నేడు చెన్నైకు అధికారుల బృందం
విజయనగరం కంటోన్మెంట్: చెన్నైలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందిన జిల్లావాసుల మృతదేహా లను తీసుకువచ్చేందుకు ఆదివారంఅధికారుల బృందం బయలుదేరనుంది. ఆర్‌డీఓ వెంకటరావుతో పాటు పీడీ మెప్మా, ఏపీఎంలు చెన్నై వెళ్లనున్నారు. అక్కడి మృతదేహాల వెలికితీత, జిల్లాకు తరలింపు వంటి చర్యలు చేపట్టనున్నారు. అలాగే అక్కడి వారి క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు జిల్లా అధికారులకు, కుటుంబసభ్యుల కు చేరవేసేందుకు కూడా చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు చెన్నైలో మృతులు, క్షతగాత్రుల వివరాలు తెలియజేసేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ (089 22-236947 నెంబర్) ఏర్పాటు చేశారు. దీంతో పాటు గా టోల్ ఫ్రీ నెంబర్ 1077ను కూడా ఏర్పాటు చేశారు.
మరోవైపు సూపరింటెండెంట్, సహాయకుల నంబర్లకు (9949234246, 9885466376) కూడా కాల్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునేలా ఏర్పాట్లు చేశా రు. ప్రమాదం జరిగిన వెంటనే దత్తిరాజేరు మండలం కృష్ణాపురానికి చెందిన ఎనిమిది మంది, బాడంగి మండలానికి చెందిన ముగ్గురు, మక్కువ మండలానికి చెంది న మరో ముగ్గురు మృతి చెందినట్టు కలెక్టరేట్‌లోని అధికారులకు సమాచారం అందింది. శనివారం రాత్రి కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారుల మృతదేహాల తరలింపుపై చర్చించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఉండి అధికారులందర్నీ అప్రమత్తం చేశారు. డీఆర్‌ఓ హేమసుందర్, ఆర్‌డీఓ వెంకటరావు, తదితరులు సమాచారాల సేకరణలో నిమగ్నమయ్యారు.
సమాచార సేకరణలో ఎమ్మెల్యే అప్పలనాయుడు
చెన్నై ప్రమాద సంఘటనలో ఎక్కువ మంది గజపతినగ రం నియోజకవర్గానికి చెందిన వారు కావడంతో ఎమ్మె ల్యే కెఏ నాయుడు కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి చేరుకుని మృతులవివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. తమ వద్ద ఉన్న సమాచారాన్ని అధికారులకు తెలియపరుస్తూ వారి వద్ద ఉన్న సమాచారాన్ని తెలుసుకుంటూ కుటుంబ సభ్యులకు తెలియజెప్పే ప్రయత్నం చేశారు.
అన్ని చర్యలూ తీసుకుంటున్నాం
చెన్నై ప్రమాద సంఘటనలో జిల్లాకు చెందిన సుమారు 14 మంది మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం అందింది. దీని ప్రకారం రేపు ఉదయం చెన్నైకు అధికారుల బృందాన్ని పంపిస్తున్నాం. అక్కడి చర్యలను వీరు వేగవంతం చేస్తారు. మృతుల కుటుంబాలకు కార్మిక శాఖ కమిషనర్ రూ.2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూం ఏర్పాటు చేశాం. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయ పడేందుకు చర్య లు తీసుకుంటున్నాం.
- కాంతిలాల్ దండే, జిల్లా కలెక్టర్