victims telugu peoples
-
మానవ మృగాన్ని ఉరి తీయాలి..
బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల కేంద్రం హాజీపూర్ గ్రామస్తుల ఆందోళనలతో భగ్గుమంది. ముగ్గురు బాలికలను అతి కిరాతకంగా బలిగొన్న నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని బహిరంగంగా ఉరి తీయాలని ప్రభుత్వాన్ని బాధితులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బొమ్మలరామారం మండల కేంద్రంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించి గుడిబావి చౌరస్తా వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి సత్వరం న్యాయం చేయాలని, బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేసి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ న్యాయ పోరాటానికి మండల ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బాధితులను ఆదుకుంటామని హామీలిచ్చిన అధికారులు జాడ లేకుండా పోయారని విమర్శించారు. పలువురు టీఆర్ఎస్ నాయకులు ఆందోళనకారుల వద్దకు వచ్చి ఎమ్మెల్యే సునీత దగ్గరికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని చెప్పినా బాధితులు ససేమిరా అన్నారు. ఇంతవరకు పట్టించుకోని ఎమ్మెల్యే ఇప్పుడు ఏం మాట్లాడతారంటూ నాయకులను అక్కడి నుంచి పంపించి వేశారు. హామీ వచ్చేవరకు దీక్ష విరమించం బాధితులకు ప్రభు త్వం స్పష్టమైన హామీ వచ్చే వరకు దీక్ష విరమిం చేదిలేదు. ముగ్గురు బాలి కలు దారుణ హత్యలకు గురైనా ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి రాలేదు. శ్రావణి మృత దేహంతో ధర్నా నిర్వహిస్తే కూతవేటు దూరం లో ఉన్న ఎమ్మెల్యే పార్టీ కార్యక్రమాలకే పరిమితమయ్యారు. బాధితులకు భరోసా ఇవ్వలేదు. – పక్కీరు రాజేందర్‌రెడ్డి, హాజీపూర్ వెనకడుగు వేయం కడుపుకోతకు గురైన కుటుంబాలకు న్యా యం జరిగే వరకు వెనకడుగు వేయం. ఆ కిరాతకుడిని ప్రభుత్వం ఉరి తీయలేని పరిస్థితి ఉంటే ప్రజలకు అప్పగించాలి. బడుగు, బలహీన వర్గాల పిల్లలంటే లెక్క లేదా. సైకో కిల్లర్ అంటున్న అధికారులు నిందితుడిని చంపడానికి ఎందుకు ఆలోచిస్తుండ్రు. – తుంగని భాగ్యమ్మ, కల్పన తల్లి కుటుంబాన్నీ ఉరి తీయాలి అభంశుభం తెలి యని ఆడపిల్లలపై అ ఘాయిత్యాలకు పాల్పడిన శ్రీనివాస్‌రెడ్డితోపాటు అతని కుటుంబ సభ్యులనూ ఉరి తీయాలి. కుటుంబసభ్యుల సహకారంతోనే శ్రీనివాస్‌రెడ్డి హత్యలకు పాల్పడ్డాడు. నిదితుడిని బహిరంగంగా ఉరితీస్తేనే ఇలాంటి నేరాలు చేసే వారి వెన్నులో వణుకు పుడుతుంది. – తిప్రబోయిన నవనీత, మనీషా సోదరి -
మహిళలకు ‘సఖి’ భరోసా
సాక్షి, హైదరాబాద్: కుటుంబం, పనిచేసే ప్రదేశం సహా పలు చోట్ల మహిళలు, బాలికలు మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురవుతున్నారు. అలాంటి బాధిత మహిళలకు మేమున్నామంటూ సఖి కేంద్రాలు భరోసా ఇస్తున్నాయి. అతివలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తూ అండగా నిలుస్తున్నాయి. వేధింపులకు గురై బయటకు చెప్పుకోలేని మహిళలు, బాలికలకు మనోధైర్యం కల్పించేందుకు ప్రభుత్వం సైతం చేయూత అందిస్తుంది. దీనిలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సఖి కేంద్రాలను ఏర్పాటు చేసింది. వ్యక్తిగత సమస్యలతో వచ్చేవారికి న్యాయపరమైన çసూచనలు ఇవ్వడంతో పాటు అన్ని రకాల సేవలను అందిస్తున్నాయి. న్యాయ, వైద్య, పోలీసుశాఖల సమన్వయంతో ఈ సేవలను ఉచితంగా అందిస్తున్నాయి. సలహా, సాంత్వన, రక్షణే లక్ష్యంగా కౌన్సెలింగ్, న్యాయసేవలు, కేసు నమోదు, పోలీసుల సహాయం, వైద్య సేవలు, తాత్కాలిక వసతి వంటి సేవలను అందిస్తున్నాయి. మహిళలకు 181 హెల్ప్‌లైన్..: సఖీ కేంద్రాలకు రాలేని మహిళల కోసం హెల్ప్‌లైన్‌ను సైతం ఏర్పాటు చేశాయి. సమస్యల్లో ఉన్న మహిళలు టోల్‌ఫ్రీ నంబర్ 181ను సంప్రదించవచ్చు. ఇది 24్ఠ7 అందుబాటులో ఉంటుంది. ఏ సమయం లోనైనా బాధితులు ఫోన్ ద్వారా సంప్రదిస్తే ఓ వాహనం వారు ఉన్న ప్రదేశానికి వస్తుంది. ఈ వాహనంలో ఒక మహిళా కానిస్టేబుల్‌తో పాటు సైక్రియాటిస్ట్ ఉంటారు. వీరు బాధితురాలికి భరోసా ఇస్తూ సఖి కేంద్రాలకు తీసుకెళ్తారు. సఖి సెంటర్లో లభించే సేవలు.. హింస, వేధింపుల బారినపడ్డ వారికి నేషనల్ హెల్త్ మిషన్, 108, పోలీసులతో అత్యవసర సేవలందిం చడం, వారిని కాపాడిన తర్వాత ఆశ్రయం కల్పించ డం కోసం సమీపంలోని హోమ్‌లకు తరలించడం, బాధితులకు వైద్య సేవలందించేందుకు సమీప దవాఖాన్లకు పంపించడం వంటి సేవలను సఖి కేంద్రాలు అందిస్తాయి. వారికి అవసరమయ్యే పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తారు. తాత్కాలికంగా మహిళా హోమ్‌లలో ఆశ్రయం కల్పించి, కనీసం ఐదు రోజులకు తక్కువ కాకుండా వసతి కల్పిస్తారు. బాధితులు కోర్టు ప్రొసీడింగ్స్‌కు హాజరుకాలేని పరిస్థితుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో తమ వాదనలు వినిపించే సౌకర్యాన్ని సైతం కల్పిస్తారు. మహిళలకు అండగా.. వేధింపులకు గురైన బాధిత మహిళలకు అండగా నిలవడానికి సఖీ కేంద్రాలు నిరంతరం పనిచేస్తున్నాయి. మహిళలకు రక్షణ కల్పించేలా అన్ని రకాల సేవలు సఖి కేంద్రాల్లో అందుబా టులో ఉన్నాయి. అవగాహనా రాహిత్యంతో చాలామంది సఖి కేంద్రాలకు రాలేకపోతున్నా రు. ఎన్జీవోలు, పోలీసు శాఖల సహకారంతో అలాంటి వారిని గుర్తించి సఖి కేంద్రాలకు తరలిస్తున్నారు. మహిళలు, బాలికలు, చిన్నారు లు తమ సమస్యలు చెప్పుకునేలా ఎన్జీవోల సహకారంతో పలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – విజయేందిర బోయి, మహిళా శిశు సంక్షేమ శాఖ సంచాలకులు -
ఎదురు చూపులే..!
విజయనగరం కంటోన్మెంట్: చెన్నైలో జరిగిన భవన ప్రమాదంలో చి క్కుకున్న వారి కోసం వారి కుటుంబ సభ్యులు కళ్లు కాయలు కాసే లా ఎదురుచూస్తున్నారు. గ్రామంలోకి ఎవరైనా వాహనంతో వస్తే చాలు ఏదైనా సమాచారం వచ్చిందేమోనని ఆశగా చూస్తున్నారు. కృష్ణాపురానికి చెందిన వారు గల్లంతు కావడంతో వారం తా మరణించారో లేక సజీవంగా ఉన్నారోనన్న ఆతృత గ్రామస్తుల్లో నెల కొంది. గ్రామానికి చెందిన ఒకరు మృతి చెందినట్టు తెలియడం, మరో పక్క మిగతా వారి జాడ తెలియకపోవడంతో ఇక్కడ గంభీర వాతావరణం నెలకొంది. బాడంగి, జియ్యమ్మవలస, మక్కువ మండలాల్లోనూ ఇదే పరిస్థితి. జిల్లా అధికారుల బృందం చెన్నై వెళ్లిన దగ్గర నుంచీ వారి నుంచి ఏదైనా సమాచారం వస్తుందోనని ఎదురు చూస్తున్నారు. అలాగే కృష్ణాపురం సర్పంచ్ మంత్రి రామారావు, ఆల్తిరామారావులు కూడా ట్రైన్లో చెన్నై వెళ్లారు. వారినుంచి క్షేమ సమాచారాలు వస్తాయని నిద్రాహారాలు లేక వీరు చూస్తున్నారు. జిల్లాలోని దత్తిరాజేరు మం డలం కోరపు కృష్ణాపురం, బాడంగి, మక్కువ మండలంలోని తూరుమామిడి గ్రామాలకు చెందిన కూలీలు శిథిలాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి కె.కృష్ణాపురానికి చెందిన సిరిపురపు రాము, బాడంగికి చెందిన శాంతికుమారిలు మృతి చెం దినట్టు గుర్తించామని కంట్రోల్ రూం సూపరింటెండెంట్ అప్పలనర్స య్య తెలిపారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం నీలమాంబపు రం గ్రామానికి చెందిన రామలక్ష్మి, మక్కువ పెదగైశిల గ్రామానికి చెం దిన వెంపడాపు శంకరరావు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. పెరుగుతున్న బాధితులు జిల్లాలో చెన్నై ప్రమాద సంఘటన బాధితులు పెరుగుతున్నారు. అక్కడ పని చేస్తున్న వారు ఎంత మంది గల్లంతయ్యారు? ఎంత మంది మృత్యువాత పడ్డారన్న సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న కొద్దీ మరింత మంది గల్లంతయ్యారనే సమాచారం వస్తోంది. నీలమాంబ పురం గ్రామానికి చెం దిన మర్రాపు వెంకటినాయుడు ఆయన కుమార్తె దమయంతిలు శిథిలాల కింద చిక్కుకున్నారు. అదే గ్రామానికి చెందిన మొదిలి రామలక్ష్మి, మొదిలి చిన్నంనాయుడు, మర్రాపు తిరుపతినాయుడులు గల్లంతయినవారి జాబితాలో ఉన్నట్టు సమాచారం. మూగబోయిన ఫోన్లు కలెక్టరేట్లో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన టోల్‌ఫ్రీ నెంబర్, ల్యాండ్‌లైన్ నంబర్లు పనిచేయడం లేదు. చెన్నై ప్రమాద దుర్ఘటన గూర్చి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తామనీ, తెలుసుకోవాలనుకునే వారు ఈ నంబర్లకు ఫోన్ చేయాలనీ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఇందుకోసం 1077 టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో పాటు మరో ల్యాండ్‌లైన్ నెంబర్ 08922-236947ను ప్రకటించారు. కానీ రెండు నెంబర్లూ పనిచేయడం లేదు. కంట్రోల్ రూం కొత్త నంబర్లివే... టోల్‌ఫ్రీ, ల్యాండ్లైన్నెంబర్లు పనిచేయకపోవడంతో కొత్తగా నెంబర్లను సూపరింటెండెంట్ అప్పలనర్సయ్య ప్రకటించారు. ప్రకటించిన నం బర్లు పనిచేయకపోవడంతో ఇక్కడ నైట్ డ్యూటీ చేసే వారి నంబర్లకు ఫోన్‌చేసి సమాచారం తెలుసుకోవచ్చని ఆయన చెప్పారు. కంట్రోల్ రూంలో ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లను నియమించినట్టు తెలిపారు. ఏ.పార్ధసారధి(8466091249), ఎన్.రవికుమార్(9908738336)ల నంబర్లకు ఫోన్‌చేసి సమాచారం తెలుసుకోవచ్చన్నారు.