చెన్నైలో 11 అంతస్తుల భవనం కూలిన సంఘటనలో విజయనగరం జిల్లాకు చెందిన 14 మంది శిథిలాల్లో చిక్కుకున్నారు.
చెన్నై: చెన్నైలో 11 అంతస్తుల భవనం కూలిన సంఘటనలో విజయనగరం జిల్లాకు చెందిన 14 మంది శిథిలాల్లో చిక్కుకున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిలో ఎక్కువ మంది తెలుగువాళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రుల కోసం సహాయక చర్యలు చేపట్టాలని విజయనగరం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప చెప్పారు. ప్రమాదం జరిగిన విషయాన్ని మంత్రి కిమిడి మృణాళిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు.
మాన్‌గాడులో శనివారం జరిగిన ఈ దుర్ఘటనలో 50 మంది చిక్కుకున్నట్టు సమాచారం. ప్రమాదంలో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహం వెలికితీశారు. మరో 8 మందిని రక్షించారు. జాతీయ విపత్తు సహాయక బృందాలు ఘటనా స్ఠలానికి చేరుకుని రంగంలోకి దిగాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు.