకున్నారు. అదే గ్రామానికి చెందిన మొదిలి రామలక్ష్మి, మొదిలి చిన్నంనాయుడు, మర్రాపు తిరుపతినాయుడులు గల్లంతయినవారి జాబితాలో ఉన్నట్టు సమాచారం.
మూగబోయిన ఫోన్లు
కలెక్టరేట్‌లో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన టోల్‌ఫ్రీ నెంబర్, ల్యాండ్‌లైన్ నంబర్లు పనిచేయడం లేదు. చెన్నై ప్రమాద దుర్ఘటన గూర్చి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తామనీ, తెలుసుకోవాలనుకునే వారు ఈ నంబర్లకు ఫోన్ చేయాలనీ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఇందుకోసం 1077 టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో పాటు మరో ల్యాండ్‌లైన్ నెంబర్ 08922-236947ను ప్రకటించారు. కానీ రెండు నెంబర్లూ పనిచేయడం లేదు.
కంట్రోల్ రూం కొత్త నంబర్లివే...
టోల్‌ఫ్రీ, ల్యాండ్‌లైన్‌నెంబర్లు పనిచేయకపోవడంతో కొత్తగా నెంబర్లను సూపరింటెండెంట్ అప్పలనర్సయ్య ప్రకటించారు. ప్రకటించిన నం బర్లు పనిచేయకపోవడంతో ఇక్కడ నైట్ డ్యూటీ చేసే వారి నంబర్లకు ఫోన్‌చేసి సమాచారం తెలుసుకోవచ్చని ఆయన చెప్పారు. కంట్రోల్ రూంలో ఇద్దరు జూనియర్ అసిస్టెంట్‌లను నియమించినట్టు తెలిపారు. ఏ.పార్ధసారధి(8466091249), ఎన్.రవికుమార్(9908738336)ల నంబర్లకు ఫోన్‌చేసి సమాచారం తెలుసుకోవచ్చన్నారు.
ఎదురు చూపులే..!
Published Mon, Jun 30 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM
Advertisement