సాక్షి, హైదరాబాద్: కుటుంబం, పనిచేసే ప్రదేశం సహా పలు చోట్ల మహిళలు, బాలికలు మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురవుతున్నారు. అలాంటి బాధిత మహిళలకు మేమున్నామంటూ సఖి కేంద్రాలు భరోసా ఇస్తున్నాయి. అతివలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తూ అండగా నిలుస్తున్నాయి. వేధింపులకు గురై బయటకు చెప్పుకోలేని మహిళలు, బాలికలకు మనోధైర్యం కల్పించేందుకు ప్రభుత్వం సైతం చేయూత అందిస్తుంది. దీనిలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సఖి కేంద్రాలను ఏర్పాటు చేసింది. వ్యక్తిగత సమస్యలతో వచ్చేవారికి న్యాయపరమైన çసూచనలు ఇవ్వడంతో పాటు అన్ని రకాల సేవలను అందిస్తున్నాయి. న్యాయ, వైద్య, పోలీసుశాఖల సమన్వయంతో ఈ సేవలను ఉచితంగా అందిస్తున్నాయి. సలహా, సాంత్వన, రక్షణే లక్ష్యంగా కౌన్సెలింగ్, న్యాయసేవలు, కేసు నమోదు, పోలీసుల సహాయం, వైద్య సేవలు, తాత్కాలిక వసతి వంటి సేవలను అందిస్తున్నాయి.
మహిళలకు 181 హెల్ప్‌లైన్..: సఖీ కేంద్రాలకు రాలేని మహిళల కోసం హెల్ప్‌లైన్‌ను సైతం ఏర్పాటు చేశాయి. సమస్యల్లో ఉన్న మహిళలు టోల్‌ఫ్రీ నంబర్ 181ను సంప్రదించవచ్చు. ఇది 24్ఠ7 అందుబాటులో ఉంటుంది. ఏ సమయం లోనైనా బాధితులు ఫోన్ ద్వారా సంప్రదిస్తే ఓ వాహనం వారు ఉన్న ప్రదేశానికి వస్తుంది. ఈ వాహనంలో ఒక మహిళా కానిస్టేబుల్‌తో పాటు సైక్రియాటిస్ట్ ఉంటారు. వీరు బాధితురాలికి భరోసా ఇస్తూ సఖి కేంద్రాలకు తీసుకెళ్తారు.
సఖి సెంటర్‌లో లభించే సేవలు..
హింస, వేధింపుల బారినపడ్డ వారికి నేషనల్ హెల్త్ మిషన్, 108, పోలీసులతో అత్యవసర సేవలందిం చడం, వారిని కాపాడిన తర్వాత ఆశ్రయం కల్పించ డం కోసం సమీపంలోని హోమ్‌లకు తరలించడం, బాధితులకు వైద్య సేవలందించేందుకు సమీప దవాఖాన్లకు పంపించడం వంటి సేవలను సఖి కేంద్రాలు అందిస్తాయి. వారికి అవసరమయ్యే పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తారు. తాత్కాలికంగా మహిళా హోమ్‌లలో ఆశ్రయం కల్పించి, కనీసం ఐదు రోజులకు తక్కువ కాకుండా వసతి కల్పిస్తారు. బాధితులు కోర్టు ప్రొసీడింగ్స్‌కు హాజరుకాలేని పరిస్థితుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో తమ వాదనలు వినిపించే సౌకర్యాన్ని సైతం కల్పిస్తారు.
మహిళలకు అండగా..
వేధింపులకు గురైన బాధిత మహిళలకు అండగా నిలవడానికి సఖీ కేంద్రాలు నిరంతరం పనిచేస్తున్నాయి. మహిళలకు రక్షణ కల్పించేలా అన్ని రకాల సేవలు సఖి కేంద్రాల్లో అందుబా టులో ఉన్నాయి. అవగాహనా రాహిత్యంతో చాలామంది సఖి కేంద్రాలకు రాలేకపోతున్నా రు. ఎన్‌జీవోలు, పోలీసు శాఖల సహకారంతో అలాంటి వారిని గుర్తించి సఖి కేంద్రాలకు తరలిస్తున్నారు. మహిళలు, బాలికలు, చిన్నారు లు తమ సమస్యలు చెప్పుకునేలా ఎన్‌జీవోల సహకారంతో పలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – విజయేందిర బోయి,
మహిళా శిశు సంక్షేమ శాఖ సంచాలకులు
Comments
Please login to add a commentAdd a comment