
విజయనగరం జిల్లాలో భారీనష్టం!
హుదూద్ తుపాను సృష్టించిన విధ్వంసం వల్ల విజయనగరం జిల్లాలో భారీగా ఆస్తి నష్టం జరిగింది.
విజయనగరం: హుదూద్ తుపాను సృష్టించిన విధ్వంసం వల్ల విజయనగరం జిల్లాలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. సముద్ర తీర గ్రామాల్లో చెట్లు నేలకొరిగాయి. జామి, ద్వారపూడిలలో చెట్లు కూలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ జిల్లాలో మొత్తం అయిదుగురు మృతి చెందారు. ఈ జిల్లాలో దాదాపు 9500 చెట్లు కూలిపోయాయి. 12 వేల ఎకరాలలో పంటకు నష్టం జరిగింది. వరి, చెరకు, అరటి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కూరగాయల పంటలు నీట మునిగాయి. 650 ఇళ్లు దెబ్బ తిన్నాయి. పడవలు వందల సంఖ్యలో కొట్టుకుపోయాయి.
తుపాను కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచార వ్యవస్థ పనిచేయడంలేదు. రోడ్లు దెబ్బతిన్నాయి. రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. ప్రజలకు నిత్యావసర వస్తువులు దొరకడంలేదు. పరిస్థితులు ఇంకా చక్కదిద్దుకోనందున జిల్లాలో రేపు కూడా పాఠశాలలకు, కళాశాలలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు.
**