విజయనగరంలో రెండోరోజు వైఎస్ జగన్ పర్యటన | Ys jagan mohan reddy Second day schedule in vizianagaram | Sakshi
Sakshi News home page

విజయనగరంలో రెండోరోజు వైఎస్ జగన్ పర్యటన

Published Wed, Jul 16 2014 8:40 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

విజయనగరంలో రెండోరోజు వైఎస్ జగన్ పర్యటన - Sakshi

విజయనగరంలో రెండోరోజు వైఎస్ జగన్ పర్యటన

విజయనగరం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన రెండోరోజు కూడా విజయనగరంలో కొనసాగనుంది. ఆయన బుధవారం సాలూరు, కురుపాం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. చెన్నైభవనం కూలిన ఘటనలో మృతుల కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శిస్తారు. మక్కువ మండలం తూరుమామిడిలో రెండు కుటుంబాలు, గైసీల గ్రామంలో మూడు కుటుంబాలు, కొమరాడ మండలం దలాయిపేటలో రెండు కుటుంబాలు, మాదలింగిలో జాన్ కుటుంబం, జీయమ్మవసల మండలం నీలమాంబపురంలో అయిదు కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు.

కాగా గత నెల 28న చెన్నైలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో పలువురు మరణించారు. వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది మృతుల కుటుంబీకులను జగన్ మంగళవారం పరామర్శించారు. చెన్నై మృతుల్లో దత్తి రాజేరు మండలంలోని కోరపు కృష్ణాపురానికి చెం దిన పేకేటి అప్పలరాము, లక్ష్మి (వీరిద్దరూ భార్యాభర్తలు), కర్రి తౌడమ్మ, వనం దుర్గ, పతివాడ గౌరీశ్వరి, సిరిపురపు రాము, పతివాడ బంగారినాయుడు, బాడంగి మండల కేంద్రానికి చెందిన బొమ్మి గౌరునాయడు, బొంగు శాంతి కుమారిల కుటుంబీకులను ఓదార్చారు. దుర్ఘటన జరిగిన తీరును, వారి కష్టాల్ని అడిగి తెలుసుకున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement