అశ్రునయనాల మధ్య...అంతిమ వీడ్కోలు
విజయనగరం కంటోన్మెంట్ : గుర్తు పట్టలేని విధంగా ఉన్న మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు, పిల్లలు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ముందుగా కలెక్టరేట్‌కు వచ్చి కంట్రోల్ రూమ్‌కు సమాచారమిచ్చిన అనంతరం ఆయా గ్రామాలకు చెన్నై అంబులెన్స్‌లు తరలివెళ్లాయి. దత్తిరాజేరు మండలం కె.కృష్ణాపురానికి చెందిన సిరిపురపు రాము, మక్కువ మండలం పెదైగైశీలకు చెందిన వెంపడాపు శంకరరావు, అదే గ్రామానికి చెందిన మజ్జి సరస్వతి, మక్కువ మండలం తూరుమామిడికి చెందిన నీలమాంబపురానికి చెందిన ముదిలి రామలక్ష్మి మృతదేహాలను ఆయా గ్రామాలకు తరలించారు.
మృతదేహాలు గ్రామాలకు రాగానే ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. ఆయా గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఏ కంట చూసిన మంటికి జాలురువారుతున్న కన్నీటిధారలే కపినించాయి. ఎవరిని కదిపినా రోదన తప్ప వారి నోటవెంట మరో మాట బయటకు రాలేదు. గ్రామస్తులందరూ కలిసి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆచూకీ తెలియాల్సి ఉంది. తొమ్మిది మంది చెన్నైలోని రామచంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల తొలగింపు కొనసాగుతుండడంతో మిగతా వారి కోసం ఎదురుచూస్తున్నారు. బాడంగి మండల కేంద్రానికి చెందిన బొమ్మి అనసూయ క్షేమంగా ఉన్నట్టు అధికారులు ప్రకటించారు.
ఊరి కాని ఊరిలో మృతి.. ఊరవతల కడచూపు
చెన్నైలో మృతి చెందిన వారి కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంది. పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రం వెళ్లిన వీరు అక్కడి భవన ప్రమాదంలో మృతి చెందడంతో కన్నీరుమున్నీరవుతున్న గ్రామస్తులు, కుటుంబ సభ్యులు వర్ణిస్తూ రోది స్తుండడం చూపరులను కూడా కంటతడిపెట్టుకునేలా చేస్తున్నాయి. సాధారణం గా ప్రమాదాల్లో మృతి చెందిన వారి మృతదేహాన్ని గ్రామాల్లో ఉంచరు. ఇది గ్రామీణ ప్రజల కట్టుబాటు. చెన్నైలో మరణించిన వారి మృతదేహాలను నేరుగా స్వగ్రామాలకు తీసుకు రాకుండా అంబులెన్స్‌ల్లో శ్మశాన వాటికలకు తరలించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు, కుటుంబ సభ్యులు నేరుగా శ్మశాన వాటికలకు తరలివెళ్లారు. ఊరుకాని ఊరిలో చనిపోయి ఊరవతల కడచూపులు మిగిల్చావా? దేవుడా అని బంధువులు, కన్నవారు మింటికి, మంటికి ఏకధాటిగా రోదించడంతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలముకున్నాయి.
అతను మా నాన్న కాదు...
కె.కృష్ణాపురానికి చెందిన సిరిపురపు రాము మృతదేహం సాయంత్రానికి స్వ గ్రామం పక్కనే ఉన్న శ్మశానానికి చేరుకుంది. దీంతో గ్రామానికి చెందని ప్రజలతో పాటు కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. వీరితో పాటు కడసారి చూపు చూపించాలంటూ బంధువులు రాము ఇద్దరు కుమార్తెలనూ శ్మశానానికి తీసుకువచ్చారు. ఏడేళ్ల వేదశ్రీ, ఐదేళ్ల ఐశ్వర్యలకు సిరిపురపు రాము మృతదేహాన్ని చూపిం చారు. ప్రమాదంలో తండ్రి తలంతా ఛిద్రమైపోయినట్టు తెలియని ఆ చిన్నారులు మానాన్న కాదూ అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నప్పుడు పంటి బిగువున దుఃఖాన్ని ఆపుకున్న వారు కూడా బోరున ఏడ్చేశారు. నాన్నను చూపించండి అంటూ ఇద్దరు చిన్నకుమార్తెలూ ఏడుస్తున్నప్పుడు అక్కడ వాతావరణం శోకసంద్రమైపోయింది.
నేడు మరో నలుగురి మృతదేహాలు జిల్లాకు
జిల్లాకు చెందిన మరో నలుగురి మృతదేహాలు బుధవారం ఆయా గ్రామాలకు చేరుకోనున్నాయని అధికారులు తెలిపారు. మక్కువ మండలం తూరుమామిడికి చెందిన సీర జయమ్మ, బాడంగి మండలకేంద్రానికి చెందిన బొంగుశాంత కుమారి, కొమరాడ మండలం దళాయిపేటకు చెందిన పడాల చిన్నమ్మ, దత్తిరాజేరు మండలం కె.కృష్ణాపురానికి చెందిన వనం దుర్గ మృతదేహాలు రానున్నాయి. జిల్లాకు చెందిన మరో 26 మంది