Vijayanagaram district
-
విజయనగరం జిల్లాలో డయేరియా డేంజర్ బెల్స్
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లా గుర్ల మండలంలో డయేరియా విజృంభిస్తోంది. మండల కేంద్రమైన గుర్లకు చెందిన బోడసింగి రాములమ్మ (67), కోటగండ్రేడు గ్రామానికి చెందిన మరడాన అప్పలనర్సయ్యమ్మ (57) గురువారం డయేరియాతో మృతి చెందారు. దీంతో గత ఐదు రోజుల్లో డయేరియాతో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. రాములమ్మకు రెండ్రోజుల క్రితమే డయేరియా సోకింది. ఆమెకు గుర్లలోని వైద్య శిబిరంలో చికిత్స అందించడంతో రోగం తగ్గిపోయిందని బుధవారం ఆమెను కుటుంబసభ్యులు ఇంటికి తీసుకువెళ్లిపోయారు. గురువారం ఉదయం మళ్లీ వాంతులు, విరేచనాలు అవ్వడంతో ఆమె పరిస్థితి విషమించింది. ఆస్పత్రికి తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు సిద్ధమవుతుండగానే మృతి చెందింది. అప్పలనర్సయ్యమ్మకు కూడా మూడు రోజుల క్రితమే డయేరియా సోకింది. ఆమెకు తొలుత గుర్ల పీహెచ్సీలో వైద్యం అందించారు. తర్వాత విజయనగరం జిల్లా సర్వజన ఆస్పత్రికి వైద్యులు రిఫర్ చేశారు. కానీ ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో కేజీహెచ్‌కు అక్కడి వైద్యులు రిఫర్ చేశారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. గుర్ల మండల కేంద్రంలో ఇప్పటికే 300 మంది ఈ రోగం బారినపడ్డారు. గురువారం కొత్తగా మరో 20 కేసులు నమోదయ్యాయి. గుర్లలోని జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ పద్మావతి సందర్శించారు. పాఠశాలలో బెంచీలపైనే 50 మంది రోగులను పడుకోబెట్టి వైద్యసేవలు అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని విజయనగరం జిల్లా సర్వజన ఆస్పత్రికి, విశాఖలోని కేజీహెచ్‌కు పంపిస్తున్నారు. -
స్వామి భూములు స్వాహా!
గంట్యాడ: దేవుడికే టీడీపీ నాయకులు శఠగోపం పెట్టేశారు. దేవుడి భూములను ఆక్రమించి ఫలసాయం పొందడంతో పాటు వాటి విక్రయాలకు తెగబడుతున్నారు. ఈ విషయం దేవదాయశాఖ అధికారులకు తెలిసినా ప్రేక్షకపాత్రకే పరిమితమవడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీమన్నార్ రాజగోపాలస్వామి ఆలయానికి అదే జిల్లా గంట్యాడ మండలం సిరిపురం గ్రామంలో 48 ఎకరాల భూమి ఉంది.విజయనగరంలోని హుకుంపేటకు చెందిన అనసపురపు జగన్నాథరావు తండ్రి రామమూర్తి పంతులు, అనసపురపు జగన్నాథ రాజగోపాలరావు తండ్రి శ్రీనివాస పంతులు శ్రీమన్నార్ రాజగోపాలస్వామివారి ధూప, దీప నైవేద్యాలు, జాతర నిర్వహణ, ఇతర ఖర్చుల కోసం 1929లో 48 ఎకరాల భూమిని రిజిస్టర్ చేశారు.డాక్యుమెంటేషన్ 1815 పేరిట 32 ఎకరాల పల్లపు భూమి, 16 ఎకరాల మెట్ట భూమిని అప్పగించారు. ఈ భూమి సర్వే నెంబర్ 95/15, 16, 17, 19, 21, 96/1, 3, 4, 97/20, 21, 23, 99/9, 10, 11, 12, 14, 15, 100/4, 5, 8, 9, 10, 140/3, 4, 9, 11, 12, 14 తదితర నంబర్లలో విస్తరించి ఉంది. దీని విలువ రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు ఉంటుందన్నది స్థానికుల మాట. దీనిపై టీడీపీ నేతల కన్నుపడింది. అంతే.. మొత్తం భూమిని తమ గుప్పెట్లోకి లాక్కున్నారు. ఏళ్ల తరబడి అనుభవించడంతో పాటు ఇప్పుడు అధికార బలంతో విక్రయాలకు సిద్ధపడ్డారు. కొందరైతే అందులో అక్రమ కట్టడాలు సైతం తలపెట్టారు. ఇంత జరుగుతున్నా దేవదాయ శాఖాధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. ఆ రిజిస్ట్రేషన్లు చెల్లవు.. శ్రీమన్నార్ రాజగోపాలస్వామి ఆలయానికి చెందిన 48 ఎకరాల భూమి సిరిపురం గ్రామ పరిసరాల్లో ఉంది. ఈ భూములన్నీ ఆలయానికి చెందినవే. పక్కా డాక్యుమెంట్లు ఉన్నాయి. శ్రీమన్నార్ రాజగోపాలస్వామి దేవస్థానానికి చెందిన భూములన్నీ మ్యానిíసిప్ట్ డయాగ్లేట్ రిజిస్టర్ (ఎండీఆర్)లో దేవస్థానం భూములుగా నమోదై ఉన్నాయి. ఈ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు నిలిపివేశాం. అక్రమ రిజి్రస్టేషన్లు చెల్లవు. కొనుగోలు చేసేవారే బాధ్యులవుతారు. – శ్రీనివాస్, వీఆర్వో, సిరిపురం -
YSR Jagananna Colonies: కావాల్సినంత ఇసుక
సాక్షి ప్రతినిధి, విజయనగరం: పేదలందరికీ పక్కా ఇంటి భాగ్యం కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనికోసం ‘పేదలందరికీ ఇళ్లు’ పథకాన్ని ఆచరణలోకి తెచ్చింది. జిల్లావ్యాప్తంగా లే అవట్లను వేసింది. వైఎస్సార్ జగనన్న కాలనీలుగా నామకరణం చేసి స్థలాలను కేటాయించింది. విశాలమైన రోడ్లు, తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించింది. కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు కావాల్సిన సామగ్రిని విరివిగా సమకూర్చుతోంది. అందులో భాగంగా ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తోంది. దీనికోసం ప్రతి మండలంలోనూ ఒక్కొక్కటి చొప్పు న స్టాక్ పాయింట్‌ను జిల్లా అధికారులు ప్రారంభించారు. సమీప ఇసుక డిపోల నుంచి వాటికి ఇసుకను చేరవేస్తున్నారు. ఇళ్ల నిర్మాణం కోసం గృహనిర్మాణ శాఖ ద్వారా జారీ అయిన బిల్లుల ఆధారంగా ఇప్పటివరకూ 17 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా గృహాల లబ్ధిదారులకు సమకూర్చారు. ఆ బిల్లులపై హాలోగ్రామ్ ఉండడంతో అక్రమాలకు అడ్డుకట్ట పడింది. 77 రీచ్‌లలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. జిల్లాలోని నాలుగు డిపోల్లో మంగళవారం నాటికి 41,850 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉంది. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయడమే తరువాయి!. ఇళ్ల మంజూరు ఇలా... పేదలకు వైఎస్సార్ జగనన్న కాలనీల్లో 80,547 ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో చాలా ఇళ్ల నిర్మాణ పను లు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని ఇళ్ల నిర్మాణం పూర్తయింది. దాదాపు 17వేల ఇళ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు ప్రారంభించాల్సి ఉంది. వారికి అవసరమైన అన్ని మౌలిక వసతులు సమకూర్చడంతో పాటు పనులు వేగవంతం కావడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలిచ్చింది. గృహనిర్మాణ శాఖ అధికారులు ప్రతి లేఅవుట్‌లోనూ ఇళ్ల నిర్మాణాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకూ ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించలేనివారితో మాట్లాడి వారికి సహాయ సహకారాలు అందజేస్తున్నారు. సలహాలు, సూచనలు ఇస్తున్నారు. సక్రమంగా ఇసుక అందేలా... ఒక్కో ఇంటి నిర్మాణానికి 20 టన్నుల ఇసుకను లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది. గతంలో ఇసుక సరఫరాలో ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నూతన ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. జేపీ పవర్ కన్స్ట్రక్ష న్స్‌కు ఇసుక సరఫరా బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. రీచ్‌ల నుంచి లారీల్లో ఇసుక జిల్లాలోని నాలుగు డిపోలకు వస్తోంది. అక్కడి నుంచి లబ్ధిదారులకు సులువుగా చేరవేసేందుకు వీలుగా మండలానికి ఒకటి చొప్పున స్టాక్ పాయింట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాలో ప్రస్తుతం 77 ఇసుక రీచ్‌లు ఉన్నా యి. వీటిలో ఒక్కోచోట వెయ్యి నుంచి రెండు వేల క్యూబిక్ మీటర్ల ఇసుక లభ్యమవుతోంది. ఆ ఇసుకను డిపోలకు, అక్కడి నుంచి స్టాక్ పాయింట్లకు తీసుకొస్తున్నారు. అక్కడ ఇళ్ల లబ్ధిదారులకు హాలోగ్రామ్ ఉన్న బిల్లుల ఆధారంగా ఇసుకను సరఫరా చేస్తున్నామని జేపీ పవర్ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధి హర్షవర్దన్ ప్రసాద్ చెప్పారు. ఇసుక పక్కదారి పట్టకుండా... గ్రామ/వార్డు సచివాలయంలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ జనరేట్ చేసి ఇచ్చిన బిల్లును లబ్ధిదారులు స్టాక్ పాయింట్‌కు తీసుకెళ్లి చూపిస్తే ఇసుక ఇస్తున్నారు. చేతిరాతతో ఇస్తే కుదరదు. హలోగ్రామ్ బిల్లులతో ఇసుక పక్కదారి పట్టకుండా నిరోధించగలుగుతున్నారు. సత్వరమే బిల్లుల చెల్లింపు.. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు గృహనిర్మాణ శాఖ ద్వారా బిల్లులను వారంలోగా జనరేట్ చేస్తున్నారు. ప్రతీ మండలం నుంచి ఆయా ఏఈలు, డీఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లు లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ స్థాయిని బట్టి బిల్లులు వారి వ్యక్తిగత ఖాతాలకు పడేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇసుక, సిమెంట్ కొరత లేదు. జిల్లాలో ఇళ్ల నిర్మాణం జోరందుకుంది. ఇనుము కోసం చర్చలు జరుగుతున్నాయి. ప్రతి లబ్ధిదారునికీ వారంలోగా బిల్లులు వారి ఖాతాల్లోకి జమవుతున్నాయి. – ఎస్వీ రమణమూర్తి, ప్రాజెక్టు డైరెక్టర్, గృహనిర్మాణ శాఖ, విజయనగరం -
రేపు విజయనగరం జిల్లాలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, విజయనగరం: ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా రేపు(బుధవారం) విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. గుంకలాంలో భారీ కాలనీలో పట్టాలు పంపిణీ, ఇళ్లనిర్మాణ పనులను సీఎం ప్రారంభించనున్నారు. సీఎం వైఎస్ జగన్.. బుధవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి, 11:15 గంటలకు గుంకలాం చేరుకోనున్నారు. పైలాన్ ఆవిష్కరణ అనంతరం ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. మధ్యాహ్నం 2.45 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.(చదవండి: బాబుపై సీఎం జగన్ వ్యంగ్యాస్త్రాలు) విజయనగరం నియోజకవర్గంలోని విజయనగరం రూరల్ మండలం గుంకలాం వద్ద 397.36 ఎకరాల్లో 12,301 మంది లబ్దిదారుల కోసం భారీ లే అవుట్‌ను సిద్ధం చేశారు. రూ.4.37 కోట్లతో లే అవుట్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. పేదలకు స్థలాలు ఇచ్చేందుకు గానూ ప్రభుత్వం.. 428 మంది రైతుల నుంచి 101.73 కోట్ల రూపాయలతో భూమిని కొనుగోలు చేసింది. మొత్తంగా విజయనగరం జిల్లాలో 1,08,230 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఇళ్లపట్టాలు పంపిణీ చేస్తోంది. దీనిలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన 65,026 మంది, పట్టణ ప్రాంతాలకు చెందిన 43,204 మంది లబ్ధిదారులు వున్నారు. పేదలకు ఇళ్ళస్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం మొత్తం 1,164 లేఅవుట్లను సిద్దం చేసింది. వీటిని అభివృద్ధి చేసేందుకు రూ.10.19 కోట్లు ఖర్చు చేసింది. (చదవండి: ‘సినిమాల్లో వకిల్ సాబ్.. బయట పకీర్ సాబ్’) -
నేడు గిరిపుత్రులకు ‘పట్టా’భిషేకం
గిరిపుత్రుల తలరాతలు మారుతున్నాయి. వారి జీవితాల్లో వెలుగు పూలు పూయించేందుకు సర్కారు నడుం బిగించింది. నాడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర సాక్షిగా వారి కష్టాలు నేరుగా తెలుసుకున్నారు... వారి సమస్యలు కళ్లారా చూశారు... నేనున్నానంటూ భరోసా కల్పించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో వాటిని నెరవేరుస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్నా హక్కుకు ఠికానా లేక... కష్టపడినా ఫలితం దక్కుతుందో తెలీక... దినదిన గండంగా గడుపుతున్న వారికి అటవీభూములపై హక్కు కలి్పస్తున్నారు. ఉన్నత విద్యను వారికి చేరువ చేసేందుకు ఇంజినీరింగ్ కళాశాలను ప్రారంభిస్తున్నారు. అత్యాధునిక వైద్యం ఉచితంగా అందించేందుకు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి కల సాకారం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లా చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో గిరిజనులకు విద్య, వైద్యం, జీవనోపాధి అందించే భారీ ప్రాజెక్టులను గాంధీ జయంతి నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఒకేసారి ప్రారంభించనున్నారు. తాను పాదయాత్రలో గిరిపుత్రులకు ఇచ్చిన మాట ప్రకారం వారికి ఉన్నత విద్యను, ఆధునిక వైద్య సదుపాయాలను అందించనున్నారు. ఎన్నో ఏళ్లుగా అడవితల్లిని నమ్ముకొని జీవనాన్ని సాగిస్తున్న గిరిపుత్రులకు వారు సాగుచేసే అటవీ భూమిపై సాగుహక్కు కల్పిస్తూ పట్టాలను ఇవ్వనున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి శుక్రవారం నిర్వహించే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ మూడు కార్యక్రమాలను ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తారు. (చదవండి: సాకారం కానున్న గిరిజన రైతుల స్వప్నం) అటవీ భూములపై శాశ్వత హక్కు జిల్లాలోని కురుపాం, పార్వతీపురం, సాలూరు తదితర మూ డు షెడ్యూల్డు ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు నాన్ షెడ్యూల్డు ప్రాంతంలోని బొబ్బిలి, గజపతినగరం, నెల్లిమర్ల, ఎస్.కోట తదితర అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వున్న అటవీ భూములపై కూడా స్థానికంగా నివసించే గిరిజనులకు సాగు హక్కు కల్పించే పట్టాలు, ప్రభుత్వ భూముల పై డీకేటీ పట్టాలు పంపిణీ చేసేందుకు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ నేతృత్వంలో ఐటీడీఏ పీఓ కూర్మనాథ్, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని షెడ్యూల్డు, నాన్ షెడ్యూల్డు ఏరియాలో కలుపుకొని 13,076 గిరిజన కుటుంబాలకు 25,002 ఎకరాల అటవీ భూమిపై అటవీ హక్కుల పత్రాలు అందజేసేందుకు అంతా సిద్ధం చేశారు. మరో 9,945 మంది గిరిజనులకు 15,012 ఎకరాల విస్తీర్ణంపై హక్కులు కలి్పస్తూ డీకేటీ పట్టాలను కూడా అందజేయనున్నారు. మొత్తం జిల్లాలోని 23,021 గిరిజన కుటుంబాలకు 40,015 ఎకరాల భూములపై సాగు హక్కులు కలి్పంచే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. చేరువలో ఉన్నత విద్య గిరిజన విద్యార్ధులు ఉన్నత చదువుల కోసం ఎంతో దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా నాణ్యమైన ఉన్నత, సాంకేతిక విద్యను వారి ముంగిటనే అందించేందుకు వీలుగా కురుపాంలో జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పా టు చేస్తున్నారు. కంప్యూటర్ సైన్సు, సివిల్, మెకానికల్, ఈసీఈ, ఈఈఈ బ్రాంచిలతో ఈ ఏడాది నుంచే తరగతు లు మొదలయ్యేలా కళాశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభు త్వం కళాశాలకు అవసరమైన భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల కోసం రూ.153 కోట్లు మంజూరు చేస్తూ ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయని కురుపాం ఇంజినీరింగ్ కళాశాల స్పెషల్ ఆఫీసర్, జేఎన్టీయూ ప్రొఫెసర్ జయసుమ చెప్పారు. ఇంజినీరింగ్ కళాశాలను ముఖ్యమంత్రి ప్రారంభించడంతోపాటు భవనాల నిర్మాణానికి కూడా ఆన్ లైన్లోనే శంకుస్థాపన చేయనున్నారు. ఆధునిక వసతుల వైద్యం పార్వతీపురంలో రూ.49.26 కోట్లతో 151 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలిచ్చింది. దీనికి సంబంధించి ఇటీవలే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సహా ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు స్థల పరిశీలన కూడా చేశారు. ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 90 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, మూడంతస్తుల్లో ఈ ఆసుపత్రి భవనాలను నిర్మించనున్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ఆన్లైన్ ద్వారా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. పార్వతీపుం ఐటీడీఏ చరిత్రలో ఇంతవరకు ఎన్నడూలేని విధంగా ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడంతో ఈ ప్రాంత గిరిజనులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. పార్వతీపురం మునిసిపల్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్‌లాల్‌తో పాటు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. పాస్‌పుస్తకాలు పంపిణీకి సిద్ధం అటవీ భూములను డిజిటైజేషన్ ద్వారా సర్వే నిర్వహించి లబి్ధదారులకు కేటాయించిన భూములకు హద్దు రాళ్ళు నాటి, అటవీ హక్కుల పాస్ పుస్తకాలు పంపిణీకి సిద్ధం చేశాం. ఆర్ఓఎఫ్ఆర్, డీకేటీ పట్టాలు పొందిన గిరిజన రైతులకు భూములు సాగుచేసుకొనే నిమిత్తం వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ ద్వారా జీడిమామిడి మొక్కలు, చిరుధాన్యాల విత్తనాలు, పవర్ వీలర్స్, స్ప్రేయర్స్, పవర్ టిల్లర్స్, సూక్ష్మ ధాతువులు రాయితీద్వారా అందించనున్నారు. – ఆర్.కూర్మనాథ్, ఐటీడీఏ పీఓ ఎన్నో ఏళ్ల కల నెరవేరుతోంది మా తాత ముత్తాతల నుంచి ఎంతోమంది అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాం. కానీ మా భూములపై హక్కులు మాకున్నాయో లేదో తెలిసేది కాదు. ఇంతవరకు కష్టపడి వ్యవసాయం చేసుకోవడమే గాని మా భూముల పై హక్కు ఎలా పొందాలి, మా పేరున పట్టాలు ఎలా తీసుకోవాలో తెలీదు. ఇప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి వల్ల ఆ కల నెరవేరుతోంది. మా భూములపై సంపూర్ణ హక్కులు లభిస్తున్నాయి. సీఎంకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. – ఆరిక శ్రీనివాసరావు, టేఖరగండి గ్రామం -
పెనుమత్స సాంబశివరాజు కన్నుమూత
సాక్షి, విజయనగరం: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశాఖ అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక నాయకుడిగా ఆయన గుర్తింపును సొంతం చేసుకున్నారు. 1989-94 లో మంత్రిగా, 1958లో సమితి ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహించారు. 1968లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన ఆయన గజపతినగరం, సతివాడ శాసనసభ స్థానాల నుంచి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి రాజకీయ కురువృద్ధుడిగా గుర్తింపు పొందారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు.. సీఎం జగన్ ఆదేశం వైఎస్సార్సీపీ సీనియర్ నేత దివంగత పెనుమత్స సాంబశివరాజు పార్ధివ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వాణి సంతాపం మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు మృతి పట్ల డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి సంతాపం తెలిపారు. విజయనగరం రాజకీయాల్లో ఆయన అరుదైన ముద్ర వేసుకున్నారని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్, జిల్లాకి ఆయన మృతి తీరని లోటని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని పుష్ప శ్రీవాణి తెలిపారు. -
కరోనా వేళ.. కాసుల వేట
‘కరోనా బాధితుడు: హలో..సర్, నేను కరోనాతో బాధపడుతున్నాను. మీ ఆస్పత్రిలో చేరాలనుకుంటున్నాను. బెడ్స్ ఖాళీగా ఉన్నాయా. ఆస్పత్రి సిబ్బంది: బెడ్స్ ఉన్నాయో లేదో చూడాలి. చెక్ చేసి చెబుతాం. కరోనా బాధితుడు: ఫీజు ఎంత అవుతుంది. ఎన్నిరోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు. ఆస్పత్రి సిబ్బంది: అడ్మిషన్‌కి రూ.25 వేలు కట్టాలి. తర్వాత రోజుకు రూ.10 వేలు. ఎన్నిరోజులకు డిశ్చార్జ్ చేస్తామనేది చెప్పలేం. వారం రోజుల క్రితం నుంచే చేర్చుకుంటున్నాం. ఇంత వరకూ ఎవరినీ డిశ్చార్జ్ చేయలేదు. కరోనా బాధితుడు: అవసరమైతే ఆక్సిజన్ పెడతారా, ఏసీ రూమ్ ఇస్తారా. ఆస్పత్రి సిబ్బంది: ఆక్సిజన్ అన్ని బెడ్స్‌కి లేదు. నాన్ ఏసీ గదులే ఇస్తాం. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి సిబ్బందికి, కరోనా బాధితుడికి మధ్య జరిగిన సంభాషణ ఇది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: కరోనా ఎంతోమంది ప్రాణాలు తీస్తుంటే.. కొందరికి మాత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. డబ్బు పోయినా ప్రాణం నిలుపుకోవాలని కొందరు తాపత్రయపడుతుంటే... విపత్కర పరిస్థితులను క్యాష్‌చేసుకోవడంలో ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు నిమగ్నమయ్యారు. నగరంలో పెద్ద ఆస్పత్రులుగా పేర్కొంటున్నవారంతా ఇదే రీతిలో దోపిడీ పర్వం కొనసాగిస్తున్న విషయం సాక్షి పరిశోధనలో వెలుగుచూసింది. కలవరపెడుతున్న వైరస్ జిల్లాలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. సామాజిక వ్యాప్తి కారణంగా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. బుధవారం నాటికి జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 4111కు చేరింది. ఇప్పటివరకూ 23 మందిని పొట్టన పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు సహజంగానే బాగా పెరిగాయి. చికిత్స కోసం ఎంతైనా ఖర్చుపెట్టేందుకు వెనకాడటం లేదు. అదే ఇప్పుడు ప్రైవేటు ఆస్పత్రులకు వరంగా మారింది. ఇదే అదనుగా ఇష్టానుసారం ఫీజుల రూపంలో పేషెంట్ల నుంచి డబ్బు గుంజేసి... అక్రమార్జనకు తెగబడుతున్నారు. జిల్లా కేంద్రాస్పత్రితో పాటు పదకొండు ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్–19 చికిత్సకు అవకాశం కల్పిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వీటిలో మిమ్స్ కోవిడ్ ఆస్పత్రి, ప్రభుత్వ ఆస్పత్రులు జిల్లా అధికార యంత్రాంగం ఆధీనంలో నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి అందరికీ వైద్యం ఉచితంగా అందే ఏర్పాటు చేసింది. అలాగే ప్రైవేటు ఆస్పత్రులకు కొన్ని రేట్లను కూడా నిర్ణయించింది. అయితే ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీని గాలికొదిలేసి, నేరుగా డబ్బు తీసుకుంటున్నారు. ఇదే విషయాన్ని పలు వురు బాధితులు స్వయంగా సాక్షికి తెలియజేశారు. దీనికి తోడు సాక్షి స్వయంగా చేసిన పరిశోధనలోనూ ప్రైవేటు ఆస్పత్రులు అధికంగా డబ్బు వసూలు చేస్తున్నట్లు వెలుగుచూసింది. అడ్మిషన్ కే రూ.25 వేల నుంచి రూ.45 వేలు తీసుకుంటున్నారు. ఇక రోజుకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకూ వసూలు చేస్తున్నవారున్నారు. కొన్ని ఆస్పత్రులు బిల్లు ఇవ్వండం లేదు. మరికొన్ని సగం సొమ్ముకు మాత్రమే బిల్లు ఇస్తామంటున్నాయి. దీనివల్ల బాధితుడికి ఆరోగ్యశ్రీ ఎలాగూ వర్తించకపోగా కనీసం అతను చేయించుకున్న వ్యక్తి గత ఆరోగ్య బీమా కూడా వచ్చే అవకాశాన్ని కోల్పోతున్నాడు. పరీక్షల జోరు.. ఫలితాలు బేజారు జిల్లాలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు, కేవలం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులు, సంజీవని బస్సుల ద్వారా రికార్డు స్థాయిలో 4,732 పరీక్షలు నిర్వహించారు. వీటిలో ఆర్టీపీసీఆర్ టెస్టులు 55, ట్రూనాట్ టెస్టులు 238, ర్యాపిడ్ యాంటిజన్ కిట్ల ద్వారా 4439 పరీక్షలు నిర్వహించారు. వీటిలో ట్రూనాట్ టెస్టులద్వారా చేసిన పరీక్షల్లో 64, ర్యాపిడ్ యాంటిజన్ టెస్టుల ద్వారా 150 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం జిల్లాలో 2,462 పాజిటివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 458 మంది కోవిడ్ ఆస్పత్రుల్లోనూ, 768 మంది కోవిడ్ కేర్ సెంటర్లలోను, 168 మంది ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ చికిత్స పొందుతున్నారు. అయితే ఫరీక్షల ఫలితాల వెల్లడిలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. గాజులరేగకు చెందిన ఒక వ్యక్తికి కరోనా నిర్థారణ పరీక్షలు ఈ నెల 22న నిర్వహించిన వైద్యులు, ఫలితాన్ని మాత్రం ఇప్పటి కీ వెల్లడించలేదు. అనుమానం వచ్చి ఆ వ్యక్తి గ్రామ వలంటీర్ ద్వారా ఆన్లైన్లో చెక్ చేయిస్తే పాజిటివ్ గా నమోదయ్యింది. కానీ ఆస్పత్రి నుంచి పాజిటివ్ అనే నిర్థారణ రిపోర్ట్ రానందున అతనిని కోవిడ్ ఆస్పత్రికి తరలించలేదు. నేటికీ టెస్ట్‌కు వచ్చిన వ్యక్తిగానే అతనిని ప్రభు త్వ కేంద్రాస్పత్రిలో ఉంచేశారు. పరీక్ష ఫలితం సమాచారం అతనికి రాకపోవడానికి అతని సెల్ ఫోన్ నంబర్ తప్పుగా నమోదు చేయడమే కారణంగా తెలిసింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. పాజిటివ్ నిర్ధారణ అయ్యాక ఆ రోగి ప్రాథమిక కాంటాక్ట్స్‌కు పరీక్షలు చేయడంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. అడిగినంత ఇచ్చి చికిత్స పొందా... నేను విజయనగరంలో ఉంటాను. నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరేందుకు నిర్వాహకులను సంప్రదించాను. అడ్మిషన్ చేసుకోవాలంటే రూ.45 వేలు కట్టాలన్నారు. మా ఇంట్లో 60 ఏళ్లు పైబడినవారు, చిన్నపిల్లలు మొత్తం కలిపి 16 మంది ఉన్నారు. వారందరి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఆస్పత్రిలో వారడిగినంత డబ్బుకట్టి జాయిన్ అయ్యాను. – కరోనా బాధితుడు. కఠిన శిక్ష తప్పదు కోవిడ్ బాధితుల చికిత్సకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులనే తీసుకోవాలి. అలా కాదని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కువ డబ్బు వసూలు చేస్తే కఠిన శిక్షలు తప్పవు. అలాంటి వారిపై బాధితులు ఫిర్యాదు చేస్తే ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన నేరంపై సెక్షన్ 188, విపత్తు నివారణ చట్టం ప్రకారం ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులపై కేసు నమోదు చేస్తాం. నేరం రుజవైతే న్యాయస్థానంలో వారికి ఏడాదిపాటు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. – బి.రాజకుమారి, జిల్లా ఎస్పీ ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులే తీసుకోవాలి ఆరోగ్యశ్రీ కార్డు లేని వారికి ప్రభుత్వం నిర్దే«శించిన ఫీజు మాత్రమే తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకున్నట్టయితే చర్యలు తీసుకుంటాం. కొంతమంది అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. – జి.నాగభూషణరావు, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయాధికారి -
ఇంటింటా కరోనా బడ్జెట్..!
కొత్తవలస: కరోనా.. ఆరోగ్యంతో పాటు ఇంటి బడ్జెట్‌నూ భారంగా మార్చింది. శానిటైజర్లు, మాస్క్‌ల వినియోగం తప్పనిసరి చేసింది. చేతుల శుభ్రత ప్రాధాన్య అంశంగా మారింది. వీటి కి తోడు రోగనిరోధక శక్తి పెంపొందించుకునేందుకు సి– విటమిన్ అందించే పండ్లు, కూరగాయలతో పాటు అదనపు ఆహారంగా డ్రై్రçఫూట్స్, గుడ్లు తీసుకోవడంతో ప్రతి ఇంటా కరోనా బడ్జెట్ పెరిగింది. సంపన్నకుటుంబాలకు పెద్దగా ఆర్థిక భారం కాకపోయినా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు మాత్రం ఖర్చు భారంగా మారింది. నెలకు సుమారు రూ.1090 అదనపు ఖర్చు అవుతోంది. చేసేది లేక ప్రతి కుటుంబం నెలవారీ ఖర్చుతో పాటూ కరోనా ఖర్చును మౌనంగా భరిస్తున్నారు. జిల్లా ప్రజలపై భారం... జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 23,44,474(23.4) జనాభా, 5,87,149 కుటుంబాలు ఉన్నాయి. కొత్త గణాంకాల ప్రకారం మరో 10 శాతం జనాభా ఉంటారని అంచనా. ఈ లెక్కన పెరిగిన నెలవారీ కరోనా బడ్జెట్ సుమారు రూ.60 నుంచి 70 కోట్లు ఉండొచ్చని అంచనా. పరిశుభ్రత ఖర్చు తప్పనిసరి కావడంతో పేద, మధ్య తరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్ పూర్తిగా మారిపోయింది. చాలీచాలని జీతాలు, కూలి డబ్బులతో గడిపే కుటుంబాలకు ఈ బడ్జెట్ భారంగా మారింది. శుభ్రత ఖర్చు పెరిగింది.. కరోనా వైరస్ వ్యాప్తి తో ఇంటితో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకో వడం అలవాటు చేసుకున్నాం. దీనికోసం శానిటైజర్లు, లైజాల్, ఫినాయిల్, హార్పిక్ వంటివి వినియోగం పెరిగింది. దీంతో ప్రతినెల ఖర్చులు పెరిగాయి. – బొడ్డు గోవిందరావు, కాంట్రాక్టు ఉద్యోగి, తుమ్మికాపల్లి శానిటైజర్ కొనుగోలు చేస్తున్న పట్టణవాసి అదనపు భారం మా ఇంట్లో ఆరుగురం ఉంటున్నాం. కరోనా బారిన పడకుండా అందరికీ మాస్క్‌లు కొనుగోలు చేస్తున్నాం. శానిటైజర్లు విధి గా వాడుతున్నాం. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లి వచ్చినప్పుడు దుస్తులు తరచూ ఉతకాల్సి వస్తోంది. దీంతో నెలకు రూ.1500 అదనపు ఖర్చు పెరిగింది. – దాసరి శ్రీదేవి, ఉద్యోగిని, కంటకాపల్లి ఇబ్బంది అయినా తప్పదు ఇంటిలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రస్తుత పరిస్థి తుల్లో జాగ్రత్తలు తప్పనిసరి. మాస్క్‌లు, శానిటైజర్లు, సబ్బులు వాడకం పెరగడంతో నెలవారీ ఖర్చు పెరిగింది. రూ.1000 నుంచి రూ.1500 ఖర్చు చేయాల్సి వస్తోంది. – ఎం.లక్ష్మి, కొత్తవలసటౌన్, మసీదు వీధి -
‘కాపు’ కాసిన దేవుడు !
సాక్షి ప్రతినిధి, విజయనగరం: చెప్పాడంటే..చేస్తాడంతే.. గత ఎన్నికల ముందు కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను కాపునేస్తం పథకం అమలు ద్వారా నెరవేర్చారు. కాపునేస్తం పథకాన్ని రాజధానిలోని తన క్యాంపు కార్యాలయంనుంచి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ తదితరులు జిల్లాలోని కాపు నేస్తం లబ్ధిదారులు 3,720 మందికి రూ.5.58 కోట్లు ఆర్థిక సహాయం అందజేశారు. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక రాష్ట్ర ప్రభుత్వ పథకాలను నిజమైన అర్హులందరికీ వలంటీర్ల వ్యవస్థ ద్వారా అందజేస్తున్న ఘనత తన ప్రభుత్వానిదేనని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తెలిపారు. కాపునేస్తం పథకం ప్రారంభోత్సవం సందర్భంగా విజయనగరం నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడు తూ జిల్లాలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఈ పథకం ప్రయోజనాలు అందేలా కృషి చేసిన జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులను అభినందించారు. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మాట్లాడుతూ ఈ పథకం కింద జిల్లాలో అత్యధికంగా 1186 మంది లబ్ధిదారులు నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందినవారే ప్రయోజనం పొందుతున్నారని పేర్కొన్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజాను తాను కలిశానని భోగాపురంలో రూ.1.50 కోట్లతో కాపు సామాజిక భవనం నిర్మించేందుకు ఆయన అంగీకరించారని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్ర లో ఇచ్చిన హామీల్లో 90 శాతం హామీలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక్క ఏడాదిలోనే నెరవెర్చారని పేర్కొ న్నారు. కరోనా నేపథ్యంలో చేనేత కారి్మకులు, ఆటో డ్రైవర్లకు నాలుగు నెలల ముందే సంక్షేమ పథకాలను అందించి ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రిదేనని చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం ఎవరికీ సాధ్యం కాదని, చిన్న వయస్సులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ దానిని ఆచరించి చూపారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్, జాయింట్ కలెక్టర్ ఆర్.కూర్మనాథ్, అసిస్టెంట్ కలెక్టర్ కె.సింహాచలం, బీసీ కార్పొరేషన్ ఈడీ నాగరాణి, బీసీ సంక్షేమాధికారి డి.కీర్తి, ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబి్ధదారులు మాట్లాడుతూ కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న విపత్కర తరుణంలోనూ ఇచ్చిన మాటకు కట్టుబడి కాపునేస్తం పథకం ద్వారా తమకు ఆర్థిక సాయం అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఊహించలేదు.. కాపు(తెలగ) కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తారని ఎప్పుడూ ఊహించలేదు. సీఎం జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. వెనుకబడిన తెలగ కులస్థులకు ఆరి్ధక సహాయం చేయడం గొప్ప ఆనందంగా ఉంది. గతంలో ఏ ప్రభుత్వం మమ్ము గుర్తించలేదు. గ్రామవలంటీర్లు ఇంటివద్దకే వచ్చి పేర్లు నమోదుచేసి ఈ పథకం వర్తించేలా చేశారు. – చెలమల తవిటమ్మ, రావుపల్లి, గరుగుబిల్లి మండలం కాపు నేస్తం ఒక వరం కాపు నేస్తం మాకు వరం. ఇంతవరకు వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరూ ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టలేదు. జగనన్న ఇచ్చిన ఈ భరోసాతో మాకు కొంత ఊరట కలిగింది. చిరువ్యాపారం చేసుకున్న వారికి ఇటువంటి ఆర్థిక సాయం ఎంతో ఉపకరిస్తుంది. ఎటువంటి రాజకీయాలు లేకుండా అర్హులందరికీ పథకం వర్తింపచేయడం గొప్ప విశేషం. – జి.మణి, బలిజిపేట -
‘కరోనా’ కల్లోలం..!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: కరోనా మహమ్మారి జిల్లాలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. కల్లోలం సృష్టిస్తోంది. సామాన్యుల దగ్గరనుంచి ప్రజాప్రతినిధులు, అధికారుల వరకూ చేరింది. ఇప్పటికే పోలీస్ శాఖలోని పలువురు అధికారులు, సిబ్బందిని తాకిన వైరస్.. తాజాగా రెవెన్యూశాఖలో ప్రవేశించింది. డిప్యూటీ తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్‌గా సోమవారం నిర్ధారణ అయ్యింది. జిల్లాలో ఈ నెల 21 వరకూ 141 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 58 మంది కోలుకున్నారు. ఇంకా 83 మంది చికిత్స పొందుతున్నారు. సోమవారం ఒక్కరోజే 21 కొత్త కేసులు వెలుగుచూశాయి. జిల్లా కేంద్రాస్పత్రి ఎదురుగా ఉన్న వెంకటేశ్వరరాయల్ అపార్ట్మెంట్లోని వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కంటైన్మెంట్జోన్గా ప్రకటిస్తూ విజయనగరం రెవెన్యూ డివిజనల్ అధికారి కె.హేమలత ఉత్తర్వులు జారీచేశారు. ఆ అపార్ట్మెంట్ నుంచి 200 మీటర్ల వరకు కంటైన్మెంట్ జోన్‌గాను, 400 మీటర్ల వరకు బఫర్ జోన్‌గా ప్రకటించారు. అపార్ట్మెంట్ నుంచి 200 మీటర్లలోపు ఉన్న ప్రజలంతా అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని హెచ్చరించారు. ఈ ప్రాంతంలోని ప్రజలంతా గృహ నిర్భంధం పాటించాలని, మాస్‌్కలు, గ్లౌజ్‌లు తప్పనిసరిగా వినియోగించాలని, భౌతిక దూరం పాటిస్తూ ఆరోగ్యసేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. కరోనా లక్షణాలైన దగ్గు, జలుబు, జ్వరం ఉన్నవారు నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. పాజిటివ్‌గా నమోదైన వ్యక్తితో కాంటాక్ట్ అయిన వారు వెంటనే హోమ్ క్వారంటైన్లోకి వెళ్లాలన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది ఆ ప్రాంతంలో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తారన్నారు. కంటైన్మెంట్ జోన్ పరిధిలో మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఈ ప్రాంతంలోని ప్రజలంతా జాగ్రత్తగా, స్వీయ రక్షణలో ఉండాలని కోరారు. జిల్లాలో మొత్తం 40 కంటైన్మెంట్ క్లస్టర్లు ఏర్పాటు చేశారు. అధికారులకు కరోనా పరీక్షలు డిప్యూటీ తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన టెలీ స్పందనకు జిల్లా అధికారులకు మినహాయింపు ఇచ్చా రు. కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపించారు. జిల్లాలో కరోనాకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం 24 గంటలూ అందుబాటులో ఉండే నంబర్: 08922–236947ను సంప్రదించాలని కలెక్టర్ కోరారు. కొత్త కేసులు ఇలా... బొండపల్లి మండలంలోని కొండకరకాం–1, నెల్లిమర్ల మండలంలోని కొండవెలగవాడ–1, డెంకాడ మండలం గొండయపాలెంలో–2, విజయనగరంలోని రాయల్ అపార్ట్మెంట్లో ఒక కేసు నమోదైంది. అలాగే... బొబ్బిలిలోని అల్లంవీధి, దేవలవీధి, నెయ్యలవీది, స్వామి వారి వీధుల్లో 7, బలిజిపేట మండలం చెకరపల్లిలో –2, జియ్యమ్మవలస మండలం పెదబుడ్డిడి, గిజబ, చినమేరంగిలలో–3. గరుగుబిల్లిలో– 1, మెరకముడిదాం మండలం గుర్జవలసలో– 1, పార్వతీపురం బంగారం కాలనీలో–1, రామభద్రపురం మండలం ఆరికితోటలో ఒక కేసు నమోదైంది. కరోనా బాధితుల్లో తమిళనాడు నుంచి వచ్చిన వారు ఆరుగురు, ఢిల్లీ నుంచి ఇద్దరు, కేరళ నుంచి ఒకరు, విజయవాడ నుంచి వచ్చిన వారు ఆరుగురు ఉన్నారు. శంబరలో కరోనా అలజడి మక్కువ: మండలంలోని శంబర గ్రామంలో దంపతులిద్దరికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మండల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దంపతులిద్దరూ వలస కూలీలు. చెన్నైనుంచి వచ్చిన వీరు ఈనెల 19న రాత్రి జిల్లా కేంద్రాస్పత్రిలో కరోనా టెస్ట్‌లు చేయించుకున్నారు. మరుసటిరోజు 20న గ్రామానికి చేరుకున్నారు. అప్పటి నుంచి హోంక్వారంటైన్లో ఉన్నారు. ఇద్దరికీ పాజిటివ్‌గా నివేదికలు రావడంతో 108లో కోవిడ్ ఆస్పత్రి మిమ్స్‌కు తరలించారు. 13 మంది ప్రైమరీ కాంటాక్ట్... చెన్నై నుంచి 8 మంది వలస కూలీలు ఈనెల 20న మండలానికి చేరుకున్నారు. వీరిలో శంబర గ్రామానికి చెందిన నలుగురు, బంగారువలసకు చెందిన మరో నలుగురు ఉన్నారు. సాలూరు పట్టణం నుంచి శంబర గ్రామానికి చెందిన ఓ ఆటోడ్రైవర్ వారిని ఇంటికి చేర్చారు. 8 మందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌రాగా, మరో నలుగురికి నెగిటివ్ వచ్చింది. దంపతులతో కాంటాక్ట్ ఉన్న 13 మందిని క్వారంటైన్‌కు తరలించారు. అలాగే, సెకండరీ కాంటాక్ట్ ఉన్న సుమారు 100 మందిని హోంక్వారంటైన్లో ఉంచినట్లు వైద్యాధికారి సు«దీర్ తెలిపారు. గ్రామాన్ని ఎస్ఐ కే.రాజే‹Ù, ఎంపీడీవో సీహెచ్ సూర్యనారాయణ, తహసీల్దార్ డి.వీరభద్రరరావు పర్యటించి పారిశుద్ధ్య పనులు జరిపించారు. చెన్నై నుంచి బస్సులో శంబర గ్రామానికి వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులకు నెగిటివ్ వచ్చినా... వారు శనివారం ఉపాధిహామీ పనులకు వెళ్లడంతో శంబర గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. బుధరాయవలసలో రెండో కేసు నమోదు.. మెరకముడిదాం: మండలంలోని బుధరాయవలస గ్రామంలో రెండో కరోనా కేసు నమోదైంది. విజయవాడ నుంచి ఈ నెల 19న గ్రామానికి చెరుకున్న 37 ఏళ్ల మహిళకు విజయనగరంలో కరోనా టెస్ట్‌లు చేశారు. ఆమెకు కరోనా పాజిటివ్‌గా వైద్య నివేదిక రావడంతో పంచాయతీ కార్యదర్శి గొర్లె రఘుబాబు, పోలీసులు, వైద్య సిబ్బంది 108లో విజయనగరం జేఎన్టీయూ కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఆవాలవలసలో... సీతానగరం: చెన్నై నుంచి మండలంలోని బూర్జ పంచాయతీ ఆవాలవలసకు చేరుకున్న వలస కూలీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనను మిమ్స్‌కు తరలించారు. ఆ వ్యక్తి ఉపాధిహామీ పనులకు సైతం వెళ్లడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఆరికతోటలో మరో కేసు... రామభద్రపురం: మండలంలోని ఆరికతోటలో 38 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యాధికారి రవికుమార్ తెలిపారు. గతంలో ఆయన కోడలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆమెను జిల్లా కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో హపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. స్వామి వారి వీధిలో అప్రమత్తం బొబ్బిలి: స్థానిక స్వామి వారి వీధి నుంచి నిత్యం విజయనగరం వెళ్లి వచ్చే స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఆమెను వైద్య పరీక్షల కోసం మిమ్స్‌కు తరలించారు. ప్రైమరీ కాంటాక్ట్‌గా భర్త, కుమారుడు ఉన్నట్టు గుర్తించిన అధికారులు హోం క్వారంటైన్లో ఉంచారు. వీరికి మంగళవారం కరోనా పరీక్షలు చేయనున్నారు. మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మురళి ఆధ్వర్యంలో స్వామివారి వీధిలో పారిశుద్ధ్య పనులు జరిపారు. బజారులోని దుకాణాలను మూసివేయించారు. -
విజయనగరంలో మేస్త్రీ నిర్వాకం..
విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతి రాజ్యమేలుతోంది. ప్రజారోగ్య పరిరక్షణకు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాల్సిన సిబ్బంది అక్రమార్జనలకు అలవాటు పడి అడ్డంగా దొరికిపోయిన అవినీతి భాగోతం బట్టబయలైంది. రూ.1.50లక్షలు సొమ్ము కోసం బిల్లు కలెక్టర్‌గా వేషం మార్చి.. ఏకంగా కార్పొరేషన్ కమిషనర్ పేరిట దొంగ సంతకం చేయడంతో పాటు దొంగ స్టాంపులు వేయటం సంచలనం సృష్టించింది. డబ్బులిచ్చిన వ్యక్తి ఫిర్యాదుతో స్పందించిన కమిషనర్ తన సంతకం చేయలేదని తేల్చటంతో అసలు విషయం బట్టబయలైంది. తదుపరి సొమ్ములు తీసుకున్న ఉద్యోగిపై చట్టపరమైన క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే... విజయనగరం: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజారోగ్య విభాగంలో సార్జెంట్ (పీహెచ్ మేస్త్రీ)గా ఎం.ఎల్లారావు పని చేస్తున్నారు. అక్రమార్జనకు అలవాటు పడిన ఎల్లారావు అడ్డగోలుగా డబ్బు సంపాదించేందుకు అలవాటు పట్టాడు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్లో రెవెన్యూ విభాగంలోని విధులు నిర్వహించాల్సిన బిల్లు కలెక్టర్ ఉద్యోగాన్ని ఎంచుకున్నాడు. బిల్లు కలెక్టర్లు మాదిరి నగరంలోని కార్పొరేషన్‌కు చెందిన షాపింగ్ కాంప్లెక్స్‌లో అద్దెకు ఉంటున్న వారి వద్దకు వెళ్లి షాపుల రెన్యువల్ చేయించుకునేందుకు చలానా రూపంలో డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ షాపింగ్ కాంప్లెక్స్‌లో 18, 21, 22, 23 షాపులు లీజుకు తీసుకున్న రేగాన ఆదినారాయణ అనే వ్యక్తి రూ.1.50 లక్షల మొత్తాన్ని ఎల్లారావుకు చెల్లించారు. ఈ మేరకు ఎల్లారావు కమిషనర్ సంతకం, స్టాంపులు ఉన్న కొన్ని కాగితాలను ఆదినారాయణకు ఇచ్చారు. రెండు నెలలు గడుస్తున్నా రెన్యువల్‌కు సంబంధించిన పత్రాలు ఇవ్వకపోవటంతో ఆదినారాయణ కార్పొరేషన్ ఉద్యోగి ఎల్లారావుపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో ఎల్లారావు రూ.50,000 నగదుకు సంబంధించి అగ్రిమెంట్స్ వస్తాయని సమాధానమిచ్చారు. అనుమానం వచ్చిన ఆదినారాయణ నేరుగా కార్పొరేషన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఎల్లారావు ఇచ్చిన కాగితాలను పరిశీలించిన కమిషనర్ ఆ కాగితాలపై ఉన్నవి తన సంతకాలు కావని తేల్చారు. ఎల్లారావు దొరికిపోయింది ఇలా...? అచ్చం కమిషనర్లానే సంతకాలు చేశానని అనుకుంటున్న మేస్త్రీ ఎం.ఎల్లారావు ఆ సంతకం చేయటంలో దొర్లిన తప్పిదంతో అడ్డంగా దొరికిపోయాడు. వాస్తవానికి కమిషనర్ వర్మ ప్రతి ఫైల్‌పై తన పూర్తి పేరు ఎస్.సచ్చిదానంద వర్మ పేరిట సంతకం చేస్తారు. అయితే ఎల్లారావు బిల్లు కలెక్టర్‌గా మాయ చేసిన విషయంలో ఎస్ఎస్.వర్మ అంటూ సంతకం చేశాడు. సదరు పత్రాలను కమిషనర్ పరిశీలించిన సమయంలో ఎస్ఎస్ వర్మ అంటూ ఆ పత్రాలపై ఉండటంతో ఇవి తన సంతకాలు కాదని, మీరు మోసపోయారంటూ ఫిర్యాదుదారుడు రేగాన ఆదినారాయణకు వివరించారు. దీంతో అవాక్కయిన ఆదినారాయణ ఈ విషయంలో మీరే న్యాయం చేయాలంటూ లబోదిబోమంటున్నాడు. ఎల్లారావుపై ఫిర్యాదు కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసి రూ1.50లక్షలు అక్రమార్జనకు పాల్పడిన ఎల్లారావుపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతో పాటు చట్టపరంగా క్రమశిక్షణా చర్యలకు ఆదేశించినట్టు కమిషనర్ ఎస్ఎస్.వర్మ సాక్షికి తెలిపారు. అక్రమార్జనకు పాల్పడిన ఎల్లారావును 24 గంటల్లోగా విధుల నుంచి తొలగించాలని ప్రజారోగ్య విభాగాధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ఇటువంటి తప్పిదాలు ఎవ్వరు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
పంట పొలంలో విషాదం
పంట పొలంలో సోమవారం ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. సాయంత్రమయ్యేసరికి ఉరుములతో కూడిన చిరుజల్లులు మొదలయ్యాయి. తలదాచుకునేందుకు అందరూ పొలంలో ఉన్న పూరిపాకలోకి వెళ్లారు. కాసేపటికే...వారుండే పాకపై పెద్దశబ్దంతో కూడిన అగ్గిపిడుగు పడింది. అంతే... అందులో ఉన్న ఆరుగురిలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో రైతులిద్దరూ అన్నదమ్ములు కాగా.. ఇంకొకరు ఉపాధ్యాయుడు. జియ్యమ్మవలస: మండలంలోని ఎస్సీమరువాడ, చినతోలుమండ గూడకు మధ్యలో ఉండే పంట పొలాల్లో మృత్యుకేకలు ఘోషించాయి. పిడుగు పాటుకు ఎస్సీ మరువాడకు చెందిన బెలగాపు పారయ్య(62), బెలగాపు పండయ్య(52), చినతోలుమండగూడకు చెందిన ఉపాధ్యాయుడు సీమల నాగభూషణం(36)లు దుర్మరణం చెందారు. పండయ్య భార్య రమణమ్మ, కుమార్తెలు నయోమి, సాత్వికలు ప్రమాదం నుంచి బయట పడ్డా రు. వీరంతా పత్తిచేను లో పనిచేస్తున్నారు. సాయంత్రం ఉరుములతో కూడిన వర్షం కురవడంతో అక్కడే ఉన్న పూరిపాకలోకి వెళ్ళారు. అదే సమయంలో పిడుగు పడడంతో పారయ్య, పండయ్య, నాగభూషణంలు దుర్మరణం చెందారు. పండయ్య భార్య, పిల్లలు స్పృహతప్పి పడిపోయారు. ప్రస్తుతం కోలుకుంటున్నారు. రైతులైన పారయ్య, పండయ్యలు అన్నదమ్ములు. ఇద్దరినీ ఒకేసారి మృత్యువు కాటేయడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. గుమ్మలక్ష్మీపురం మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చినతోలుమండగూడకు చెందిన భూషణంకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పాఠశాలకు సెలవు కావడంతో పొలం పనికి వెళ్లి పిడుగుపాటుకు గురయ్యాడు. గూడలోని పిల్లలను విద్యావంతులు చేస్తున్న ఉపాధ్యాయుడి మృతితో గ్రామస్తులు కలతచెందుతున్నారు. చినమేరంగి ఎస్ఐ బి.శివప్రసాద్ కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
లాక్డౌన్ వేళ..ఆర్థిక అండ
జయనగరం పూల్‌బాగ్: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో పూజలు, ప్రార్థనలు నిషేధించింది. భక్తులు రాకపోవడంతో అర్చకులు, మౌజమ్(ఇమామ్)లు, పాస్టర్లకు భృతి కరువైంది. వీరిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. జిల్లా వ్యాప్తంగా 3,060 మందికి రూ.5వేలు చొప్పున రూ.కోటీ53లక్షల ఆర్థిక సా యం మంగళవారం అందజేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. జిల్లాలో వివిధ దేవాలయాల్లో పూజలు చేసే 1616 మంది అర్చకులు, చర్చిల్లో ప్రార్థనలు జరిపే 1320 మంది పాస్టర్లు,62 మసీదుల్లో నమాజ్ చేయించే 124 మంది మౌజామ్,ఇమామ్‌లు లబ్ధిపొందనున్నారు. వీరి ఖాతాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి నగదు జమచేయనున్నారు. ఆర్థిక సాయంపై లబ్ధిదారు ల కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రత్యేక ఆర్థిక సాయం... లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పాస్టర్లను, మౌజామ్లు, ఇమామ్‌లను ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంది. అందులో భాగంగా ఒక్కొక్కరికి రూ.5వేలు సాయం అందించనుంది. జిల్లా వ్యాప్తంగా 1320 మంది పాస్టర్లు, 62 మంది మౌజామ్లు, 62 మంది ఇమామ్‌లు ఉన్నారు. వారందరికీ సాయం అందుతుంది. దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు ఎండోమెంట్ శాఖ ద్వారా సాయం అందనుంది. జిల్లావ్యాప్తంగా అందరికీ కలిపి రూ.కోటి 53 లక్షలు సాయం అందనుంది. – ఎం.అన్నపూర్ణమ్మ, మైనారిటీ సంక్షేమాధికారి, విజయనగరం కష్టకాలంలో ఆదుకుంటున్నారు.. సీఎం జగన్మోహన్రెడ్డి కష్టకాలంలో ఆదుకుంటున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇటువంటి సమ యంలో ఆర్థికంగా సాయం అందించి ఆదుకోవడం శుభపరిణామం. రెండు నెలలుగా ఆలయాలకు భక్తులు రాకపోవడంతో భృతికరువైంది. అర్చకులకు అండగా నిలవడం అభినందనీయం. – ఆకెళ్ల భాస్కరరావు, అర్చకులు, విజయనగరం -
వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు
వైఎస్సార్సీపీ రోజురోజుకూ బలోపేతమవుతోంది. ప్రతి గ్రామం నుంచి నాయకులు... స్థానికులు ఇతర పార్టీల మద్దతుదారులు విరివిగా వచ్చి చేరుతున్నారు. కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలువురు నాయకులు పెద్ద సంఖ్యలో ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి సమక్షంలో వైఎస్సార్సీపీలో శుక్రవారం చేరారు. స్థానిక ఎన్నికల ముందు ఈ చేరికలు మరింత ఉత్సాహాన్నిస్తున్నాయి. జియ్మమ్మవలస: వైఎస్సార్ సీపీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖమంత్రి పాముల పుష్ఫశ్రీవాణి, అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు అన్నారు. మండలంలోని గవరమ్మపేట, వెంకటరాజపురం, జియ్యమ్మవలస, పొట్టుదొరవలస గ్రామాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరారు. వీరికి చినమేరంగిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. గవరమ్మపేట నుంచి 95 కుటుంబాలు, వెంకటరాజపురం నుంచి 40 కుటుంబాలు, జియ్యమ్మవలస పంచాయతీ పొట్టుదొరవలస నుంచి 20 కుటుంబాలు, జియ్యమ్మవలస నుంచి 60 కుటుంబాలవారు వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీలో చేరిన నాయకులు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్టు వెల్లడించారు. అమ్మ ఒడి, రైతుభరోసా, ఆరోగ్యశ్రీ తదితర మంచి పథకాలతో పేదలను ఆదుకుంటున్నారని తెలిపారు. భవిష్యత్‌లో టీడీపీ పూర్తిగా ఖాళీ అవుతుందన్నారు. డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మాట్లాడుతూ జగనన్న చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయని, ఇందులో భాగంగానే టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారన్నారు. పరీక్షిత్‌రాజు మాట్లాడుతూ పార్టీలో చేరిన వారందరూ స్థానిక సంస్థల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషిచేయాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో వెంకటరాజపురం గ్రామానికి చెందిన మర్రాపు లక్ష్మునాయుడు, కర్రి సీతం నాయుడు, బొత్స గోవిందరావు, శ్రీరామాయూత్ సభ్యులు, గవరమ్మపేట గ్రామం నుంచి డీలర్ రౌతు అప్పలనాయుడు, కె.చంద్రశేఖర్, గవరమ్మపేట యువత ఉన్నారు. అలాగే, జియ్యమ్మవలస, పొట్టుదొరవలస నుంచి దత్తి శంకరరావు, బేత అప్పలనాయుడు, బొడ్డుపల్లి శ్రీనివాసరావు, తటిపిడకల వెంకటనాయుడు, రాయల సింహాచలం, గర్భాన చిన్న, చిలకల తిరుపతి, రంభ సత్యనారాయణ, రంభ శ్రీరాములు తదితరులు పార్టీలో చేరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మూడడ్ల గౌరీశంకరరావు, మండల ఎన్నికల సమన్వయకర్త బొంగు సురేష్, ఆర్నిపల్లి వెంకటనాయుడు, పెద్దింటి శంకరరావు, మర్రాపు చినతాతబాబు, జోగి సురేష్ పాల్గొన్నారు. -
ఉత్కంఠకు తెర!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలిఘట్టం పూర్తయ్యింది. జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి..జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీఠం ఈసారి ఎస్సీ మహిళకు దక్కింది. 2014 జెడ్పీ ఎన్నికల్లో చైర్పర్సన్ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించారు. ఈ సారి ఎస్సీ మహిళకు రిజర్వయ్యింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ రిజర్వేషన్ల వివరాల జాబితాను విడుదల చేశారు. జిల్లాలో 34 జెడ్పీటీసీలు, 34 ఎంపీపీలు, 549 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎంపీపీల్లో ఎస్టీ మహిళలకు 2, ఎస్టీ జనరల్‌కు 2 స్థానాలు కేటాయించారు. ఎస్సీ మహిళలకు 2, ఎస్సీ జనరల్ 2 స్థానాలు, బీసీ మహిళలకు 13, బీసీ జనరల్‌కు 13 స్థానాలు కేటాయించారు. జిల్లాలోని 34 జెడ్పీటీసీ స్థానాలకు ఎస్టీ మహిళలకు 2 స్థానాలు, ఎస్టీ జనరల్‌కు 2 స్థానాలను కేటాయించారు. ఎస్సీ మహిళలకు 2, ఎస్సీ జనరల్ 2 స్థానాలు, బీసీ మహిళలకు 9, బీసీ జనరల్‌కు 9, అన్ రిజర్వుడ్ మహిళలకు 4, అన్ రిజర్వుడ్ జనరల్‌కు 4 స్థానాలు కేటాయించారు. ఎంపీటీసీలకు సంబంధించి 549 స్థానాలకు ఎస్టీ మహిళలకు 37, ఎస్టీ జనరల్‌కు 24, ఎస్సీలకు 35, ఎస్సీ జనరల్‌కు 23, బీసీ మహిళలకు 150, బీసీ జనరల్‌కు 138, అన్ రిజర్వుడ్ మహిళలకు 80, అన్ రిజర్వుడ్ జనరల్‌కు 62 స్థానాలను కేటాయించారు. తుది నిర్ణయం తీసుకోనున్న హైకోర్టు రిజర్వేషన్ల ఖరారుపై ఈ నెల 8న రాష్ట్ర హైకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం 1994 రూల్ నెం.13 ప్రకారం రిజర్వేషన్ల కేటాయింపు జరగడంతో దాదాపుగా ఇవే ఖరారయ్యే అవకాశం ఉంది. రిజర్వేషన్ల ప్రకారం చూస్తే జిల్లాలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యం లభించింది. ఎంపీటీసీలుగా 549 స్థానాలకు 302 స్థానాల్లో మహిళలే పోటీ చేయాల్సి ఉంది. 34 జెడ్పీటీసీ స్థానాల్లో సగం మహిళలకే దక్కాయి. ఎంపీపీల్లోనూ 34 స్థానాల్లో 17 మహిళలకే కేటాయించారు. తాజా రిజర్వేషన్ల ప్రకారం రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా చోట్ల ఆశావహులు పోటీ చేయాలని ఆశగా ఉన్నారు. రిజర్వేషన్ల గెజిట్ విడుదల తర్వాత వారిలో చాలా మంది అవకాశాన్ని కోల్పోయారు. అలాంటి వారిలో కొంత నైరాశ్యం ఏర్పడింది. కానీ ప్రభుత్వం ఏ విధమైన రాజకీయాలకు, పక్షపాతానికి తావు లేకుండా 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను అనుసరించి అధికారుల చేత రిజర్వేషన్లు రూపొందించింది. -
రివర్స్ అదుర్స్
బొబ్బిలి: ఆశ్రిత పక్షపాతం, స్వప్రయోజనం గత ప్రభుత్వ విధానమైతే... ప్రజా సంక్షేమం, ఖజానాపై భారం తగ్గడం తాజా పాలకుల లక్ష్యం. అదే ఉద్దేశంతో రూపొందించిన రివర్స్ టెండరింగ్ విధానం జిల్లాలో మంచి లాభాలను చేకూర్చింది. గత ప్రభు త్వం జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీలు, ఒక నగ ర పంచాయతీలో చేపట్టిన అర్బన్ హౌసింగ్ ఇళ్ల నిర్మాణం ఖజానాపై పెనుభారం మోపింది. ఎంతోమంది నిరుపేదలు ఇళ్లకోసం దరఖాస్తు చేసుకున్నా... వారిని పట్టించుకోకుండా కేవలం జన్మభూమి కమిటీలు సిఫారసు చేసిన తమ సొంతవారికే వాటిని కట్టబెట్టింది. అలా మంజూరైన ఇళ్ల కాంట్రాక్టును అప్పట్లో విజయ్‌నిర్మాణ్ సంస్థకు పెద్ద మొత్తానికి అప్పగించింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం 20శాతం లోపు నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టును రద్దు చేసి రివర్స్ టెండర్‌కు పిలవాలని నిర్ణయించడంతో బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు మునిసిపాలిటీల్లోని ఇళ్లను కొత్త కంపెనీ తక్కువకు దక్కించుకుని ఖజానాకు రూ. 22కోట్లు ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఆ మూడు మున్సిపాలిటీల్లో గతంలో రూ.148 కోట్లకు విజయనిర్మాణ్ సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంటే రివర్స్ టెండరింగ్‌లో రూ.126 కోట్లకే ఇంద్రజిత్ మెహర్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ దక్కించుకుంది. ఈ పరిణామంతో ఇక పట్టణ గృహ నిర్మాణాలు వేగవంతం అవుతాయని లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 20శాతం లోపు పనులు నిలుపుదల జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీలకు మంజూరైన ఇళ్ల నిర్మాణ బాధ్యతను గతంలో విజయనిర్మాణ్ సంస్థ దక్కించుకుంది. అందులో బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మునిసిపాలిటీలకు మంజూరైన ఇళ్ల నిర్మాణం 20శాతానికి మించలేదు. అందుకే ఈ మూడింటికి కొత్తగా రివర్స్ టెండరింగ్ విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త కాంట్రాక్ట్ పొందిన ఇంద్రజిత్ మెహర్ కంపెనీ పాత కంపెనీ ధరల కంటే 14.78 శాతం తక్కువకు కోట్‌చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కంపెనీకి టెండర్లు ఖరారు చేసింది. ప్రభుత్వం క్లియరెన్స్ లెటర్ ఇచ్చాక పనులు ప్రారంభించేందుకు కొత్త సంస్థ సిద్ధంగా ఉంది. గత కాంట్రాక్టు పెద్ద మొత్తానికి వెళ్లినట్టు గుర్తించిన ప్రభుత్వం ఈ నిర్మాణాలపై పలుమార్లు నివేదికలు కోరింది. మున్సిపల్ కమిషనర్లు, టిడ్కో ఇంజినీర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా వారి అనుమానం నిజమన్న విషయం తేటతెల్లమైంది. వెంటనే 20శాతం కంటే తక్కువ పనులు చేపట్టిన మూడు మునిసిపాలిటీలకు రివర్స్ టెండరింగ్ అమలు చేసింది. ఊపందుకోనున్న నిర్మాణాలు జిల్లాలోని బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు అర్బన్ హౌసింగ్ నిర్మాణాలకు కొత్త కాంటాక్టరుకు అప్పగించడంతో ఇక పనులు చురుకుగా సాగే అవకాశం ఉందని లబి్ధదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు మునిసిపాలిటీల్లో ఈ సంస్థ 3072 ఇళ్లను నిర్మించనుంది. జిల్లా వ్యాప్తంగా 7,677 ఇళ్లను నిర్మించేందుకు అప్పట్లో పనులు చేపడితే మూడు మున్సిపాలిటీల్లో 3072 ఇళ్లకు మాత్రమే రివర్స్ టెండరింగ్‌కు పిలిచారు. విజయనగరంలో పనులు పూర్తవగా, నెల్లిమర్లలో అసలు టెండర్లు పిలవలేదు. కొద్ది రోజుల్లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం జిల్లాలోని మున్సిపాలిటీల్లో చేపట్టే ఇళ్ల నిర్మాణాలు మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. అర్బన్ ఇళ్ల నిర్మాణానికి గత కాంట్రాక్టును నిలిపివేసిన ప్రభుత్వం కొత్తగా రివర్స్ టెండరింగ్ పిలిచింది. కొత్తగా మూడు మున్సిపాలిటీల్లో 3072 ఇళ్ల నిర్మాణానికి 14.78 శాతం తక్కువకు కోట్ చేసిన ఇంద్రజిత్ మెహర్ కన్స్ట్రక్షన్స్కు టెండర్ దక్కింది. ప్రభుత్వం నుంచి లెటర్ ఆఫ్ ఏక్సెప్టెన్సీ వచ్చాక సంస్థ పనులు ప్రారంభించనుంది. మరి కొద్ది రోజుల్లో ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ప్రారంభం కానుంది. – మామిడి శ్రీనివాస్, ఈఈ, టిడ్కో హౌసింగ్ -
సాక్షి ఎఫెక్ట్: భంజ్‌దేవ్‌కు భారీ దెబ్బ
అధికారం అండతో అక్రమాలకు పాలడ్డారు. అడ్డగోలుగా భూములు ఆక్రమించేసి చేపల చెరువులు తవ్వించేశారు. ఇదేమని ప్ర శ్నిస్తే అది తమ తాతలనాటి ఆస్తులంటూ బుకాయించారు. అంతేనా... సాగుకు వినియోగించాల్సిన నీటినీ చెరువులకు మళ్లించేశారు. దర్జాగా వ్యాపారం చేసుకుని కాసులు కూడేశారు. అధికారం మారింది. వారి తలరాత కూడా మారిపోయింది. అడ్డగోలు అక్రమాలపై వరుసగా ప్రచురితమైన సాక్షి కథనాలు అధికారులను కదిలించాయి. జిల్లా కలెక్టర్‌కు న్యాయస్థా నం నుంచి ఆదేశాలూ అందాయి. విచారణ చేపట్టిన జిల్లా అధికారులు అవన్నీ అక్రమాలేనని తేల్చారు. ఇన్నాళ్లు సర్కారును... ప్రజలను మభ్యపెట్టినందుకు తగిన శిక్ష విధించారు. ఏకంగా ఆక్వా లైసెన్సును రద్దు చేస్తూ తీర్మానించారు. ఇదీ సాలూరు టీడీపీ ఇన్చార్జి భంజ్‌దేవ్‌కు తగిలిన భారీదెబ్బ. సాక్షి ప్రతినిధి, విజయనగరం: అధికారం అడ్డుపెట్టుకుని సాలూరు టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్, ఆయన సోదరుడు ఏపీ భంజ్‌దేవ్ సాగించిన చేపల చెరువుల వ్యాపారంలో అక్రమాలు నిజమేనని సష్టమైంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన ప్రత్యేక కమిటీ నిర్ధారించింది. చేపల చెరువు తవ్వకానికి గ్రామదేవత స్థలాన్ని ఆక్రమించినట్టు నిర్ధారణయింది. దీని ఫలితంగా పాచిపెంట మండలం విశ్వనాథపురం గ్రామంలో చేపల చెరువు ఏర్పాటుకోసం గతంలో మంజూరు చేసిన అనుమతులు రద్దు చేస్తూ అక్వాకల్చర్ చెరువుల అనుమతులకోసం ఏర్పాటైన జిల్లా కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా జిల్లా స్థాయి కమిటీ అధ్యక్షలు కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్, సభ్యులు జాయిం ట్ కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెం కటరావు, మత్స్యశాఖ ఉప సంచాలకులు టి.సుమలత, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సుదర్శన, వ్యవసాయ శాఖ డీడీ నంద్, భూగర్భ జలశాఖ ఇన్చార్జి డీడీ రమణమూర్తి గురువారం సమావేశమై తీర్మానించారు. అవన్నీ అక్రమాలే: పాచిపెంట మండలం విశ్వనాథపురంలో సర్వే నంబరు 12–1 లో ఆరు ఎకరాల స్థలంలో ఏపీ భంజ్‌దేవ్ చేపల చెరువు ఏర్పాటు చేసేందుకు గతంలో దరఖాస్తు చేసుకోగా ఆ మండల తహసీల్దార్ సిఫారసు మేరకు జిల్లా కమిటీ గతంలో ఆమోదం తెలిపింది. ఇటీవల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ చెపల చెరువు భూములపై దర్యాప్తు జరిపిన పార్వతీపురం సబ్ కలెక్టర్ నేతత్వంలోని సబ్ కమిటీ గ్రామదేవతకు చెందిన భూములు ఆక్రమిస్తూ ఈ చెరువు తవ్వించినట్టు నిర్థారించింది. ఈ స్థలానికి హక్కుదారుగా గ్రామదేవత వున్నారని, సెటిల్మెంట్ ఫెయిర్ అడంగల్ లో ఈ మేరకు నమోదై వున్నట్టు సబ్ కమిటీ పేర్కొంది. సర్వే నం.12–1లోని స్థలంపై అక్వా రైతు ఆర్పీ భంజ్‌దేవ్ సోదరుడైన ఏ.పి.భంజ్‌దేవ్‌కు ఎలాంటి న్యాయపరమైన హక్కు లేనందున సబ్ కలెక్టర్ కమిటీ నివేదిక ఆధారంగా జిల్లా స్థాయి కమిటీలో అనుమతులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనితో పాటు ఇదే వ్యక్తుల చేతిలో గ్రామంలోని సర్వే నెంబరు 14–1లో 3.25 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన చేపల చెరువులోనూ 2.81 ఎకరాల ప్రభుత్వ ఇనాం భూమి ఆక్రమణకు గురైనట్టు సబ్ కలెక్టర్ నేతత్వంలోని సబ్ కమిటీ నిర్ధారించింది. ఈ చెరువు ఏర్పాటుకు జిల్లా స్థాయి కమిటీ అనుమతి పొందలేదని, ఈ చెరువు కూడా అక్రమమైనదేనని కమిటీ నిర్థారించింది. ఈ మేరకు ప్రభుత్వ స్థలంలోని ఆక్రమణలు తొలగించాలని, అక్రమంగా ఏర్పాటు చేసిన చెరువులను కూడా నిర్మూలించాలని సమావేశంలో నిర్ణయించారు. కోర్టు ఆదేశాలు... సబ్‌కలెక్టర్ విచారణ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన భంజ్‌దేవ్, అతని సోదరులు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ, గ్రామ దేవత భూములను ఆక్రమించుకుని చేపల చెరువులు సాగు చేసుకుంటున్నారు. రైతులు సాగునీటికి వాడాల్సిన పెద్దగెడ్డ జలాశయ నీటిని తమ చేపల చెరువుకు మళ్లించుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై స్థానికులు కొందరు న్యాయస్థానంలో పిటిషన్ కూడా వేశారు. ఈ నేపథ్యంలో గత ఫిబ్రవరిలో హైకోర్టు బెంచ్ ఒక తీర్పు వెలువరించింది. చెరువులపై విచారణ జరిపి, ఆక్రమితమని తేలితే ధ్వంసం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. విచారణ బాధ్యతలను సబ్‌కలెక్టర్‌కు జిల్లా కలెక్టర్ అప్పగించారు. సాక్షి కథనాల్లో చెప్పిన అంశాలన్నీ వాస్తవాలేనని సబ్ కలెక్టర్ విచారణలో తేలింది. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లా కమిటీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. సంచలనం సృష్టించిన సాక్షి భంజ్‌దేవ్ చేపల చెరువుల ఆక్రమణలను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. అన్ని ఆధారాలతో వరుస కథనాలను ప్రచురించింది. వాటిని కూడా పిటిషన్‌దారులు కోర్టుకు సమర్పించారు. అదే విధంగా ‘సాక్షి’ కథనాల కారణంగా నియోజకవర్గ ప్రజల్లో చైతన్యం వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం భంజ్‌దేవ్‌ను పిలిపించి వివరణ కోరారు. దశాబ్దాలుగా జరుగుతున్న అక్రమానికి అడ్డుకట్టవేయడంలో ప్రధాన భూమిక పోషించిన ‘సాక్షి’ చరిత్ర సృష్టించింది. -
‘ఉపాధి’ జాతర..!
జిల్లాలో ఖరీఫ్ వరి పనులు పూర్తికావస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో ఉపాధి హామీ పనుల జాతర ఆరంభం కానుంది. వేతనదారులకు చేతినిండా పనిదొరకనుంది. ఈ మేరకు పనుల గుర్తింపు ప్రక్రియను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. వాటి ఆమోదానికి గ్రామ సభలు చురుగ్గా నిర్వహిస్తోంది. ఆమోదం తెలిపిన పనులు చేపట్టేందుకు ఉత్తర్వులు జారీ చేస్తోంది. విజయనగరం: ఉన్న ఊరిలో ఉపాధి కల్పించి వలసలు నివారించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగాస్వామ్యంతో అమలవుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం సత్ఫలితాలు ఇస్తోంది. ఏడాదికి ఏడాదికి పెరుగుతోన్న లక్ష్యాలే దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ‘ఉపాధి’ జాతర ప్రారంభం కానుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతనదారుల్లో నూతన ఉత్సాహాన్ని నింపనుంది. లక్షలాది మంది వేతనజీవులకు అధిక పనిదినాలు దొరకనున్నాయి. దీనికోసం ఇప్పటికే పనుల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. ఇక పనుల ఆమోదానికి గ్రామసభలు కొనసాగుతున్నాయి. అవి ఆమోదం పొందడమే తరువాయి. పనుల కల్పన ఇలా... 2020–21 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఉపాధిహామీ పనులు చేపట్టేందుకు అధికారులు కార్యాచరణను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా రూ.1800 కోట్లతో అభివద్ధి పనులు చేపట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. సుమారు 3.50 లక్షల మంది వేతనదారులకు 3 కోట్ల పనిదినాలు కలి్పంచేందుకు చర్యలు చేపడుతున్నారు. క్షేత్రస్థాయిలో గ్రామసభలు నిర్వహించి ప్రజలకు అవసరమైన పనులను జియోట్యాగింగ్ సాయంతో గుర్తించారు. ఇలా గుర్తించిన పనుల ప్రజామోదానికి మరోసారి గ్రామసభలు నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల్లో గ్రామసభలు ముగియనున్నాయి. పనుల నిర్ణయం ఇలా... గతంలో ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనులు గుర్తించి అవసరమైన మేరకు పనులు చేసేవా రు. ఈ సారి మాత్రం గ్రామసభల్లో గుర్తించిన పనులకు గ్రామసభ ఆమోదం పొందుతారు. దీనికి సంబంధించి గ్రామసభ తీర్మానం అవసరం. గతంలో పంచాయతీ సర్పంచి తీర్మానించేవారు. కొత్త విధానం ప్రకారం ఉపాధిహామీ పథకంలో చేపట్టిన అన్ని పనులు కంప్యూటర్లో క్రోడీకరించాలి. అలా క్రోడీకరించిన అనంతరం తీర్మానాన్ని ఉపాధిహామీ పథకం వెబ్సైట్ నుంచి డౌన్Œలోడ్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న తీర్మానాలను మండల పరిషత్ కార్యాలయానికి పంపించాలి. మండల పరిషత్ అధికారులు ఒక తీర్మానం చేసి జిల్లా నీటి యాజమాన్య సంస్థకు పంపాలి. అక్కడ పనులను పరిశీలించి జిల్లాస్థాయిలో తీర్మానం చేసి కలెక్టర్‌కు పంపుతారు. కలెక్టర్ పరిపాలన ఆమోదం లభించిన అనంతరం రానున్న ఆర్థిక సంవత్సరంలో పనులు చేపడతారు. 30 కేటగిరీల్లో 196 రకాల పనులు గుర్తింపు.. ఉపాధిహామీ పథకంలో 30 కేటగిరీల్లో 196 రకాల పనులను రానున్న ఆర్థిక సంవత్సరంలో చేపట్టేందుకు నిర్ణయించారు. ఈ పనుల్లో ఆయా గ్రామాల్లోని ప్రజలకు అవసరమైన 1.17 లక్షల పనులు గుర్తించారు. ఈ ఏడాది కొత్తగా గ్రామీణ పార్కులు, నర్సరీలు పెంచడం తదితర పనులకు ప్రాధాన్యమిచ్చారు. ప్రభుత్వ సంస్థల అభివృద్ధి, పిల్లకాలువలను మెరుగుపరచడం, భూ అభివృద్ధి పనులు, రహదారుల అభివృద్ధి తదితర పనుల గుర్తింపు ప్రక్రియ ముగిసింది. పనులను గ్రామ సభల్లో తీర్మానించే ప్రక్రియ చేపడుతున్నారు. అధిక పనుల గుర్తింపు 2020–21 ఆర్థిక సంత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకంలో రూ.1800 కోట్ల విలువ చేసే పనులను గుర్తించాం. ఆయా గ్రామ సభ ల్లో చర్చించి ఆమోదం పొందిన తరువాత పనుల మంజూరు ఆదేశాలు జారీ చేస్తాం. మొత్తం 1.17 లక్షల పనులు గుర్తించగా... 3 కోట్ల పనిదినాలు వేతనదారులకు కలి్పంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ప్రస్తుత ఏడాది 2.65 కోట్ల పని దినాలు లక్ష్యం చేసుకోగా.. ఇప్పటి వరకు 1.86 కోట్ల పని దినాలు కలి్పంచాం. – ఎ.నాగేశ్వరరావు, పీడీ, డ్వామా, విజయనగరం -
ఏమైందో..ఏమో..!
వేపాడ: కన్నపేగు తెంచుకుని పుట్టిన కొడుకు వృద్ధాప్యంలో పోషిస్తాడని ఊహించుకున్న ఆ తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగులుస్తూ ఆ బిడ్డ కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఉన్న ఇద్దరిలో ఒకరినైనా చదివించి ప్రయోజకుడ్ని చేద్దామని కష్టపడి పనిచేస్తున్న ఆ తల్లిదండ్రుల ఆశల్ని విధి ఎత్తుకుపోయింది. ఎంతో భవిష్యత్ ఉన్న కొడుకు కళ్ల ముందే విగత జీవిగా పడి ఉండడాన్ని చూసిన ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా ఎడుస్తుంటే వారిని ఆపడం ఎవరి తరమూ కాలేదు. క్షణికావేశంలో ఆ బాలుడు తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని దహించేస్తుంటే, ఊరిని శోకసంద్రంలో ముంచేసింది. ఈ మృతిపై వల్లంపూడిగ ఎస్ఐ స్వర్ణలత అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. వేపాడ మండలం ముకుందపురం గ్రామానికి చెందిన ఏడువాక గణేష్ (13) సోమవారం తన ఇంటిలో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయాన్నే తండ్రి రామకృష్ణ, అన్నయ్య హరికృష్ణతో కల్లానికి వెళ్లి పాలు తీసుకువచ్చి, గ్రామంలోని క్యాన్‌కు పాలు పోసిన తర్వాత గణేష్ ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో తల్లి దేముడమ్మ గణేష్‌ను బడికి టైము అవుతుంది వెళ్లవా అని అడిగింది. మక్క నొప్పి పెడుతుందని వెళ్లనని సమాధానం ఇచ్చాడు. తల్లి పనుల్లో మునిగిపోయింది. అనంతరం గణేష్ అన్న హరికృష్ణ వచ్చి తమ్ముడు స్కూల్‌కు వెళ్లలేదా అని తల్లిని అడిగాడు. వెళ్లలేదని ఆమె చెప్పింది. వెంటనే హరికృష్ణ, గణేష్ ఉండే రూములోకి వెళ్లి చూడగా తమ్ముడు హుక్కుకు ఉరివేసుకుని ఉండడాన్ని చూసి హతాశుడయ్యాడు. వెంటనే హరికృష్ణ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి గణేష్‌ను కిందకి దింపాడు. అప్పటికే గణేష్ మృతి చెందడంతో వారు శోక సంద్రంలో మునిగిపోయారు. మృతుడి తండ్రి రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
నేత్ర పరీక్షల్లో నంబర్ వన్
సాక్షి ప్రతినిధి విజయనగరం: సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. చూపు ఉంటే చక్కగా చదువుకోవచ్చు.. నచ్చిన రంగంలో రాణించవచ్చు. అన్ని పనులూ చకచకా పూర్తిచేయవచ్చు. అందుకే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నేత్ర సంరక్షణకు పెద్దపీట వేసింది. వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థుల్లో నేత్ర సమస్యలను తొలగిస్తోంది. వారు చదువుకునే పాఠశాలకే వైద్యులను పంపించి పరీక్షలు చేయిస్తోంది. ఉచితంగా మందులు అందజేస్తోంది. చిన్నవయస్సులోనే కంటి సమస్యలను దూరం చేసేందుకు కృషిచేస్తోంది. తల్లిదండ్రులపై ఆర్థిక భారం లేకుండా.. దృష్టిలోపాలను సరిదిద్దుతోంది. వైఎస్సాఆర్ కంటివెలుగు కార్యక్రమం జిల్లాలో చురుగ్గా సాగుతోంది. రాష్ట్రంలోని ముందువరుసలో నిలుస్తుండడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు సంతోషిస్తున్నారు. పథకం సత్ఫలితాలనిస్తుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సీఎంకు కృతజ్ఞతలు చెబుతున్నారు. పరీక్షలు ఇలా... జిల్లాలో 3,03,819 మంది విద్యార్థులు ఉండగా ఇప్పటివరకు 2,34,993 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 77.34 శాతం పరీక్షలు పూర్తి చేసిన జిల్లాగా విజయనగరం జిల్లా రికార్డు సృష్టించింది. పరీక్షలు చేయించుకున్న విద్యార్థుల్లో 10,909కి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో సాధారణ కంటి అద్దాలు ధరించిన వారు 2,239 మంది మాత్రమే కాగా దృష్టిలోపం ఉండి కూడా అద్దాలు ధరించని వారు 1750 మంది. 9,159 మందికి కంటి అద్దాలు అవసరమని పరీక్షల్లో నిర్ధారించారు. జిల్లాలో 3,396 పాఠశాలలు ఉండగా ఇంతవరకు 3,209 పాఠశాలల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. కళాశాల విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజాగా నిర్వహించిన వైద్య ఆరోగ్యశాఖ సమీక్షలో నిర్ణయించారు. దీంతో జిల్లాలోని ఇంటర్ కళాశాలలు ప్రభుత్వ– 24, ప్రైవేటు–56, డ్రిగ్రీ ప్రభుత్వ– 6, ప్రైవేటు–16 కళాశాలల్లో చదువుతున్న సుమారు 66 వేలమంది విద్యార్థులకు నేత్ర పరీక్షలు చేయనున్నారు. అందరికీ కంటి వెలుగు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం. పరీక్షల అనంతరం అవసరాన్ని బట్టి శస్త్ర చికిత్సలు, కళ్లద్దాల పంపిణీ వేగంగా చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. పరీక్షల్లో విద్యార్థులు ఫెయిల్ కావడానికి కంటి సమస్యలు కూడా కారణం. గిరిజన పాఠశాలల్లో ఎక్కువ మంది కంటి సమస్యల కారణంగా సబ్జెక్టుల్లో వెనకబడుతున్నారు. దీనిపై దృష్టి సారించాలని ఐటీడీఎ కొత్త పీఓకి కూడా చెప్పాం. కంటి సమస్యలతో ఏ విద్యార్థీ బాధపడకూడదు, అవకాశాలను పోగొట్టుకోకూడదన్నదే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. – డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, కలెక్టర్, విజయనగరం జిల్లా వెలుగులు నింపుతున్నారు.. మా అమ్మాయి భీమవనం యూపీ స్కూల్లో ఏడో తరగతి చదువుతోంది. ఇటీవల కంటి పరీ క్షలు నిర్వహించారు. సమస్యలు గుర్తించి మందు లు అందజేశారు. మాలాంటి నిరుపేదల పిల్లలకు వైద్య పరీక్షలు చేసి వెలుగులు నింపుతున్నారు. – తొత్తల సత్యవతి, విద్యార్థిని తల్లి, చినభీమవరం, బాడంగి కంటివెలుగయ్యాడు.. ముఖ్యమంత్రి జగనన్న విద్యార్థుల పాలిట కంటివెలుగయ్యాడు. ఇప్పటికే ప్రకటించిన నవరత్నాలు ఒక్కొక్కటి అమలుచేస్తూ ప్రజల గుండెల్లో చోటు సంపాదించాడు. కంటివెలుగు పథకంతో విద్యార్థులకు చూపు ప్రసాదిస్తున్నాడు. నేత్ర సమస్యలను పరిష్కరిస్తున్నాడు. ఆయన మేలు మరువలేం. – గొంప ఉమా, రామలింగపురం, విద్యార్థి తల్లి చదువుకు సాయం.. పిల్లల్లో కంటి సమస్యలు పరిష్కరించడం వల్ల పిల్లలు చక్కగా చదువుకునేందుకు అవ కాశం కలుగుతుంది. సీఎంగా ఎన్నికైన కొద్ది రోజుల్లోనే అన్నిరకాల పథకాలతో అన్ని వర్గాలకు మేలు చేస్తున్నారు. నేత్ర సంరక్షణకు పెద్దపీట వేస్తూ వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సంతోషదగ్గ అంశం. – భవాని, వీబీపురం, విద్యార్థి తల్లి ముందు‘చూపు’ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో వైఎస్సార్ కంటివెలుగు పథకం అమలు చేయడం ఆనందదాయకం. విద్యార్థులకు చిన్న వయస్సులోనే కంటి సమస్యలు తెలుస్తాయి. పరిష్కారమవుతాయి. మంచి కార్యక్రమం. – బొద్దాన దేముడు, వేపాడ ప్రాథమిక పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ మంచి కార్యక్రమం.. సీఎం జగన్మోహన్రెడ్డి విద్యార్థుల్లో అంధత్వ నివారణ కోసం అమలుచేసిన కం టివెలుగు కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. పైసా ఖర్చులేకుండా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం సంతోషకరం. పేదలకు కంటి వెలుగు నివ్వడం దేవుడిచ్చిన వరం లాంటిది. – ఎలకల రాంబాబు, జోగులడుమ్మ నేత్ర సమస్యలకు చెక్.. ప్రతి పాఠశాలకు వెళ్లి విద్యార్థుల కళ్లను పరీక్షించి అవసరమైన మందులు ఉచితంగా అందజేస్తుండడం ఆనందం గా ఉంది. చిన్నవయస్సులోనే నేత్ర సమస్యలకు చెక్ పెట్టేందుకు వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమం అమలు చేయడం మంచి నిర్ణయం. జీవితాంతం జగనన్నకు రుణపడి ఉంటాం. – రాయగడ సూర్యశేఖర్, జియ్యమ్మవలస -
వివాహేతర సంబంధాల వల్లే..
-ఈ ఏడాది జూలై నెల 31న విజయనగరం ఎల్ఐసీ కార్యాలయం సమీపంలోని పొలంలో ఒక రోజు వయసున్న మగశిశువును అట్టపెట్టెలో పెట్టి పడేశారు. దీంతో ఆ శిశువు మృతి చెందాడు. -ఈఏడాది ఆగస్టు 30న గజపతినగరం రోడ్డులో రెండ్రోజుల వయసున్న మగ శిశువును పడేశారు. దీంతో మగశిశువు మృతి చెందాడు. -బొబ్బిలిలో సెప్టెంబర్ నెలలో అప్పుడే పుట్టిన శిశువును కాలువలో పడేయడంతో మృతి చెందాడు. -తాజాగా విజయనగరం జొన్న గుడ్డి ఉప్పరవీ«ధిలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును చెత్తకుప్పలో పడేయడంతో తలను కుక్కలు తినేశాయి. -ఇవే కాదు.. వెలుగులోకి రానివి ఇంకెన్నో ఉన్నాయి. నెల రోజుల వ్యవధిలోనే జిల్లాలో శిశువులను చెత్తకుప్పలు, రోడ్డు పాల్జేసిన సంఘటనలు మూడు బయట పడ్డాయి. సాక్షి, విజయనగరం ఫోర్ట్: మాతృత్వానికి నోచుకోక ఎంతో మంది మహిళలు అల్లాడుతున్నారు. అలాంటిది చందమామలాంటి పిల్లలను కొందరు నిర్థాక్షిణ్యంగా చంపేస్తున్నారు. నవమాసాలు గర్భంలో ఉన్న శిశువులు కళ్లు తెరవకముందే హత్య చేసేస్తున్నారు. కొందరు శిశువులను చెత్తకుండీలు, తుప్పల్లో పడేస్తున్నారు. మరి కొందరు ఆలయాలు, బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్లలో వదిలేస్తున్నారు. ఎవరైనా చూస్తే వారు బతికి బట్టగడుతున్నారు. లేదంటే వారు కుక్కలు, నక్కలు పాలై మృత్యువాత పడుతున్నారు. అందరూ ఉన్నప్పటికీ అమ్మ, నాన్న పిలుపునకు నోచుకోక అనాథలుగా మిగులుతున్నారు. వివాహేతర సంబంధాల వల్లే.. వివాహేతర సంబంధాల వల్ల గర్భం దాల్చినవారు విషయం బయటపడితే పరువు పోతుందని భయపడి చెత్తకుప్పలు, బావుల్లోనూ పడేస్తున్నట్టు సమాచారం. వివాహం కాకుండా గర్భవతులు అయిన మహిళలు శిశువులను వదిలించుకోవడానికి విక్రయించడం లేదా శిశువులను తుప్పలు, చెత్తకుప్పల్లో పడేస్తున్నారు. శిశుగృహకు అప్పగించండి పిల్లలు అవసరం లేదనుకునే వారు శిశుగృహకు అప్పగించాలి. వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. శిశువులకు అన్ని రకాల వసతి రక్షణ కల్పించి వారికి ఉజ్వల భవిష్యత్తు కల్పిస్తాం. శిశువులను చెత్తకుప్పల పాల్జేయడం మంచిది కాదు. – బి.హెచ్.లక్ష్మి, జిల్లా బాలల సంరక్షణాధికారి 1098కి ఫోన్ చేయండి.. పిల్లలు అక్కర్లేకపోతే చైల్డ్‌లైన్ ట్రోల్ ఫ్రీ నంబర్ 1098 కు ఫోన్ చేసి ఫలానా ప్రాంతంలో శిశువు ఉన్నాడని సమాచారం ఇస్తే చాలు.. క్షణాల్లో రక్షణ కల్పిస్తాం. లేదంటే నేరుగా అందించిన ఫర్వాలేదు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఆర్థిక ఇబ్బందులుంటే ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలు వినియోగించుకోవాలి. అంతే తప్ప పిల్లలను చంపేయడం నేరం. – వి.లక్ష్మణరావు, చైర్మన్, జిల్లా బాలల సంక్షేమ సమితి -
ఉద్యోగాల సందడి
సాక్షి, విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ కొలువుల కోసం ఏళ్లతరబడి ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత కల సాకరమయ్యే రోజు వచ్చింది. సచివాలయ ఉద్యోగ ఫలితాలు గురువారం విడుదల కావడంతో అధిక మార్కులు సాధించిన అభ్యర్థులు ఆనందపడుతున్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకున్న ఉద్యోగాల విప్లవం నిర్ణయంతో చిరకాల స్వప్నం నెరవేరనుందంటూ సంబరపడుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీల కోసం ఏళ్లతరబడి నిరీక్షణే మిగిలిందని చెబుతున్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల జాతరను తీసుకొచ్చిందని, ప్రకటిం చిన తేదీ ప్రకారం ఉద్యోగాల భర్తీకి కృషిచేస్తోందన్నారు. పరీక్ష జరిగిన 10 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం దేశంలోనే చరిత్రాత్మకమని పేర్కొంటున్నారు. శుక్రవారం నాటికి మార్కులు పూర్తిస్థాయిలో తెలుస్తాయని అధి కారులు చెబుతున్నారు. ఇందులో ప్రతిభ ప్రకారం ఎవరికి పోస్టులు వస్తాయన్న విషయం స్పష్టత రానుంది. 1:1 నిష్పత్తిలో ఎంపిక.. జిల్లాలో 5,915 పోస్టులకు 14 రకాలు పరీక్షలు నిర్వహించారు. ఇందులో నాలుగు పరీక్షలు ఇంగ్లిష్‌లో, మిగిలిన పది పరీక్షలు ఇంగ్లిష్, తెలుగులో ప్రశ్నపత్రాలతో నిర్వహించారు. పరీక్షలకు మొత్తం 91.55 శాతం మంది హాజరయ్యారు. విడుదల చేసిన ఫలితాల్లో మెరిట్లో ఉన్న వారికి ఉద్యోగాలు వస్తాయి. పోస్టులు ప్రాప్తికి అభ్యర్థులను 1:1 నిష్పత్తిలో ధువపత్రాలు పరిశీలనకు పిలుస్తామని జెడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచిన అభ్యర్థులు.. జిల్లా స్థాయిలో సచివాలయ పరీక్షల్లో పలువురు తమ ప్రతిభ చాటారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబితా ప్రకారం కొందరు పేర్లు విడుదల చేశారు. ఇందులో కేటగిరి–2(గ్రూప్–బీ) విభాగంలో పురుషులు విభాగంలో టి. సందీప్‌చంద్ర 118.5మార్కులు సాధించి జిల్లా,(రాష్ట్ర)స్థాయిలో ప్రథమస్థానంలో నిలిచాడు. 115 మార్కులతో మహిం తి సూరిబాబు రెండోస్థానంలో నిలిచాడు. పప్పల వెంకట ఉదయ కుమార్ 113 మార్కులు, కసిరెడ్డి వాసుదేవ 112.5 మార్కులతో తర్వాత స్థానాల్లో నిలిచారు. గ్రూప్–ఎ విభాగానికి సంబంధించి మెంటాడ సాయిరాం 113.5 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచాడు. మహిళలు విభాగంలో కేటగిరి–2 (గ్రూప్–ఎ) 108 మార్కులతో గేదెల మానస ప్రథమ స్థానం సాధించారు. విలేజ్ అగ్రి కల్చర్ అసిస్టెంట్(గ్రేడ్–2) విభాగంలో 104 మార్కులతో బొడ్డు గాయత్రి ప్రథమ స్థానం, 103 మార్కులతో చొక్కాపు సాయిబిందు రెండోస్థానం, ఏఎన్ఎం(గ్రేడ్–3) విభాగంలో శంబంగి పోలినాయిని సుకన్య 102.75 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. ప్రభుత్వం విడుదల చేసే మెరిట్ జాబితా ప్రకారం సచివాలయం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు ధ్రువపత్రాలు పరిశీలించనున్నారు. -
పాపం పసికందు
సాక్షి, విజయనగరం క్రైం: వ్యర్థాలు, చెత్తకుప్పలతో నిండిపోయి, వర్షానికి విపరీతమైన దుర్వాసన వచ్చే జొన్నగుడ్డి ఉప్పరవీధి శివారున నెలలు నిండని పసికందు మృతదేహం గురువారం బయటపడింది. సుమారు మూడున్నర నెలల వయస్సు ఉన్న ఈ పసికందు మృతదేహాన్ని ఎప్పుడు పడేశారో తెలియదు. తలభాగం పూర్తిగా పందులు, కుక్కలు పీకేశాయి. కొందరు మహిళలు ఉదయాన్నే అటుగా వచ్చినప్పుడు వారికి ఈ దృశ్యం కనిపించింది. వారు కేకలు వేయడంతో స్థానికులు, చుట్టు పక్కల ప్రజలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయ్యో ‘పాప’ం అంటూ నిట్టూర్చారు. పిల్లలు లేని దం పతులు ఎందరో ఉన్నారని, వారికి శిశువును అప్పగిస్తే సరిపోయేదంటూ వాపోయారు. పోలీ సులకు సమాచారం అందించారు. వన్‌టౌన్ పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ రాష్ట్ర నాయకుడు కేసలి అప్పారావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతశిశువును పరిశీలించారు. అనంతరం అప్పారావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఊయల కార్యక్రమంలో భాగంగా ఎవరైనా బిడ్డలు వద్దనుకుంటే ఆ ఊయలలో వదిలేసి వెళ్లిపోవచ్చని, ప్రతీ ప్రభుత్వాస్పత్రిలో ఒక ఊయల ఉంటుందన్నారు. లేదంటే చైల్డ్‌లైన్‌కి అప్పగించవచ్చని తెలిపారు. ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్ల పసికందులు మృత్యువాతకు గురవుతారన్నారు. ఇటువంటి దారుణాలకు పాల్పడవద్దని కోరారు. వన్‌టౌన్ ఎస్ఐ ప్రసాద్ నేతృత్వంలో మృతశిశువును కేంద్రాస్పత్రికి తరలించారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. -
కలగానే ఇరిగేషన్ సర్కిల్!
సాక్షి, విజయనగరం గంటస్తంభం: విజయనగరంలో ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం ఏర్పాటు గత ప్రభుత్వం కలగా మార్చేసింది. బొబ్బిలి సర్కిల్ కార్యాలయం నుంచి శ్రీకాకుళం వేరు పడిన తరువాత జిల్లాలోని ఇరిగేషన్‌శాఖను ఒకే సర్కిల్ పరిధిలోకి తీసుకురావాలన్న అధికారుల ఆలోచన నెరవేరలేదు. దీనిపై రెండున్నరేళ్ల క్రితమే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో తీర్మానించి పంపినా గత ప్రభుత్వం పట్టించుకోకపోవడమే ఈ పరిస్థితికి కారణం. దీనివల్ల ఇటు అధికారులు, అటు రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. బొబ్బిలి నుంచి వేరు పడిన శ్రీకాకుళం.. విజయనగరం నీటిపారుదలశాఖలో వింత పరిస్థితి ఉంది. జిల్లాలో ఉన్న నీటిపారుదల శాఖ అంతా ఒక గొడుగు కింద లేదు. మధ్య, చిన్ననీటిపారుదలశాఖకు విజయనగరం, పార్వతీపురం డివిజన్లు ఉన్నాయి. ఇందులో విజయనగరం డివిజన్ విశాఖపట్నం సర్కిల్ పరిధిలో ఉంది. ఈ సర్కిల్లో పనులను విశాఖపట్నం ఎస్ఈ పర్యవేక్షిస్తున్నారు. జిల్లాకు సంబంధించి బొబ్బిలిలో సర్కిల్ కార్యాలయం ఉన్నా విజయనగరం డివిజన్‌ను అందులోకి తీసుకురాలేదు. ఒకప్పుడు పార్వతీపురం డివిజ న్తోపాటు శ్రీకాకుళం జిల్లా అందులో ఉండేది. మూడేళ్ల క్రితం శ్రీకాకుళంలో ప్రత్యేకంగా ఒక ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేసి ఆ జిల్లా ఇరిగేషన్ శాఖను ఆ పరిధిలోకి తీసుకొచ్చారు. అయినా విజయనగరం జిల్లాలో రెండు డివిజన్లను ఒకే సర్కిల్ పరిధిలోకి తీసుకురాలేదు. రెండు సర్కిళ్లతో ఇబ్బందులు.. వాస్తవానికి విజయనగరం చిన్న జిల్లా. బొబ్బిలి డివిజన్లో గతంలో శ్రీకాకుళం మొత్తం ఉండడంతో పని భారం వల్ల విజయనగరం డివి జన్ను విశాఖపట్నంలో కలిపారు. కానీ బొబ్బిలి సర్కిల్ ఒక్క పార్వతీపురానికి పరిమితమైన నేపథ్యంలో విజయనగరంలో కలిపితే భౌగోళికంగా, పరిపాలనాపరంగా ఇబ్బందులు తొలుగుతాయి. ఇలా కాకుండా రెండు వేర్వేరు సర్కిల్లో డివిజన్లు ఉండడం వల్ల అధికారులకు, రైతులకు కొంత ఇబ్బంది ఏర్పడుతోంది. విజయనగరం డివిజన్‌కు చెందిన రైతులు విశాఖపట్నం వెళ్లాల్సి వస్తోంది. అంతేగాకుండా నీటిపారుదల వనరుల అభివృద్ధికి సంబంధించి స్పష్టత లేకపోయింది. రెండు డివిజన్లకు సంబంధించి ఇద్దరు ఈఈలతోపాటు ఇద్దరు ఎస్ఈలను అడిగితేగానీ కుదరట్లేదు. దీనివల్ల ప్రగతి కొంతవరకు కుంటుపడుతోంది. ఈ విషయం గుర్తించిన అప్పటి కలెక్టర్ ఎం. ఎం.నాయక్ రెండు డివిజన్లను ఒక సర్కిల్ పరిధిలోకి తీసుకురావాలని, ఇందుకు చర్యలు తీసుకోవాలని నీటిపారుదల అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు సిఫా ర్సు కూడా చేశారు. ఈ నేపథ్యంలో బొబ్బిలిలో ఉన్న ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం విజయనగరానికి మార్చాలని కోరారు. దీనిపై జెడ్పీ సమావేశంలో చర్చ జరిగింది. అప్పుడు విజయనగరంలో సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేయాలని తీర్మానించి ప్రభుత్వానికి పంపించారు. ఉన్నతాధికారులు ఆలోచించాల్సిందే... గత ప్రభుత్వంలో పని చేసిన జిల్లాకు చెందిన మంత్రి, ఇతర పాలకులు పట్టించుకోకపోవడం కారణమైతే జెడ్పీ సమావేశంలో చేసిన తీర్మానంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించేలా చేయడంలో ఏ ఎమ్మెల్యేగానీ, ఎమ్మెల్సీగానీ ప్రయత్నించలేదు. దీనివల్ల విజయనగరంలో సర్కిల్ ఏర్పాటు, ఒకే గొడుకు కిందకు మొత్తం ఇరిగేషన్ డిపార్టుమెంట్ రాలేదు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున సమస్య గుర్తించి విజయనగరానికి సర్కిల్ ఇస్తారన్న ఆశతో జిల్లా రైతాంగం భావిస్తోంది. -
రాజన్నా..నీ మేలు మరువలేం..
కరువుకోరల్లో చిక్కుకున్న జనానికి ఆపన్న హస్తం అందించావు.. ప్రకృతి కరుణించక.. సాగునీరు లేక.. బీడువారిన భూములను జలయజ్ఞంతో సస్యశ్యామలం చేశావు.. రుణాలు మాఫీ చేశావు.. విద్యుత్ చార్జీలు మాఫీ చేసి ఉచిత విద్యుత్ అందించావు... వేలకువేలు ఖర్చుచేయలేక... అనారోగ్యం పాలైన రోగులకు ఆరోగ్యశ్రీతో అండగా నిలిచావు.. ఆర్థిక స్థోమత సహకరించక.. చదువులు సాగించలేని విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్‌తో ఊతమిచ్చావు.. సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నావు... విజయనగరం జిల్లా అభివృద్ధికి బాటలు వేశావు... రాజన్నా... నిను మరువలేము... మా గుండెల్లో నీ గుడి కట్టుకున్నాం... ప్రతిరోజూ నిను తలచుకుంటున్నాం... సోమవారం జరిగే నీ వర్ధంతికి మనసారా అంజలి ఘటిస్తాం. సాక్షి, విజయనగరం: డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా జిల్లాకు ఎనలేని అభివృద్ధి చేశారు. రైతులకు సాయం చేశారు. ప్రాజెక్టులు నిర్మించి బీడు భూములకు సాగునీరు అందించారు. సోమవారం ఆయన వర్ధంతిని పురస్కరించుకుని ఆయన జిల్లాకు చేసిన సేవలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో బొబ్బిలి, తెర్లాం, బాడంగి మండలాలను కలుపుకుంటూ తోటపల్లి నుంచి సాగునీటి కాలువ ప్రారంభించి అన్నదాతల్లో కళ్లల్లో వెలుగులు నింపారు. చీపురుపల్లి నియోజకవర్గంలో 2004 నుంచి 2009 వరకు నియోజకవర్గంలో అభివద్ధి పరుగులు పెట్టించారు. రూ. 84 కోట్లతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇందిరమ్మ, సుజలధార తాగునీటి పథకాన్ని బొబ్బిలి నియోజకవర్గానికి మంజూరు చేశారు. చీపురుపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ,ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల, టీటీడీ కల్యాణ మండపాలు మంజూరు చేశారు. ఎస్‌కోట నియోజకవర్గంలోని వేపాడ మండలంలో విజయరామసాగర్‌ను మినీరిజర్వాయర్‌గా తీర్చిదిద్దామంటూ హామీ ఇచ్చిన వైఎస్సార్ అతని హయాంలోనే నిధులు కొంతమేర మంజూరు చేశారు. తరువాత సాగర్ అభివృద్ధిని పట్టించుకున్న నాథుడు లేడు. ఖాయిలా పడ్డ భీమసింగి చక్కెర కర్మాగారాన్ని తెరిపించి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారు. సుజలస్రవంతితో విశాఖ ప్రజల దాహార్తిని తీర్చి తాటిపూడి, రైవాడ రిజర్వాయర్ నీటిని పూర్తిగా సాగుకు విడిచిపెడతామంటూ హామీ ఇచ్చారు. ఆయన మరణంతో సుజలస్రవంతికి మోక్షం లేక, తాటిపూడి, రైవాడ రిజర్వాయర్ నీటిని తాగునీటి అవసరాల పేరుతో తరలిస్తూ కోట్ల రూపాయలకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. సాలూరు నియోజకవర్గంలో వైఎస్సార్ హయాంలోనే మెంటాడ, పాచిపెంట, సాలూరు మండలాల్లో అభివద్ధి ఎక్కువగా జరిగింది. గ్రామాలకు రహదారులు, వంతెనల నిర్మాణాలు జరిగాయి. మక్కువ మండలంలో మాత్రం సూరాపాడు ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. అలాగే, వెంగళరాయ సాగర్ రిజర్వాయర్ సంబంధించిన కాలువలు అభివద్ధి పనులు జరిగాయి. కురుపాం నియోజకవర్గంలో తోటపల్లి రిజర్వాయర్‌కు వైఎస్సార్ నాంది పలికారు. దీంతో లక్షలాది ఎకరాలకు సాగునీరుకు అస్కార లభ్యమైంది. దీంతో రైతులు కూడా ఎంతో ఊరటచెందారు. కొమరాడ మండలంలో జంఝావతి రబ్బర్ డ్యామ్ రాజశేఖరరెడ్డి హయాంలోనే నిర్మాణానికి నాంది పలికారు. జంఝావతి ప్రాజెక్టు దేశంలోనే మొట్టమొదటి రబ్బర్‌డ్యామ్‌గా పేరుంది. కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద జంఝావతి ప్రాజెక్టు రబ్బర్ డ్యామ్‌కు రూ.6 కోట్లు విడుదల చేశారు. నిరూపయోగంగా ఉన్న డ్యామ్‌కు రబ్బర్ డ్యామ్‌ను నిర్మించడం వల్ల 3వేల ఎకరాలకు సాగునీటిని అందించారు. అప్పట్లో గిరి నియోజకవర్గంలో వేల మంది నిరుపేదలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా శస్త్ర చికిత్సలు చేయించి వేలాది మంది ప్రాణాలు నిలిపారు. పార్వతీపురం నియోజకవర్గంలోని గరుగుబిల్లి మండలంలో తోటపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 90 శాతం పనులు పూర్తిచేయించారు. గజపతినగరం నియోజకవర్గానికి తోటపల్లి చానల్ ద్వారా సుమారు 3వేల ఎకరాలకు పైలాన్ ప్రారంభోత్సవం చేశారు. పేదలకు లక్షలాది ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ కుల, మతాల తేడా లేకుండా పింఛన్లు మంజురు చేశారు. జిల్లా కేంద్రమైన విజయనగరంలో యూత్ హస్టల్ ప్రారంభించి వెనుకబడిన వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో వైఎస్ ఐదేళ్ల పాలనలో నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనించింది. ఇక్కడి నాలుగు మండలాల్లోని పంట పొలాలకు సాగునీటిని అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తారకరామతీర్థసాగర్ సాగునీటి ప్రాజెక్టును మంజూరు చేశారు. దీని కోసం 2007లోనే సుమారు రూ.187 కోట్లను విడుదల చేశారు. అయితే ఆయన మరణానంతరం ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం చోటుచేసుకుంది. జిల్లాకు ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేయించి సాంకేతిక విద్యను అందుబాటులోకి తెచ్చారు. ‘కోట’తో మహానేత బంధం మరువలేనిది.. శృంగవరపుకోట: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి ఎస్.కోట నియోజకవర్గంతో విడదీయలేని బంధం ఉంది. ఎన్నో దఫాలు ప్రతిపక్ష నేతగా, సీఎంగా శృంగవరపుకోట నియోజకవర్గంలో పర్యటించారు. తొలుత 1998లో పీసీసీ అధ్యక్షుని హోదాలో, 1999 ఎన్నికల ప్రచారం, 2001 నాటి స్థానిక సంస్థల ఎన్నికలకు ఎస్.కోట వచ్చి బహిరంగ సభలో పాల్గొని ప్రచారం చేశారు. 2003 నాటి పాదయాత్రలో భాగంగా జిల్లాలో మొదటిగా శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలోని వేపాడ మండలంలోని నీలకంఠరాజపురం గ్రామంలో అడుగుపెట్టారు. మా కన్నీళ్లు తుడిచి, మాకింత కూడు పెట్టిన మహానుభావుడు రాజన్న అంటూ భీమసింగి సహకార చక్కెర కర్మాగార కార్మికులు దివంగత రాజన్నను జ్ఞాపకం చేసుకుంటారు. అధికారంలోకి వస్తే కర్మాగారాన్ని తెరిపిస్తానని ఇచ్చిన మాట ప్రకారం వై.ఎస్.రాజశేఖరరెడ్డి 2004 సంవత్సరం నవంబర్ 15న చక్కెర కర్మాగారంలో క్రషింగ్ ప్రారంభించారని, కర్మాగారానికి ఆప్కాబ్ నుంచి రూ.36కోట్లు రుణం ఇచ్చి, ఖాయిలా పడ్డ కర్మాగారం తెరిపించారని, 300 కార్మికులు జీవితాల్లో, వేలమంది రైతన్నల బతుకుల్లో వెలుగు నింపారని గుర్తుచేసుకుంటున్నారు. మహానేతా మనసాస్మరామి.. బాడంగి: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి 2007లో ఇందిరమ్మ చెరువుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మండలంలోని బొత్సవానివలసలలో మల్లునాయుడు చెరువు అభివృద్ధి పనులను ప్రారంభించారు. చెరువును బాగుచేసేందుకు కృషిచేశారు. వాసిరెడ్డి వరదరామారావుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఈ ప్రాంతాభివృద్ధికి కృషిచేశారని ఈ ప్రాంతీయులు చెబుతున్నారు. ఆయన వర్ధంతిని జరిపేందుకు సిద్ధమవుతున్నారు. రైతుల మదిలో చెరగని ముద్ర.. దత్తిరాజేరు: నిత్యం రైతుల కోసం ఆలోచించి వారి అభ్యున్నతి గురించి పాటుపడిన వ్యక్తులు కొంత మందే ఉంటారు. అలాంటి వ్యక్తులలో రైతుల మదిలో చెరగని ముద్ర వేసుకన్న వ్యక్తి స్వర్గీయ వై.ఎస్. రాజశేఖరరెడ్డి. ప్రజా సమస్యలను తెలసుకునేందుకు చేపట్టిన పాదయాత్రలో దత్తిరాజేరు రైతుల సాగు కష్టాలను గుర్తించారు. వర్షాధారంతో పంటలు సాగుచేసి ప్రకృతి అనుకూలించక రైతులు అప్పులపాలవుతున్న వైనాన్ని కళ్లారా చూశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తోటపల్లి ప్రాజెక్టు నీటిని అందిస్తానని హామీ ఇచ్చారు. అంతే... 2004లో గద్దెనెక్కిన వెంటనే తోటపల్లి నీటిని అందించేందుకు వీలుగా కాలువ తవ్వకాల పనులకు 2006లో పెదమానాపురం సంత వద్ద శంకుస్థాపన చేశారు. మండలంలోని చినకాదలో 785.08 ఎకరాలకు, పెదకాదలో 734.08 ఎకరాలకు, వంగరలో 627.47, గొభ్యాంలో 435.86, దాసపేటలో 233.75, కన్నాంలో 285.31, విజయ రామగజపతిపురానికి 58.23, వింద్యవాసిలో 118.42, వి.కృష్ణాపురంలో 203.54, పెదమానాపురంలో 643.12 ఎకరాలకు సాగునీటినందించేందుకు కాలువ తవ్వకాలకు అవసరమైన భూమిని సేకరించారు. అయితే, ఆయన మరణానంతరం పనులు ఎక్కడివక్కడే నిలిచిపోవడంతో రైతుల సాగునీటి కష్టాలు యథావిధిగా మిగిలాయి. జలయజ్ఞ ప్రదాత.. గరుగుబిల్లి: జలయజ్ఞం పథకంలో భాగంగా నాగావళి నదిపై రూ.450.23 కోట్ల వ్యయంతో తోటపల్లి వద్ద ప్రాజెక్టు నిర్మించి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పంటపొలాలకు సాగునీరు అందించారు. పాత ఆయకట్టు 64 ఎకరాలతో పాటు అదనంగా లక్షా 20వేల ఎకరాలకు సాగునీటిని అందించి రైతుల గుండెల్లో గుడికట్టుకున్నారు. ఆయన కృషివల్లే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతోందంటూ రైతులు నిత్యం రాజన్నను తలచుకుంటారు. సంక్షేమ పథకాల రూపకర్త.. విజయనగరం ఫోర్ట్: ప్రకృతి కరుణించక.. పంటలు పండక.. ప్రభుత్వ సాయం అందక.. కరువుతో తినడానికి తిండలేక రైతులు వలస వెళ్లేపోయే పరిస్థితులు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిని కదిలించాయి. పాదయాత్ర పూర్తిచేసి అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమపథకాల అమలుకు శ్రీకారం చుట్టారు. కరువు పరిస్థితులను రూపుమాపేందుకు కృషిచేశారు. అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను చేరువు చేసి ఆర్థిక పుష్టికలిగించారు. విద్య, వైద్య సదుపాయాలతో పాటు రైతుల కష్టాలు తీర్చారు. విద్యుత్ చార్జీలు, పంట రుణాలు మాఫీ చేశారు. వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించారు. రూ.2కే కిలో బియ్యం అందించారు. 108, 104 వాహనాలతో వైద్యాన్ని అక్కరకు చేర్చారు. ఆరోగ్యశ్రీతో రూపాయి ఖర్చులేకుండా శస్త్రచికిత్సలు చేయించారు. ప్రజాసంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చోటు సంపాదించారు. రుణం మాఫీ చేశారు... నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. కరువు పరిస్థితులతో బ్యాంకులో తీసుకున్న రూ.50 వేల రుణం తీర్చలేకపోయాను. వైఎస్సార్ సీఎం అయిన తర్వాత అసలు రూ.50 వేలు వడ్డీ రూ.30 వేలు మొత్తం రూ.80 వేలు రుణమాఫీ చేశారు. మళ్లీ బ్యాంకులో రుణం కూడా ఇప్పించారు. సాగుకు ఊతమిచ్చారు. – ఎస్.సర్వదేముడు, రైతు ఆరోగ్యశ్రీ ఆదుకుంది.. నాకు కడుపులో నొప్పి రావడంతో కేంద్రాస్పత్రిలో చేరాను. పైసా తీసుకోకుండా ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ చేశారు. నాకు వైద్యం చేయించిన వైఎస్సార్‌ను మరువలేను. – ఎస్.రాము, ఆరోగ్యశ్రీ లబ్ధిదారుడు, పెదవేమలి గ్రామం అపర భగీరథుడు.. కొమరాడ: కొమరాడ మండలంలోని రాజ్యలక్ష్మిపురం గ్రామం వద్ద 1976లో జంఝావతి రిజర్వాయర్ నిర్మించారు. ఒడిశాతో చిన్నపాటి వివాదంతో రిజర్వాయర్ అక్కరకు రాకుండా పోయింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఫలితం లేకపోయింది. దిగవంత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలోనే మొట్టమొదటి సారిగా ఆస్ట్రియా టెక్నాలజీతో రూ.6 కోట్ల వ్యయంతో రబ్బర్డ్యాంను ఏర్పాటుచేశారు. సుమారు 12వేల ఎకరాలను సస్యశ్యామలం చేశారు. ఈ ప్రాంత రైతులకు సాగునీటి కష్టాలు తీర్చి అపరభగీరథుడిగా పేరుపొందారు. ఆయన మేలును మరచిపోలేమని రైతులు గుర్తుచేసుకుంటున్నారు. వైఎస్సార్ రైతుల పాలిటి దేవుడు.. మహానేత వైస్సార్ రైతుల పాటిట దేవుడు. ఎన్నోదశాబ్దాల కళను నిజం చేశారు. జంఝావతి నీటిని పొలాలకు మళ్లించారు. ఆయన చేసిన మేలు నా జీవితాంతం మరవలేను. – దాసరి నారయణరావు, రైతు, విక్రంపురంగ్రామం, కొమరాడ మండలం రాజన్న దయే... ఈ రోజు పంటలు పండి నాలుగు మెతుకులు తింటున్నామంటే అది వైఎస్సార్ దయే. బీడు భూములకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేసిన ఘతన వైఎస్సార్‌దే. జంఝావతి నీరు గంగారేగువలస పరిసర పాంతాలకు అందుతుందంటే ఆయన ఏర్పాటుచేసిన రబ్బరుడ్యామ్ వల్లే. – ద్వారపురెడ్డి జనార్దననాయుడు, గంగారేగువలస గ్రామం, కొమరాడ మండలం ఆయనుంటే మరింత మేలు జరిగేది.. మహానేత బతికుంటే జంఝావతి ప్రాజెక్టనుంచి పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందేది. ఒడిశాతో వివాదం పరిష్కరించేవారు. సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. – కెంగువ పోలినాయుడు, మాజీ సర్పంచ్, కొత్త కంబవలస, కొమరాడ విద్యా వెలుగులు.. సీతానగరం: సీతానగరం మండలంలో మహానేత వైఎస్సార్ విద్యావెలుగులు ప్రసరింపజేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత చేపట్టిన రాజీవ్ పల్లెబాటలో భాగంగా సీతానగరంలో పర్యటించిన ఆయన మండలంలోని ఆహ్లాదకర వాతావరణానికి ఆకర్షితులయ్యారు. జోగింపేట వద్ద పట్టు పరిశ్రమకేంద్రాన్ని ఏర్పాటుచేయించారు. అలాగే, గిరిజన ప్రతిభావిద్యాలయాన్ని ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారు. సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో రూ.4 కోట్ల వ్యయంతో గిరిజన ప్రతిభ విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 6 జిల్లాలకు చెందిన గిరిజన విద్యార్థులకు విద్యా బోధన జరుగుతోంది. గిరిజన ప్రతిభా విద్యాలయాన్ని ఆనుకుని ఎస్సీకులాలకు చెందిన కుటుంబాల్లో విద్యాకుసుమాలు విలసిల్లాలనే ఉద్దేశ్యంతో 8 ఎకరాల విస్తీర్ణంలో రూ.16 కోట్ల వ్యయంతో సాంఘిక సంక్షేమగురుకుల బాలుర విద్యాలయాన్ని ఏర్పాటు శ్రీకారం చుట్టారు. రెండు విద్యాలయాలకు ఆనుకుని ఉన్న 2 ఎకరాల విస్తీర్ణంలో కేజీబీవీ బాలికల విద్యాలయాన్ని ఏర్పాటుకు స్థలాన్ని సమకూర్చారు. రాజన్న మండలానికి రాకతోనే జోగింపేట గ్రామం విద్యలయాలకు నిలయమైందని ఈ ప్రాంతీయులు గుర్తుచేసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీతో ఆదుకున్నారు.. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం మా కుటుంబాన్ని కాపాడింది. ముగ్గురు ఆడపిల్లలకు తండ్రినైన నాకు పైసా ఖర్చులేకుండా గుండె ఆపరేషన్ చేశారు. నిజంగా వైఎస్సార్ దేవుడు. గతంలో షర్మిల, జగన్ ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు వారిని కలిసి ఇదే విషయాన్ని చెప్పాను. – అడబాల కృష్ణారావు, ఆరోగ్యశ్రీ లబ్ధిదారు, మెట్టవలస ఎంబీఏ చదివా.... సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన నేను గజపతినగరం సెయింట్ థెరీసా కళాశాలలో ఎంబీఏ చేశాను. నాకు రెండేళ్లకు రూ.60వేలు ఫీజురీయింబర్స్‌మెంట్ వచ్చింది. లేకుంటే నేను చదవలేకపోయేవాడిని. రాజశేఖర్‌రెడ్డి నాలాంటి ఎందరికో ఉన్నత విద్యావకాశాలను కల్పించి అమరులయ్యారు. – అరసాడ శంకరరావు, ఎంబీఏ పట్టభద్రుడు, మెట్టవలస బీసీల్లో చేర్చడంతో... ఓసిలో ఉన్న అయ్యరకలను బీసీలో చేర్చిన మహనీయుడు వైఎస్సార్ రాజశేఖరరెడ్డే. ఆయన దయతో మా కులంలో ఉన్న చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. బీసీ రిజర్వేషన్‌తో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాను. మా కులస్తులందరూ రాజశేఖరుడికి రుణపడి ఉన్నాం. – లెంక కనక తాతారావు, ఏఆర్ కానిస్టేబుల్, సుందరయ్యపేట గూడు గోడు తీర్చారు... ఇల్లులేక ఇబ్బంది పడుతున్న మా కుటుంబానికి ఇల్లు మంజూరు చేశారు. రాజన్న అందించిన నిధులు రూ.50వేలతో ఇల్లు కట్టుకున్నాం. మాలాంటి ఎంతోమంది పేదలకు పక్కా ఇంటి భాగ్యం కల్పించిన ఘనత వైఎస్సార్‌దే. – బల్లంకి శ్యామల, బొద్దాం, వేపాడ మండలం -
నకిలీ బంగారంతో బురిడీ
సాక్షి, పూసపాటిరేగ (నెల్లిమర్ల): నకిలీ బంగారు ఆభరణాలు కుదువపెట్టి బ్యాంకుకు బురిడీ కొట్టించిన సంఘటన విజయనగరం జిల్లాలో వెలుగు చూసింది. దీనికి సంబంధించి సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి. పూసపాటిరేగ మండలం కోనాడ జంక్షన్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో నకిలీ బంగారం కుదువపెట్టి లక్షలాది రూపాయలు కాజేసినట్లు తెలిసింది. బ్యాంకు అప్రైజర్ ప్రోత్సాహంతోనే ఈ విధంగా పలువురు బ్యాంకును మోసగించినట్లు సమాచారం. ఓ ఖాతాదారుడు కుదువపెట్టిన నగలను రెన్యువల్ చేయించుకునేందుకు రమ్మని కబురంపగా ఆయననుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు వస్తువులను పరిశీలించడంతో అవి నకిలీవిగా తేలింది. దీనిపై రెండురోజులుగా బ్యాంకులో ఏరియా మేనేజర్ సి. శ్రీనివాసరావు సమక్షంలో నలుగురు బంగారం నాణ్యత చూసే వ్యక్తులతో పాటు, పలువురు ఆ శాఖ ఉన్నతాధికారులు బ్యాంకులో తనిఖీలు చేపడుతున్నారు. మత్స్యకార గ్రామాలైన కోనాడ, తిప్పలవలసకు చెందిన వ్యక్తులు అత్యధికంగా బ్యాంకులో నకిలీ వస్తువులతో రుణాలు పొందినట్లు వెల్లడైంది. బంగారు నాణ్యత పరిశీలించిన వ్యక్తి కోనాడ వాసి కావడంతో ఆయనతో పరిచయం ఉన్న పలువురు వ్యక్తులకు నకిలీ బంగారు నగలు ఇచ్చి బ్యాంకులో రుణాలు తీసుకోవాలని ప్రోత్సహించి, వారి పేరున తానే నిధులు కాజేశాడన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే బ్యాంకు నుంచి రూ. 17 కోట్ల వరకు పలువురు ఖాతాదారులు బంగారు ఆభరణాలపై రుణాలు పొందారు. అందులో ఎంతమంది నకిలీ ఆభరణాలు ఇచ్చారనేది తేలాల్సి ఉంది. బ్యాంకులో బంగారు రుణాలు తీసుకున్న ఖాతాదారులను పిలిపించి వారి సమక్షంలోనే బంగారు నాణ్యత పరీక్షలు చేస్తున్నారు. దీనిపై పూర్తిగా పరిశీలన చేసిన తర్వాతే వాస్తవాలు బయటకు రాగలవని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. దీనిపై బ్యాంకు ఏరియా మేనేజర్ సి.శ్రీనివాసరావు మాట్లాడుతూ, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నకిలీ బంగారు నగలతో రుణాలు పొందారనే సమాచారంతో తనిఖీలు చేస్తున్నాం. కోనాడకు చెందిన వనం వెంకటప్పడు అనే వ్యక్తి గోల్డ్‌లోన్ రెన్యువల్‌కు ముఖం చాటేయడంతో అనుమానం వచ్చి కుదువపెట్టిన వస్తువులను పరిశీలించడంతో నకిలీ వస్తువుగా తేలిందని తెలిపారు. దీనిపై పూరిస్థాయిలో విచారణ చేసిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
ఔట్సోర్సింగ్ కుచ్చుటోపీ !
ఔట్ సోర్సింగ్ ముసుగులో గత ప్రభుత్వ నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తమ ప్రాబల్యం పెంచుకునేందుకు అధికారులను పావులుగా వాడుకుని అడ్డగోలుగా ప్రభుత్వ నిధులు కాజేశారు. మొన్నటికి మొన్న సర్వశిక్ష అభియాన్ ద్వారా భారీ స్క్రీన్ల పేరుతో నిధులు మింగినవైనం బయటపడగా... తాజాగా జిల్లాలో మాజీ టీడీపీ ఎమ్మెల్యే అండతో ఏర్పాటైన ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ఉద్యోగుల ఈఎస్ఐ, పీఎఫ్ మొత్తాలు చెల్లించకుండా బోర్డు తిప్పేసిన సంఘటన వెలుగు చూసింది. సీరియస్‌గా తీసుకున్న జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఇప్పుడు ఆ సంస్థపై క్రిమినల్కేసు నమోదు చేయించేందుకు జిల్లా విద్యాశాఖాధికారి చర్యలు తీసుకుంటున్నారు. సాక్షి,విజయనగరం అర్బన్: విద్యాశాఖ అడ్డాగా గత ప్రభుత్వ పాలనలో సాగిన అక్రమాల పర్వం వెలుగు చూస్తూ నే ఉంది. జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్లలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాల చెల్లింపుల్లో జరిగిన అక్రమాలు తాజాగా బయ ట పడ్డాయి. వారికోసం చెల్లించా ల్సిన ఈపీఎఫ్, ఈఎస్ఐ సొమ్ము రూ.62 లక్షలు జమచేయకుండా జిల్లాలోని ఒక టీడీపీ మాజీ ఎమ్మెల్యేకి చెందిన బేతస్థ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ తినేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఏడాదిపాటు సిబ్బంది అడిగినా ఇటు విద్యాశాఖగానీ, అటు ఏజెన్సీగానీ స్పందించలేదు. అయితే తినేసిన ఆ రూ.62 లక్షలు ఆ ఎమ్మెల్యే ఎన్నికల ఖర్చులో చూపించారని ప్రచారం జరుగుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ ఏజెన్సీ అడ్రస్‌కు నోటీసులు పంపినా స్పందించకపోవడంతో వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో విద్యాశాఖ క్రిమినల్ కేసు పెట్టింది. అధికారం అండతో... అడ్డగోలు నియామకాలు... జిల్లాలోని 16 మోడల్ స్కూళ్లలో నూతనంగా ఏర్పాటు చేసిన హాస్టళ్ల నిర్వహణ కోసం గతేడాది జనవరిలో వివిధ కేడర్ నాన్ టీచింగ్ సిబ్బందిని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. తొలుత జిల్లా విద్యాశాఖ అర్హులైన అభ్యర్థులతో నియామక జాబితాను సిద్ధం చేసి సర్వీసు అనుభవం ఉన్న ఒక ఔట్ సోర్సింగ్ ఏజెన్సీతో జిల్లా యంత్రాంగం ఒప్పందం పెట్టుకుంది. అయితే అప్పటి అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల మేరకు ఆ నియామకాలను, ఏజెన్సీ ఒప్పందాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. ఆ ఏజెన్సీ స్థానంలో ఎలాం టి అనుభవం లేని అప్పటి టీడీపీ ఎమ్మెల్యే బంధువుకు చెందిన బేతస్థ ఔట్సోర్సింగ్ ఏజెన్సీని నియమించింది. రాత్రికి రాత్రి ఇచ్చిన ఆ ఆదేశాలతో నిబంధనలకు విరుద్ధంగా కనీసం పత్రికా ప్రకటనైనా లేకుండా ఒక్క రోజు సమయం ఇచ్చి నియామక నోటిఫికేషన్ మరలా విడుదల చేసి ఎలాగోలా తమకు అనుకూలమైనవారిని నియమించుకుని మరో జాబితా ప్రకటించారు. ఈ విషయం అప్పట్లో వివాదా స్పదమైనాజిల్లా యంత్రాంగం పట్టించుకోలేదు. తొలినుంచీ ఎగ్గొట్టిన ఈపీఎఫ్, ఈఎస్ఐ మొత్తాలు.. తొలి మూడు నెలలకు ఒకసారి వేతన నిధులు రావడంతో ఆ మొత్తం ఒకేసారి చెల్లించారు. ఆ సమయంలో ఈపీఎఫ్, ఈఎస్ఐ ఇతర సౌకర్యాల నిధులు వెళ్లలేదని విద్యాశాఖ గుర్తించి తదుపరి బిల్లులకు అనుమతులివ్వలేదు. జిల్లా యంత్రాంగంపై ఆ ఎమ్మెల్యే ఒత్తిడి పెంచడంతో ఈపీఎఫ్, ఈఎస్ఐ నిధులు కేటాయించకపోయినా తరువాత మరో ఐదునెలల వేతనాన్ని విడుదల చేశారు. అయినా ఆ ఏజెన్సీ ఈపీఎఫ్, ఈఎస్ఐ నిధులు ఎగ్గొట్టింది. ఇప్పుడు ఆ ఏజెన్సీ చెల్లించాల్సిన బకాయి రూ.62 లక్షలకు చేరింది. నూతన ప్రభుత్వం వచ్చాక జిల్లా యంత్రాంగంలో చలనం వచ్చింది. గత నెల రోజులుగా బేతస్థ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ యజమానికి నోటీసులు పంపారు. అక్కడినుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్ ఆదేశాల మేరకు ఆ ఏజెన్సీపై విద్యాశాఖ తాజాగా ఒన్‌టౌన్ పోలీసు స్టేషన్‌పై క్రిమినల్ కేసు పెట్టింది. ఆందోళనలో సిబ్బంది.. జిల్లాలోని 16 మోడల్ స్కూళ్లలో గతేడాది హాస్టళ్లను నూతనంగా ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణ కోసం ఒక్కో హాస్టల్‌కు ఒక వార్డెన్, ఒక హెడ్కుక్, ఇద్దరు సహాయ కుక్‌లు, ఒక నైట్ వాచ్‌మన్ వంతున పోస్టులను భర్తీ చేశారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ ఖాతాల కోసం వేతన మొత్తం నుంచి తీసుకున్న సొమ్మును ఇవ్వకపోడంపై ఏడాదిగా ఆందోళనలో ఉన్నారు. ఆ ఏజెన్సీపై కేసుపెట్టాం.. జిల్లాలోని మోడల్ స్కూళ్లలో హాస్టల్ నిర్వహణ సిబ్బంది నియామకానికి గడచిన ఏడాది ఒప్పందం పెట్టుకున్న బేతస్థ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాం. వేతనాల నుంచి కేటాయించిన ఈపీఎఫ్, ఈఎస్ఐ నిధులను సిబ్బంది ఖాతాలో జమ చేయకుండా సుమారు రూ.62 లక్షలు తిరిగి చెల్లించాలని కొన్ని నెలలుగా కోరుతున్నాం. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ ఏజెన్సీపై చట్టబద్ధమైన చర్యలకోసం ఒన్‌టౌన్ పోలీసు స్టేషన్లో క్రిమినల్ కేసు పెట్టాం. సిబ్బంది వివరాలను తాజాగా పోలీసులు అడిగారు. ఇస్తున్నాం. – జి.నాగమణి, డీఈఓ, విజయనగరం -
కాటేసిన కాలువ
ఇద్దరు చిన్నారులూ ఐదోతరగతి చదువుతున్నారు. మంచి స్నేహితులు. ఉదయం పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం సెలవుపెట్టారు. సరదాగా ఆటల్లో నిమగ్నమయ్యారు. సైకిల్‌పై గ్రామానికి కిలోమీటరు దూరంలో ఉన్న తోటపల్లి కుడి ప్రధాన కాలువ వద్దకు చేరుకున్నారు. దుస్తులు ఒడ్డున పెట్టి స్నానం కోసం దిగబోయారు. అంతే.. కాలువ రూపంలో మృత్యువు కాటేసింది. ఇద్దరినీ అందని లోకాలకు తీసుకుపోయింది. పిల్లలే సర్వస్వంగా బతుకుతున్న కుటుంబాలను విషాదంలోకి నెట్టేసింది. సాక్షి, చీపురుపల్లి రూరల్: చీపురుపల్లి పట్టణంలోని జి.అగ్రహారం గ్రామానికి చెందిన ఇజ్జరోతు సతీష్(9) ఖరీదు గౌరీ శంకర్(9) సోమవారం సాయంత్రం గ్రామ సమీపంలో ఉన్న తోటపల్లి కాలువలో పడి మృతిచెందారు. స్థానిక పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... ఇద్దరు చిన్నారులు స్థానికంగా ఉన్న వేర్వేరు ప్రైవేటు పాఠశాలల్లో ఐదోతరగతి చదువుతున్నారు. ఉదయం పాఠశాలకు వెళ్లారు. మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చిన వీరు పాఠశాలకు సెలవుపెట్టారు. ఆటల్లో నిమగ్నమయ్యారు. సాయంత్రం 3 గంటల సమయంలో సైకిల్‌పై తోటపల్లి కాలువ వైపు వెళ్లారు. ఇద్దరూ దుస్తులు తీసి ఒడ్డున పెట్టారు. స్నానానికి దిగబోయి కాలువలో పడిపోయారు. ఈత రాకపోవడంతో మునిగిపోయారు. ఇద్దరు చిన్నారుల్లో ఒకరి మృతదేహం కాలువలోని నీటిలో తేలి ఉండడాన్ని అటువైపుగా వస్తున్న రైతులు గమనించారు. గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో స్థానికులు దిగి విద్యార్థి మృతదేహాన్ని బయటకు తీశారు. ఒడున రెండు జతల దుస్తులు కనిపించడంతో మరో విద్యార్థి ఉండొచ్చని భావించి కాలువలో దిగి వెతికారు. కాలువలోని బురదలో కూరుకుపోయిన మరో చిన్నారి మృతదేహం కనిపించడంతో గగ్గోలు పెడుతూ బయటకు తీశారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. మరణంలోనూ వీడని స్నేహం.. వారిద్దరు చిన్నారులు మంచి స్నేహితులు. ఒకటే వయస్సు. మృత్యువులోనూ స్నేహం వీడలేదు. మృతుల్లో సతీష్ తల్లిదండ్రులు శంకరరావు డ్రైవర్ కాగా తల్లి అరుణ ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తోంది. వీరికి సతీష్ ఒక్కడే కుమారుడు. ఒక్కగానొక బిడ్డను మృత్యువు కాటేయడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. కుమారుడి మృతదేహాన్ని పట్టుకుని వారు విలపిస్తున్న తీరు అక్కడివారిని కంటతడి పెట్టించింది. మరో విద్యార్థి గౌరీ శంకర్ తల్లిదండ్రులు సత్యనారాయణ, కనకరత్నంలు అగ్రహారం గ్రామం రోడ్డు సమీపంలో చిన్నపాటి టిఫిన్ దుకాణం నడుపుకుంటూ కాలం గడుపుతున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక కుమారుడు. అల్లారుముద్దుగా సాకుతున్న కుమారుడిని మృత్యువు కబళించడంతో భోరున విలపిస్తున్నారు. దేవుగా ఎందుకిలా చేశావు.. నీకు మేము ఏం అన్యాయం చేశావు... మా పిల్లలను తీసుకుపోయావంటూ ఏడ్చిన తీరు అక్కడివారిని కలచివేసింది. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. -
సర్కారు బడులకు స్వర్ణయుగం
సాక్షి, విజయనగరం అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. నూతన ప్రభుత్వం వచ్చాక భవనాలు, సౌకర్యాల పరిస్థితులను పాఠశాలల నుంచి నేరుగా ఛాయాచిత్రాల ద్వారా తీసుకొనే ప్రక్రియ ఇప్పటికే పూర్తి చేసింది. వాటిని సమకూర్చే ప్రణాళికలు ఒకవైపు జరుగుతుండగా మరో వైపు గత ప్రభుత్వం విస్మరించిన అభివృద్ధి పనులను పూర్తి చేసే బృహత్తర కార్యక్రమానికి ప్రాధాన్యమిస్తోంది. ఇందులో భాగంగా గత ఏడాది యూ–డైస్ ద్వారా సేకరించిన మౌలిక సదుపాయాల ప్రణాళికను ముందుగా పరిశీలించింది. గత ప్రభుత్వం మూడేళ్లుగా పట్టించుకోని మరుగుదొడ్ల, మేజర్ మరమ్మతు పనులను ముందుగా పూర్తి చేయాలని సర్వశిక్షా అభియాన్ నిర్ణయింది. ఈ చర్యల్లో భాగంగా జిల్లాలోని 128 పాఠశాలలకు రూ.2.5 కోట్లు మంజూరు చేసింది. వీటిని అత్యవసర పనులుగా సర్వశిక్షా అభియాన్ చేపట్టడానికి సిద్ధమయింది. గత కొన్నేళ్లుగా కనీస మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న పాఠశాలలకు మోక్షం లభించినట్లయింది. అవసరమైన చోట మరుగుదొడ్లు.. జిల్లాలోని 128 స్కూళ్లకు సర్వశిక్షా అభియాన్ రూ.2.5 కోట్లు నిధులు కేటాయించింది. వీటిలో 21 స్కూళ్లకు రూ.54.60 లక్షలతో బాలురకోసం మరుగుదొడ్లు నిర్మించనున్నారు. జిల్లాలోని గుర్ల మండలంలో 4, పార్వతీపురం మండలలో 3 స్కూళ్లకు, జామి, వేపాడ, ఎస్‌కోట, భోగాపు రం, నెల్లిమర్ల, చీపురుపల్లి, మెరకముడిదాం, సాలూరు, బొబ్బిలి, గరుగుబిల్లి, జియమ్మవల స, జీఎల్‌పురం, కొమరాడ మండలాల్లో ఒక్కో స్కూల్‌కి బాలుర మరుగుదొడ్డి నిర్మాణానికి ని ధులు మంజూరయ్యాయి. అదేవిధంగా 15 పా ఠశాలల్లో రూ.39 లక్షలతో బాలికలకోసం మరుగుదొడ్లు నిర్మించనున్నారు. వాటిలో అత్యధికంగా సాలూరు మండలంలో 4, పార్వతీపురం, పాచిపెంట మండలాల్లో రెండేసి స్కూళ్లు, మెరకముడిదాం, గరివిడి, గరుగుబిల్లి, కురుపాం, జీఎల్‌పురం, కొమరాడ మండలాల్లో ఒక్కొక్క స్కూల్‌ను గుర్తించారు. ఒక్కో మరుగుదొడ్డికి రూ.2.6లక్షల వంతున నిధులు కేటాయించారు. 92 స్కూళ్లకు మేజర్ మరమ్మత్తులు.. జిల్లాలోని 92 పాఠశాలల్లో మేజర్ మరమ్మతులు చేపట్టేందుకు రూ.1.53 కోట్లు మంజూరయ్యాయి. ప్రధానంగా బీటలు వారిన తరగతి గదుల గోడలు, స్లాబ్లకు ప్రాధాన్యమిచ్చారు. ఆ తరువాత ప్రహరీలు, ఫ్లోరింగ్ మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. గుర్తించిన 92 స్కూళ్లలో ఒక్కోదానికి కనీసం రూ.1.2 లక్షల నుంచి అధికంగా రూ.1.8 లక్షల వరకు నిధులు మంజూరు చేశారు. మౌలిక సదుపాయాలే తొలిప్రాధాన్యం.. జిల్లా వ్యాప్తంగా గతంలో పెండింగ్‌లో ఉన్న పాఠశాలల్లోని మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. వాటిని తక్షణమే నిర్మించాలని జిల్లాకు రూ.2.5 కోట్లు మంజూరు చేసింది. గతంలోని రెండు సంవత్సరాలలోని యూ–డైస్ ద్వారా గుర్తించిన మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రస్తుతం తొలి ప్రాధాన్యమిస్తాం. – ఎం.కృష్ణమూర్తినాయుడు, పీఓ, సర్వశిక్షా అభియాన్ -
ఆధార్ బేజార్
అమ్మ ఒడి పథకానికి అర్హత కోసం చిన్నారి పేరు ఆధార్‌లో నమోదు కావాలి. పెన్షన్‌కు అర్హత సాధించాలంటే వయసు ధ్రువీకరణ కోసం అవసరమైన మార్పులు ఆధార్‌లో చేయించుకోవాలి. అంతేనా... రేషన్ సరకులు కోసం ఈ కేవైసీ చేయించుకోవాలంటే ఆధార్ కేంద్రంలో వేలిముద్రలు వేయించుకోవాలి. ఇన్ని అవసరాలకు కారణమైన ఆ ఆధార్ కోసం ఇప్పుడు బేజారు పెరిగింది. ఒక్కసారిగా జనమంతా ఆధార్ కేంద్రాలు నిర్వహిస్తున్న మీ సేవ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఇప్పుడు అక్కడి జనాన్ని చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. సాక్షి, విజయనగరం గంటస్తంభం: జిల్లాలో ఆధార్ నమోదు వ్యవహారం ప్రహసనంలా మారింది. ఈకేవైసీ నమోదులో భాగంగా ఆధార్ నమోదు కేంద్రాలపై ఒత్తిడి పెరగ్గా అందుకు తగ్గ కేంద్రాలు లేకపోవడం... ఉన్నవి కాస్తా మూతపడటం... వాటిని పునరుద్ధరించేందుకు ఉడాయ్ స్పందించకపోవడం ఈ సమస్యకు కారణ మైంది. ఇప్పుడు ఆధార్ నమోదుకోసం జనం కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి దాపురించింది. పరిస్థితిని గమనించిన అధికారులు దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారు. ఈకేవైసీ నమోదుకు గడువు లేదని స్పష్టం చేస్తూ విద్యార్థులకు పాఠశాలల్లోనే నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇన్నాళ్లూ నమోదు చేసుకోకే... ప్రతి వ్యక్తికి ఏకీకృత గుర్తింపు సంఖ్య(యుఐడీ) జారీ చేస్తున్న విషయం తెలిసిందే. వేలిముద్రలు, కంటిపాపలు, ఇతర వివరాలు సేకరిస్తున్న సంగతీ తెలిసిందే. ఈ పక్రియ గత ఐదారేళ్లుగా నిరంతరం సాగుతోంది. అప్పట్లో తీసుకోని వారు, పిల్లలు పుట్టి, పెరిగిన తర్వాత వారు నమోదు చేసుకోవాల్సి ఉం ది. ఇలా ఇప్పటికీ ఆధార్ నమోదు చేసుకోని వారు చాలామంది ఉన్నారు. కొం దరికి అప్పట్లో తల్లితండ్రి పేరున ఆధార్ నంబర్ జారీ చేసినా వేలిముద్రలు సేకరించలేదు. పిల్లల వయస్సు ఐదేళ్లు దాటిన తర్వాత వారికి ఆధార్ చేయించాల్సి ఉన్నా చేయలేదు. ఈకేవైసీ నమోదుతో ఆధార్‌కు పరుగులు.. తాజాగా ప్రభుత్వం ఈకేవైసీ నమోదు చేసుకోవాలని సూ చించడంతో నమోదుకు రేష న్ డీలర్ల వద్ద ఈకేవైసీ కోసం వెళ్లగా పిల్లల వేలిముద్రలు పడట్లేదు. వారి ఆధార్ నమోదు కాకపోవడం ఇం దుకు కారణం. ఆధార్ చేయించుకోని కొందరు పెద్దవారి పరిస్థితీ ఇంతే. ఈ పరిస్థితుల్లో తొలుత ఆధార్ నమోదు చేసుకోవాల్సి రావడంతో వారంతా ఆధార్ నమోదు కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. జిల్లాలో ఇంకా 1.83లక్షల మంది ఈకేవైసీ నమోదు కావాల్సి ఉండడంతో రోజూ ఆధార్ తీసే మీసేవ కేంద్రాల వద్ద గంటల కొద్దీ వేచి ఉంటున్నారు. అయినా ఆధార్ జరగకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. కేంద్రాల సంఖ్య తగ్గడంవల్లే ఇబ్బందులు.. డిమాండ్‌కు తగ్గట్టుగా ఆధార్ కేంద్రాలు లేకపోవడంతో వెళ్లిన వారు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 36 శాశ్వత, 10 తాత్కాలిక నమోదు కేంద్రాలను ఈసేవ, మీసేవ కేంద్రాల్లో అప్పట్లో ఏర్పాటు చేశారు. కానీ అందులో ఇప్పుడు కేవలం 19 మాత్రమే పని చేస్తున్నాయి. తాత్కాలిక కేంద్రాలను ఆపేయగా సరైన డాక్యుమెంట్లు స్కాన్ చేయకపోవడం, నిర్దేశిత రుసుం కంటే ఎక్కువ వసూలు చేయడం, సూపర్వైజర్ లాగిన్ లాక్ చేయడం వంటి కేంద్రాలతో శాశ్వత కేంద్రాల్లో 17 నిలుపుదల చేశారు. వీటిని తెరిపించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ రెండుసార్లు ఉడాయ్ అధికారులకు లేఖలు రాసినా వారు స్పందించలేదు. పాతవి పునరుద్ధరించకపోగా కొత్తవి కూడా మంజూరు చేయలేదు. దీనివల్ల ఇప్పుడు ప్రజలు అవస్థలు పడుతున్నారు. వేలాదిగా తరలివస్తున్న జనం.. విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఈ సేవ కేంద్రానికి శనివారం ఒక్కరోజే నాలుగువేల మంది వచ్చి ఉదయం నుంచి బారులు తీరారు. దీనివల్ల కాసేపు అక్కడ తోపులాట చోటు చేసుకుంది. అక్కడికి వచ్చిన వారు తోసుకున్నారు. లైన్లో ఉన్న వారికి మానేసి పక్కనుంచి వచ్చిన వారికి ఇస్తున్నారని ఆందోళన చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అదుపు చేయాల్సి వచ్చింది. చివరకు నిర్వాహకులు అందరికీ ఆధార్ చేయలేక ఆక్టోబర్ 25వ తేదీ వరకు రోజుకు 50మంది చొప్పున టోకెన్లు ఇచ్చి పంపేశారు. అయినా ఇంకా చాలామంది టోకెన్లు లభించక నిరాశతో వెనుదిరిగారు. ఉదయం నుంచి ఉన్నా తమ పని కాలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి జిల్లాలోని మిగతా కేంద్రాలవద్ద కూడా ఉండటం విశేషం. స్పందించిన అధికారులు.. జనం పడుతున్న అవస్థల నేపథ్యంలో అధికారులు స్పందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈకేవైసీ చేయించుకోకుంటే కార్డులు తొలిగించమని ఇప్పటికే సంయుక్త కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రభుత్వం గడువు ఏమీ విధించలేదని తాజాగా వెల్లడించారు. అంతేగాకుండా ఐదేళ్ల నుంచి 15ఏళ్ల లోపు పిల్లలకు పాఠశాలల్లోనే ఆధార్ నమోదు, అప్డేషన్ చేస్తామని తెలిపారు. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈకేవైసీ రేషన్ డిపోల్లో డీలర్ల వద్దే చేయించుకోవాలన్నారు. ఇక ఆధార్కోసం పిల్లల్ని తీసుకుని మీసేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈకేవైసీ లేకున్నా... రేషన్.. ఈకేవైసీ నమోదు చేసుకోకుంటే రేషన్ సరుకులు ఇవ్వరన్నది వాస్తవం కాదని, నమోదు చేయించుకోకున్నా రేషన్ ఇస్తామని సంయుక్త కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 15ఏళ్ల వరకు ఉన్న వారికి పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ నమోదు, అప్డేట్ చేయించే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తర్వాత రేషన్ డీలర్ వద్దకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవచ్చని చెప్పారు. వీరంతా ఆధార్ నమోదు కేంద్రానికి రావాల్సిన అవసరం లేదన్నారు. ఈకేవైసీ చేయించుకునేందుకు ఎలాంటి గడువు లేదని, ఎప్పుడైనా చేయించుకోవచ్చనీ స్పష్టం చేశారు. 15సంవత్సరాలు దాటిన వారు ఆధార్ కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, రేషన్ డీలరే ఈకేవైసీ చేస్తారనీ, ప్రజలు ఈవిషయాన్ని గమనించాలని కోరారు. -జేసీ వెంకటరమణారెడ్డి -
ఇసుక కొరతకు ఇక చెల్లు!
ఇసుక ఇక సామాన్యునికి అందుబాటులోకి రానుంది. కోరిన వెంటనే అందించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. పారదర్శకత కోసం కొత్త ఇసుక విధానం అమలు చేయనున్నారు. ఇప్పటికే దీనికోసం కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో ఇసుక నిల్వలున్నట్టు గుర్తించారు. వాటిని స్టాక్ చేసేందుకు సాలూరు, బొబ్బిలిలో రెండు పాయింట్లు గుర్తించి పదెకరాల స్థలాన్ని కేటాయించారు. కొద్దిరోజులుగా ఇసుక కొరతను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలనుకున్న వారి నోళ్లకు ఇక తాళాలు పడనున్నాయి. సాక్షి, బొబ్బిలి: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టనున్న ఇసుక కొత్త పాలసీకి వడివడిగా అడుగులు పడుతున్నాయి. వచ్చే నెల 5 నాటికి ఇసుక సరఫరాను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇసుక విధానం అమలు చేసేందుకు సంబంధిత శాఖల కమిటీ ఇప్పటికే జిల్లాలోని రీచ్‌లను గుర్తించే పనిలో నిమగ్నమైంది. ప్రభుత్వం ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తగిన మార్గదర్శకాలను విడుదల చేయనుంది. ఇందుకోసం జిల్లాలో 62 ఇసుక రీచ్‌లు ఉండగా ఇందులో 55 ప్రాంతాల్లో ఇసుక నిల్వలను సంబంధిత శాఖాధికారులు గుర్తించారు. ఈ ఇసుక నిల్వలు ఎంత మేరకు తవ్వాల్సి ఉంటుందన్నది ఇప్పుడు చర్చిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని ఈ కొత్త ఇసుక పాలసీని నిర్ణీత సమయానికి ప్రారంభించేందుకు ఆయా శాఖలు పనిలో పడ్డాయి. ఒక్కో స్టాక్‌పాయింట్‌కు ఐదు ఎకరాలు.. జిల్లాలో ఇసుకను ఇతర ప్రాంతాల్లోని రీచ్‌లనుంచి తీసుకువచ్చి స్టాక్‌పాయింట్ల వద్ద నిల్వ చేస్తారు. ఈ పాయింట్ల నుంచి లబ్ధిదారులకు ఇసుకను తరలించేందుకు అనుమతులు జారీ చేస్తారు. జిల్లాలో సాలూరు, బొబ్బిలిలోని గొర్లె సీతారామపురం వద్ద గల ఐదేసి ఎకరాల వంతున స్థలాలను ఆయా తహసీల్దార్లు సిద్ధం చేసి చూపించారు. వీటిని సబ్ కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలోని ఏయే రీచ్‌ల నుంచయినా ఈ పాయింట్ల వద్దకు ఇసుకను లారీలతో తరలించి డంప్ చేస్తారు. ఇసుక లభ్యతను బట్టి త్వరలోనే స్టాక్‌పాయింట్లను పెంచే అవకాశం ఉంది. విజయనగరంలో ఇంకా గుర్తించాల్సి ఉంది. బ్యాంకులో డీడీ తీసి స్టాక్ పాయింట్‌కు వెళితే సరి.. జిల్లాలో గుర్తించిన స్టాక్‌పాయింట్ల నుంచి ఇసుకను తరలించేందుకు బ్యాంకులో డీడీలు తీయాల్సి ఉంటుంది. ఈ డీడీలను అందజేసిన వెంటనే వారికి కూపన్లు వస్తాయి. వాటిని తీసుకుని స్టాక్‌పాయింట్‌కు వెళితే అక్కడ ఇసుకను ఆయా వాహనాలకు పరిమాణాన్ని అనుసరించి అందజేస్తారు. వ్యాపారులకు, సాధారణ వినియోగదారులకు వేర్వేరు ధరలు.. జిల్లాలోని ఇసుక వినియోగదారులను రెండు రకాలుగా అధికారులు విభజిస్తున్నారు. ఒకటి సాధారణ లబ్ధిదారులు, రెండోది కాంట్రాక్టర్లు. యూనిట్ ధరను కాంట్రాక్టర్లకు, సాధారణ వినియోగదారులకు వేర్వేరుగా నిర్ణయించే ప్రక్రియ సాగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే ఓ యాప్ సిద్ధం చేసి ఆ యాప్ ద్వారా నమోదు చేసుకుని ఇసుకను తరలించుకునే సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇప్పట్లో యాప్ విధానాన్ని అమలు పరిచే అవకాశం లేదు. శ్రీకాకుళం జిల్లా రీచ్‌లను ఇవ్వాలని లేఖ: జిల్లాలో ఇసుక కొరత ఉంది. నదులు, గెడ్డలు, వాగుల్లో ఇప్పటికే ఇసుకను పెద్ద ఎత్తున తరలించేశారు. ఒక మీటరు ఇసుకను తీసుకోవాలంటే 5 మీటర్ల లోతున ఇసుక నిల్వలుండాలి. అలాగే రెండు మీటర్ల లోతున ఇసుకను తవ్వాలంటే 8 మీటర్ల లోతు ఇసుక ఉండాలి. కానీ జిల్లాలో ఇప్పటికే మీటరు లోతున్న ఇసుకను కూడా పూర్తిగా తవ్వేశారు. దీనివల్ల జిల్లాలో ఇసుక కొరత తీవ్ర రూపం దాల్చింది. ఈ కొరతను అధిగమించేందుకు శ్రీకాకుళం జిల్లాలోని సంకిలి సమీపంలోని గోపాలపురం, అన్నవరం ప్రాంతాల్లో ఇసుక లభ్యత బాగానే ఉన్నట్టు గుర్తించిన అధికారులు ఈ ఇసుక రీచ్‌లను విజయనగరం జిల్లాకు కేటాయించాలని ప్రభుత్వానికి లేఖరాశారు. ఇవి గాకుండా ఈ జిల్లాలోని కొమరాడ, జియ్యమ్మవలసల్లో అత్యధికంగా ఇసుక నిల్వ లున్నాయి. వీటి నుంచి ప్రభుత్వం ఇసుకను రెండు స్టాక్పాయింట్లకు తరలించి ఇసుక కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటోంది. విక్రయ బాధ్యత ఏపీఎండీసీకే.. జిల్లాలో గుర్తించిన వివిధ రీచ్‌లనుంచి ఇసుకను స్టాక్ పాయింట్లకు తరలించాక వాటిని విక్రయించడం, నిర్వహణ బాధ్యతలను ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు అప్పగించనున్నారు. స్టాక్ పాయింట్ స్థలాలను అప్పగించాక వాటికి ప్రహరీగానీ కంచెగానీ ఏర్పాటు చేసుకోవడం పొక్లెయిన్, వాహనాలు, కంప్యూటర్లు, సిబ్బందిని కేటాయించి వారికి పూర్తి స్థాయి నిర్వహణ బాధ్యతను అప్పగించనున్నారు. వచ్చే నెల 5 నుంచి ఇసుక సరఫరా.. జిల్లాలో వచ్చే నెల 5 నుంచి ఇసుక సరఫరాకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సంబంధిత శాఖలతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఇప్పటికే రెండు చోట్ల స్టాక్‌పాయింట్లు గుర్తించాం. జిల్లాలో ఇసుకను యథేచ్ఛగా తోడేశారు. నిల్వలు తక్కువగా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి రెండు రీచ్‌ల కోసం ప్రభుత్వానికి లేఖ రాశాం. ఏర్పాట్లన్నీ పూర్తి చేసి ఇసుక కొరతను తీర్చే ప్రయత్నాల్లో ఉన్నాం. – డాక్టర్ ఎస్.వి.రమణారావు, మైన్స్ ఏడీ, విజయనగరం -
నాడెప్ కుండీలతో నిధుల గల్లంతు..!
అధికారం ఉంది... అడిగేవారు ఎవ్వరన్న ధైర్యంతో గత టీడీపీ పాలకులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. నాడెప్ కుండీల నిర్మాణాల పేరుతో రూ.కోట్లాది రూపాయలను ఖర్చుచేశారు. నాసిరకం నిర్మాణాలతో నిధులు కాజేశారు. సేంద్రియ ఎరువుల తయారీ లక్ష్యాన్ని మరుగునపడేశారు. ప్రతీ పైసా ప్రజోపకారానికే ఖర్చు చేశామంటూ ప్రచారం చేస్తున్న మాజీ సీఎం చంద్రబాబుకు నిరుపయోగంగా మారిన నాడెప్ కుండీలు కనిపించడం లేదా అంటూ జనం ప్రశ్నిస్తున్నారు. లక్కవరపుకోట: జిల్లాలోని పలు గ్రామాల్లో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించిన నాడెప్ కుండీలు నిరుపయోగంగా మారాయి. ఉపాధి హామీ పథకం నిధులు రూ.కోట్లు ఖర్చుచేసినా పైసా ప్రయోజనం కలగలేదు. ఎక్కడా కిలో సేంద్రియ ఎరువు కూడా తయారు కాలే దు. టీడీపీ కార్యకర్తలకే కుండీలను మంజూరు చేసి నిధులను కైంకర్యం చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లోని కుండీలు నిధుల దుర్వినియోగానికి నిలువెత్తు సాక్ష్యంగా మారాయి. అయ్యవారు టార్గెట్ ఇచ్చారు.. మనం నిర్మించేద్దామనే క్రమంలో ఒక్కో గ్రామంలో ఒకే చోట నాలుగు నుంచి ఎనిమిది కుండీలను నిర్మించారు. ప్రతీ పైసా ప్రజోపకారానికే ఖర్చు చేయాలని.. మంచి విజన్ ఉన్న నాయుకుడినంటూ చెప్పుకున్న చంద్రబాబుకు ఈ వృథా ఖర్చులు కనిపించలేదా అంటూ జనం దుమ్మెత్తిపోస్తున్నారు. నిధులను దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అప్పులపాల చేశారంటూ మండిపడుతున్నారు. నిర్మాణాల తీరు ఇలా... జిల్లాలో 2016–17 ఆర్థిక సంవత్సరంలో 33, 256 నాడెప్ కుండీల నిర్మాణానికి రూ. రూ.35కోట్ల72 లక్షల41వేలు ఖర్చుచేశారు. అలాగే, 2017–18 సంవత్సరంలో 16,450 కుండీల నిర్మాణానికి రూ.14.46 కోట్లు, 2018–19 సంవత్సరంలో 2,239 కుండీలకు రూ2.05కోట్లు ఖర్ఛు చేశారు. జిల్లాలో అత్యధికంగా గుర్ల మండలంలో 810 కుండీల నిర్మాణానికి సుమారు రూ.76లక్షల నిధులు చెల్లించారు. ఎస్.కోట నియోజకవర్గం పరిధిలోని కొత్తవలస మండలంలో 796, లక్కవరపుకోటలో 520, వేపాడలో 705, ఎస్.కోటలో 421, జామి మండలంలో 550 సేందియ ఎరువుల తయారీ కుండీలను నిర్మించారు. నిర్మాణాలు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలే నిర్వహించారు. ఇప్పటికే కొన్ని చోట్ల బీటలు వారి శిథిలావస్థకు చేరాయి. చెల్లింపులు ఇలా.. ఒక్కో కుండీ నిర్మాణానికి గత ప్రభుత్వం సుమారుగా రూ10,900 కేటాయించింది. 10 అడుగుల పొడువు, ఆరడుగుల వెడెల్పు, మూడు అడుగుల ఎత్తు పరిమాణంలో నిర్మించాలి. ఈ నిర్మాణాలు అత్యధికంగా టీడీపీ కార్యకర్తలు సంబంధిత ఉపాధి హామీ క్షేత్రసహాయకులు కుమ్మకై నిర్మించారని పలువురు బహిరంగానే ఆరోపిస్తున్నారు. ఎలా నిర్మించినా ఒక్కోగుంతకు సుమారుగా రూ.9,100 చెల్లించారు. అవగాహన కల్పించక... సేంద్రియ ఎరువుల తయారీని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో కుండీల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారే తప్ప వీటిపై రైతులకు ప్రచారం చేయలేదు. కుండీల లబ్ధిదారుల ఎంపికలో పాడి పశువులు లేనివారు.. ఎరువులు అవసరం లేనివారు అధికమంది ఉండడం వల్లే లక్ష్యం నీరుగారింది. నిధులు కాజేయడమే లక్ష్యంగా నిర్మాణాలు చేశారే తప్ప సేంద్రియ ఎరువులు తయారుచేద్దామన్న ఉద్దేశం ఎక్కడా కనిపించలేదనేందుకు నిరుపయోగంగా కనిపిస్తున్న కుండీలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. నిర్మాణ బాధ్యతలు ఉపాధిహామీ సిబ్బంది తీసుకున్నారు. అవగాహన బాధ్యతను మండల వ్యవసాయాధికారులకు, వెలుగు సిబ్బందికి అప్పగించారు. కాగా... ఎక్కడ రైతులకు అవగాహన మాత్రం కల్పించలేదు. సేంద్రియ ఎరువుల గుంతల్లో పోయాల్సిన చెత్త, పశువుల పేడను ఎప్పటి మాదిరిగానే ఆరుబయటే రైతులు పోసుకుంటున్నారు. నిధులు రికవరీ చేయాలి గ్రామాల్లో నిర్మించిన నాడెప్‌ల పనులను ఉన్నతస్థాయి అధికారులు పరిశీలించాలి. పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యుల నుంచి రికవరీ చేయాలి. నిర్మాణ పనుల్లో నాణ్యత, పర్యవేక్షణ పూర్తిగా కరువైంది. కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వి నియోగం అయ్యింది. – గాడి అప్పారావు, సీఐటీయూ నాయకుడు, ఎస్.కోట డివిజన్ ఎందుకు నిర్మించారో తెలియదు... మా గ్రామంలో పదుల సంఖ్యలో సేంద్రియ ఎరువుల తయారీ కుండీలను నిర్మించారు. నిర్మాణ సమయంలో అధికారులు వచ్చి హడావుడిగా నిర్మించేశారు. వాటిని ఉపయోగించుకునే విధానంపై అవగాహన కల్పించలేదు. నిరుపయోగంగా ఉన్న కుండీలను ఇప్పటికే కేంద్ర బృందం వచ్చి పరిశీలించి వెళ్లింది. – కొట్యాడ జగం, మాజీ సర్పంచ్ మాది నిర్మాణ బాధ్యత మాత్రమే.. మేము గ్రామాల్లో రైతులకు అవసరమైన చోట నాడెప్లను నిర్మించిన వరకే మా పని. రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయాధికారులు, వెలుగు సిబ్బందికి అప్పగించారు. – ఎస్.విజయలక్ష్మి, ఉపాధిహామీ ఏపీఓ, లక్కవరపుకోట మండలం -
దుకాణంలో దొంగలు.!
సాక్షిప్రతినిధి, విజయనగరం: వ్యాపారులకు మంచి జరగాలి.. పంచాయతీకి ఆదాయం రావాలన్న సదుద్దేశంతో పంచాయతీ, వ్యాపారుల భాగస్వామ్యంతో నిర్మించిన దుకాణాలపై టీడీపీ నేతల కన్ను పడింది. అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని దుకా ణాలను తమ చేతుల్లోకి తీసుకున్నారు. కోట్ల రూపాయల పంచాయతీ ఆదాయానికి గండికొ డుతున్నారు. తక్కువ అద్దెలు చెల్లిస్తూ ప్రశ్నించే వారిపై దౌర్జన్యం చేస్తున్నారు. ప్రభుత్వం మారిన తర్వాతైనా వారిలో మార్పువచ్చిందా అంటే అదీ లేదు. న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న దుకాణాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. అధికారంలో ఉన్నన్నాళ్లూ ఇదే చీపురుపల్లిలో అనేక అక్రమాలకు పాల్పడిన టీడీపీ నేతలు నేటికీ అదే ధోరణిని కొనసాగి స్తుండడాన్ని చూసి జనం విస్తుపోతున్నారు. అయితే, దుకాణాలకు బహిరంగ వేలం నిర్వహించడం ద్వారా పంచాయతీకి ఆదాయం చేకూర్చవచ్చని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్‌కు సూచించారు. ఇదీ కథ... చిరువ్యాపారుల సంక్షేమం దృష్ట్యా చీపురుపల్లి పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్, మెయిన్ రోడ్డును ఆనుకుని ఉన్న పయంచాయతీ స్థలంలో 26 దుకాణాల నిర్మాణానికి 2009లో అప్పటి కాంగ్రెస్ పాలకులు ప్రణాళికలు వేశారు. దుకాణాల నిర్మాణానికి చిరు వ్యాపారుల నుంచి కొంత వరకు నిధులు సమీకరించి ఆ డబ్బుతో దుకాణాలను నిర్మించారు. సాధారణ అద్దె నిర్ణయించి ఏడు సంవత్సరాలు లీజుకు దుకాణాలను కేటాయించారు. తరువాత 2016లో పంచాయతీ తిరిగి ఆ దుకాణాలను తీసుకుని బహిరంగ వేలం నిర్వహించాల్సి ఉంది. అప్పటికి టీడీపీ అధికారంలో ఉండడంతో రెండేళ్లు తాత్సారం చేసింది. 2018లో స్థానిక టీడీపీ నాయకులు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి బహిరంగ వేలం లేకుండా 30 శాతం అద్దెలను పెంచుతూ తమ వర్గీయులకు దుకాణాలను కేటాయించుకున్నారు. ఆ సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడొకరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కోర్టు ‘ఇంజక్షన్ ఆర్డర్’ను ఇచ్చింది. దుకాణాలను బహిరంగ వేలం నిర్వహించకుండా టీడీపీ పాలకులు తమ అనుయాయులకు, ఇష్టులకు తక్కువ అద్దెలకు దుకాణాలను కట్టబెట్టి మొదటి నుంచీ ఉన్న వారికి దుకాణాలు కేటాయించకుండా అన్యా యం చేశారు. అలా అన్యామైపోయిన వారిలో కోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీ నాయకుడు ఒకరు. అయితే, కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ మెయిన్ రోడ్డులో వైఎస్సార్ సీపీ నాయకుడికి చెందిన దుకాణానికి టీడీపీ మాజీ జెడ్పీటీసీ వర్గీయులు సోమవారం దౌర్జన్యంగా తాళం వేశారు. ఇదేమిటని అడిగిన వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువార్గాల వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అద్దెల లెక్క ఇలా... ప్రస్తుతం ఒక్కో దుకాణం నుంచి రూ.2వేల నుంచి రూ.2,800 వరకు మాత్రమే పంచాయతీకి అద్దెలు వస్తున్నాయి. కానీ అక్కడ మార్కెట్లో మాత్రం ఒక్కొక్క దుకాణానికి రూ.20వేల నుంచి రూ.25 వేల వరకూ అద్దెలు పలుకుతున్నాయి.ఈ లెక్కన ఏడేళ్లకు రూ.5.46 కోట్ల ఆదాయం పంచాయతీకి రావాల్సి ఉంది. టీడీపీ నాయకుల చేతివాటంతో పంచాయతీ ఆదాయానికి గండిపడుతోంది. దీంతో పంచాయతీలో ఉద్యోగులకు జీతాలు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీరు, వీధి దీపాలు అంటూ అనేక పనులకు నిధుల కొరత ఏర్పడింది. ఇప్పటికైనా టీడీపీ నేతలు ప్రజలు, పంచాయతీ బాగు కోసం ఆలోచించి బహిరంగ వేలానికి మద్దతిస్తే ఎలాంటి వివాదాలకు తావులేకుండా అర్హులకు దుకాణాలు దక్కే అవకాశం ఉంది. వేలంతో పంచాయతీకి ఆదాయం.. చీపురుపల్లి దుకాణాల అంశంపై కలెక్టర్ హరిజవహర్‌లాల్‌తో ఇప్పటికే చర్చించాం. దుకాణాలకు ప్రస్తుతం అతి తక్కువ అద్దెలు వస్తున్నాయి. దీనివల్ల పంచాయతీకి ఆదా యం రావడం లేదు. ఈ విధానం మారాల్సిన అవసరం ఉంది. అందుకే బహిరంగ వేలం నిర్వహించాల్సింది గా కలెక్టర్‌ను కోరాం. అదే జరిగితే పంచాయతీకి ఏడాదికి దాదాపు రూ.5 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. పంచాయతీ అవసరాలకు ఆ సొమ్ము ఉపయోగపడుతుంది. – బెల్లాన చంద్రశేఖర్, ఎంపీ, విజయనగరం ఉన్నతాధికారుల సూచనల మేరకే... వ్యాపారులు దుకాణాల కోసం గ్రీవెన్సుసెల్‌ను గతేడాది ఆశ్రయించారు. దీంతో ప్రతిపాదనలు పంపించాల్సిందిగా జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ మేరకు ప్రతిపాదనలు పంపించాం. 30 శాతం అద్దె పెంచుతూ దుకాణాలను కేటాయించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ ప్రకారం అద్దెలు పెంచుతూ దుకాణాలను కేటాయించాం. – డి. శ్రీనివాస్, మేజర్ పంచాయతీ అధికారి, చీపురుపల్లి -
కలసిసాగారు... నీరు పారించారు...
కాలువలు శుభ్రంగా ఉంటేనే పంట పొలాలకు సాగునీరందేది. ఏటా వాటి నిర్వహణ కోసం కొంత బడ్జెట్ కేటాయించడం పరిపాటి. ఆ నిధులు వెచ్చిస్తున్నట్టు రికార్డుల్లో కనిపిస్తున్నాయి. కానీ వెంగళరాయ సాగర్ పరిధిలోని 12 ఎల్, 10 ఆర్ కాలువల దుస్థితి మాత్రం అసలు వాస్తవాన్ని బయటపెడుతున్నాయి. కాలువలన్నీ తుప్పలతో పూడుకుపోయాయి. సాగునీరు సక్రమంగా అందక 2500 ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకమైంది. చేసేది లేక నాలుగేళ్లుగా అక్కడి రైతులే వాటిని శ్రమదానంతో శుభ్రపరచుకుని నీరు పారించుకుంటున్నారు. మక్కువ: వెంగళరాయసాగర్ ప్రాజెక్ట్ కాలువల ఆధునికీకరణకు కోట్లాది రూపాయిలు ఖర్చుచేశామని గత పాలకులు గొప్పగా చెప్పుకున్నారు. కానీ శివారు గ్రామాల ప్రజలకు మాత్రం సాగు నీటి కష్టాలు తీరలేదు. గడచిన నాలుగేళ్లు ఈ కాలువలను అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో మక్కువ మండలంలోని వెంక ట భైరిపురం గ్రామానికి చెందిన రైతులు గ్రామంలో కమీషన్ పాట(ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారులు అందించాల్సిన సొమ్ము) ద్వారా కొంతమొత్తం, రైతులు చందాలు ఎత్తుకొని మరికొంత వెచ్చించి, ఏటా ఖరీఫ్ సీజన్లో కాలువల్లో పేరుకుపోయిన పూడికలు తొలగించుకొని పంటలు సాగుచేసుకుంటున్నారు. 9 గ్రామాలకు అందని సాగునీరు... వెంగళరాయసాగర్ ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ పరిధిలోని 12ఎల్ కాలువ మండలంలోని చప్పబుచ్చమ్మపేట, మేళాపువలస, ములక్కాయవలస, పాపయ్యవలస, కాశీపట్నం, వెంకటభైరిపురం, కొయ్యానపేట, కొండరేజేరు గ్రామాల రైతులకు చెందిన సుమారు 2500 ఎకరాలున్నాయి. నాలుగేళ్లనుంచి కాలువల నిర్వహణ చేపట్టకపోవడంతో ఈ కాలువల ద్వారా పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా కావడంలేదు. కాలువల్లో తూటికాడలు, నాచు, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగిపోయి నీరు పారడంలేదు. మండలంలోని కాశీపట్నం గ్రామం సమీపంలోని 10ఆర్ కాలువ వద్ద గతంలో ఏర్పాటుచేసిన మదుము, యూటీ శిథిలావస్థకు చేరుకోవడంతో కాలువ మధ్యలో పెద్దగొయ్యి ఏర్పడి నీరు పంటపొలాల మీదుగా సీతానగరం మండలం తామరఖండి గెడ్డలోకి వృథాగా పోతోంది. దిగువనున్న పాపయ్యవలస, కొయ్యానపేట, కొండరేజేరు, వెంకటభైరిపురం గ్రామాల పరిధిలోని కాలువలకు సాగునీరు అందట్లేదు. అయినా వాటిని చక్కదిద్దేందుకు ఇరిగేషన్ అధికారులు చొరవ చూపలేదు. శ్రమదానంతో కాలువల నిర్వహణ.. అధికారులు కాలువల నిర్వహణ సరిగ్గా చేపట్టకపోవడంతో రైతులు శ్రమదానంతో ఈ నెల 14వ తేదీ నుంచి కొండరేజేరు గ్రామానికి చెందిన రైతులు కన్నంపేట గ్రామం నుంచి కొండరేజేరు వరకు కాలువలో ఉన్న పూడికలను తొలగించుకున్నారు. కొయ్యానపేట గ్రామానికి చెందిన రైతులు 12ఎల్, ఆర్ కాలువలో పేరుకుపోయిన పూడికలను మూడురోజులపాటు తొలగించుకొని పంటపొలాలకు సాగునీరు సమకూర్చుకుంటున్నారు. శనివారం వెంకటభైరిపురం గ్రామానికి చెందిన సుమారు 150మంది పురుషులు, మహిళలు కలసికట్టుగా కాలువల్లో పేరుకుపోయిన పూడికలు, తూటికాడలు తొలగిస్తున్నారు. సుమారు 7కిలోమీటర్ల పొడవునా తుప్పలు తొలగిస్తున్నారు. వెంకటభైరిపురం గ్రామానికి చెందిన రైతులు ఏటా రూ. లక్ష వరకు వెచ్చించి, కాలువలు నిర్వహించుకుంటున్నారు. ఎల్బీసీ పరిధిలోని 12ఎల్ కాలువ మొత్తం పూడికలతో నిండిపోవడంతో సరాయివలస, కొండబుచ్చమ్మపేట గ్రామాలకు చెందిన పంటపొలాలకు సాగునీరు అందకపోవడంతో, చందాలు ఎత్తుకొని పూడికలు తొలగించుకునేందుకు సమాయత్తమవుతున్నారు. అదును దాటిపోతున్నా... జరగని ఉభాలు.. శివారు గ్రామాలైన వెంకటభైరిపురం, కొండరేజేరు, కొయ్యానపేట, సరాయివలస, గోపాలపురం గ్రామాల పంటపొలాలకు కాలువల ద్వారా సాగునీరు అందకపోవడంతో ఖరీఫ్‌సీజన్ సగం పూర్తయినా పంటపొలాలకు సాగునీరు అందకపోవడంతో రైతులు ఉభాలు జరిపించలేకపోతున్నారు. దీనివల్ల నారుమడులు ముదిరిపోతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో సొంతంగా కాలువలు శుభ్రం చేసి నీటిని సమకూర్చుకుంటున్నారు. అధికారులు ఇప్పటికైనా వారి సమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాల్సిందే. సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం.. నాలుగేళ్లుగా కాలువల నిర్వహణ చేపట్టకపోవడంతో సాగునీటికోసం అనేక అవస్థలు పడుతున్నాం. ఏటా రైతులు చందాలు ఎత్తుకొని, కాలువల్లో పూడికలు తొలగించుకుంటున్నాం. ఏటా ఖరీ ఫ్ సీజన్ ముగిసిన సమయంలో ఉభాలు జరి పిస్తుండటంతో దిగుబడులు రావడం లేదు. సాగు చేసినప్పటికి వచ్చిన దిగుబడులు పెట్టుబడులకే సరిపోతున్నాయి. ఏటా మేమే కాలు వ శుభ్రపరచుకుంటున్నా... ఇరిగేషన్ అధికా రులు పట్టించుకోవడం లేదు. – రెడ్డి శ్రీరాము, వెంకటభైరిపురం, రైతు సీజన్ పూర్తవుతున్నా ఉభాలు జరగలేదు.. నాకు పదెకరాల పొలం ఉంది. అదంతా కాలువ పరిధిలోనే ఉన్నందున కాలువ ద్వారా నీరురాకపోవడంతో ఇంతవరకు ఉభా లు జరిపించలేకపోయాం. ఖరీఫ్‌సీజన్ ముగుస్తుండటంతో నారుమడులు ముదిరిపోతున్నా యి. ముదిరిన నారు నాటినా ప్రయోజనం ఉండదు. దిగుబడి శాతం తగ్గిపోతుంది. ప్రతి ఏటా ఇదేతంతు జరుగుతుంది. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. – జాగాన తిరుపతినాయుడు, రైతు, వెంకటభైరిపురం -
అగ్రగామిగా విజయనగరం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని, రాబోయే రోజు ల్లో జిల్లాను పూర్తి సస్యశ్యామలంగా తీర్చిదిద్దేందుకు అడుగులు పడుతున్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. విజయనగరం పోలీస్ పరేడ్ మైదానంలో గురువారం నిర్వహించిన 73వ స్వాతంత్య్ర దినోత్సవంలో ఆమె ముఖ్యఅతిథిగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లాలోని వివిధ∙ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ పనితీరు కనబరచిన ఉద్యోగులు, అధికారులకు ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. అనంతరం ఆమె జిల్లా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ గ్రామాలే దేశాభివృద్ధికి పట్టుకొమ్మలనే గాంధీ ఆలోచనలకు అనుగుణంగా గ్రామ స్వరాజ్య సాధన దిశగా ప్రభుత్వ సాలన సాగుతోందని చెప్పారు. జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రోత్సాహం అందించేందుకు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం, ప్రస్తుతం ఉన్నవాటిని ఆధునికీకరిస్తామని తెలిపారు. త్యాగధనుల ఆశయసాధనకు కృషి: దేశ స్వాతంత్య్రం కోసం ఎంతోమంది నిస్వార్ధ పోరాటం చేశారని, వారి త్యాగాలను మనం ఎన్నటికీ మరువలేమన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మొదలుకొని మన ప్రాంతంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వరకు ఎందరో నేతలు దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలు అర్పించారనీ, అలాంటి సమర యోధులందరికీ శిరసు వంచి నివాళులర్పిస్తున్నట్లు తెలిపా రు. వారి ఆశయాల సాధన కోసం పునరంకితం కావా లని కోరారు. రాష్ట్రంలో విజయనగరం జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని, ప్రజల్లో దేశభక్తి భావాలు పెంపొందించే రచనలు చేసిన మహాకవి గురజాడ అప్పారావు నడయాడిన నేల అని, వ్యవహారిక భాషకు పట్టంకట్టిన గిడుగు రామమూర్తి, హరికథ ద్వారా జిల్లా పేరు ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేసిన ఆదిభట్ల నారాయణ దాసు వంటి ఎందరో మహనీయులకు పురిటిగడ్డయిన ఈ జిల్లాలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి: జిల్లా ఆర్థిక వ్యవస్థకు మూలమైన వ్యవసాయ, అనుబంధ రంగాల అభివద్ధికి తోడ్పాటు అందించి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని వెల్లడించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తిచేయడం, మరికొన్ని ప్రాజెక్టులను ఆధునికీకరించి పూర్తి సామర్థ్యంతో నిర్దేశిత ఆయకట్టుకు సాగునీటిని అందించే పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. అదనపు ఆయకట్టుకు సాగునీటి వసతుల కల్పనలో భాగంగా 62 పెద్ద చెరువులను మరమ్మతు చేయనున్నట్టు చెప్పారు. దాదాపు రూ.210 కోట్లతో ఈ ఏడాది నుంచి వ్యవసాయరంగ అభివృద్ధితో పాటు ఉద్యాన పంటల విస్తరణకు ప్రోత్సాహం, మత్స్య పరిశ్రమ అభివద్ధికి తోడ్పాటు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు చేయూతనిస్తామన్నారు. ఆంధ్ర ప్రదేశ్ సమీకృత సాగునీరు– వ్యవసాయ పరివర్తన పథకం, నీటిపారుదల– జీవనోపాధుల అభివృద్ధి పథకం పేరుతో ఈ కార్యక్రమాలు ఈ ఏడాది నుండి అమలు కానున్నాయని చెప్పారు. దివంగత నేత వైఎస్సార్ ఆశయ సాధనలో భాగంగా రైతులు గౌరవప్రదమైన స్థానంలో నిలిచేలా ప్రస్తుత ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నారని చెప్పారు. జిల్లాలో ప్రకృతివ్యవసాయంవైపు రైతులు మొగ్గు చూపేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది 37 వేల మంది రైతుల ద్వారా 40వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు 61 వేల క్వింటాళ్ల వరి, వేరుశనగ, పచ్చిరొట్ట ఎరువులు, విత్తనాలు రాయితీపై సరఫరా చేశామని, బ్యాంకుల ద్వారా రూ.1446కోట్ల పంట రుణాలు అందజేయాలన్నది లక్ష్యమని ఇప్పటి వరకూ రూ. 571 కోట్లు అందజేశామని తెలిపారు. జిల్లాలో 15 వేల మంది కౌలు రైతులకు రుణ అర్హత పత్రాలు మంజూరు చేసినట్లు వివరించారు. గిరిజన సంక్షేమానికి పెద్దపీట: జిల్లాలోని గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామనీ, విద్య, వైద్యంతో పాటు వారి ఆర్థికాభివృద్ధికి చేయూతనిస్తున్నామని వివరించారు. గిరిజనులకోసం మంజూరైన విశ్వవిద్యాలయాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి మన జిల్లాలోనే ప్రారంభిస్తున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేసే గ్రామ సచివాలయాల్లోని ఉద్యోగాలన్నీ వంద శాతం గిరిజన యువతకే కేటాయించేలా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రతి గిరిజన కుటుంబానికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించటంతో పాటు జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు భోజన, వసతి సదుపాయాల నిమిత్తం ఏడాదికి రూ.20 వేలు అందించనున్నట్లు చెప్పారు. మాతా శిశు మరణాల నిరోధానికి జిల్లాలో రెండు చోట్ల గర్భిణుల వసతి గృహాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. పాఠశాలల మెరుగుకు చర్యలు: ప్రభుత్వ విద్యాసంస్థల్లో వసతులు మెరుగు పరచి విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతాయన్నారు. సంక్షేమ వసతి గృహాలలో పరిస్థితులు మెరుగు పరుస్తామని తెలిపారు. హాస్టళ్ల మరమ్మతుకోసం జిల్లాకు రూ.14 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేస్తూ బడ్జెట్లో రూ.66 కోట్లు కేటాయించారన్నారు. గరివిడిలో పశు వైద్య కళాశాలను త్వరలో ప్రారంభిస్తామన్నారు. అక్టోబర్ నుంచి వైఎస్సార్ రైతు భరోసా: రైతుల కోసం వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి నాలుగేళ్ళకు పెట్టుబడి సహాయంగా రూ.50 వేలు అందించనున్నట్టు తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ నెల నుంచే ఈ పథకం అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. రైతుల దరఫున ప్రభుత్వమే బీమా మొత్తాన్ని చెల్లిస్తుందని, రైతులకు వడ్డీలేని పంట రుణాలు అందించడంతో పాటు వారికి ప్రభుత్వమే ఉచితంగా బోర్లు కూడా వేయిస్తుందన్నారు. ఆరోగ్యపరిరక్షణలో భాగంగా కిడ్నీ, తలసేమియా లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రతినెలా రూ.10 వేలు పింఛన్ ఇస్తున్నామన్నారు. బడికి పంపే తల్లులకు అమ్మ ఒడి పథకం ద్వారా అండగా నిలువనున్నట్లు తెలిపారు. జిల్లాలో 3 లక్షల 9 వేల మంది ప్రయోజనం పొందనున్నట్లు తెలిపారు. వైఎస్సార్ ఆసరా పథకం కింద 45 ఏళ్ల వయస్సు కలిగిన డ్వాక్రా సభ్యులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళకు ఏడాదికి రూ. 15 వేలు సహాయం అందించనున్నట్టు వెల్లడించారు. జిల్లాలో 3 లక్షల 5 వేల మందికి ప్రతి నెలా సామాజిక పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఇల్లు లేని అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ళ స్థలాలతో పాటు పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. మద్యం నిషేధానికి అడుగులు: మద్యం రక్కసిని తరిమి కొట్టాలని ప్రభుత్వం భావి స్తోందనీ, దీనిని దశలవారీగా అమలు చేసేందుకు బెల్ట్ షాపులు మూసివేయిస్తున్నట్టు తెలిపారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా అక్టోబర్నుంచి ప్రజలదగ్గరికే పథకాలు వస్తాయన్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రతి సోమవారం స్పందన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి రాష్ట్రంలో కొత్త ఇసుక విధానం అందుబాటులోకి వస్తోందన్నారు. విజయనగరాన్ని సుందర వనంగా, హరిత నగరంగా చేయాలనే కలెక్టర్ ఆలోచనను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యమివ్వాలని కోరారు. కార్పొరేషన్ హోదా దక్కించుకున్న విజయనగరంలో రోడ్ల విస్తరణ, అభివృద్ధి, నీటి సరఫరా వంటి పనులను రూ.110 కోట్లు వెచ్చిస్తున్నట్టు తెలిపారు. జిల్లా ఎస్పీ నేతృత్వంలో శాంతిభద్రతల పరిరక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణకు చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి తోడ్పాటు నందించా లని కోరారు. -
మళ్లీ పేలిన రెడ్మీ నోట్-4 ఫోన్
-
తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
విజయనగరం: ప్రభుత్వంపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు, ఫిరాయింపుదారులకు మంత్రిపదవులపై కార్యకర్తల్లో అసహనం తదితర తలనొప్పులతో ఇబ్బందిపడుతోన్న అధికార తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. విజయనగరం జిల్లా సాలూరు, పాచిపెంట మండల శాఖల్లో పార్టీ సంస్థాగత ఎన్నికల సందర్భంగా తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగి రచ్చరచ్చచేశారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ఎమ్మెల్సీ సంధ్యారాణి, నియోజకవర్గ ఇన్చార్జి ఆర్పీ భంజ్ దేవ్ల అనుచరు మధ్య గొడవ మొదలైంది. వాగ్వాదం కాస్తా తోపులాటకు దారితీయడంతో ఆ ప్రంగణం రణరంగంలా మారింది. తమ్ముళ్ల దూకుడును భరించలేని స్థితిలో.. పార్టీ పరిశీలకుడిగా కార్యక్రమానికి విచ్చేసిన నాయుడు అక్కడినుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు. -
విజయనగరంలో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
-
విజయనగరంలో మిస్టర్ ఆంధ్రా పోటీలు
-
విజయనగరంలో మంత్రివర్గ కోటా కోట్లాట
-
విజయనగరంలో బీసీ వర్సెస్ ఓసీ
-
మూలవలసలో భారీ అగ్నిప్రమాదం
విజయనగరం : విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం మూలవలసలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికులు వెంటనే స్పందించి... అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని... మంటలార్పుతున్నారు. ఈ ప్రమాదంలో 18 ఇళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. రూ. 10 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు వెల్లడించారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. షార్ట్ సర్క్యూటే కారణమని స్థానికులు భావిస్తున్నారు. -
విజయనగరం జిల్లాలో ఏనుగుల బీభత్సం
-
అగ్నిప్రమాదంలో 11 పూరిళ్లు దగ్ధం
విజయనగరం: విజయనగరం జిల్లా పుసపాటిరేగ మండలం రోలుచొప్పడిలో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 11 పూరిళ్లు దగ్ధమయ్యాయి. విద్యుత్ షార్ట్‌సర్క్యూటే కారణమని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
వృద్ధురాలిపై ఎద్దు దాడి
విజయనగరం : పార్వతీపురం మున్సిపాలిటీ ఆఫీసు సమీపంలో ఓ వృద్ధురాలిని దేవర ఎద్దు పొడిచింది. ఎద్దు పొడవటంతో వృద్దురాలి పొట్ట నుంచి పేగులు బయటకు వచ్చాయి. స్థానికులు ఆమెను హుటాహుటిన పార్వతీపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. వృద్ధురాలికు సంబంధించిన చెందిన వివరాలు తెలియాల్సి ఉంది. -
పనుల నత్తనడకపై జపాన్ బృందం అసంతృప్తి
విజయనగరం: జపాన్ బృందం బుధవారం విజయనగరం జిల్లాలో పర్యటించింది. జిల్లాలోని గంత్యాడ, ఎస్.కోట మండలాల పరిధిలో 15 వేల ఎకరాలకు నీరందించేందుకు నిర్మించిన తాటిపూడి ఆయకట్టు ప్రాజెక్టును సందర్శించింది. 2011లో మొదలైన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి జపాన్ ప్రభుత్వం రూ. 23 కోట్ల నిధులు సమకూర్చిన సంగతి తెలిసిందే. కాగా, దండిగా నిధులున్నప్పటికీ నిర్మాణం పనుల్లో తీవ్రజాప్యం నెలకొన్న కారణంగా ప్రాజెక్టు ఇంకా పూర్తికాలేదు. పనులు జరుగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన జపాన్ బృందం.. డిసెంబర్ లోగా పనులు పూర్తిచేయాలని అధికారులను కోరింది. జపాన్ బృందం పర్యటనలో జిల్లా ఇరిగేషన్ ఉన్నతాధికారులు, సిబ్బంది కూడా పాల్గొన్నారు. -
విజయనగరం జిల్లాలో భారీనష్టం!
విజయనగరం: హుదూద్ తుపాను సృష్టించిన విధ్వంసం వల్ల విజయనగరం జిల్లాలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. సముద్ర తీర గ్రామాల్లో చెట్లు నేలకొరిగాయి. జామి, ద్వారపూడిలలో చెట్లు కూలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ జిల్లాలో మొత్తం అయిదుగురు మృతి చెందారు. ఈ జిల్లాలో దాదాపు 9500 చెట్లు కూలిపోయాయి. 12 వేల ఎకరాలలో పంటకు నష్టం జరిగింది. వరి, చెరకు, అరటి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కూరగాయల పంటలు నీట మునిగాయి. 650 ఇళ్లు దెబ్బ తిన్నాయి. పడవలు వందల సంఖ్యలో కొట్టుకుపోయాయి. తుపాను కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచార వ్యవస్థ పనిచేయడంలేదు. రోడ్లు దెబ్బతిన్నాయి. రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. ప్రజలకు నిత్యావసర వస్తువులు దొరకడంలేదు. పరిస్థితులు ఇంకా చక్కదిద్దుకోనందున జిల్లాలో రేపు కూడా పాఠశాలలకు, కళాశాలలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు. ** -
శిథిలాల కింద 14 మంది విజయనగరం జిల్లా వాసులు
చెన్నై: చెన్నైలో 11 అంతస్తుల భవనం కూలిన సంఘటనలో విజయనగరం జిల్లాకు చెందిన 14 మంది శిథిలాల్లో చిక్కుకున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిలో ఎక్కువ మంది తెలుగువాళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రుల కోసం సహాయక చర్యలు చేపట్టాలని విజయనగరం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప చెప్పారు. ప్రమాదం జరిగిన విషయాన్ని మంత్రి కిమిడి మృణాళిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. మాన్‌గాడులో శనివారం జరిగిన ఈ దుర్ఘటనలో 50 మంది చిక్కుకున్నట్టు సమాచారం. ప్రమాదంలో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహం వెలికితీశారు. మరో 8 మందిని రక్షించారు. జాతీయ విపత్తు సహాయక బృందాలు ఘటనా స్ఠలానికి చేరుకుని రంగంలోకి దిగాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. -
విజయనగరం కోటలో దేశం పాగా
ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆధిక్యత సాధించింది. ఏకైక ఎంపీ స్థానం విజయనగరంతో పాటు మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఆరుచోట్ల విజయాలు సొంతం చేసుకుంది. విజయనగరం లోక్‌సభ స్థానంలో టీడీపీ సీనియర్ నాయకుడు పూసపాటి అశోక్ గజపతిరాజు నెగ్గారు. కురుపాంలో టీడీపీ అభ్యర్థి జనార్థన్ థాట్రాజ్‌పై వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని పాముల పుష్పశ్రీవాణి గెలిచారు. సాలూరులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రాజన్నదొర ఘన విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి భంజదేవ్పై ఆయన 7044 ఓట్ల ఆధిక్యం సాధించారు. బొబ్బిలి ఎన్నిక ఏకపక్షంగా సాగింది. బొబ్బిలి రాజా రావు సుజయ్ కృష్ణ రంగారావు 7044 ఆధిక్యంతో టీడీపీ అభ్యర్థి తెంటు లక్ష్మీనాయుడు మీద విజయం సాధించారు. పార్వతీపురంలో టీడీపీ అభ్యర్థి బొబ్బిలి చిరంజీవులు 5861 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్ నామమాత్రంగా కూడా పోటీలో లేకుండా పోయింది. గజపతినగరం నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నాయకుడు కొండపల్లి అప్పలనాయుడు 19421 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. జిల్లా కేంద్రం విజయనగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామిపై టీడీపీ అభ్యర్థి మీసాల గీతకు 15404 ఓట్ల మెజారిటీ లభించింది. ప్రతిష్ఠాత్మకమైన చీపురుపల్లి నియోజకవర్గంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై టీడీపీ అభ్యర్థి కిమిడి మృణాళిని 20812 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు. బొత్స కుటుంబం మీద స్వతహాగా ఉన్న వ్యతిరేకతతో పాటు సమైక్య ఉద్యమ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలే సత్తిబాబు ఓటమికి కారణమయ్యాయని అంటున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో జిల్లా వైఎస్ఆర్సీపీ కన్వీనర్ పెన్మత్స సాంబశివరాజు కుమారుడు డాక్టర్ పి.సురేష్ స్వల్పతేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇక్కడ హోరాహోరీ పోరు జరిగింది. సీనియర్ నాయకుడు పతివాడ నారాయణస్వామి నాయుడు 6669 ఓట్ల తేడాతో గెలిచారు. శృంగవరపుకోట నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి 28572 ఓట్ల తేడాతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జగన్నాథంపై గెలిచారు. ఒకే సామాజికవర్గం మధ్య ఓట్ల చీలికతో పాటు ఇతర కారణాలు ఆమె విజయానికి కారణమయ్యాయి. -
రాజన్న వెలుగులు
జి.సిగడాం, న్యూస్‌లైన్: మండలంలోని గంగన్నదొరపాలెం-దేవర పొదిలాం గ్రామాల మధ్య పెద్దగెడ్డ ఉంది. వేసవి కాలంలో విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం దేవరపొదిలాం, నిమ్మలవలస, వెంకటాపురం గ్రామాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడాం మండలం గంగన్నదొరపాలెం, పెనసాం, నడిమివలస, సేతుభీమవరం, ఎస్పీఆర్ పురం తదితర గ్రామాల ప్రజలు గెడ్డలోంచే రాకపోకలు సాగించేవారు. వర్షాకాలమైతే వారి కష్టాలు వర్ణణా తీతం. వంతెన లేకపోవడంతో దగ్గరలో కనిపిస్తున్న గ్రామానికి చేరుకోవాలంటే కిలోమీటర్ల దూరం ప్రయూణించాల్సిన దుస్థితి. ప్రయూణ వ్యయం తడిసిమోపెడయ్యేది. వంతెన నిర్మించి కష్టాలు తీర్చాలంటూ తొమ్మిదేళ్లు పాలించిన చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తిచేశారు. స్థానిక టీడీపీ నేతల సహాయంతో సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గోడు వినిపించారు. ఫలితం శూన్యమే. వీరి కష్టాలు గురించి చంద్రబాబు కనీసం స్పందించలేదు కూడా. దీనిని దృష్టిలోపెట్టుకుని 2004, 2009 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధిచెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డికి పాలనా పగ్గాలు అందించారు. ఆయన వద్ద సమస్యను విన్నవించారు. దీంతో మహానేత ప్రజల ప్రయూణ కష్టాలను గుర్తించారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు నుంచి వివరాలు సేకరించారు. గెడ్డపై వంతెన నిర్మాణనాని అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని కోరుతూ ఆ మేరకు రూ.2 కోట్లు నిధులు మంజూరు చేశారు. అంతే... వంతెన నిర్మాణం పూర్తరుు్యంది. దశాబ్దాల తరబడి ఉన్న సమస్యకు పరిష్కారం దొరికింది. ప్రస్తుతం రాజాం నుంచి రణస్థలం వరకు బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడంతో రెండు జిల్లాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సౌకర్యాలు కొనసాగించాలంటే రానున్న ఎన్నికల్లో రాజన్నరాజ్యమందించేవారికే పట్టం కట్టాలన్న నిశ్చయంతో ఈ ప్రాంత ప్రజలు ఉన్నారు. -
ఒడిశా తీరప్రాంతాల్లో కొనసాగుతున్న భారీ వర్షాలు
-
బొత్స మేనల్లుడు చిన్న శ్రీను ఇంటిపై సమైక్యవాదుల దాడి
విజయనగరం: 'తెలంగాణ నోట్' సెగలు సీమాంధ్రలో కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజనకు కేంద్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేయడంతో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. సమైక్యవాదులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. విజయనగరంలో జిల్లాలో ఉద్యమకారులు కదం తొక్కారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు చెందిన సత్యా విజన్ కేబుల్ కార్యాలయంపై శుక్రవారం రాత్రి ఆందోళనకారులు దాడి చేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. కార్యాలయానికి నిప్పు పెట్టారు. మంటలను అదుపు చేయడానికి వచ్చిన అగ్నిమాపక వాహనం అద్దాలు పగులగొట్టారు. పోలీసుల లాఠీచార్జి చేయడంతో ఆందోళనకారులు చెల్లాచెదురయ్యారు. బొత్స మేనల్లుడు చిన్నశ్రీను ఇంటిపై కూడా సమైక్యవాదుల దాడి చేశారు. ఆందోళనకారుల కళ్లలో చిన్న శ్రీను అనుచరులు కారం కొట్టారు. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. లాఠీచార్జి చేశారు. దీంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఉదయం బొత్సకు చెందిన కళాశాల,లాడ్జీపై విద్యార్థులు రాళ్ల దాడి చేశారు. -
ఇవి రాజకీయాలా?
బాబు పాదయాత్రలు, బస్సుయాత్రలు, ఢిల్లీయాత్రలు ప్రజల కోసం కాదు.. జగన్‌ను అడ్డుకోవటం కోసమే జగన్ బెయిల్‌ను అడ్డుకోవటానికి ఢిల్లీ వెళ్తున్నామని నిస్సిగ్గుగా చెప్తున్నారు.. అసలు మీరు ఏ రకం నాయకులు? ఇవి రాజకీయాలా? తెలంగాణ ఇచ్చేసుకోండని బ్లాంకు చెక్కు ఇచ్చిన చంద్రబాబు.. హత్య చేసి ఆ శవం మీదే పడి వెక్కివెక్కి ఏడ్చినట్టు ప్రజలను మభ్యపెట్టటానికి ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించాలనుకుంటోంది టీడీపీ సహా ఐదు పార్టీలు విభజనకు అనుకూలమని చెప్తే.. వైఎస్సార్ సీపీ, సీపీఎం, ఎంఐఎంలు విభజనకు ఎప్పుడూ అనుకూలమని చెప్పలేదు ఇప్పటికీ మించిపోయింది లేదు.. బాబుకు చిత్తశుద్ధి ఉంటే విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కుతీసుకోవాలి.. తాను రాజీనామా చేసి, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామాలు చేయించాలి విశాఖ, విజయనగరం జిల్లాల్లో షర్మిల 13వ రోజు సమైక్య శంఖారావం యాత్ర ప్రజల సమస్యలను కాదని.. జగన్ బెయిల్‌ను అడ్డుకునే బాబు యత్నాలపై షర్మిల ఈసడింపు సమైక్య శంఖారావం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘చంద్రబాబు గారు పాదయాత్రలు చేసినా, బస్సు యాత్రలు చేసినా, ఢిల్లీ యాత్రలు చేస్తున్నా ప్రజల కోసం కాదు కేవలం జగన్మోహన్రెడ్డి గారిని అడ్డుకోవటం కోసం. తొమ్మిది సంవత్సరాలు అధికారపక్షంలో ఉండి, మరో తొమ్మిది సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆఖరికి ఒక్క యువకుడ్ని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకుండా ఈ రోజు ఆయన బెయిల్‌ను అడ్డుకోవటానికి ఢిల్లీకి వెళ్తున్నామని నిస్సిగ్గుగా చెప్తున్నారంటే... అసలు మీరు ఏ రకం నాయకులు? ఒక అమాయకుడ్ని తీసుకెళ్లి 16 నెలలుగా నేరం రుజువు కాకుండానే జైలు పాలు చేశారంటే.. ఛీ..! ఇవి రాజకీయాలా?! మీలాంటి వాళ్లు మనుషులా?’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ఈసడించుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాం డ్తో షర్మిల పూరించిన సమైక్య శంఖారావం యాత్ర ఆదివారం 13వ రోజు విశాఖ, విజయనగరం జిల్లాల్లో సాగింది. విశాఖపట్నం నగరం, విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో జరిగిన సమైక్య శంఖారావం సభలకు భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే... మీ ఎమ్మెల్యేలను బేరం పెట్టటానికి వెళుతున్నారా బాబూ? ‘‘చంద్రబాబు గారు ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నారట. ఎందుకు వెళ్తున్నారు చంద్రబాబు గారు అంటే.. రాష్ట్రంలో చాలా అనిశ్చితి నెలకొని ఉందట.. ఈ అనిశ్చితిని దూరం చేయాలని కాంగ్రెస్ పార్టీని అడగటానికని చంద్రబాబునాయుడు గారు ఢిల్లీకి వెళ్తున్నారట. అసలు ఈ అనిశ్చితికి కారణం మీరు కాదా చంద్రబాబు గారూ? తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చి ఈ అనిశ్చితికి కారణమై మళ్లీ ఏ మొఖం పెట్టుకొని అనిశ్చితి దూరం చేయటానికి వెళ్తున్నానని చెప్తున్నారు చంద్రబాబు గారూ? తెలుగుదేశం పార్టీలో ఉన్న రెండు ప్రాంతాల నాయకులను తీసుకొని ఢిల్లీకి వెళ్తున్నానని చంద్రబాబు గారు అంటారు. అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు గారు? మీది రెండు కళ్ల సిద్ధాంతం అని చెప్పాలనుకుంటున్నారా? మీది రెండు నాలుకల ధోరణి అని చెప్పాలనుకుంటున్నారా? అందుకనే ఎప్పుడూ రెండు వేళ్లు ఊపుకుంటూ తిరుగుతారా? ఏం చెప్పాలనుకుంటున్నారు? సమైక్యానికి అనుకూలం అని చెప్పాలనుకుంటున్నారా? లేక విభజనకు అనుకూలం అని చెప్పాలనుకుంటున్నారా? లేకపోతే నాకు ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంత మంది ఎంపీలు ఉన్నారు చూడండీ అని, వాళ్లను అమ్మకానికి పెట్టి.. జగన్మోహన్రెడ్డి గారికి ఎలాగైనా బెయిల్ రాకుండా చూడ్డానికి బేరాలు కుదుర్చుకోవటానికి ఢిల్లీ వెళ్తున్నారా? లేకపోతే ఒక కిరణ్‌కుమార్‌రెడ్డి గారికే కాదు, ఒక బొత్స సత్యనారాయణ గారికే కాదు నాకు కూడా సోనియాగాంధీ గారు అధిష్టానమే.. మీరు ఏది ఆదేశిస్తే అది శిరసా వహిస్తాను.. అని చెప్పి కాళ్ల మీద పడి.. నామీద మట్టుకు ఏ కేసులు, విచారణలు జరగకుండా చూడండి అని వేడుకోవడానికి వెళ్తున్నారా? చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసిన ట్టు మీరు కూడా తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేసుకుంటే కనీసం మీకు కేంద్రమంత్రి పదవైనా వస్తుందేమో..! ఈ రాష్ట్రంలో ఉంటే మీకు ఏదీ రాదు చంద్రబాబు గారు. తెలంగాణను ఇచ్చేసుకుంటే ఇచ్చేసుకోండి అని బ్లాంకు చెక్కు ఇచ్చేసినట్లు లేఖలు రాసి ఇచ్చేశారు ఈ చంద్రబాబుగారు. హత్య చేసి ఆ శవం మీదే పడి వెక్కివెక్కి ఏడ్చినట్టు చంద్రబాబు గారు తెలంగాణకు అనుకూలంగా లేఖనిచ్చేసి ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టటానికి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. సీఎం, బొత్సలు దిష్టిబొమ్మల్లాగా కూర్చున్నారు... ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టాలనుకుంటోంది. కనీసం ఈ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారని అనుకుంటే దిష్టిబొమ్మలాగా కూర్చున్నారు. బొత్సగారు ఈ ప్రాంతం నాయకుడు కదా! పీసీసీ అధ్యక్షుడు కదా! ఈయన గారైనా ఏమైనా సమాధానం చెప్తాడా? అంటే.. ఈయన గారు కూడా ఇంకో దిష్టి బొమ్మలాగా నిల్చొని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేస్తుందని, ఆ విషయం గురించి మన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గారికి, బొత్స గారికి చాలా స్పష్టంగా ఎప్పటి నుంచో తెలుసని కేంద్రమంత్రి కిశోర్‌చంద్రదేవ్ గారు స్వయంగా చెప్పారు. అంటేముఖ్యమంత్రికి, బొత్స గారికి ఈ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని చీల్చబోతున్న సంగతి తెలిసి కూడా.. అడ్డుకుంటే వీళ్ల పదవులు ఎక్కడ పోతాయోనని అడ్డుకోనూ లేదు. బొత్స గారూ..! కాంగ్రెస్ పార్టీ చీల్చుతుందన్న సంగతి ముందు మీకు తెలుసా? తెలియదా? ముందే తెలిస్తే ఎందుకు అడ్డుకోలేదు? కనీసం ప్రజలకు ఎందుకు చెప్పలేదు? లేకపోతే మీకు చెప్పకుండానే చేసి ఉంటే.. దిగ్విజయ్‌సింగ్ గారు మన రాష్ట్రాన్ని చీల్చుతున్నామని ప్రకటన చేసిన రోజే మీరు ఎందుకు రాజీనామాలు చేసి ప్రజల పక్షాన నిలబడలేదు? మేం విభజనకు ఎప్పుడూ మద్దతు పలకలేదు... తెలుగుదేశం పార్టీతో సహా ఐదు పార్టీలు ఈ విభజనకు మద్దతు పలికితే.. మూడు పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, ఎంఐఎం పార్టీలు ఎప్పుడూ విభజనకు మద్దతు పలకలేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నా, ఇంకా ఆయనలో ఏమాత్రం నిజాయితీ మిగిలి ఉన్నా తాను కూడా తెలంగాణకు వ్యతిరేకమేనని.. ఇప్పటికైనా ఈ మూడు పార్టీల పక్షాన నాలుగో పార్టీగా చేరి, కోట్ల మంది ప్రజలకు క్షమాపణ చెప్పి, తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి. కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేయటం తగదని ఆయన రాజీనామా చేయాలి. తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను రాజీనామా చేయించాలి. అంతవరకు చంద్రబాబు గాని, టీడీపీ నాయకులు గాని సీమాంధ్రలో అడుగుపెట్టడానికి వీలు లేదని ప్రజలంతా తరిమి కొట్టాలి. ఆ రోజే వారు కూడా రాజీనామా చేసి ఉంటే... హఠాత్తుగా ఏ పరిష్కారం చూపించకుండా కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్ల కోసం మన రాష్ట్రాన్ని చీలుస్తున్నామని ప్రకటించిన వెంటనే, ఆ సంకేతాలు పంపించిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతమంది నాయకులు రాజీనామాలు చేశారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి గారు కూడా రాజీనామాలు చేశారు.. నిరాహార దీక్షలు చేశారు. లేఖల మీద లేఖలు రాసి.. ఇది అన్యాయం మా రాష్ట్రాన్ని విడగొట్టొద్దని ఈ రోజుటి వరకు పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ ఎంత మంది టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీనామాలు చేసిన రోజునే వీళ్లందరూ రాజీనామాలు చేసుంటే.. కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకునేలా ఒత్తిడి పెరిగేది. కానీ పదవీ మత్తులో మునిగి తేలుతున్న ఈ కాంగ్రెస్, టీడీపీ నాయకులు ప్రజలకంటే తమ పదవే ముఖ్యమని మళ్లీ నిరూపించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచీ ఒకే మాట చెప్పింది. ఏ ఒక్క ప్రాంతానికి అన్యాయం జరగకుండా, ఒక కన్నతండ్రిలాగా ఆలోచన చేయాలి. ఆ ఆలోచన మీరు ఎలా చేస్తారో మీ ఉద్దేశం ఎలా ఉందో ముందు అందరినీ పిలవండి అని పదేపదే చెప్పింది, లేఖలు రాసింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాస్వామ్య దేశమనే విషయాన్నే మరచి వ్యవహరించింది. అందుకే మళ్లీ చెప్తున్నాం. న్యాయం చేయ డం మీ ఉద్దేశమే కాదని తేలిపోయింది కనుక రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. సమైక్య రాష్ట్రం కోసం జగనన్న నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజల తరఫున నిలబడి పోరాటం చేస్తుందని మీకు మాటిస్తున్నాం.’’