ప్రభుత్వంపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు, ఫిరాయింపుదారులకు మంత్రిపదవులపై కార్యకర్తల్లో అసహనం తదితర తలనొప్పులతో ఇబ్బందిపడుతోన్న అధికార తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. విజయనగరం జిల్లా సాలూరు, పాచిపెంట మండల శాఖల్లో పార్టీ సంస్థాగత ఎన్నికల సందర్భంగా తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగి రచ్చరచ్చచేశారు.