పులకించిన పల్లె
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:తమ వారిని పోగొట్టుకొని పుట్టెడు బాధలో ఉన్న చెన్నై బాధిత కుటుంబాలకు తానున్నానని హామీలభిం చింది. తమ కష్టాలను ఎవరితో చెప్పుకుం దామా అని ఎదురుచూస్తున్న సమయంలో ఒక ఆశా దీపం వారి కళ్లల్లో కనిపిం చడంతో వారి మోము లు వికసించాయి. రెండు రోజుల పర్యటన నిమిత్తం శ్రీకాకుళం జిల్లా కు చేరుకున్న వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెన్నై బాధిత కుటుంబా ల్లో ఆనందం నింపారు. బుధవారం రాత్రి జిల్లాసరిహద్దులో ప్రవేశించిన ఆయన గురువారం ఉదయం ఆమదాలవలస, పాల కొండ, పాతపట్నం నియోజకవర్గాల్లో పర్యటించి అక్కడి వారిని ఓదార్చారు. బూర్జ, పాలకొండ, ఎల్.ఎన్.పేట, హిరమండలం, కొత్తూరు మండలాల్లో పర్యటించారు. జగన్‌ను చూసిన గ్రామీణ ప్రాంత ప్రజలు పులకించిపోయారు.
చాన్నాళ్ల తర్వాత తమ నాయకుడు రావడం తో పల్లె ప్రజలు కళ్లల్లో ఒత్తులేసుకొని ఎదురుచూశారు. ఇటీవల చెన్నైలో చోటు చేసుకున్న రెండు వేర్వేరు దుర్ఘటనలో జిల్లాకు చెందిన 24 మంది మృతి చెందారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ గురువారం ఉదయం ఆమదాలవలసలో పార్టీ నేత తమ్మినేని సీతారాం నివాసగృహం నుంచి బూర్జ మండలం వైపు బయలుదేరి ఆ మండలంలో మూడు కుటుంబాలను పరామర్శించారు. అనంతరం పాల కొండలో ఊల రవి కుటుంబాన్ని పరామర్శించారు.
అనంతరం ఎల్.ఎన్.పేట, కొత్తూరు, హిరమండలం మండలాల్లో బాధిత కుటుంబాలను పరామర్శించి వారి కష్టాలను ఓపిగ్గా విన్నారు. సంఘటన ఎలా జరిగింది, కుటుంబ సభ్యు ల వివరాలు, భవిష్యత్తులో వారికి ఏమైనా అండ లభిస్తుందా, ప్రభుత్వం ప్రోత్సాహం ఏమైనా ఇచ్చిందా అని ఆరా తీశారు. భవిష్యత్తులో పార్టీ తరఫున, తమ కుటుం బం తరఫున పూర్తి సహకారం లభిస్తుందని హామీనిచ్చారు. సాక్షాత్తూ జగనే తమ ఇళ్లకు రావడంతో బాధిత కుటుంబాలు హర్షిం చాయి. తమవాడేనన్న భావన కల్పించడంతో మరింత ఉప్పొం గిపోయారు. తమ కష్టాలను ఆయనకు చెప్పుకున్నారు.
కష్టాలు చెప్పుకున్న మహిళలు..
జగన్ పర్యటించిన అన్ని ప్రాంతాల్లోనూ రైతులు, మహిళలు తమ కష్టాలను చెప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ రుణమాఫీ అం టూ గద్దెనెక్కి ఇప్పుడు రీషెడ్యూల్ అంటూ తప్పుడు ప్రకటనలు చేయడంతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళా సంఘాల పట్ల ప్రభుత్వం ఉదాసీనత వ్యక్తం చేయడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనం ప్రతిపక్షంలో ఉన్నామని, రానున్న రెండు నెలల్లో అసెంబ్లీలో రాష్ట్ర ప్రజల కష్టాలపై గట్టిగా వాదిస్తానని జగన్ వారికి హామీనిచ్చారు. పర్యటించిన అన్ని ప్రాంతాల్లోనూ పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా జగన్‌తో చేతులు కలిపేందుకు ప్రయత్నించారు. ఆయన మోములో చిరు నవ్వును చూసి అచ్చం నాన్నలాగే ఉన్నావంటూ ఆనంద పడ్డారు. మా కష్టాలు నువ్వే చూడాలంటూ సమస్యలు వివరించే ప్రయత్నం చేశారు. జగన్ పర్యటించిన అన్ని ప్రాంతాల్లోనూ అటు పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఉత్సాహం కల్పించింది.
రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నరసన్నపేటతో పాటు పలు మండలాల్లో జగన్ పర్యటన కొనసాగనున్నట్టు నేతలు తెలిపారు. జగన్ రాకను తెలుసుకున్న గ్రామస్తులు రోడ్డుకిరువైపులా నిలబడి ఆశగా ఎదురుచూశారు. హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలతో రహదారులు నింపేశారు. వయస్సు తారతమ్యం లేకుండా అన్ని వర్గాల వారు జగనన్నకు హారతులు పట్టారు. హాస్టల్ విద్యార్థులు తాము తింటున్న భోజనం ఇదేనంటూ రుచి చూపించారు. జగన్ బాధపడుతూ ఇలాంటి అన్నం తింటున్నారా అంటూ ఆవేదన చెందారు. వృద్ధుల తల నిమిరారు.
అక్క, చెల్లెళ్లను ఓదార్చారు. కొన్ని ప్రాం తాల్లో వర్షం వస్తున్నా లెక్క చేయకుండా జిల్లా ప్రజలు జగన్ కోసం ఎదురుచూశా రు. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా క్యూ కట్టారు. మొత్తానికి జగన్ పర్యటన చెన్నై బాధిత కుటుంబాల్లో వెలుగులు నింపింది. జగన్ పర్యటనలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, కేంద్ర పాలకమండలి సభ్యుడు పాలవలస రాజశేఖరం, ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, కలమట వెంకటరమణ, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పార్టీ జిల్లా స్థాయి నాయకులు తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతి, పిరియా సాయిరాజ్, అంధవరపు సూరిబాబు, వరుదు కల్యాణి, మామిడి శ్రీకాంత్, పాలవలస విక్రాంత్, కరణం ధర్మశ్రీ, విశాఖ, విజయనగరం జిల్లాల నేతలు పాల్గొన్నారు. జగన్ పర్యటించిన చోట ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు ఘనంగా స్వాగతించారు.
శ్రీకాకుళం చేరుకున్న జగన్
తొలిరోజు పర్యటన ముగించుకున్న జగన్‌గురువారం అర్ధరాత్రి 12.15 గంటల సమయంలో శ్రీకాకుళం చేరుకున్నారు.