చెన్నై మహానగరంలో బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య బుధవారం 41కి చేరింది.
చెన్నై మహానగరంలో బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య బుధవారం 41కి చేరింది. గత అర్థరాత్రి భవన శిథిలాల నుంచి 8 మృత దేహాలను వెలికి తీశారు. అలాగే శిథిలాల కింద చిక్కుకున్న మరో 27 మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా శనివారం నిర్మాణంలో ఉన్న11 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఆ భవన నిర్మాణంలో పని చేస్తున్న కార్మికులలో అత్యధికులు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారే.