బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల కేంద్రం హాజీపూర్ గ్రామస్తుల ఆందోళనలతో భగ్గుమంది. ముగ్గురు బాలికలను అతి కిరాతకంగా బలిగొన్న నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని బహిరంగంగా ఉరి తీయాలని ప్రభుత్వాన్ని బాధితులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బొమ్మలరామారం మండల కేంద్రంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించి గుడిబావి చౌరస్తా వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి సత్వరం న్యాయం చేయాలని, బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేసి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ న్యాయ పోరాటానికి మండల ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బాధితులను ఆదుకుంటామని హామీలిచ్చిన అధికారులు జాడ లేకుండా పోయారని విమర్శించారు. పలువురు టీఆర్‌ఎస్ నాయకులు ఆందోళనకారుల వద్దకు వచ్చి ఎమ్మెల్యే సునీత దగ్గరికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని చెప్పినా బాధితులు ససేమిరా అన్నారు. ఇంతవరకు పట్టించుకోని ఎమ్మెల్యే ఇప్పుడు ఏం మాట్లాడతారంటూ నాయకులను అక్కడి నుంచి పంపించి వేశారు.
హామీ వచ్చేవరకు దీక్ష విరమించం
బాధితులకు ప్రభు త్వం స్పష్టమైన హామీ వచ్చే వరకు దీక్ష విరమిం చేదిలేదు. ముగ్గురు బాలి కలు దారుణ హత్యలకు గురైనా ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి రాలేదు. శ్రావణి మృత దేహంతో ధర్నా నిర్వహిస్తే కూతవేటు దూరం లో ఉన్న ఎమ్మెల్యే పార్టీ కార్యక్రమాలకే పరిమితమయ్యారు. బాధితులకు భరోసా ఇవ్వలేదు.
– పక్కీరు రాజేందర్‌రెడ్డి, హాజీపూర్
వెనకడుగు వేయం
కడుపుకోతకు గురైన కుటుంబాలకు న్యా యం జరిగే వరకు వెనకడుగు వేయం. ఆ కిరాతకుడిని ప్రభుత్వం ఉరి తీయలేని పరిస్థితి ఉంటే ప్రజలకు అప్పగించాలి. బడుగు, బలహీన వర్గాల పిల్లలంటే లెక్క లేదా. సైకో కిల్లర్ అంటున్న అధికారులు నిందితుడిని చంపడానికి ఎందుకు ఆలోచిస్తుండ్రు.
– తుంగని భాగ్యమ్మ, కల్పన తల్లి
కుటుంబాన్నీ ఉరి తీయాలి
అభంశుభం తెలి యని ఆడపిల్లలపై అ ఘాయిత్యాలకు పాల్పడిన శ్రీనివాస్‌రెడ్డితోపాటు అతని కుటుంబ సభ్యులనూ ఉరి తీయాలి. కుటుంబసభ్యుల సహకారంతోనే శ్రీనివాస్‌రెడ్డి హత్యలకు పాల్పడ్డాడు. నిదితుడిని బహిరంగంగా ఉరితీస్తేనే ఇలాంటి నేరాలు చేసే వారి వెన్నులో వణుకు పుడుతుంది.
– తిప్రబోయిన నవనీత, మనీషా సోదరి
Comments
Please login to add a commentAdd a comment