
చెన్నై: సొంతవాళ్లు చనిపోతేనే పట్టించుకోని ఈ సమాజంలో ఒక మూగజీవి ప్రాణంపోయిందని ఒక ఆఫీసర్ వెక్కివెక్కి ఏడ్చిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. ముదుమలై టైగర్ రిజర్వ్‌లోని సాదివాయల్ ఎలిఫెంట్ క్యాంప్‌లో ఒక ఏనుగు తీవ్రంగా గాయపడింది. ముదుమలై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గాయపడిన ఏనుగును దగ్గరికి తీసుకొని సపర్యలు చేసి వైద్యుల చేత దానికి చికిత్స అందిస్తున్నాడు.
అయితే చికిత్స పొందుతూ ఆ ఏనుగు మరణించడంతో ఖననం చేసేందుకు అటవీ శాఖ సిబ్బంది ఏర్పాట్లుచేశారు. లారీలో ఉన్న ఏనుగుకు కడసారి వీడ్కోలు పలికేందుకు దాని దగ్గరకు వెళ్లిన ఆఫీసర్‌కు కన్నీళ్లు ఆగలేదు. దాని తొండాన్ని నిమురుతూ వెక్కి వెక్కి ఏడ్చాడు. ఈ వీడియోను భారత అటవీ అధికారి రమేష్ పాండే ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ వీడియో పెట్టిన రెండు రోజుల వ్యవధిలో లక్ష్యల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment