చెన్నైలో బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 54కి చేరింది.
చెన్నై : చెన్నైలో బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 54కి చేరింది. మరికొందరి కోసం ఆరో రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే భవనం శిథిలాల కింద ఇంకా ఎంతమంది చిక్కుకుని ఉంటారనే దానిపై అధికారులు స్పష్టంగా వివరాలు ఇవ్వటం లేదు. కాగా శనివారం నిర్మాణంలో ఉన్న 11 అంతస్తుల భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే.
దాంతో నిర్మాణ పనుల్లో ఉన్న అనేకమంది శిథిలాల కింద చిక్కుకు పోయారు. కూలిన భవనం నుంచి సహాయక సిబ్బంది మృతదేహాలను వెలికి తీస్తునే ఉన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందినవారు ఎక్కువగా తెలుగువారే ఉన్నారు. వీరంతా ఉపాధి కోసం విజయనగరం జిల్లా నుంచి చెన్నైకి వలస వెళ్లారు. మరోవైపు మృతదేహాలకు చెన్నైలోని రాయపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ 17మృతదేహాలను గుర్తించినట్లు తెలుస్తోంది.
Chennai Building Collapse, 54 Dead, ex gratia, చెన్నై, కుప్పకూలిన భవనం, 54 మంది మృతి, 11 అంతస్తుల భవనం, మౌళివాకం, ఎక్స్గ్రేషియా