Mudumalai
-
తెప్పకడు ఎలిఫెంట్ క్యాంపును సందర్శించిన మోదీ
-
ఆస్కార్ విజేతలను కలిసిన ప్రధాని నరేంద్ర మోదీ
-
సింహం మృతితో అలర్ట్: ఏనుగులకు కోవిడ్ టెస్ట్
చెన్నె: ఇన్నాళ్లు మనుషులకు మహమ్మారి కరోనా వైరస్ సోకుతుండగా తాజాగా జంతువులకు కూడా ఆ వైరస్ వ్యాపిస్తోంది. జంతువులకు మొట్టమొదటి కేసు తెలంగాణలోని నెహ్రూ జూలాజికల్ పార్కులో వెలుగు చూడగా అనంతరం తమిళనాడులోని వండలూరు జూలో కూడా జంతువులకు కరోనా సోకింది. అయితే ఇక్కడ వైరస్‌తో ఓ సింహ మృతి చెందడం కలకలం రేపింది. ఆ సింహం ద్వారా 9 సింహాలకు వైరస్ పాకింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా ఏనుగులకు కూడా వైరస్ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ముదుమలై టైగర్ రిజర్వ్‌లోని తెప్పకాడు ఏనుగుల శిబిరంలో మంగళవారం 28 ఏనుగులకు కరోనా పరీక్షలు చేశారు. వాటి నుంచి నమూనాలను (శాంపిల్స్) సేకరించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఇన్‌జత్‌నగర్‌లో ఉన్న భారత పశుసంవర్ధక పరిశోధనా సంస్థ (ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ సెంటర్)కు నమూనాలు పంపించాలని ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి రామచంద్రన్ ఆదేశించారు. ఏనుగుల నుంచి ట్రంప్ వాష్ శాంపిల్, రెక్టల్ స్వాబ్‌ను సేకరించినట్లు వెటర్నరీ సర్జన్ రాజేశ్ కుమార్ తెలిపారు. అయితే ఏనుగులన్నీ ఆరోగ్యంగా ఉన్నాయని, వాటికి వైరస్ లక్షణాలు లేవని మరో అధికారి కేకే కౌశల్ వివరించారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా వాటి బాగోగులు చూసుకునే మావటిలు, సహాయ సిబ్బంది మొత్తం 52 మందికి కరోనా వ్యాక్సిన్ వేయించారు. ఏనుగులకు కరోనా సోకే అవకాశం చాలా తక్కువ అని, ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా వాటికి కరోనా పరీక్షలు చేయించినట్లు అధికారులు తెలిపారు. కరోనాతో సింహం మృతి చెందడంతో అప్రమత్తమైన ముఖ్యమంత్రి స్టాలిన్ జూన్ 6వ తేదీన జూపార్క్‌ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. -
ఏనుగు మృతి.. వెక్కివెక్కి ఏడ్చిన అధికారి
చెన్నై: సొంతవాళ్లు చనిపోతేనే పట్టించుకోని ఈ సమాజంలో ఒక మూగజీవి ప్రాణంపోయిందని ఒక ఆఫీసర్ వెక్కివెక్కి ఏడ్చిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. ముదుమలై టైగర్ రిజర్వ్‌లోని సాదివాయల్ ఎలిఫెంట్ క్యాంప్‌లో ఒక ఏనుగు తీవ్రంగా గాయపడింది. ముదుమలై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గాయపడిన ఏనుగును దగ్గరికి తీసుకొని సపర్యలు చేసి వైద్యుల చేత దానికి చికిత్స అందిస్తున్నాడు. అయితే చికిత్స పొందుతూ ఆ ఏనుగు మరణించడంతో ఖననం చేసేందుకు అటవీ శాఖ సిబ్బంది ఏర్పాట్లుచేశారు. లారీలో ఉన్న ఏనుగుకు కడసారి వీడ్కోలు పలికేందుకు దాని దగ్గరకు వెళ్లిన ఆఫీసర్‌కు కన్నీళ్లు ఆగలేదు. దాని తొండాన్ని నిమురుతూ వెక్కి వెక్కి ఏడ్చాడు. ఈ వీడియోను భారత అటవీ అధికారి రమేష్ పాండే ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియో పెట్టిన రెండు రోజుల వ్యవధిలో లక్ష్యల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. -
ఆ ఏనుగు చనిపోయింది
ఉదగమండలం: దేశవ్యాప్తంగా ప్రమాదాల్లో ఏనుగులు చనిపోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన గజరాజు చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది. సోమవారం కృష్ణగిరి జిల్లా హోసూరు సమీపంలో రోడ్డు దాటుతుండగా 10 ఏళ్ల వయసున్న ఏనుగును ఆర్టీసీ బస్సు ఢీకొంది. దాని కుడి కాలికి, వెన్నుముఖకు గాయలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఏనుగును మెరుగైన చికిత్స కోసం మదుమలైలోని తెప్పక్కాడ్ ఎలిఫెంట్ క్యాంప్ కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఏనుగు మృతి చెందిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. మరోవైపు గత 15 రోజుల్లో తమిళనాడు అడవుల్లో వరుసగా ఐదు ఏనుగులు అనారోగ్య కారణాలతో మరణించడం పట్ల జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.