సాక్షి, నల్లగొండ: హాజీపూర్ వరుస హత్యల నిందితుడు శ్రీనివాసరెడ్డిని పోలీసులు నల్లగొండ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో హాజరుపరిచారు. అదే విధంగా కేసుకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికను సైతం సమర్పించారు. ఈ క్రమంలో చివరిగా నిందితుడు శ్రీనివాసరెడ్డి వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేయనుంది. కాగా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌కు చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యాలకు పాల్పడి హత్యచేసిన విషయం విదితమే.
ఈ నేపథ్యంలో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ కేసును నల్లగొండ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు విచారిస్తోంది. గత రెండు నెలల కాలంలో ఈ కేసులో దాదాపు 300 మంది సాక్షులను కోర్టు విచారించింది. ఈ క్రమంలో గురువారం చివరిసారిగా నిందితుడి వాంగ్మూలం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల్లో తీర్పు వెలువడే అవకాశం ఉంది. మరోవైపు.. శ్రీనివాసరెడ్డిని ఉరి తీయాలని బాధిత కుటుంబాలు డిమాండు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment