
తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
విజయనగరం: ప్రభుత్వంపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు, ఫిరాయింపుదారులకు మంత్రిపదవులపై కార్యకర్తల్లో అసహనం తదితర తలనొప్పులతో ఇబ్బందిపడుతోన్న అధికార తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. విజయనగరం జిల్లా సాలూరు, పాచిపెంట మండల శాఖల్లో పార్టీ సంస్థాగత ఎన్నికల సందర్భంగా తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగి రచ్చరచ్చచేశారు.
సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ఎమ్మెల్సీ సంధ్యారాణి, నియోజకవర్గ ఇన్‌చార్జి ఆర్పీ భంజ్ దేవ్‌ల అనుచరు మధ్య గొడవ మొదలైంది. వాగ్వాదం కాస్తా తోపులాటకు దారితీయడంతో ఆ ప్రంగణం రణరంగంలా మారింది. తమ్ముళ్ల దూకుడును భరించలేని స్థితిలో.. పార్టీ పరిశీలకుడిగా కార్యక్రమానికి విచ్చేసిన నాయుడు అక్కడినుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు.