శిథిలాల నుంచి ఓ బాలిక వెలికితీత | A girl from ruins | Sakshi
Sakshi News home page

శిథిలాల నుంచి ఓ బాలిక వెలికితీత

Published Sun, Jun 29 2014 3:32 PM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM

శిథిలాల నుంచి ఓ బాలిక వెలికితీత

శిథిలాల నుంచి ఓ బాలిక వెలికితీత

చెన్నై: మొగలివాక్కంలో భవనం కూలిన ప్రదేశంలో శిథిలాల నుంచి ఈ రోజు ఓ బాలికను బయటకు తీశారు. ఇక్కడ నిర్మాణంలో ఉన్న 11 అంతస్తుల భవనం నిన్న కూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పది మంది తెలుగు కార్మికులు మృతి చెందారు. ఇంకా శిథిలాలను తొలగిస్తున్నారు.  కింద చిక్కుకున్నవారిని బయటకు తీస్తున్నారు. ఈ రోజు భవానీ అనే బాలికను వెలికి తీశారు. ఇప్పటి వరకు 21 మందిని సురక్షితంగా బయటకు తీసినట్లు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రి కె.మృణాళిని సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు. మృతి చెందినవారిలో ఎక్కువ మంది కార్మికులు విజయనగరం జిల్లా వారే.  మృతి చెందిన ఒక్కో కార్మికుని కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిదు లక్షల రూపాయలు ప్రకటించారు. గాయపడిన వారికి 50 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. తమిళనాడు ముఖ్యమంత్రి  జయలలిత రెండు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడినవారికి 50 వేల రూపాయలు ఇస్తామని జయలలిత చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement