ఇప్పటి వరకు 27 మంది మృతి... | Chennai building collapse: Death toll rises to 27, Tamilnadu government release bulletin | Sakshi
Sakshi News home page

ఇప్పటి వరకు 27 మంది మృతి...

Published Tue, Jul 1 2014 11:29 AM | Last Updated on Sat, Sep 2 2017 9:39 AM

Chennai building collapse: Death toll rises to 27, Tamilnadu government release bulletin

చెన్నై: చెన్నై శివారులోని మౌళివాకంలో 11 అంతస్తుల భవనం కూలిన ఘటనపై తమిళనాడు ప్రభుత్వం మంగళవారం బులిటెన్ విడుదల చేసింది.  ఇప్పటివరకూ ఈ ప్రమాదంలో 27మంది మృతి చెందినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మరో 24మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది.

మృతి చెందినవారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన నలుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నట్లు తెలిపింది. అలాగే క్షతగాత్రుల్లో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు మంత్రి అచ్చెంనాయుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement